నేను వెళ్లేసరికి సుమన చింటూకు ఫోన్ ఇచ్చి అన్నం పెడుతూ వుంది. వాడు ఫోన్లో 'కెవ్వు కేక' పాట చూస్తూ పది నిముషాలకోసారి నోరు తెరుస్తున్నాడు. ఆ తరువాత పెరుగన్నం తినేప్పుడు 'రింగ రింగా' పాట చూస్తూ తిన్నాడు. రోజూ ఉండే తతంగమే ఇది. వాడికి అన్నం పెట్టడానికి సుమనకు ఓ అరగంట పడుతుంది. ఏదో విధంగా తన కొడుకు అన్నం తింటే చాలన్న ఆలోచనను రోజులా నాకెందుకులే అని చూస్తూ ఊరుకోలేక పోయాను.
"అబ్బ ఈ పిల్లాడికి అన్నం పెట్టేసరికి తల ప్రాణం తోక్కొస్తుందనుకో " అంటూ వచ్చి కూర్చుంది.
"పిల్లల పోషణ అంటే శారీరక అవసరాలు చూడడమేనా మన బాధ్యత?" అడిగాను.
"అంతేగా మరి రెండేళ్ళ పిల్లలకు అంతకంటే ఏం చేస్తాం?" ఆశ్చర్యపోయింది సుమన.
"చింటూ 'కెవ్వు కేక', 'రింగ రింగా' పాటలు రోజూ చూస్తున్నాడు. ఆడవారిని ఆటబొమ్మగా చూపే అలాంటి పాటలు వాడి మనసుమీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఆలోచిస్తున్నామా....మరో రెండేళ్ళు పొయ్యాక వాడు ఆడే వీడియో గేమ్స్ లో గన్స్ తో కాల్చుకోవడమే వుంటుంది. వాడి ఆలోచనా ధోరణి పెద్దయ్యాక ఏవిధంగా ఉంటుందో ఆలోచించు" తను నొచ్చుకోకుండా సాధ్యమైనంత సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించాను.
"చిన్నతనంలో ఆడే వీడియో గేమ్స్, టివి పిల్లల మీద అంత ప్రభావం చూపిస్తాయంటే నేనొప్పుకోను." నా ఆలోచనను గట్టిగానే ఖండిచింది.
"మొన్న సెలవల్లో మా అక్కావాళ్ళు వచ్చారు గుర్తుందిగా వాళ్ళ అమ్మాయి ప్రవల్లిక టెన్త్ చదువుతోంది. తనోసారి పిల్లలతో కూర్చుని టివి చూస్తూ, "ఆ ఏరోప్లేన్ ను గన్ తో కాల్చేయాలనిపిస్తుంది" అంది. నాకర్ధం కాలేదు, "ఎందుకలా అనిపించిందిరా" అనడిగాను. " ఐ డోంట్ నో, వీడియో గేమ్స్ లో అలా చేసి చేసి అలవాటయిపోయింది" అంది."
కొంచెం సేపు నిశ్సబ్దంగా ఉండిపోయింది సుమన. "మొన్న స్కూల్లో తల్లిని, పసిపిల్లలను నిలువునా కాల్చేసిన వాడ్నికరుడు గట్టిన రాక్షసుడనుకోవాలా? నిండా పాతికేళ్ళు కూడా వున్నట్టులేవే" నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అన్నాను.
"అతను పెరిగిన పరిస్థితిలు ఎలాంటివో మన వాళ్ళు అలా ఎందుకవుతారు?" మెల్లగా అంది. అంతకు ముందున్నంత విశ్వాసం లేదు స్వరంలో, తన ఆలోచన మీద తనకే పూర్తి నమ్మకం వున్నట్లనిపించలేదు.
"వ్యసనాలకు బానిసై సులభంగా వచ్చే డబ్బుకు ఆశపడి పసిపాపను బలితీసుకున్న వాడు పెరిగింది మన దేశంలోనే. పాపం వాళ్ళమ్మను చూస్తే ఎంత బాధనిపించిందో! "నా కొడుకు మంచి వాడు ఎవరినీ ఇబ్బంది పెట్టే మనస్థత్వం కాదు వాడిది. ఇలా ఎందుకు చేశాడో" అని ఆవిడ బాధపడుతుంటే నాకు ఎదురుగా మన పిల్లలే కనిపించారు. ఎక్కడుంది లోపం?" ఎన్నాళ్ళుగానో మనసులో ఆలోచన ప్రశ్న రూపంలో బయటకు వచ్చింది. సమాధానం లేనట్లుగా మౌనంగా చూస్తూండిపోయింది సుమన.
