Friday, October 5, 2012

తామెల్లరూ విచ్చేసి...

"శర్కరీ... ఓయ్ శర్కరీ ఎక్కడా?"
"ఇక్కడిక్కడ...ఏమిట౦త ఉత్సాహం?"
"ఉత్సాహమా...అంత కంటే పెద్ద పదం ఏదైనా.."
"ఆహా...ఏమిటో విశేషం?"
"విశేషమే మరి"
"చెప్పకూడదా?"
"చెప్పాలనేగా వచ్చాను."
"అయితే సరి...చెప్పు మరీ."
"అంత తొందరే.."
"ఉండదా?"
"ఉంటుందనుకో.."
"మాటలతోనే సరా?"
"కాదు"
"మరి?"
"పసందైన విందు!"
"ఓస్ అంతేనా?"
"అంతేనా!"
"కాక.."
"ఎక్కడని అడగవా?"
"ఎక్కడైతేనేం"
"అక్కడే వుంది విశేషం"
"అయితే చెప్పు"
"సైకత తీరాల వెంబడి శార్వరీ సమీపాన..."
"ఊ"
"చందన సమీరాలు వీస్తుండగా..."
"నీకేమమ్మా ఎక్కడికైనా వెళ్తావు..ఏమైనా చేస్తావు"
"ఉడుక్కోకే వెఱ్ఱిదానా"
"మరేం చెయ్యగలను?"
"అందుకేగా నీ కోసం..."
"ఏమిటీ....నా కోసమే?"
"ఊ...శత భక్ష్య పరమాన్నాలతో..."
"ఏమిటీ వందే...గొప్ప విశేషమే! ఇంతకూ అసలు విషయం చెప్పనేలేదు"
"నా నెచ్చెలివి....ఊహించలేవా?"
"అంత సూటిగా అడిగితే....ఓ...ఇది వందో టపా కదూ"
"సరిగ్గా చెప్పావ్. వంద పూర్తయిన సందర్భాన.... "
"మాకందరకూ విందన్నమాట"
"అతిధిలు కూడా వేంచేశారు, మరి వడ్డన మొదలు పెట్టనా?"
"తప్పకుండా...."
"ఇవన్నీ నన్ను ఆకట్టుకున్నవి...మది దోచినవీను."
"మృష్టాన్నభోజనమన్నమాట..."
"అన్నమాటే౦! ఉన్నమాటే."

తామెల్లరూ శర్కరి సహపంక్తిని ఈ బ్లాగింట విందారగించి చందన తాంబూలాలు స్వీకరించ వలసినదిగా ప్రార్ధన.


87 comments:

  1. వావ్..శత టపాలని భలే గుదిగుచ్చి మాకు మంచి విందు భోజనం పెట్టారు.మళ్ళీ మరోసారి అన్నీ రుచి చూస్తాం...థాంక్యూ!

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా రండి వరూధిని గారు. థాంక్స్

      Delete
  2. కొన్ని రుచి చూసినవి, మరి కొన్ని ముఖమైనా చూడనవి.. మీరు వడ్డించినా తినే సమయం,ఆరగింపు జేసుకునే శక్తి ఉందా!? అని మాలో మాకే సందేహం.
    అయినా.. మీ శతాధిక విశేష విందు మాకు కడు సంతోషం కల్గించినది.
    కొన్ని .. ఐటమ్స్ ఎక్కువ రకాలు ఉన్నాయి. మీరు యోచిస్తే మరి కొన్ని వంటలు లభ్యమయ్యేవి.. అని సూచనే సుమా! విమర్శ కాదు.
    మీ ఓపికకి, శ్రద్దకి అభినందనలు. మరీ మరీ ధన్యవాదములు.

    ReplyDelete
    Replies
    1. వనజ గారు ఈ వందవ టపాలో నాకు బ్లాగు వ్రాయడానికి స్ఫూర్తి నిచ్చిన టపాలు కొన్ని పెట్టాలనుకున్నాను. వాటితో పాటు నాకు నచ్చినవి కొన్ని చేర్చాను. మీరన్నట్లు మరెన్నో మంచివి వున్నాయండి. ఇక్కడ లేనంత మాత్రాన ఉన్నతమైనవి కావని కాదు. ఈ విషయములో ఎవరినైనా నొప్పించి వుంటే క్షమాపణలు కోరుకుంటున్నాను. మీ సద్విమర్శకు ధన్యవాదాలు.

