అదేమో కార్తీక మాసం, మాదేమో కొత్త కాపురం. మా చుట్టుపక్కల వారందరూ రకరకాల వంటల చేసేసుకు౦టున్నారు. నాక్కూడా ఏదైనా పిండివంట చేద్దామనే మహత్తరమైన ఐడియా తట్టింది. ముందస్తుగా లడ్డు చేద్దామనుకున్నా. లడ్డు తయారీ విశేషాలు కనుకున్నాక, అది చాలా ముదురు స్వీటని నాలాంటి లేత ఇల్లాలికి కష్టమని అర్ధమైంది. బాదుషా గురించి అడిగా ఉహూ.. అదికూడా కుదేరేపని కాదు. మైసూర్ పాక్, జిలేబి, మడత కాజా, గవ్వలు, ఇలా అన్నింటి తీరుతెన్నులు తెలుసుకున్నాక, ఔరా! వీటివెనుక ఇంత చరిత్రు౦దా అని ఆశ్చర్యపోయి, చివరగా గులాబ్ జామ్ కి ఫిక్స్ అయ్యా.
ఆ సాయత్రం నేను మా శ్రీవారు తీరిగ్గా షాపుకి వెళ్లి గులాబ్ జాం ప్యాకెట్ కొని పక్కనే ఉన్న పార్క్ లో చెట్టాపట్టాలేసుకుని రాత్రివేళకు ఇంటికి చేరాం. తీరగ్గా బోజనాలు అవీ కానిచ్చి గులాబ్ జాం చేసే మహత్కార కార్యానికి శ్రీకారం చుట్టా౦. పౌడర్ కలపడానికి ఒక గిన్నె, నీళ్ళకో గ్లాసు, వేపడానికో బాండలి, చక్కెర, ఏలుకలు, నూనె వగైరాలన్నీ సిద్దం చేసుకున్నాం.
ఇక తయారీ మొదలు, అదే ఆయన చదవడం నేను చెయ్యడం అన్నమాట. చక్కెర వంద గ్రాములు అన్నారు. మన దగ్గర ఐదు వందల గ్రాములు ఉంది. ఎలా అని తర్జన బర్జన పడి ఏదో ఉపాయం కనిపెట్టాం. సరే పిండి కలపడం పూర్తయ్యింది. ఇక చక్కెర పాకం. ఖాళీ గిన్నెలో చక్కెర, ఓ రెండు స్పూనులు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టాను.
ఇక్కడ మీకో విషయం చెప్పాలి. మా అమ్మ మైసూర్ పాక్ చాలా బాగా చేసేవారు. ఆ పాకం పట్టేప్పుడు నన్ను ఓ ప్లేటులో నీళ్ళు పోసుకురమ్మనే వారు. ఆ నీళ్ళలో ఈ మరిగిన పాకం కొంచెం వేసేవారు. తీగ సాగిందో లేదో విచారణకన్నమాట. ఆ విషయం గుర్తుంచుకుని నేను కూడా బాగా తీగ సాగేదాక పాకం పట్టేసా. పాకం బ్రంహాండంగా కుదిరింది. మరో పక్క బా౦డలిలో గులాబ్ జామూన్లను పాకెట్లో చెప్పినట్లుగా బంగారు రంగు వచ్చేవరకు వేపుతూ, నా పాకశాస్త్ర ప్రావీణ్యానికి ఆశ్చర్యపడిపోయేలా మా వారికి తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నా. చివరగా ఈ గులాబ్ జూమూన్లను పాకంలో వేసేసాను.
లేత బంగారు రంగు పాకంలో ముదురు బంగారపు జామూన్లు చూడ్డానికి బహు ముచ్చటగా ఉన్నాయి. గులాబ్ జామూన్లు పాకంలో నానాలిగా, అప్పటికే పదకొండున్నర అయింది, రేపు చూద్దాం అనుకుని సంతృప్తిగా వెళ్లి పడుకున్నాం. ఉదయాన్నే లేచి మా తొలి పిండివ౦ట చూద్దామని వంట గదిలోకి అడుగు పెట్టా. ఇంకేముంది రాత్రికి రాత్రి గిన్నెకి జామూన్లకి ఎంత గట్టి బంధమేర్పడి౦దంటే ఒకదాన్ని వదిలి ఒకటి రానంటాయి.
