పసిమొగ్గలతో, పువ్వులతో హాయిగా నవ్వుతున్న ఈ సన్నజాజికి తెలుసా నన్నిక రోజూ చూడలేదని. ఆ పసిమొగ్గలు వికసి౦చగనే నాకోసం వెతుకుతాయి కాబోలు! రేపటి నుండి ఈ తీగకు రోజూ నీళ్లెవరు పోస్తారో...మేడ మీదకు వాలిన కొబ్బరాకు నా మాట వినిపించక బెంగ పెట్టుకోదూ... బంతి మొక్క కొత్త చివురులు తొడుగుతోంది, ఆకులు వచ్చే సమయానికి చూడడానికి నేను౦డను కదూ!
ము౦గిట వేసిన ముగ్గు ఈ రోజెందుకో కలత పడినట్లుంది. ఎన్నడూ లేనిది గాలి కూడా జాలిగా వీస్తోంది. మాలతీమాధవం పక్కనున్న ఈ మెట్టుమీద కూర్చుని ఎన్నెన్ని పుస్తకాలు చదివానో! నేను లేక ఇది ఒంటరిదైపోతుందా... వీధి చివర కానుగ చెట్టు బస్సు రాగానే నన్ను పిలుస్తుంది కాబోలు..నేనిక రానని తెలియదు పాపం.
ఇంటికి రాగానే నన్ను పిలిచే నాన్న ఇకనుండి ఎవరిని పిలుస్తారు? కబుర్లెవరితో చెపుతారు? రాత్రి భోజనాలు వడ్డించేప్పుడు మంచి నీళ్లెవరు పెడతారు? రేపట్నుండి నాన్నమ్మ తన కాళ్ళద్దాలు, తనే వెతుక్కుంటుంది కాబోలు! ఎప్పుడూ నాతో పోట్లాడే తమ్ముడు ఈ మధ్య నాతో మునుపటిలా ఉండడం లేదు. ఒక్కసారి పోట్లాడితే బావుణ్ణు. కుయ్యి, కుయ్యి మంటూ నా చుట్టూ తిరుగే ఈ కుక్కపిల్ల కొన్నాళ్ళకు నన్ను మరచిపోతుందేమో..
ఇంటి ముందున్న ఆ వేపచెట్టుకే, అట్లతద్దినాడు ఊయల వేసి ఊగింది. పెరట్లో ఆ చివరగా పందిరిమీద పూసిన మల్లెలతోనే కదూ అమ్మ నాకు ప్రతి వేసవిలో పూలజడలల్లింది. తొలిసారి ఓణీ వేసుకున్నరోజు, ఈ మందారమొక్కే నాతో ఫోటో కావాలని సరదా పడింది. ఆ జ్ఞాపకం గోడమీద బొమ్మై నిలిచింది కూడానూ. రోజూ పూజకోసం పువ్వులిచ్చే నందివర్ధన౦ ఈవేళ ఒక్క పువ్వైనా పూయలేదే! నేను వెళుతున్నానని కోపమేమో.
ము౦గిట వేసిన ముగ్గు ఈ రోజెందుకో కలత పడినట్లుంది. ఎన్నడూ లేనిది గాలి కూడా జాలిగా వీస్తోంది. మాలతీమాధవం పక్కనున్న ఈ మెట్టుమీద కూర్చుని ఎన్నెన్ని పుస్తకాలు చదివానో! నేను లేక ఇది ఒంటరిదైపోతుందా... వీధి చివర కానుగ చెట్టు బస్సు రాగానే నన్ను పిలుస్తుంది కాబోలు..నేనిక రానని తెలియదు పాపం.