      Delete
  3. ఏమీ విందు, అదరహో
    మీ సేకరణకి ఓహో
    సాహో శర్కరీ సాహో...!

    ReplyDelete
  4. డైటింగ్ చేసేవారు ఈ విందుని ఎలా ఆరగించాలి మరి..:)
    బావుందండీ కలక్షన్.

    ReplyDelete
    Replies
    1. అన్నీ ఆరోగ్యకరమైనవేనండీ తృష్ణ గారు. ఎంతైనా ఆరగించొచ్చు. ధన్యవాదాలు.

      Delete
  5. బాగుందండి.మంచి మంచి బ్లాగలు ,మంచి టపాలు నిజంగా విందు బోజనమే..వాటిలో నేను చదవని టపాలు ఉన్నాయి చదావాలి అదే విందారగించాలిగా..

    ReplyDelete
    Replies
    1. తృప్తిగా ఆరగించండి రాధిక గారు. థాంక్యు

      Delete
  6. మీ విందులో నా గాజర్ హల్వాను కూడా వడ్డించినందుకు థాంక్స్ అండి :)

    ReplyDelete
    Replies
    1. చేసిచ్చినందుకు నేనే మీకు ధన్యవాదాలు తెలపాలి మాలా కుమార్ గారు.

      Delete
  7. soooooooooooooperrrrrrrrrrr.....
    కొన్ని పోస్టులు మొదటి సారి చదవాలీ.. మరికొన్ని మరోసారి చదవాలి...

    నన్ను కూడా ఇరికించినందుకు ధన్యవాదాలండీ... పసందైన విందు ;)

    ReplyDelete
    Replies
    1. "అట్లు ముట్టని వాడు..." అనే మీ అట్టు లేకపోతే అది వి౦దెలా అవుతు౦ది రాజ్ గారు. :) థాంక్యు.

      Delete
  8. భోజనం చేశాక చదివింపులు కమెంట్ బాక్స్ లో చదివించవలెను.
    ;) ;) ;)

    ReplyDelete
    Replies
    1. భలే చెప్పారు రాజ్ గారు. ఏ కామెంట్ బాక్స్ అయినా ఫరవాలేదు. చదివింపు మాత్రం ఇవ్వాల్సిందే.;)

      Delete
  9. "విందు భోజనం.. పసందు భోజనం... ఏటిగట్టు తోటలోన మేటి భోజనం..."
    అభినందనలు శర్కరి గారూ.. మరిన్ని వందల టపాలు మీ నుంచి రావాలని ఆకాంక్షిస్తూ, భవదీయుడి టపాలు చేర్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ...

    ReplyDelete
    Replies
    1. అందించినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పాలండి. నాది వడ్డన మాత్రమే. ధన్యవాదాలు మురళి గారు.

      Delete
  10. hahahahahha...naa rachana add cheyyaka pothey " rangu paduddi " ani chepdaamanukunna...lucky gaa list lo rangu padindi...thanks jyothi.

    ReplyDelete
    Replies
    1. అదృష్టం కొద్దీ మరచిపోలేదు. లేకపోతే నా పని ఏమయ్యేది...;)
      మీ బ్లాగు మీకోసం బెంగ పెట్టుకుందట. నిన్న వెళ్ళినప్పుడు చెప్పింది ఎన్నెల గారు.
      ధన్యవాదాలు.

      Delete
  11. meeku yentha vopiko..!! I really admire it..

    ReplyDelete
    Replies
    1. రాసిన వాళ్ళదండీ ఓపిక. నాది సేకరణ మాత్రమే.

