Wednesday, July 4, 2012

కౌముదిలో నా కవిత 'ప్రతిఫలం'

నా కవిత 'కౌముది' ఇంటర్నెట్ మాసపత్రిక 'జూలై' సంచికలో ప్రచురితమైంది.నా కవితను ప్రచురించిన కౌముది సంపాదకులకు బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

ప్రతిఫలం 


సందె మబ్బులు
చీకటి మాటుకు తప్పుకుంటున్నై!
వేచియున్న కలువపై
వెన్నెల పరచుకుంటోంది!

మదిలో ఏ మూలో...
నిశ్శబ్దపు ఒంటరి రాత్రి
జ్ఞాపకాల దొంతర కదిలిన చప్పుడు!

అప్పుడెప్పుడో...
'నీకేం కావాలని' కదూ అడిగావ్!
ఏం అడగాలో ...
ఎలా చెప్పాలో... తెలియని రోజులు
ఒక్క నవ్వు నవ్వేసి ఊరుకున్నా!

ఆ తరువాతెప్పుడో ...
'ఏం తెచ్చానో చూడమ'న్నావ్,
మూసిన గుప్పెట్లో విరిసిన మల్లెలు!

వెన్నెల విహారాలు...
జాజిపూల పరిమళాలు!
వలపు సయ్యాటలు...
సరసాల సరాగాలు!

మోయలేని భారంతో...
మనసు కృంగిన రోజు
కొండంత ఓదార్పైనావు!

అనుభవాలు
పాఠాలయ్యాయి!
జీవితం గోదారి పాయలా
నిండుగా సాగిపోతుంది!

అప్పటి నీ ప్రశ్నకు,
ఇప్పటి నా సమాధానం
అదే చిరునవ్వు!

కాలంతో పాటు కలసిపోనీక
నువ్వు కాపాడిన
'నా నవ్వు'కు
ప్రతిఫలంగా నీకు నేనేమివ్వగలను?


35 comments:

  1. చాలా బాగా రాశారు జ్యోతి గారు..:-)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు నాగిని గారు.

      Delete
  2. కవిత చాలా బాగుంది. ఏమీ అనుకోక పోతే ఒక్క మాట. సంజమబ్బులు చీకటి మాటుకు తప్పుకునే సమయంలో వెన్నెల కలువలపై విరియడం సమంజసంగా లేదు.ఒకదాని తర్వాత ఒకటి అయిందని అనుకున్నా మబ్బులు వెన్నెట్లో కూడా కనిపిస్తాయి కదా?ఎక్కడికీ పోవు.రంధ్రాన్వేషణ కాదిది. మీ కవిత మరింత గుబాళించాలనే కోరిక.

    ReplyDelete
    Replies
    1. గోపాల కృష్ణ గారూ ఎంత మాట. మళ్ళీ ఓ సారి కవిత చదివితే మీరు చెప్పింది సబబుగా అనిపించిందండీ..ముందు నలుగు వాక్యాలు లేకపోతే కవిత భావం మరింత సూటిగా ఉండేది. లేకపోయినా సంధ్యను వర్ణించడానికి వేరే పదాలు వాడి వుండాల్సింది. మీరిలా చెప్పడం చాలా ఆనందంగా కూడా అనిపించింది. మీలాంటి వారు చెపితేనే కదా సరిదిద్దుకునే అవకాశం కలిగేది. ధన్యవాదాలు.

      Delete
  3. Replies
    1. ధన్యవాదాలు బాబాయిగారూ..

      Delete
  4. అభినందనలు మీకు...
    కవిత బాగుంది...
    @శ్రీ

    ReplyDelete
  5. బావుంది జ్యోతిర్మయి గారు,

    శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. లోకేష్ శ్రీకాంత్ గారు..మీ వ్యాఖ్య ఎందుకో మోడరేషన్ లో వుండిపోయి౦దండీ...ఆలస్యంగా సమాధానమిస్తున్నాను, ఏమనుకోకండి. ధన్యవాదాలు.