"మన వార్తా పత్రికల్లో గ్యాంగ్ రేప్స్ గురించి చదువుతూనే వున్నాం కదా. వాళ్ళు పెరిగింది మన సంస్కృతిలోనే. పిల్లలు ఇక్కడ పెరిగారా, ఇండియాలోనా అన్నది కాదు ముఖ్యం వాళ్ళు పెరుగుతున్న పరిస్థితులు ఎలాంటివి? వాళ్ళను సరిదిద్దవలసిన బాధ్యత మనమీద ఎంతుంది?" నిన్నటినుండి మనసులో సుడి తిరుగుతున్న ప్రశ్నలను ఎవరిని అడగాలో తెలియక సుమన వైపు సంధించాను.
"అందరూ అలానే తయారవుతున్నారా? ఎంతమంది చక్కగా చదువుకుని జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు లేరు."
"నిజమే జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళే వున్నారు. పక్కన అన్యాయం జరుగుతున్నా స్పందించే సున్నితత్వాన్ని కోల్పోతున్నారు. వారి జీవితమే వారికి ముఖ్యం. తమదాకా వస్తే కాని అది పట్టించుకోవాల్సిన సమస్య కానే కాదు వారి దృష్టిలో."
"అలా అని ప్రతి సమస్యనూ మనసుదాకా తీసుకుని ఎప్పుడూ బాధ పడుతూ ఉండాలా?"
"అక్కర్లేదు సుమనా కనీసం మన వలన అలాంటి తప్పులు జరగకుండా చూడాలి. ఇండియా గురించి నాకు తెలియదు కాని ఇక్కడ మాత్రం పిల్లలకు మంచి చెడూ బోధించాల్సిన తల్లిదండ్రులు అమెరికా వ్యామోహంలో పూర్తిగా మునిగి పోయారు. నిద్రలేస్తే జీవనోపాధి కోసం పరుగులు, రెండు దేశాల సంస్కృతలను వంట బట్టించుకునే ప్రక్రియలో క్షణం తీరికలేని వారాంతాలు.
ఇక మన, తన అని తేడా ఏముంది" కొంత బాధగా చెప్పాను.
"సెలవలలో పెద్దవాళ్ళు రావడమో పిల్లలు ఇండియా వెళ్లడమో జరుగుతూనే ఉంటుందిగా" నేను మాట్లాడుతున్నది అర్ధమౌతున్నా ఒప్పుకోవడానికి సిద్దంగా లేదు.
"మనవల కోసం పెద్దవాళ్ళు వస్తున్నారు. వచ్చిన వాళ్ళతో వీళ్ళెంతవరకూ మాట్లాడ గలుగుతున్నారు? ఇద్దరి మధ్య సంబంధాలు ఎలా వుంటున్నయ్. మనం చిన్నప్పుడు మన అమ్మమ్మా వాళ్ళిల్లు అని మధుర స్మృతులు గుర్తుచేసికున్నట్లుగా వీరికి వారితో ఆ అనుబంధం వుందా?"
"నువ్వన్నది నిజమే. దీనికి పరిష్కారం ఏమిటి మరి" సాలోచనగా అంది.
పరిష్కారం అంత సులువుగా దొరికేది కాదు. ఈ సమస్య మనందరిదీ. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు రేపు ఎలాంటి భయంకర పరిస్థితులు ఎదుర్కుంటారో, ఎలాంటి పరిస్థితులలో దోషులుగా మారుతారో తెలియదు. పరిస్థితి చెయ్యిదాటి పోకముందే మేల్కొoదాం. పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడుపుదాం. వాళ్ళ స్నేహితులు ఎలాంటి వారో తెలుసుకుందాం.