      Delete
  12. అబ్బ నిజంగా మృష్టాన్న భోజనం ....అభినందనలు

    ReplyDelete
  13. మీ నూరవ పోస్ట్ ఎప్పుడొస్తుందా అని చూస్తుంటే మీరు చాలా ఓపికతో ఇన్ని బ్లాగుల్లోని మంచి పోస్ట్ లను సేకరించి వ్రాయటం చాలా గ్రేట్.అందులో నా కవిత కూడా కలిపినందుకు మీకు ధన్యవాదాలు.మీది సృజనాత్మక మయిన ఆలోచన.

    ReplyDelete
    Replies
    1. రవిశేఖర్ గారూ నాకంటే ఎక్కువగా వందవ టపా కోసం ఎదురుచూసినందుకు మీకే చెప్పాలి ధన్యవాదాలు. వంద పూర్తయిన సందర్భంగా నేను బ్లాగు వ్రాయడానికి స్ఫూర్తి నిచ్చిన టపాలు కొన్ని పెట్టలనుకున్నాను. వాటితో పాటు నచ్చినవి కొన్నింటిని చేర్చాను. థాంక్ యు.

      Delete
  14. వంద టపాలు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు! ఏ టపాతో రాబోతున్నారా అని చూస్తే ఇలా వచ్చారనమాట! బాగు బాగు! పుచ్చుకుంటినమ్మ వాయినం :) ఇందులో అన్నీ నేను రుచి చూసినవే! నా గాజులు కూడా అందరికీ పంచారనమాట :) ధన్యవాదాలండీ!

    ReplyDelete
    Replies
    1. రసజ్ఞా గాజులు పంపించినందుకు నీకే చెప్పాలి ధన్యవాదాలు. థాంక్స్

      Delete
  15. జ్యోతి గారూ!
    టపాల శతకాన్ని పూర్తి చేసినందుకు
    హృదయపూర్వకమైన అభినందనలు...
    లిస్టులో నా టపా కు చోటిచ్చినందుకు ధన్యవాదాలు...
    మీరు మీ బ్లాగ్ పేరు లాంటి టపాలను ఎప్పటిలాగే మాకు అందిస్తున్దాలని
    మనసారా కోరుకుంటూ...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానానికి చాలా సంతోషం. ధన్యవాదాలు శ్రీ గారు.

      Delete
  16. వినూత్నమైన ఆలోచన జ్యోతిర్మయి గారూ! చాలా చాలా బావుంది.
    "శర్కరి" వంద పోస్ట్ లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు.
    మరిన్ని వందలు రాయాలని శుభకామనలు.
    విందులో నా రాతలూ చేర్చినందుకు ధన్యవాదాలు. :)

    ReplyDelete
    Replies
    1. కొత్తావకాయ గారూ నాకు నచ్చినవి నలుగురితో పంచుకోవాలని చేసిన ఈ ప్రయత్నం మీకు నచ్చినందుకు చాలా సంతోష౦. మీ రచనలు తీసుకున్నందుకు నేనే మీకు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. బ్లాగుల వెంట ఈ ప్రయాణం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ధన్యవాదాలు.

      Delete
  17. అభినందనలు జ్యోతిర్మయి గారూ...
    పక్షానికి సరిపడా విందు భోజనం పెట్టేశారు! ధన్యవాదాలు :-)

    ReplyDelete
    Replies
    1. నిషి గారు మీ ధన్యవాదాలు వంట చేసిన మీ లాంటి వారికి చెందాలి. నాది వడ్డన మాత్రమేనండి. ధన్యవాదాలు.

      Delete
  18. జ్యోతిర్మయి గారూ మీ వందో పోస్టు ఇలా రాయాలి అన్న ఆలోచన భలే ఉంది ! మీరు కస్టపడి తయారు చేసిన list కూడా బావుంది . ఇంకా మీ విందు లో నా వంటకానికి కూడా చోటు దొరికినందుకు ఇంకా సంతోషం గా ఉంది, థాంక్స్ :-))

    ReplyDelete
    Replies
    1. శ్రావ్య గారు ఆ కష్టంలో బోలెడు ఆనందం దొరికిందండి. పైగా చదినప్పుడల్లా రెట్టింపు సంతోషం కూడానూ..అక్కడ అతిధులపై పన్నీరు చిలకరిస్తోంది మీ అమ్మాయేనండీ. :) థాంక్స్.