ఇంటికి రాగానే నన్ను పిలిచే నాన్న ఇకనుండి ఎవరిని పిలుస్తారు? కబుర్లెవరితో చెపుతారు? రాత్రి భోజనాలు వడ్డించేప్పుడు మంచి నీళ్లెవరు పెడతారు? రేపట్నుండి నాన్నమ్మ తన కాళ్ళద్దాలు, తనే వెతుక్కుంటుంది కాబోలు! ఎప్పుడూ నాతో పోట్లాడే తమ్ముడు ఈ మధ్య నాతో మునుపటిలా ఉండడం లేదు. ఒక్కసారి పోట్లాడితే బావుణ్ణు. కుయ్యి, కుయ్యి మంటూ నా చుట్టూ తిరుగే ఈ కుక్కపిల్ల కొన్నాళ్ళకు నన్ను మరచిపోతుందేమో..
ఇంటి ముందున్న ఆ వేపచెట్టుకే, అట్లతద్దినాడు ఊయల వేసి ఊగింది. పెరట్లో ఆ చివరగా పందిరిమీద పూసిన మల్లెలతోనే కదూ అమ్మ నాకు ప్రతి వేసవిలో పూలజడలల్లింది. తొలిసారి ఓణీ వేసుకున్నరోజు, ఈ మందారమొక్కే నాతో ఫోటో కావాలని సరదా పడింది. ఆ జ్ఞాపకం గోడమీద బొమ్మై నిలిచింది కూడానూ. రోజూ పూజకోసం పువ్వులిచ్చే నందివర్ధన౦ ఈవేళ ఒక్క పువ్వైనా పూయలేదే! నేను వెళుతున్నానని కోపమేమో.
రేపు తెల్లవారి తలుపులు తెరువగానే రోజూ కనిపించే ఈ తురాయిచెట్టు, కువకువలాడే బుల్లిపిట్టలు, సైకిలు మీద నుంచి పేపర్ వేసే అబ్బాయి, పూల బుట్టతో ఇల్లిల్లూ తిరిగే రంగమ్మ నాకిక కనిపించరు కదూ. ఆకాశంలో మబ్బెక్కడా కనిపించలేదు కానీ, వర్షం మాత్రం ధారగా చెంపపై కురుస్తోంది. ఈ ముసురు ఈ వేళ ఆగేలా లేదు.
ఇప్పటి వరకూ నాతో గడిపిన రోజులన్నీ వీడ్కోలిచ్చి గత౦లోకి జారిపోనున్నాయి. తెలియని లోకంలోకి, కొత్త జీవితంలోకి ఈ రాత్రికే నా ప్రయాణం. అన్నం తినని రోజున కేకలు వేసేవాళ్ళు ఉండరు. 'మా ఇంటి మహలక్ష్మి' అంటూ మురిసి మెటికెలు విరిచే వారు కనిపించరు. ఏ వేళ ఇంటికొచ్చినా నాకోసం వెతికే చల్లని చూపులు నన్ను చేరవిక.
ఇక నుండి ఈ ఇల్లూ, నా వాళ్ళూ అంతా నాకు పరాయేనా. నాది అనుకున్న నా ప్రంపంచం, కాదని చెప్తున్న పెద్దరికం. ఏది నిజమో ఏది భ్రమో తెలియని అయోమయం. పక్షం క్రితమే నా మెడలో చేరిన మాంగల్యం ఈ వేళ మరీ బరువుగా ఉంది. ఓ మంత్రదండంలా నా సొంతమైన ప్రంపంచాన్ని పరాయిగా మార్చేసింది. అయినా ఎందుకో మరి కోపం రావడంలేదు. జీవితాంతం తోడుంటానని భరోసా ఇచ్చినందుకా, కష్టమైనా సుఖమైనా ఇకనుంచి ఇద్దరిదీ అని పలికినందుకా! వెండి మెట్టెలతో పాటు మువ్వల పట్టీలు కూడా భారంగా పుట్టింటి గడప దాటాయి.
Very nice..
ReplyDeletenaa jnaapakaala logili loki velli poyaanu.
Wow !