      Delete
  6. Replies
    1. భాస్కర్ గారూ ధన్యవాదాలండీ..

      Delete
  7. prayatnam baaga vundi,
    meeru vaadina pada prayogaalu, padaalu,
    ivanni eppudo 30 years munde cadivinaa,
    inka ave pattukuni kavitvam raayatam,
    koddigaa word treasure ni IMPROVE chesukondi.

    kothagaa cheppandi,

    ReplyDelete
    Replies
    1. అజ్ఞాత గారూ మీ పేరు చెపితే బావుండేది. పదప్రయోగం గురించి మీరు చెప్పింది పూర్తిగా అర్ధం కాలేదు. ఉదాహరణలతో ఇంకొంచెం వివరంగా చెప్పగలరా..ధన్యవాదాలు.

      Delete
  8. mimmalni praise cheyyataaniki chaala mandi vastaaru,
    avanni nammakandi,

    meeku poetry path dorikindi,
    adi try cheyyandi,
    kotha pada prayogam tho...

    ReplyDelete
  9. Replies
    1. ధన్యవాదాలు తెలుగు పాటలు గారు..

      Delete
  10. చక్కగా రాశారు.
    నువ్వు కాపాడిన 'నా నవ్వు' కు....ఈ నాలుగు మాటల్లో చాలా అర్ధం ఇమిడి ఉంది.
    అభినందనలు!

    ReplyDelete
    Replies
    1. ఆ భావమే నాతో ఈ కవిత వ్రాయించింద౦డీ...కవితను బాగా అర్ధం చేసుకున్నారు. ధన్యవాదాలు చిన్ని ఆశ గారు..

      Delete
  11. జ్యోతిర్మయి గారికి, అపార్థం చేసుకోకుండా నా విమర్శను సహృదయంతో స్వీకరించినందుకు సంతోషం. మీనుంచి మంచి మంచి కవితల కోసం ఎదురుచూస్తుంటాను.

    ReplyDelete
    Replies
    1. గోపాల కృష్ణ గారు.. సద్విమర్శకు ఎప్పుడూ ఆహ్వానమే అండీ..మీరు శ్రమ తీసుకుని చెప్పినందుకు చాలా సంతోషం. కవితలు వ్రాసి చాలా కాలమైంది, ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.

      Delete
  12. నా కామెంట్ మీరు ఇంతకు ముందు పోస్ట్ లో చూడండి

    ReplyDelete
    Replies
    1. చూశానండీ..ధన్యవాదాలు వెన్నెల గారూ..

      Delete
  13. జ్యోతి గారూ, కవిత బాగుంది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ఫాతిమా గారూ..

      Delete
  14. అవు ను చిరు నవ్వుని నిలపటం కంటే
    గొప్ప వరం ఏముంటుంది...వనితా మదిలో
    నిలిచిపోవటానికి...చాలా బాగుంది జ్యోతి గారు

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శశి కళ గారూ...

      Delete
  15. చాలా చక్కని అనుబంధాన్ని మీ కవిత వ్యక్తీకరించింది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రవిశేఖర్ గారూ..

      Delete
  16. చాలా బాగుందండీ మీ కవిత.. Congratulations!
    చివరి stanza నాకు చాలా నచ్చింది. :)

    ReplyDelete
    Replies
    1. మధురవాణి గారూ కవిత నచ్చినందుకు చాలా సంతోషం. థాంక్యు.

      Delete
  17. Replies
    1. ధన్యవాదాలు శేఖర్ గారూ..

      Delete
  18. "జీవితం గోదారి పాయలా
    నిండుగా సాగిపోతుంది!" నిజం మీ ఈ కవిత కూడా గోదారిపాయలానే ఉంది.అభినందనలు.కౌముదిలో అచ్చయినందుకు కంగ్రాట్శ్

    ReplyDelete
    Replies
    1. వాసుదేవ్ గారు జీవితంలాగే కవితా కూడా నిండుగానే ఉందంటారు. మీ అభిమానానికి ధన్యవాదాలు.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.