      Delete
  19. WOW.. ఎంతందమైన వందో టపా రాసారండీ.. మా అందరి కోసం ఎంత ఓపిగ్గా, ఎంత అభిమానంగా విందు సిద్ధం చేసారండీ.. నిజంగా అద్భుతం!
    మీరూ, మీ శర్కరి కలిసి ఇలాగే మరెన్నో అందమైన అక్షరమాలలు అల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా..
    నావి కూడా నాలుగు పలుకులు చేర్చినందుకు మరీ మరీ థాంకులు.. :)

    ReplyDelete
    Replies
    1. మధుర గారు...మిస్ పనిమంతురాలు వచ్చి సహాయం చేసింది కాబట్టి ఈ పని సకాలంలో పూర్తిచేయగాలిగాను. :-) ధన్యవాదాలు.

      Delete
  20. WOW... అభినందనలు జ్యోతిర్మయి గారు!
    విందు బాగుంది.
    నాకు చోటు ఇచ్చినందుకు శర్కరి కి థాంక్స్‌ లు :)

    ReplyDelete
    Replies
    1. హర్షా ఏదో ఈ విందారగించైనా ఒళ్ళు చేస్తే నీ చిరకాల వాంఛ నెరవేరి ఒళ్ళు చేస్తావనీ, గన్ను నీ చేతికి వస్తుందినీను.. :) థాంక్స్.

      Delete
  21. విందు పసందుగా ఉంది.
    వంద టపాలకి అభినందనలు.
    మా వంటకం వడ్డిన్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. సుబ్రహ్మణ్యం గారూ...మా ఆహ్వానాన్ని మన్నించి శ్రమ అనుకోకుండా రైలు ప్రయాణం చేసి మరీ వచ్చారు. ధన్యవాదాలు.

      Delete
  22. అభినందనలు జ్యోతిర్మయి గారు వేయి టపాల విందుకి కుడా పిలవాలి సుమా

    ReplyDelete
    Replies
    1. లాస్య గారూ వెయ్యి టపాల విందు మీ వల్లే అవుతుందండి, బ్లాగి౦ట జరుపుకుందాం. థాంక్యు సొ మచ్.

      Delete
  23. అభినందనలు జ్యోతిర్మయి గారూ...నా టపాకి కూడా మీ విందులో చోటు దక్కినందుకు సంతోషం...

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు స్ఫురిత గారు.

      Delete
  24. నా ఫ్లైట్ కొంచెం లేటయ్యింది. అందుకే రావడం కాస్త ఆలస్యమయ్యింది.
    అయినా ఘుమఘుమలన్నీ అంత తాజాగానూ వున్నాయి.
    జ్యోతిర్మయిగారూ,
    మీ ఈ ఆలోచనకి జోహార్లండీ. వివిధ రుచులనీ ఒక్కచోటికి చేర్చిఅందించినందుకు అభినందనలు. అన్నీ మళ్ళీ రుచి చూసే అవకాశం కల్పించారు. అందులో నా కవితను కూడా జోడించినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. శ్రీ లలిత గారూ...ఆలస్యంగానైనా వచ్చి మీరు చెప్పకపోతే "ఎవరు చెపుతారు" చెప్పండి. ధన్యవాదాలు.

      Delete
  25. హబ్బా మీ కష్టం నాకు బోలెడుబాగా తెలుసు..,అప్పుడేప్పుడో నేను చేద్దామని అనుకుని తీరికా,ఓపికా,బద్దకం ఇత్యాదికారణాలతో వదిలేసినపని ఇది..ఎంత ఓపిక అండి మీకు ఇన్ని టపాలు చదివి వాటిని ఒకచోట చేర్చడం మాటలుకాదు .. నా పోస్ట్లు కూడా కలిపినందుకు బోలెడు ధన్యవాదాలు... ఈ లింకు నాకు మెయిల్ ఇచ్చిన వారికి కూడా బోలెడు ధన్యవాదాలు ...:)

    ReplyDelete
    Replies
    1. నేస్తం గారు స్వాగతమండీ. మీరు అనగనగా ఒక రోజు వస్తారని చూస్తున్నాను, ఇప్పుడొచ్చారు. చాలా సంతోషం. మీకు, మీకు మెయిల్ ఇచ్చినవారికి కూడా బోలెడు ధన్యవాదాలు.