కొస మెరుపుగా మన వంట ప్రావీణ్య౦ తెలిసిన మా పుట్టింటి వారు పోస్ట్‌లో ఎంచక్కా మా ఊరి మైసూర్ పాక్ లు పంపించారు. అవి తినేసి వాటి మాధుర్యాన్ని ఆ జ్ఞాపక౦తో కలిపేసి అప్పుడప్పుడు ఇలా గుర్తు చేసుకుంటాం అన్నమాట. మీరందరూ అన్ని బ్లాగులలోనూ మంచి మంచి వంటలు తినేసి భుక్తాయసంతో తీరిగ్గా కూర్చుని ఉంటారుగా...నలుగురు కలసి నవ్వేవేళ ఒక పసందైన జ్ఞాపకాన్ని మీతో పంచుకుందామని....
(ఎన్నెల గారిచ్చిన సలహా మేరకు 'ఆశ్చర్యంలో ముంచి వేసిన గులాబ్ జామూన్లు' అనే పేరును 'లేత ఇల్లాలి ముదురు పాకం'గా మార్చాను. ధన్యవాదాలు ఎన్నెల్ గారు)
హమ్మయ్యా! భోజనాలయ్యాయి ఎవరయినా స్వీట్ ఇస్తే బాగుండు అనుకున్నా మీరు తేనే తెచ్చారు! బాగుంది ఈ గులాబ్జాంతో ఐస్ క్రీం కలిపితే ఇంకా బాగుంటుంది!
ReplyDeleteఇంకా నయం.. నన్ను పిలవలేదు ఆ సమయంలో. లేకుంటే నేను ఐపోయేదాన్ని.హ హ హ బాగుందండీ. ఒకసారెప్పుడో రేడియోలో వచ్చిందంటండీ.. మా అమ్మా వాళ్ళు ఇప్పటికీ చెప్పుకుని నవ్వుకుంటారు..
ReplyDelete" వాటిని చూడగానే ఏమనుకున్నాడొ ఏమో గుబుక్కున తీస్కుని జేబులో వేస్కున్నాడు అని "
చాలా బాగుందండి మీ జ్ఞాపకం. నేనైతే ఇప్పటికీ గులాబ్జాం పాకెట్ కొని వేయించి నీళ్ళ నీళ్ళ పాకంలో వేసేయటమే. అన్నింటికన్నా ఈజీ బూజీ వంటకం. మా మూంపల్లి కూడా తినేసారంటే అది కూడా మీకు ఓ తియ్యని జ్ఞాపకమై మిగులుతుంది చూడండి.
ReplyDeleteగులాబ్ లౌసులు అన్న మాట . మరి చాకుతో ముక్కలు గా కట్ చేసారా ;-)
ReplyDeleteకృష్ణ ప్రియ గారి లా కొత్త పేరు పెట్టేసి మార్కెటి౦గ్ చెయ్యకు౦డా ఇలా నిజం చెప్పేశారు అయ్యో ఇలా అయితే ఎలా
(నాకిష్టమయిన మె౦తి కూర మసాలా ని రివర్స్ ప్రాసెస్ లో చేసి 'టల్లోస్' అన్నారు మరి .;-) )
బాగుందండి మీ జామూన్ల ప్రహసనం, తొలినాళ్ళ వంటలు కదా మధుర జ్ఞాపకంగా మిగిలిపోతాయి
ReplyDeleteఏం ఫర్వాలేదు..మాకు సుత్తితో పగలగొట్టుకు తినే అలవాటుందిలెండి..ఏదీ ఆ గిన్నె ఇటు పట్రండి..బాబూ ఆ సుత్తి అందుకోమ్మా...పాపా కొంచెం గిన్నె గట్టిగా పట్టుకో తల్లీ....అదీ...ఊడి వచ్చిందిగా....అక్కా, చెయ్యి నొప్పెట్టింది గానీ..యీ పాకాన్ని కొంచెం చితగ్గొట్టు అందరికీ తలో ముక్క రావాలి...ఇదిగోనండీ లేత ఇల్లాలి ముదురు పాకం..భలేగా ఉంది కదూ...దీనికి యీ పేరే ఫిక్స్ చేసేద్దాం ఏటంటారూ!!!!