మన చుట్టూ వుండే టివి, సినిమా రంగం మానవతా విలువలు లేకుండా, అసభ్యతతో కలుషితమై పోయి వుంది. వాటిని నిర్మూలించ వలసిన ప్రభుత్వం కొంత మంది వ్యక్తుల లాభాలకోసం, కొన్ని సంస్థల అభివుద్ది కోసమో అమ్ముడు పోయింది. వాటిని మనం మార్చలేనప్పుడు కనీసం పిల్లలను వాటికి దూరంగా ఉంచడానికి ప్రయత్నిద్దాం. మొక్కై వంగనిది మానై వంగదు ... పసిపిల్లలుగా ఉన్నప్పుడే వారికి నీతి కథలు, కబుర్లతో మంచీ చెడూ చెప్దాం.
పరిస్థితి చేయి దాటి పోతోందని రోజూ వార్తా పత్రికలలో వచ్చే వార్తల ద్వారా తెలుస్తూనే వుంది. పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిండ్రుల మీదే వుంది. పసి మనసుల మీద చేస్తున్న వ్యాపారాన్ని అరికట్టవలసిన బాధ్యత మనందరిదీ.
అన్యాయంగా దురాగతాలకు బలౌతున్న అమాయకులకు అశ్రునయనాలతో...

చాలా బాగ చెప్పారు. పిల్లలను ఇలాంటి కలుషిత వాతవరణము నుండి కాపాడ వలసిన భాద్యత మనదే.
ReplyDeleteధన్యవాదాలు అజ్ఞాత గారు.
Deleteపసుమనసులు చాలా సులభంగా చెడువైపు ఆకర్షితమైపోతాయి...
ReplyDeleteబాధ్యత అందరిదీ, నిజమే.
ధన్యవాదాలు చిన్నిఆశ గారు.
DeleteReally true
ReplyDeleteధన్యవాదాలు బాబాయి గారు.
Delete>>పసి మనసుల మీద చేస్తున్న వ్యాపారాన్ని అరికట్టాలి<<
ReplyDeleteనిజం, నిజం,.. ఈ మధ్య ప్రతి వస్తువూ పిల్లలను దృష్టి లో వుంచుకొనే మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నారు :(
బాగా రాసారు!
ధన్యవాదాలు హర్షా.
Deleteకళ్ళు తెరిపించేడిగా ఉంది ఈ పోస్ట్. మన భాధ్యతా రాహిత్యాన్ని..కళ్ళకి కట్టినట్లు చెప్పారు.ముందు పెద్దవాళ్ళకి కౌన్సిలింగ్ కావాలి.
ReplyDeleteమాటలకు అందని భావాలు అక్షారాల్లో సాక్షాత్కరిస్తాయి. సాహిత్యానికి పెద్ద పీట వేసి పుస్తకాకు చదవడం ప్రోత్సహించాలి. అప్పుడే ఆలోచనా పరిధి పెరుగుతుంది. దురదృష్టవశాత్తు మన విద్యావిదానం జీవనభ్రుతి కోసం పాటుపడే చదువును బోధిస్తుంది, జీవన సాఫల్యానికి చదవాల్సిన పుస్తకాల మాటే వినిపించదు. ధన్యవాదాలు.
Delete//మన చుట్టూ వుండే టివి, సినిమా రంగం మానవతా విలువలు లేకుండా, అసభ్యతతో కలుషితమై పోయి వుంది. వాటిని నిర్మూలించవలసిన ప్రభుత్వం కోంత మంది వ్యక్తుల లాభాలకోసం, కొన్ని సంస్థల అభివుద్ది కోసమో అమ్ముడు పోయింది...//
ReplyDeleteప్రభుత్వం నిర్మూలించాలని అనను కానీ, కనీసం నియంత్రించాలి. కానీ, పబ్లిక్కే ఇష్టపడుతున్నపుడు ప్రభుత్వం మాత్రం ఏం చేయగలదు?
తెలుగు భావాలు గారు పిల్లల్నడిగితే చాకోలేట్ నచ్చిన ఆహారం అంటారు. అదే నిజమని ప్రభుత్వం మనల్ని మభ్యపెడితే ఎలా...నిజానిజాలు అందరికీ తెలుసు. ధన్యవాదాలు.