      Delete
  26. జ్యోతి గారు, సుభాబివందనాలు , ఆలస్యంగా వచ్చాను అనుకోని అతిదిని కదా..

    ReplyDelete
    Replies
    1. మెరాజ్ గారూ మీరు వస్తారని ఎదురుచూస్తూనే వున్నానులెండి. మీరు రాకపోతే ఈ విందుకు నిండుదనం రాదు. ధన్యవాదాలు.

      Delete
  27. జ్యోతిర్మయి గారూ..
    వంద టపాలు పూర్తి చేసినందుకు మీకు అభినందనలండీ..
    మీకు నచ్చిన టపాల్లో అమ్మ గురించి నేను చెప్పుకున్న కబుర్లకి కూడా చోటిచ్చినందుకు
    చాలా సంతోషంగా వుంది..

    ThankYou..!


    ReplyDelete
    Replies
    1. రాజి గారూ...అమ్మ గురించి మీరు చెప్పిన కమ్మని మాట ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సింది. విందుకు హాజరైనందుకు ధన్యవాదాలు.

      Delete
  28. జ్యోతిర్మయి గారు, మీ ఓపికకుజోహార్లు. నాటపా కూడా చేర్చినందుకు ధన్యవాదాలు.
    వందో టపా మైలురాయికి చేరుకున్నందుకు అభినందనలు :-)

    ReplyDelete
    Replies
    1. వేణు గారూ...ఇన్ని వ్రాయగలనని, వ్రాస్తానని ధన్యవాదాలు అస్సలు ఊహించలేదండీ. నాకూ చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.

      Delete
  29. ఓరోరి! ఈ విందులూ నా వంటకమూ ఉందీ!!

    ReplyDelete
    Replies
    1. మీ వంటకం లేకపోతే ఎలా అరుణ్ గారు...మీ తెలుగు పరిజ్ఞానం మాకు తెలియనిదా...థాంక్యు.

      Delete
  30. అమ్మ తన పుట్టిన రోజునాడు కూడా తానే పులిహోరా, గారెలూ, పాయసమూ వండి పిల్లలకు విందు చేస్తుందే. అలా ఉంది మీ ఈ మైలురాయి బహుమతి. అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. నారాయణ స్వామి గారూ మీ రాక నాకెంతో సంతోషంగా వుంది. మీ వ్యాఖ్య "అన్నదాతా సుఖీభవ" అన్నట్లు నిండుగా వినిపించిందండీ. ధన్యవాదాలు.

      Delete
  31. జ్యోతిర్మయి గారూ ! మీ
    చేతులతో మాకు విందు చేయగ నూరో
    జ్యోతిని వెలిగించితిరి గ
    దా ! తడవేల ? భుజియింతు మన్నియు తృప్తిన్ .
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. రాజారావు గారూ పెద్దలు మీరు నన్ను గారు అనకండి. మీ ఆశీర్వాదమే నాతో ఇవి చేయిస్తోంది. వచ్చినందుకు మెచ్చినందుకు మీకు బోలెడు ధన్యవాదాలు.

      Delete
  32. అమ్మాయ్!
    ఏమ్మా పనిలో ఉన్నావా? ఏంటో బయలుదేరి వచ్చేటప్పటికి ఆలస్యమైపోయిందమ్మా. వందవ టపా విందుకి అభినందనలు, బాగుంది,ఏంటీ! నా మాట కచేరీ పెట్టేవా వినోదానికి, సంతోషం. శతమనంతం భవతి.

