నా కవిత 'కౌముది' ఇంటర్నెట్ మాసపత్రిక 'జూలై' సంచికలో ప్రచురితమైంది.నా కవితను ప్రచురించిన కౌముది సంపాదకులకు బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ప్రతిఫలం
సందె మబ్బులు
చీకటి మాటుకు తప్పుకుంటున్నై!
వేచియున్న కలువపై
వెన్నెల పరచుకుంటోంది!
మదిలో ఏ మూలో...
నిశ్శబ్దపు ఒంటరి రాత్రి
జ్ఞాపకాల దొంతర కదిలిన చప్పుడు!
అప్పుడెప్పుడో...
'నీకేం కావాలని' కదూ అడిగావ్!
ఏం అడగాలో ...
ఎలా చెప్పాలో... తెలియని రోజులు
ఒక్క నవ్వు నవ్వేసి ఊరుకున్నా!
ఆ తరువాతెప్పుడో ...
'ఏం తెచ్చానో చూడమ'న్నావ్,
మూసిన గుప్పెట్లో విరిసిన మల్లెలు!
వెన్నెల విహారాలు...
జాజిపూల పరిమళాలు!
వలపు సయ్యాటలు...
సరసాల సరాగాలు!
మోయలేని భారంతో...
మనసు కృంగిన రోజు
కొండంత ఓదార్పైనావు!
అనుభవాలు
పాఠాలయ్యాయి!
జీవితం గోదారి పాయలా
నిండుగా సాగిపోతుంది!
అప్పటి నీ ప్రశ్నకు,
ఇప్పటి నా సమాధానం
అదే చిరునవ్వు!
కాలంతో పాటు కలసిపోనీక
నువ్వు కాపాడిన
'నా నవ్వు'కు
ప్రతిఫలంగా నీకు నేనేమివ్వగలను?
చాలా బాగా రాశారు జ్యోతి గారు..:-)
ReplyDeleteధన్యవాదాలు నాగిని గారు.
Deleteకవిత చాలా బాగుంది. ఏమీ అనుకోక పోతే ఒక్క మాట. సంజమబ్బులు చీకటి మాటుకు తప్పుకునే సమయంలో వెన్నెల కలువలపై విరియడం సమంజసంగా లేదు.ఒకదాని తర్వాత ఒకటి అయిందని అనుకున్నా మబ్బులు వెన్నెట్లో కూడా కనిపిస్తాయి కదా?ఎక్కడికీ పోవు.రంధ్రాన్వేషణ కాదిది. మీ కవిత మరింత గుబాళించాలనే కోరిక.
ReplyDeleteగోపాల కృష్ణ గారూ ఎంత మాట. మళ్ళీ ఓ సారి కవిత చదివితే మీరు చెప్పింది సబబుగా అనిపించిందండీ..ముందు నలుగు వాక్యాలు లేకపోతే కవిత భావం మరింత సూటిగా ఉండేది. లేకపోయినా సంధ్యను వర్ణించడానికి వేరే పదాలు వాడి వుండాల్సింది. మీరిలా చెప్పడం చాలా ఆనందంగా కూడా అనిపించింది. మీలాంటి వారు చెపితేనే కదా సరిదిద్దుకునే అవకాశం కలిగేది. ధన్యవాదాలు.
Deletegood
ReplyDeleteధన్యవాదాలు బాబాయిగారూ..
Deleteఅభినందనలు మీకు...
ReplyDeleteకవిత బాగుంది...
@శ్రీ
ధన్యవాదాలు శ్రీ గారూ..
Deleteబావుంది జ్యోతిర్మయి గారు,
ReplyDeleteశుభాకాంక్షలు.
లోకేష్ శ్రీకాంత్ గారు..మీ వ్యాఖ్య ఎందుకో మోడరేషన్ లో వుండిపోయి౦దండీ...ఆలస్యంగా సమాధానమిస్తున్నాను, ఏమనుకోకండి. ధన్యవాదాలు.