Deleteఎంతో క్లిష్టమైన సమస్య ని చాలా సునిశితం గా స్పృశించారు జ్యోతి గారు..:-)Great post..:-)
ReplyDeleteమనసుకు నిలువక రాశాను నాగిని గారు. చదివిన ఒక్కరైనా పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకుంటారని చిన్నఆశ. ధన్యవాదాలు నాగిని గారు.
Deleteజ్యోతి గారూ!...చాలా బాగా చెప్పారు...అందరూ కనీసం ఇపుడైనా మేల్కోవాలి...@శ్రీ
ReplyDeleteశ్రీ గారు ఇవి అందరికీ తెలిసిన విషయాలే. ఆచరణలోకి వచ్చేసరికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. మేల్కొనే రోజు రావాలనే కోరుకుందాం. ధన్యవాదాలు.
Deleteజ్యోతి గారు, పిల్లల్ని ఇలాంటి కలుషిత వాతవారణం నుంచి దూరంగ ఉంచవలసిన బాధ్యత కొంత వరకు పెద్దలదే.
ReplyDeleteచిన్నిగారు. పిల్లలు అభం శుభం తెలియని వారండి. మనం నేర్పించినవే వాళ్ళు నేర్చుకుంటారు. నేర్పించే ఓర్పు మనకుండాలి. ధన్యవాదాలు.
Deleteనిజమే అండి.. మన పిల్లలు అలా మారుతున్నారు అంటే తల్లి తండ్రులదే బాద్యత...
ReplyDeleteమంచి చెడు.. మానవత విలువలు వారికి చిన్నప్పుడే తెలిసేలా చేయాలి కొంత ఏజ్ వచ్చాకా చెప్పిన పలితం తక్కువా...
ప్రిన్స్మ గారు...మనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో పిల్లలకు ఎన్నో కథలు చూపించొచ్చు. తద్వారా వారు మంచి చెడూ తెలుసుకోగలరు. ఆ రోజులు త్వరలో వస్తాయనే ఆశిద్దాం. ధన్యవాదాలు.
Deleteబాగా రాసారు.
ReplyDeleteడిల్లీలో జరిగిన సంగటన చదువుతుంతే ఏడుపొచ్చేసింది.ఇటువంటివి చదువుతుంటే ఎటు పోతుంది మనసమాజం అనిపిస్తుంది.
రాధిక గారు ఆడపిల్ల అంగాంగాలను తెరమీద చూస్తున్నప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్నoడీ ఇది. సమస్య మూలాలు తెలుసుకోగలిగితే పరిష్కారం గురించి ఆలోచించొచ్చు. అన్ని ఊర్లు మీ ఊరులా ఉంటే ఎంత బావుణ్ణు. ధన్యవాదాలు.
Deleteit is the total mistake of parents, for the misdeeds of children.if they are able to spend two
ReplyDeletehours time daily,till the age of 25 ,their children
will have bright future,& it is proved in our family.
P'Jagadish Babu
స్వాగతం జగదీష్ గారు. అలాంటి తల్లిదండ్రులున్న మీరు చాలా అదృష్టవంతులు. ప్రతిఒక్కరు అలా ఆలోచించాలని కోరుకుందాము. ధన్యవాదాలు.
Deleteజ్యోతిర్మయి గారూ..
ReplyDeleteబాధ్యత కుటుంబం,సమాజం ప్రతి ఒక్కరిదీ..
కాకపోతే చిన్ని మనసులకు ఇల్లే మొదటి బడి కాబట్టి అక్కడి నుండే వాళ్ళకు నైతిక విలువలు,మానవత్వం ఇలాంటివి తెలియచేయాల్సిన అవసరం ఉంది..
తల్లిదండ్రులు పాటిస్తూ పిల్లలకి నేర్పటం మంచి ఫలితాలను ఇస్తుందన్నది మీలాగే చాలా మంది అభిప్రాయం కూడా..
రాజి గారు మీరన్నారు చూశారా >>తల్లిదండ్రులు పాటిస్తూ అని>> అది చాలా ముఖ్యం. చాలా వరకు చిన్నపిల్లలు మనల్ని అనుకరిస్తూ నేర్చుకుంటారు. ధన్యవాదాలు.
Deleteసందేశాత్మకమైన పోస్ట్....కానీ ఎందరు పాటిస్తారో!