    ReplyDelete
    Replies
    1. బాబాయ్ గారూ..ఉదయమే మీగురించి ఆలోచిస్తూ ఎక్కడా కనిపించడం లేదేమిటా అనుకున్నాను. ఆలశ్యం ఏం లేదు బాబాయి గారు, దూరాభారం కదా! అనుకున్నప్పుడల్లా రావడం కుదరదుగా...పైగా ఇంకా రావలసిన వాళ్ళూ వున్నారు. వందో టపా సందర్భంగా నేను అభివాదం చెయ్యక మునుపే నాకు ఆశీర్వాదాలు అందిచారు. మీకు పాదాభివందనాలు.

      Delete
  33. జ్యోతిర్మయిగారూ,నన్నుకూడా గుర్తుంచుకున్నందుకు ధాంక్స్. ఈ పోస్టు ఇప్పుడే ఆలస్యంగా చూసేను.అయినా వడ్డించే వాళ్లు మనవాళ్లయినప్పుడు ఎంత ఆఖరులో వచ్చినా ఫరవాలేదంటారుగదా?--అపురూపం.

    ReplyDelete
    Replies
    1. గోపాల కృష్ణా రావు గారూ..మీరు పెద్దలు నన్ను గారూ అనకండి. మనవాళ్ళన్నారు కదా. ఆ మాట చాలు. ధన్యవాదాలు.

      Delete
  34. ఓహ్! నేను ఇది మిస్ అయ్యానండీ! :(. :(. మీ విందు భుక్తాయాసం తెప్పించేలా ఉంది :). మీకు శుభాభినందనలు. మరిన్ని వ్రాయాలని విన్నపాలు :)

    ReplyDelete
    Replies
    1. మానస గారూ మీరు మిస్ అవలేదు, సమయానికే వచ్చారు. కమ్మని వంట వండిన వాళ్ళందరకూ మీ అభినందనలు చెందుతాయి. మరిన్ని రాయమన్న మీ ప్రోత్సాహం నేను మరువలేనిది. థాంక్యు.

      Delete
  35. కొన్ని వంటకాలు కడుపు నిండా తిన్నాను. ఇంకా రుచి చుడాల్సినవి చాలానే వున్నాయి.

    I appreciate your work.ఎంత సమయం వెచ్చించి ఉంటారో....మా అందరికి భుక్తాయాసం వచ్చేటంత శ్రమ కదూ..అంతే అధ్బుతంగా వుంది

    ReplyDelete
  36. ఎంత కష్టం,..ఎంత కష్టం .......
    ఇంత మందిని మీ ఆతిధ్యంతో ఆనందింపచేసినందుకు,..ఆ పంక్తిలో నాకు కాస్తా చోటిచ్చినందుకు,..
    మీకు బోలెడన్ని ధన్యవాదాలండి,..

    ReplyDelete
    Replies
    1. భాస్కర్ గారు...కష్టమేం లేదండీ, పైగా చాలా ఇష్టంగా కూడా వున్నది. థాంక్యు.

      Delete
  37. జాబిలీ వెన్నల పువ్వు తోట చీకటి వెలుగు సరసం సంతోషం కష్టం నష్టం ఓదార్పు నిటూర్పు వంట వార్పూ రుచి అభిరుచి నిదానం గమ్యం పయనం పండగ భవిత కవిత విద్య వైద్యం పేదరికం పెద్దరికం అమ్మ నాన్న కుటుంబం కోలాహలం సింధూరం సిగ్గు కల కళ అభిరుచి అభిమానం అచ్చులు హల్లులు సంసారం సాగరం ఆహ్వానం దైవం దిశలు దిక్కులు సూచనలు సోయగాలు ఆయుధం ఆమని కోకిల కోరిక ................
    మీ శతకంలో నుంచి నేను నేర్చుకున్న అర్థ సతకమండి.... ఇంకా చాలానే ఉన్నాయి చెప్పాలంటే కాపోతే క్లుప్తంగా అవి ...
    వయసు పల్లకి ఎక్కేకొద్ది వలపులు వాడిపోతాయి అది ఆ దేవుడి రీతి... భావాల పందిరి నీడలో ఉంటేనే చాలు వయసుతో పనేముంది అనేది మీ రీతి... ఆహా చాలా బాగుందండి జ్యోతిర్మయి గారు ... ఒక్క దారము ఎన్ని ముత్యాలనైన కూర్చగలదని చెప్పకనే చెప్పారు... ఇంకా ఇలా ఎన్నో విషయాలు మీ అనుభవాలనుంచి మాకు పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను .... :)