ReplyDeleteమూలాలు ఏ మట్టిలోవైనా
ReplyDeleteమొక్క పూలనిచ్చేది పైనున్న కొమ్మలకే
ఆడదాని జీవితం మూలం ఎక్కడైనా
మూడు పూవులూ ఆరు కాయలై
మురిసేది మెట్టినింటిలోనే...
కన్న తల్లిని ఉన్న ఊరిని వదిలిపోవడం ఎంత బాధగా ఉంటుందో బాగా చెప్పేరు. ఇది మగవాడిగా కూడా నా అనుభవం.
ReplyDeleteమీ వర్ణన వాస్తవికం గా వుంది.బాగా వ్రాసారు.కానీ నాదో సందేహం అబ్బాయి కూడా అలాగే ఇల్లు వదిలి ఎక్కడికో వెడతాడు కదా!పూర్వకాలం లో అయితే అత్తారింటికి,తన ఇల్లు వదిలి కోడలు వెడుతుంది.ఈ రోజుల్లో ఇద్దరు అందరిని వదిలి ఎక్కడికో దూరంగా వెడుతున్నారు.ఉద్యోగం కోసమేననుకోండి.
ReplyDeleteఅప్పగింతల వేళ అమ్మాయి మనసును చక్కగా ఆవిష్కరించారండీ...
ReplyDeleteపెళ్ళై వెళ్ళిపోయే ప్రతి ఆడపిల్ల మనసుని అందంగా ప్రతిబింబించారు.
ReplyDeleteచాలా బావుంది
బాగా వ్రాసారండి. చదువుతుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అంటే నా అభిప్రాయం పుట్టింటిని వదిలి అత్తవారింటికి వెళ్ళే ఆడపిల్లల మనస్సు గుర్తు వచ్చి అలా అనిపించింది..ఈ రోజుల్లో అబ్బాయిలు కూడా బయటకు వెళ్తున్నారులెండి..
ReplyDeletevery touching...
ReplyDeleteచాలా బాగారాసారు .
ReplyDeleteఅమ్మా జ్యోతిర్మయీ,
ReplyDeleteఅద్భుతంగా ఉంది. అత్తవారింటికి మొదటిసారిగా వెళ్తూ తనపరిసరాల్ని వీడలేక వీడలేక వెళ్ళే అమ్మాయి అనుభూతుల్ని ఇంతపదిలంగా దాచుకున్నందుకు అభినందనలు. ఇది చాలా చక్కని కవిత్వం. ముఖ్యంగా :
తొలిసారి ఓణీ వేసుకున్నరోజు, ఈ మందారమొక్కే కదూ నాతో ఫోటో కావాలని సరదా పడింది. ఆ జ్ఞాపకం గోడమీద బొమ్మై నిలిచింది కూడానూ.
ఆకాశంలో మబ్బెక్కడా కనిపించలేదు కానీ, వర్షం మాత్రం ధారగా చెంపపై కురుస్తోంది. ఈ ముసురు ఈ వేళ ఆగేలా లేదు.
పక్షం క్రితమే నా మెడలో చేరిన ఈ మాంగల్యం ఈ వేళ మరీ బరువుగా ఉంది. ఓ మంత్రదండంలా నా సొంతమైన ప్రంపంచాన్ని పరాయిగా మార్చేసింది.
ఈ వాక్యాలు చాలా లోతుగా, గంభీరంగా, రసనిష్యందంగా ఉన్నాయి.
అభినందనలు.
మేడం.. ఆమె తనకు దూరం అవుతున్న వాటి గురించి బాధ పడుతూ బాహిరంగా తన బాధను వాటికి ఆపాదిస్తోందా... లేక, నేను లేకపోతే ఇవన్నీ ఏమయిపోతాయో అనే అహమా... :) ఆ క్లారిటీ కొంచెం మిస్ అయింది. (నా చూపు తేడాయో మరేమో...)