ReplyDeleteపద్మార్పిత గారు అన్యాయాలకు బలౌతున్న వాళ్ళు మనలాంటి వారే అన్న స్పృహ వున్నవాళ్ళు తప్పకుండా పాటిస్తారండి. ధన్యవాదాలు.
Deletechala baga chepara andi jyothi garu..manchi post...andariki telisana vishayamu kani temporary comfort kosam marchipotuvuntaru...pelllalu ki first and best teacher parents...pellalu ki manchi sankaramulu echi, manchi vyaktitva ayina manishaga chesey bhadyata talli-tandrilu dey...eee post choosee chala mandi telisana vishayamu malli telusukuni aacharistarani bhavistananu..
ReplyDeleteThanks
Anuradha
అనురాధ మీరన్నారు చూశారా 'టెంపరరీ కంఫర్ట్' అని చాలా బాగా చెప్పారు. దాని పర్యవసానం గురించి అలోచించి వుండరు. చక్కని వ్యాఖ్య వ్రాశారు. ధన్యవాదాలు.
Deleteచాలా బాగారాశారు...
ReplyDeleteధన్యవాదాలు డేవిడ్ గారు.
Deleteబాగా రాసారు జ్యోతిర్మయి గారు, నిజమే పిల్లలకి మంచి చెడు చెప్పాల్సిన భాద్యత తల్లిదండ్రులదే...కానీ, ఇప్పుడు తల్లిదండ్రులు బిజీ గా ఉండి, మీరన్నట్టు ఫోన్ లో /pc లో గేమ్స్...లేదా టీవీ అలవాటు చేస్తున్నారు పిల్లలకి :(
ReplyDeleteకావ్యాంజలి గారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్నో మంచి పనులకు వాడొచ్చండి, దానినుండి ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవచ్చు. మన బాధ్యత పట్ల మనకు అవగాహన వుంటే చాలు. ధన్యవాదాలు.
Delete
ReplyDeleteజ్యోతి గారూ, ఈ మద్య కొంత తీరిక లేకపోవటం వల్లా మీ పోస్ట్ చూడలేదు, మీ వ్యాఖ్యల్లో ఉన్న ఇంగిత జ్ఞానం తెలుసు నాకు. ఎప్పుడూ ఏదో ఒక సందేశం ఇవ్వగలిగే మీ రాతలు అద్భతం, అనితర సాద్యం. ఎవరినా పాటిస్తారా లేదా అని కాదు ఆలోచన మీ మాటలు సమజానికి పనికివస్తాయి కనుక రాయండి. మంచి పోస్ట్ అభినందనలు.
మెరాజ్ గారు అనుక్షణం సామాజిక శ్ర్యేయస్సు గురించి ఆలోచించే మీనుంచి ఇలాంటి అభినందన అందుకోవడం చాలా ఆనందంగా వుంది. ధన్యవాదాలు.
Delete"ముందే మేల్కోక పోతే అపరాథుల తల్లి దండ్రుల వలే పశ్చాత్తప్తులవడం తప్పదు" - అనే సందేశం బలంగా మీ ఈ టపాలో విన్పిస్తోంది . ఎందరు పాటిస్తారు అనే సందేహం అనవసరం . పరిణతి పొందిన బ్లాగర్లు ఇలాంటి మంచి సామాజిక చైతన్యానికి పూనుకో వలసిన అవసరం నేడు ఎంతైనా ఉంది .
ReplyDelete>>బ్లాగర్లు ఇలాంటి మంచి సామాజిక చైతన్యానికి పూనుకోవాలసిన అవసరం నేడు ఎంతైనా ఉంది.>>
Deleteసరిగ్గా నా మనసులో మాట చెప్పారు రాజారావు గారు. ధన్యవాదాలు.
Wonderfully said, mee article tho okka person change aina..thats enough....As a parent, this made me think a lot and change the way i want to raise my kid...
ReplyDeleteThanks for a thought provoking post.
అజ్ఞాత గారు మీ నిర్ణయం సంతోషాన్ని కలుగజేసిందండి. ఇలాంటి వ్యాఖ్యలే వ్రాయడానికి స్ఫూర్తిని కలుగజేస్తాయి. ధన్యవాదాలు.
