కొమ్మపై ఊయలలూగే కోయిలమ్మ నడిగాను
నీ పిలుపుకన్నా మధురమైన పాటేదీ లేదన్నది!
మాపటేళ మరులు గొలిపు మరుమల్లియ నడిగాను
నీ స్పర్శకు మించిన లాలిత్యం తనకేదన్నది!
తోటలన్నీ తిరిగాను! చెట్టు చెట్టునూ వెతికాను
నీ మనసుకన్నా అందమైన సుమమేదీ లేదన్నవి !
నీరెండ జల్లుల్లో విరిసే ఇంద్రధనస్సు నడిగాను
నీ నవ్వుకు సరితూగే వర్ణం తన దరి లేదన్నది!
నిశీధి వీధుల్లో మెరిసే చుక్కని కలిశాను
నీ కళ్ళలోని కాంతిముందు తన మెరుపేపాటిదన్నది!
శ్రావ్యమైన పాట కోసం రాగాలను సాయమడిగాను,
శ్రావ్యమైన పాట కోసం రాగాలను సాయమడిగాను,
నీ అనురాగానికి మించిన రాగమేదీ లేవన్నవి!
మదిలోని భావనను కవితను చేసి కానుకివ్వాలనుకున్నాను
నీ ప్రేమకు సరితూగే భాషలేదని తెలుసుకున్నాను!
నిండు మనసు తప్ప వేరేమీ ఇవ్వలేని పేదరాలిని
రిక్తహస్తాలతో నీ ఎదుట నిలిచాను!
నీ కౌగిలి చేరిన మరుక్షణ౦ రాణినయ్యాను!
సామ్రాజ్ఞినయ్యాను!!
చాలా బాగుందండీ..
ReplyDeleteధన్యవాదాలు వేణు శ్రీకాంత్ గారు.
Deleteకవిత చాలా బాగుంది జ్యోతిర్మయి గారు.
ReplyDeleteధన్యవాదాలు కిషోర్ వర్మ గారు.
Deleteఅతని పిలుపు కన్న నాపాత మథురమౌ
ReplyDeleteపాట లేదను ప్రియ భావన గన
అతని కన్న భువిని నత్యంత సంపన్ను
డుండ బోడు ప్రేమ భాగ్య శాలి
రాజారావు గారు ఒకరికొకరుగా మెలగు వారివురూ అదృష్టవంతులే...మీ పద్యం చాలా బావుంది. ధన్యవాదాలు.
DeleteWOW WOW :)
ReplyDeleteధన్యవాదాలు హర్షా..
Deleteచాలా రోజులకి మీ కవిత మళ్ళీ.
ReplyDeleteSimply superb!
చిన్ని ఆశ గారు బాగానే గమనించారే...వచనం మొదలు పెట్టాక కవిత వ్రాయడం కాస్త కష్ట౦గా వుంది. ధన్యవాదాలు.
Deleteనిండు మనస్సు-
ReplyDeleteఇంతకంటే గొప్ప బహుమానం ఏముంటుంది చెప్పండి.
simply superb.
హరి గారు నిజమేనండి. ధన్యవాదాలు.
Deleteమీవారికి ప్రేమికుల రోజు కానుకా? చాలా బాగుందండి
ReplyDeleteహై హై నాయక గారు ఏదో కథాంశం కోసం వెతుకుతుంటే డ్రాఫ్ట్స్ లో సంగం వ్రాసిన కవిత దొరికిందండి. పూర్తిచేసాను. అది యాదృచ్చికంగా ప్రేమికుల రోజే అయింది. ధన్యవాదాలు. ధన్యవాదాలు.
Deleteచాలా బావుంది జ్యోతిర్మయి గారు.
ReplyDeleteలోకేష్ శ్రీకాంత్ గారు చాలా రోజులకు కనిపించారే...ధన్యవాదాలు.
Deletechaala bagundandi jyothigaru...
ReplyDeleteధన్యవాదాలు అనురాధ గారు.
Deleteభావగీతమొకటి ఎదలోయలలో ఝుమ్మన్నది
ReplyDeleteఎన్నెన్నో కవి సమయాల సాయం కోరుకున్నది
రాగమైనా అనురాగమైనా మనసులోనే ఉన్నది అని తెలుసుకున్నది
ఆ హృదయాన మధూదయం అడుగిడినది
అంత ఒక సామ్రాజ్యమే కట్టెదుట కనబడినది
దానికి తానే సామ్రాజ్ఞి ఐనది
అరుదైన భావాలకు అభినందనం
అందమైన కవితకు కవితాభి వందనం
కవిత బావుంది నాన్నా..
Deleteనీరెండ జల్లులోని విరిసే ఇంద్రధనస్సు నడిగాను,
ReplyDeleteని నవ్వుకి సరితూగే వర్ణం తన దరి లేదన్నది !
నీ కౌగిలి చేరిన మరుక్షణం రాణినయ్యాను
సామ్రాజ్ఞినయ్యను
చాలా చాలా బాగుందండి
ధన్యవాదాలు విద్యాసాగర్ గారు.
Deleteచాలా బావుంది జ్యోతిర్మయి గారు..."మదిలోని భావమును కవితగా.......భాష లేదని తెలుసుకున్నాను" ఇది మాత్రం నాకు బాగా నచ్చేసింది...
ReplyDeleteఎగిసే అలలు గారు నా బ్లాగుకు స్వాగాతమండి. మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.
Deleteకవిత చాలా బాగుంది జ్యోతిర్మయి గారు.
ReplyDeleteఒకసారి మా బృందావనం చూసి మీ అభిప్రాయం తెలియచేయండి
www.brundavanam.org
ధన్యవాదాలు శైలబాల గారు.
Delete