ReplyDeleteమీ పోస్ట్ చదివితే శకుంతల అత్తవారింటికి వెళ్ళే సీన్
ReplyDeleteగుతుకు వచ్చి మనసు భారం అయింది.చాలా చక్కగా వ్రాసారు
తనతో అనుబంధం పెంచుకున్న ప్రతి అంగుళం, ప్రతీ వ్యక్తీ తన వియోగంలో అనుభవించే, తమ పరస్పర వ్యధ ఈ అప్పగింతలు. మగవారు ఎంతకాలం దూరమైనా ఆ ఇల్లు తమదే అనే భావం వీడదు. కాని ఆడవారి విషయం అలా కాదుకదా! ప్రతి ఆడపిల్ల భావాలకు అద్దం పట్టిన ఈ పుత్తడిబొమ్మ మనసు మాత్రం నాకు చాలా నచ్చింది జ్యోతిర్మయి గారు.
ReplyDeleteచాలా బాగా రాశారండీ..
ReplyDeleteElaa Vraste Elanandi...
ReplyDeletechala chala baga rasaru ... sahithyam chala bagundi ...
ReplyDelete@ వనజ గారూ... మది దాగిన తలపులు చమరింతల నెలవులు కదూ..ధన్యవాదాలు.
ReplyDelete@ శ్రావ్య గారూ ధన్యవాదాలు.
@ శ్రీ లలితగారూ స్త్రీ జీవితం గురించి చక్కని కవిత చెప్పారు. ధన్యవాదాలు.
@ బాబాయి గారూ ఎవరికైనా ఉన్న వూరిని ఆ పరిసరాలను వదిలి రావడం చాలా బాధాకరమైన విషయం...ధన్యవాదాలు
@ రవిశేఖర్ గారూ మీ సందేహానికి జయగారు సమాధానమిచ్చారు చూడండి. పుట్టిపెరిగిన పరిసరాలను, కన్నవాళ్ళను వదిలి వెళ్లడం ఎవరికైనా బాధాకరమైన విషయమేనండీ..ధన్యవాదాలు.
ReplyDelete@ రాజి గారూ ఓ జ్ఞాపకం... మీతో పంచుకున్నాను ధన్యవాదాలు.
@ లతగారూ ఆ సమయంలో అందరి ఆలోచనలు ఇలాగే ఉంటాయి కదూ..ధన్యవాదాలు
@ ఆనందం గారూ.... పెళ్లి వేడుకలు ముగిశాక, జీవితాన్ని మలుపు తిప్పే ఈ చివరి ఘట్టమే బాధాకరమైనది. ధన్యవాదాలు.
ReplyDelete@ తృష్ణ గారూ..నా బ్లాగుకు స్వాగతమండీ...ధన్యవాదాలు.
@ మాలాకుమార్ గారూ మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.
@ మూర్తిగారూ పూర్తిగా చదివి విపులంగా చేర్చించే మీ ప్రోత్సాహమే నాతో ఇవి వ్రాయిస్తుందండీ...మీ అభిమానానికి ధన్యవాదాలు.
ReplyDelete@ ఫణీంద్ర గారూ ఆ అమ్మాయి తన పరిసరాలను వదిలి వెళ్తున్న౦దుకు పడే బాధ అది. అదే సమయంలో తను నిర్వర్తించే పనులన్నీ ఎవరు చేస్తారు, తను లేకపోతే ఇబ్బంది పడతారు కదా అన్న ఆవేదన కూడానూ..ధన్యవాదాలు
@ శశి కళ గారూ మీరు చెప్పాక నాకూ ఆ సన్నివేశం గుర్తొచ్చింద౦డీ. ఎక్కడ దొరుకుతుందో మరోసారి చదవాలి. ధన్యవాదాలు.
ReplyDelete@ జయ గారూ చాలా బాగా చెప్పారు. మీ వ్యాఖ్య చాలా ఆత్మీయంగా అనిపించిందండీ..ధన్యవాదాలు.
@ వేణు గారూ మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.
