మెంతిగింజ ఆవగింజతో
అవహేళనగా అన్నది
నా రంగు నీకేదని!
దనియం జీలకర్రతో
బడాయికి పోయింది
నా అందం నీకు లేదని!
మిరియ౦ లవంగంతో
బీరాలు పలికింది
నా ఘాటు నీకేదని!
వెల్లుల్లి ఉల్లితో
పుల్లవిరుపుగా అన్నది
నీకన్నా నేనెంతో నాజూకని!
కారంతో పసుపు
గుసగుసలాడింది
రూపంలో తామొక్కటేనని!
పొయ్యిమీద కూర
ఫక్కున నవ్వింది
ఎవరెన్ని పలికినా
చివరికి కలిసేది నాలోనేగా అని!!
అన్నిటినీ చూసి ఉప్పు జాలిపడింది! ఉప్పులేని కూర యొప్పదు రుచులకు అని!
ReplyDeleteజ్యోతిర్మయిగారూ,
ReplyDeleteచాలాకాలం తర్వాత మూసలోంచి వచ్చిన ఉపమానలతో గాక ఆహ్లాదకరమైన నూతనత్వంతో వచ్చింది మీ కవిత. ఎవ్వరూ చూడని ప్రకృతిని మనం మొదటిసారి చూస్తేకలిగిన అనుభూతి కలుగుతోంది.
మనఃపూర్వక అభినందనలతో,
మూర్తి.
హహ్హహ్హ్హా.. భలే ఉంది.. :)))
ReplyDelete:))భలే ఉంది.
ReplyDeleteమీ కవిత చదివిన తర్వాత వంటగదిలో నిజంగా ఇలాంటి వాదోపవాదాలు వాటిమధ్య జరుగుతాయేమో అన్నట్టుగా వుందండి.
ReplyDeleteజ్యోతిర్మయిగారూ..కవిత భలే చమత్కారంగా ఉంది. రసఙ్ఞ గారి కొసమెరుపు అద్భుతం:)
ReplyDeleteమొత్తంగా కవిత చాలా చాలా బాగుంది, కొత్తదనంతో..
స్పందించిన మిత్రులకు పెద్దలకు ధన్యవాదములు.
ReplyDeleteNice భలే ఉంది.
ReplyDeleteశైలబాల గారూ ధన్యవాదాలు.
ReplyDeleteవావ్ !! సింపుల్ గా చాలా బాగా చేసేసారు కూర .... ;-)
ReplyDeleteఈ కూర రుచి మీకు బాగా నచ్చినట్లుందే :-) ధన్యవాదాలు విద్యాసాగర్ గారు.
Deleteఅంతా చదివిన తరువాత వావ్ అంటూ ఒక చిన్న స్మైల్ మనస్సులో మెదిలింది.
ReplyDeleteలక్కరాజు గారు మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.
Deleteమనిషి నాలుక మనసులో అనుకుంది
ReplyDeleteనన్ను తాకకుండా కడుపులోకి వెళ్లలేరని