    ReplyDelete
    Replies
    1. కళ్యాణ్ గారూ...చాలా రోజులకు కనిపించారు. బావున్నారా? బ్లాగ్ అంతా కాచి వడపోసి చక్కటి విశ్లేషణ ఇచ్చారు. మీ వ్యాఖ్య ఎంతటి సంతోషాన్నిచ్చి౦దో మాటల్లో చెప్పలేను. మీకు బోలెడు బోలెడు ధన్యవాదాలు.

      Delete
  38. ఎంత శ్రమ ఉందో ఈ టపా వెనుక! వంద టపాలని ఏరి కూర్చడం మాటలు కాదు. మా అమ్మను కూడా చేర్చినందుకు ధన్యవాదాలు. మీ వందవ టపా కూడా మీ ప్రతి టపాలాగే ప్రత్యేకంగా ఉంది. మీ శ్రమని గౌరవిస్తూ మీరు వడ్డించిన వంద టపాలూ మళ్ళీ చదువుతాను. మీకు శతటపోత్సవ శుభాకాంక్షలు. :) రాస్తూనే ఉండండి. మీ శైలి నాకు చాలా ఇష్టం.

    ReplyDelete
    Replies
    1. శిశిర గారు...అమ్మ గురించి మీర్రాసిన మాటల్లో మా ఊరు కనిపించింది. మీ వ్యాఖ్య నన్ను మేఘాల పైకి తీసుకెళ్ళింది. థాంక్యు.

      Delete
  39. ధన్యవాదాలండి. మీ ఊరు బాగా నచ్చిందనా, నన్ను కూడా 'ఎదసడి' తో కలిపేసారు:) వంద టపాల అభినందనలండి.

    ReplyDelete
    Replies
    1. జయ గారు పొరపాటున రెండింటికీ ఒకే లింక్ ఇచ్చినట్లున్నానండి. ఇప్పుడు మార్చాను.
      సారి ఏమనుకోకండి. థాంక్యు.

      Delete
  40. జ్యోతిర్మయి గారి వంద (విందు) భోజనం, ఎలా మిస్ అయ్యాం?
    కంగ్రాచ్యులేషన్స్ అండీ!
    లేట్ గా చెప్తున్నామని కోప్పడ్రు కదా? ;)

    ReplyDelete
    Replies
    1. కోపమా భలేవారే. ఆలశ్యం అయింది ఏం వెళతాంలే అనుకోకుండా వచ్చి ఓ మాట చెప్పరు చాలా సంతోషం. ధన్యవాదాలు చిన్ని ఆశ గారు.

      Delete
  41. వావ్.. భలే ఉంది. చాలా కష్టపడి బ్రహ్మాండంగా రాశారు.

    ReplyDelete
    Replies
    1. కృష్ణప్రియ గారు నాకు నచ్చినవన్నీ మళ్ళీ మళ్ళీ చదువుకోవాలంటే వెతకక్కరలేకుండా ఇలా అన్నమాట. థాంక్యు.

      Delete
  42. సూపర్ అండి మీరు జ్యోతిర్మయిగారు... చదవాల్సిన టపాలు చాలానే ఉన్నాయి.... ఈ టపా చూడ్డంలో నేను మరీ లేటేమో...... :)

    ReplyDelete
    Replies
    1. శోభ గారు ఆత్మీయంగా వచ్చారు..అది చాలు. అన్నీ చదివేయండి మరి.
      ధన్యవాదాలు.

      Delete
  43. కెవ్వ్! నాకిప్పటిదాకా ఈ టపా గురించి తెలియనే తెలియదూ! నేను పైని శోభ గారికంటే లేటు!
    మీ ఓపిక్కి చాలా పెద్ద నమస్కారం :-)
    నా బ్లాగును కూడా ప్రస్తావించినందుకు థాంక్స్.

    ReplyDelete
  44. Your blog buffet is awesome! ! All of them are tempting👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.