ReplyDelete@ ప్రిన్స్ గారూ ఏమిటండీ పేరు మార్చుకున్నారా!అప్పుడప్పుడూ ఎదలోతులను స్పృశించడం మంచిదేకందండీ..ధన్యవాదాలు.
@ సత్య గారూ స్వాగతమండీ. ఓ జ్ఞాపకానికి రూపమేనండీ ఇది. మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.
ఆడపిల్ల పెళ్ళయ్యాక మొదటిసారిగా అత్తవారింటికి వెళుతున్నప్పుడు తన వారు, చుట్టూ వున్న పరిసరాలు ఎలా స్పందిస్తారో ఎంత చక్కగా చెప్పారండి! ఇంత సునిశిత దృష్టి వున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను జ్యోతిర్మయి గారు!
ReplyDeleteBest Wishes,
Suresh Peddaraju
సురేష్ గారూ..రచనను మెచ్చుకోవవడమే కాక మంచి మనసుతో అభినందనలందించారు. ధన్యవాదాలు.
ReplyDeleteమీరు చాలా సున్నిత మనస్కులండి! చాలా బాగా రాసారు. నాకు మాత్రం ఇలాంటి జ్ఞాపకాలు లేవు కనక మొదటి సారి చదివినప్పుడు relate చేసుకోలేకపోయాను. మీ కవిత కూడా చదివాను కౌముది లో.. బాగుందండి!
ReplyDeleteవెన్నెల గారూ నేను వదిలి వచ్చినవన్నీ ఒక్కోసారి ఎదురుగా వచ్చి భలే ఇబ్బంది పెడుతూ ఉంటాయండీ..ఈ సారి కనిపించగానే వాటిని బ్లాగులో పెట్టేశాను. కవిత నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.
ReplyDelete'గాలి కూడా జాలిగావీస్తోంది'... ఈ వర్ణన చాలు మొత్తం మనసులో బాధ తెలియజేయడానికి.బాగుందండి.
ReplyDeleteబాలూ గారూ నాక్కూడా ఆ వాక్యం చాలా నచ్చింది. ధన్యవాదాలు.
ReplyDeleteచాలా బాగా చెప్పారు జ్యోతిర్మయి గారు ! చాలా హాయి గా అనిపించి .... నేను మా ఇంటి దగ్గర మందారా చెట్టు, కొబ్బరి చెట్టు, సన్నజాజి తీగ జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయాను... :) చిన్న చిన్న పదాలలో పెద్ద భావం అందం గా వోదిగిపోయింది :)
ReplyDeleteలక్ష్మీ శిరీష గారూ... మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్లి వచ్చారన్నమాట...బావుందండీ...ధన్యవాదాలు.
ReplyDeleteసూపర్బ్ జ్యోతి గారూ!..ఇలా కళ్ళు అక్షరాల వెంట తర్వాత ఏముందో అని చదివించేలా వ్రాసే నేర్పు, శైలి మీ సొంతం ...మువ్వలపట్టీలతో బాటు ఎన్నెన్ని జ్ఞాపకాలు తీసుకొని వెడుతుందో చాలా బాగా చెప్పారు.....అభినందనలు...@శ్రీ
ReplyDeleteఎప్పటికీ తాజాగా..వెన్నంటి వుండే జ్ఞాపకాలు...
Deleteధన్యవాదాలు సురేష్ గారు.
ఆ గుబులు , ఆ ఇన్నోసెన్స్ ఇప్పటికీ తలుచుకుంటే..అప్పటికి, అక్కడికి వెళ్లిపోతాం! ఆనాటి మానసిక స్థితిని అద్భుతంగా చిత్రించారు జ్యోతిగారు!
ReplyDeleteస్వాగతం సువర్చల గారు. ఇంత వెనక్కి వచ్చి చదివారు. నచ్చినందుకు చాలా సంతోషం ధన్యవాదాలండి.
Delete