Deletechakkani kavitha, congrats
ReplyDeleteభాస్కర్ గారూ ధన్యవాదాలండీ..
Deleteprayatnam baaga vundi,
ReplyDeletemeeru vaadina pada prayogaalu, padaalu,
ivanni eppudo 30 years munde cadivinaa,
inka ave pattukuni kavitvam raayatam,
koddigaa word treasure ni IMPROVE chesukondi.
kothagaa cheppandi,
అజ్ఞాత గారూ మీ పేరు చెపితే బావుండేది. పదప్రయోగం గురించి మీరు చెప్పింది పూర్తిగా అర్ధం కాలేదు. ఉదాహరణలతో ఇంకొంచెం వివరంగా చెప్పగలరా..ధన్యవాదాలు.
Deletemimmalni praise cheyyataaniki chaala mandi vastaaru,
ReplyDeleteavanni nammakandi,
meeku poetry path dorikindi,
adi try cheyyandi,
kotha pada prayogam tho...
Bagundi Andi...
ReplyDeleteధన్యవాదాలు తెలుగు పాటలు గారు..
Deleteచక్కగా రాశారు.
ReplyDeleteనువ్వు కాపాడిన 'నా నవ్వు' కు....ఈ నాలుగు మాటల్లో చాలా అర్ధం ఇమిడి ఉంది.
అభినందనలు!
ఆ భావమే నాతో ఈ కవిత వ్రాయించింద౦డీ...కవితను బాగా అర్ధం చేసుకున్నారు. ధన్యవాదాలు చిన్ని ఆశ గారు..
Deleteజ్యోతిర్మయి గారికి, అపార్థం చేసుకోకుండా నా విమర్శను సహృదయంతో స్వీకరించినందుకు సంతోషం. మీనుంచి మంచి మంచి కవితల కోసం ఎదురుచూస్తుంటాను.
ReplyDeleteగోపాల కృష్ణ గారు.. సద్విమర్శకు ఎప్పుడూ ఆహ్వానమే అండీ..మీరు శ్రమ తీసుకుని చెప్పినందుకు చాలా సంతోషం. కవితలు వ్రాసి చాలా కాలమైంది, ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.
Deleteనా కామెంట్ మీరు ఇంతకు ముందు పోస్ట్ లో చూడండి
ReplyDeleteచూశానండీ..ధన్యవాదాలు వెన్నెల గారూ..
Deleteజ్యోతి గారూ, కవిత బాగుంది.
ReplyDeleteధన్యవాదాలు ఫాతిమా గారూ..
Deleteఅవు ను చిరు నవ్వుని నిలపటం కంటే
ReplyDeleteగొప్ప వరం ఏముంటుంది...వనితా మదిలో
నిలిచిపోవటానికి...చాలా బాగుంది జ్యోతి గారు
ధన్యవాదాలు శశి కళ గారూ...
Deleteచాలా చక్కని అనుబంధాన్ని మీ కవిత వ్యక్తీకరించింది.
ReplyDeleteధన్యవాదాలు రవిశేఖర్ గారూ..
Deleteచాలా బాగుందండీ మీ కవిత.. Congratulations!
ReplyDeleteచివరి stanza నాకు చాలా నచ్చింది. :)
మధురవాణి గారూ కవిత నచ్చినందుకు చాలా సంతోషం. థాంక్యు.
Deleteబాగుంది :)
ReplyDeleteధన్యవాదాలు శేఖర్ గారూ..
Delete"జీవితం గోదారి పాయలా
ReplyDeleteనిండుగా సాగిపోతుంది!" నిజం మీ ఈ కవిత కూడా గోదారిపాయలానే ఉంది.అభినందనలు.కౌముదిలో అచ్చయినందుకు కంగ్రాట్శ్
వాసుదేవ్ గారు జీవితంలాగే కవితా కూడా నిండుగానే ఉందంటారు. మీ అభిమానానికి ధన్యవాదాలు.
Delete