ReplyDelete>>>అది చాలా ముదురు స్వీటని నాలాంటి లేత ఇల్లాలికి కష్టమని అర్ధమైంది<<<
ReplyDeleteహ్హహ్హహ్హ.. చాలా బాగా రాశారు.
మీ గులాబ్ జా మూన్‌ల మధురస్మృతి బాగుందండి .పరవాలేదు . మాకు అలాగే పెట్టేయండి . తినేస్తాము .
ReplyDelete@ రసజ్ఞా మీకు పెట్టాలనే ఉంది. గిన్నెలో నుండి ఊడి వస్తేగా..ధన్యవాదములు.
ReplyDelete@ శుభా వాటిని జోబీలో కూడా వేసుకోలేం టేబుల్ సెంటర్ పీస్ లా పట్టడమే. ధన్యవాదములు.
@ జయగారూ..మీరన్నట్టు మీ మూంపల్లి కూడా తీయని జ్ఞాపకమే. ధన్యవాదములు.
@
@ మౌళి గారూ..స్వాగతం. చాకుతో కాదండీ సుత్తితో కొట్టి తీయాలి. కృష్ణ ప్రియగారు 'టల్లోస్' అన్నా'లొట్టల్స్' అన్నా మహా గమ్మత్తుగా ఉంది లెండి. ధన్యవాదాలు.
ReplyDelete@ లత గారూ తొలినాళ్ళన్నీ మధుర స్మృతులే కదూ..ధన్యవాదములు.
@ ఎన్నెల గారూ ఇంకేట౦టాను మీరేట౦టే నానదే గదా అంట 'లేత ఇల్లాలి ముదురు పాకం' ఎట్టేద్దారి.
ధన్యవాదములు.
@ శిశిర గారూ స్వాగతం..మీక్కూడా అదే టైటిల్ నచ్చినట్లుందే..ధన్యవాదములు.
ReplyDelete@ మాలా కుమార్ గారూ మీకెంత మధుర స్మృతి నచ్చితే మాత్రం ఆ గులాబ్ జాం తినే సాహాసం చేస్తారా. బాగా మొహమాటస్తుల్లా ఉన్నారే..ధన్యవాదాలు.
సుత్తి దాకా ఎ౦దుక౦డి, కాసిని నీళ్లు వేస్తె (అవసరమైతే కాస్త వేడి చేస్తే సరి ) కరిగి పోతాయ్ ..
ReplyDeleteజ్యోతిర్మయిగారు, మీరేం దిగులు పడకండి ఈ ప్యాకెట్ తో చేసినప్పుడు మొదట్లో దాదాపు అందరికి ఇలాగే వస్తాయి. నాకైతే ఇప్పటికి ఈ ప్యాకెట్ తో జామూన్లు మెత్తగా రావు. కోవా ఐతేనా ఈజీగా చేసేస్తాను
ReplyDelete@ ఆ తర్వాతేం చేసానో గుర్తు లేదు మౌలిగారూ..
ReplyDelete@ జ్యోతి గారూ స్వాగతం. ఆ తర్వత్తర్వాత ఏదో కష్టపడి నేర్చుకున్నాను లెండి. ఇప్పుడు కొంచెం ఫరవాలేదు. ఈ మధ్యే మా ఇంట్లో వారు నేను కొత్త కొత్త స్వీట్లు చేస్తుంటానన్న భ్రమ లోంచి బయటపడి తెలిసిన స్వీట్లే కొత్తకొత్తగా చేస్తు౦టానన్న జ్ఞానం సంపాదించారు. ధన్యవాదాలు.
mee gnapakam naaku pelli aina kotha lo maa ayana chesina gulab jamunulu nu gurthu chesayi. kaani maa ayana chesina jamunulu superb.
ReplyDeleteసుమతి గారూ మీ జ్ఞాపకంతో పాటు జామూన్లు కూడా మధురం అన్నమాట. ధన్యవాదములు.
ReplyDelete