Deleteజ్యోతి గారు,
ReplyDeleteచాల మంచిగా బాధ్యత ని గుర్తు ఎరుగచేసారండి. వుగ్గుపాలు పట్టే వయసు నుండే ఇలా చేస్తే బిడ్డలకి మంచి చెడు ఎలా తెలుస్తుంది కదా! అదే ఒక అన్నమయ్య పాట పాడుతూ పోనీ మరీ పాత స్టైల్ అయితే చిట్టి కృష్ణుడికి యశోదమ్మ పెరుగు బువ్వ ఎట్లా పెట్టిందో ఒక అమరాచిత్ర కధో లేకపోతె కృష్ణుడి కధలు ఎన్ని లేవు చిన్న చిన్న ఎపిసోడ్స్ గా వీడియోస్ అవి చూపించి పెట్టొచ్చు. ఎంత తేడా పడుతుందో కదా ఆ బిడ్డ మీద మనం చూపించేవి చెప్పేవి. నేను మొన్న చిన్మయ మిషన్ వాళ్ళ వర్క్ షాప్ కి వెళ్ళాను. అక్కడికి చాల కుటుంబాలు వచ్చాయి. అందరు సేవ చేస్తున్నారు. ఒక బాబు 14 ఏళ్ళ వయసు వాడు చాల బరువు మోస్తున్నాడు (కార్ ట్రంక్ లో పెట్టటానికి). ఒక్కసారే అంత బరువు ఎందుకు నాన్న అంటే హనుమాన్ ఇస్ విత్ మీ ఆంటీ ! అన్నాడు. ఒక్క నిమిషం పట్టింది నాకు వాడు అన్నది అర్ధం చేసుకోడానికి.. ప్రతి ఒక్కళ్ళు చేసే ప్రతి పని లో భగవంతుడిని తోడుగా వుహించుకుంటే ప్రపంచం నందనవనం లా వుండదూ ! మనం అందరమూ రామాయణ భారత భాగవత గాధల్ని పసిపిల్ల లప్పటినుండే చెప్పటం చూపెట్టటం చేస్తే వాళ్ళతో పాటు మనలో కూడా అవసరమైన మార్పులు తప్పకుండా వస్తాయి. తల్లితండ్రులూ మేల్కొనండి! జ్యోతి గారు మీ మంచి మంచి పోస్ట్ లకు చాల థాంక్స్!
సుజాత
సుజాత గారు మనం చెప్పే నీతి కథలు కబుర్లు పిల్లలను సన్మార్గంలో నడిపిస్తాయనే నా నమ్మకాన్ని బలపరిచాయి మీరు చెప్పిన విషయాలు. ధన్యవాదాలు.
Deleteనమస్కారం జ్యోతి గారూ,
ReplyDeleteచాలా బాగా చెప్పారండి. నా చిన్నతనాన్ని మా బుజ్జిగాడి చిన్నతనంలో చూసుకోవాలనే నా కోరిక. అమ్మమ్మ నాయనమ్మలు, బాబయ్య మామయ్య అత్తలు పిన్నులు అందరి ప్రేమలో మాధుర్యం వాడు కూడా చూడాలి. అన్నిటికంటే మిన్నగా నా భాష తెలుగు వాడి భాష కూడా కావాలి. ఆ కోరిక నెరవేరడానికి మేము ఏమి చేయడానికైనా సిద్దమే. ఆఖరికి ఈ ఉద్యోగాలు వదిలేసి పల్లెకి పోదాం చలో చలో కి కూడా తయారే.
నమస్కారం హై హై నాయక గారు. మీ కోరిక తీరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు
ReplyDeleteఇది చాలా పెద్ద సమస్య.... కానీ, దీని పరిష్కారం మన చేతిలొనే ఉంది...
ReplyDeleteపిల్లలకి చక్కటి కథలు చెబుతూ అన్నం పెట్టే రోజులు పోయాయి (ఎక్కడో కొందరు తప్పించి).....
మార్పు వస్తుందనే ఆశిద్దాం మాధవి గారు. చాలా రోజులకు కనిపించారు...బావున్నారా..
Deleteధన్యవాదాలు
good
ReplyDeleteధన్యవాదాలు సుబ్రమణ్యం గారు.
Delete