నా కవిత 'కౌముది' ఇంటర్నెట్ మాసపత్రిక 'మే' సంచికలో ప్రచురితమైంది.
నా కవితను ప్రచురించిన కౌముది సంపాదకులకు బ్లాగ్ముఖంగా ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను.
అయినా అంత తొందరేంటి నీకు?
కలిసెళ్దాం అనుకున్నాం కదా!
నువ్వొక్కదానివే అలా వెళ్లిపోవడమేనా?
ఎవరేమైతే నీకేం? ఎవరెలాపోతేనేం?
అరె....వెళ్లేముందు కనీసం ఓ మాట...
అయినా ఏ రోజు నువ్వు నా మాట విన్నావు కనుక!
నా కోసం వేచి వుండకన్నానా ...
రాత్రవనీ, అపరాత్రవనీ,
నేనొచ్చేదాకా కళ్ళు వాకిటనే!
తిండీ లేదూ ...నిద్రా లేదూ....
అసలు నువ్వెంత గడుసుదానివంటే...
నా ఇష్టాలేంటో తెలుసుకున్నావు కాని,
కనీసం ఒక్కసారైనా, నీకు నచ్చేవే౦టో చెప్పావా?
నన్ను పసివాడిగా మార్చి ఏమి తెలియకుండా చేశావ్!
నీ కెంత స్వార్ధం లేకపోతే...
సంతోషాన్నంతా మూట కట్టుకుని,
విషాదాన్ని విరజిమ్మివెళ్తావ్ ?
నాకేనా పౌరుషం లేనిది?
నీ తలపులన్నీ ఈ పూటే తుడిచేస్తా....
అదేంటో.... చెరిపేస్తున్నకొద్దీ కనిపిస్తూనే వున్నయ్
ఊట బావిలో నీరులా....
అవి కూడా నీ అంతే మొండివి మరి!
నీ ఉనికితో నా మనసంతా వెల్లవేసినట్టున్నావ్
ఏ వైపు చూసినా నీ రూపమే!
నువ్వు మొన్న కట్టిన పచ్చ చీర
జ్ఞాపకాల అలల్ని రేపుతోంది!
నువ్వు నాటిన మల్లెమొక్క
నిను గానక... బిక్క మొహం వేసింది!
నా సంతోషానికి అవసరమైన మందేదో
చెప్పడం మరిచిపోయావ్,
ఎదుటనున్న కాలం అంతా....
నీ తలపులు మోస్తూ బ్రతకమన్నావా!
తిట్టానని కోపగించుకుని రాకుండా వుండకేం!
మరుజన్మలోనైనా... నన్ను కలుస్తావని వెఱ్ఱి ఆశ!!
నా కవితను ప్రచురించిన కౌముది సంపాదకులకు బ్లాగ్ముఖంగా ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను.
వెఱ్ఱి ఆశ
అయినా అంత తొందరేంటి నీకు?
కలిసెళ్దాం అనుకున్నాం కదా!
నువ్వొక్కదానివే అలా వెళ్లిపోవడమేనా?
ఎవరేమైతే నీకేం? ఎవరెలాపోతేనేం?
అరె....వెళ్లేముందు కనీసం ఓ మాట...
అయినా ఏ రోజు నువ్వు నా మాట విన్నావు కనుక!
నా కోసం వేచి వుండకన్నానా ...
రాత్రవనీ, అపరాత్రవనీ,
నేనొచ్చేదాకా కళ్ళు వాకిటనే!
తిండీ లేదూ ...నిద్రా లేదూ....
అసలు నువ్వెంత గడుసుదానివంటే...
నా ఇష్టాలేంటో తెలుసుకున్నావు కాని,
కనీసం ఒక్కసారైనా, నీకు నచ్చేవే౦టో చెప్పావా?
నన్ను పసివాడిగా మార్చి ఏమి తెలియకుండా చేశావ్!
నీ కెంత స్వార్ధం లేకపోతే...
సంతోషాన్నంతా మూట కట్టుకుని,
విషాదాన్ని విరజిమ్మివెళ్తావ్ ?
నాకేనా పౌరుషం లేనిది?
నీ తలపులన్నీ ఈ పూటే తుడిచేస్తా....
అదేంటో.... చెరిపేస్తున్నకొద్దీ కనిపిస్తూనే వున్నయ్
ఊట బావిలో నీరులా....
అవి కూడా నీ అంతే మొండివి మరి!
నీ ఉనికితో నా మనసంతా వెల్లవేసినట్టున్నావ్
ఏ వైపు చూసినా నీ రూపమే!
నువ్వు మొన్న కట్టిన పచ్చ చీర
జ్ఞాపకాల అలల్ని రేపుతోంది!
నువ్వు నాటిన మల్లెమొక్క
నిను గానక... బిక్క మొహం వేసింది!
నా సంతోషానికి అవసరమైన మందేదో
చెప్పడం మరిచిపోయావ్,
ఎదుటనున్న కాలం అంతా....
నీ తలపులు మోస్తూ బ్రతకమన్నావా!
తిట్టానని కోపగించుకుని రాకుండా వుండకేం!
మరుజన్మలోనైనా... నన్ను కలుస్తావని వెఱ్ఱి ఆశ!!
good concept.nice poetry.
ReplyDeleteచాలా చాలా బాగుందండీ..:-)
ReplyDeleteకౌముది పత్రికను గత ఎన్నో సంవత్సరాలుగా రాగానే పైనుంచి కిందకి చదివెయ్యడం అలవాటు. దానిలో భాగం గానే, మీ కవిత చదివాను. బాగుందండి జ్యోతిర్మయి గారు.
ReplyDeleteఅద్భుతం.
ReplyDeleteకవిత చాలా బాగుందండీ..
ReplyDeleteఅభినందనలు జ్యోతిర్మయి గారు..
కవిత వీచిన దుఃఖవీచికలు మనసును కలతపరిచినా జవాబురాని విన్నపాన్ని వెర్రిఆశగా చక్కగా వర్ణించారు జ్యోతిర్మయిగారు.
ReplyDeletekavita chaalaa baavundi jyothi congrats publish ainanduku
ReplyDeletenice
ReplyDeleteచాలా చాలా బాగుంది. యెంత బాగుందో..ఎక్స్ ప్రెస్ చేయలేను. అంతే!
ReplyDeleteKavitha chala chala bagundi sis
ReplyDelete@ ధన్యవాదాలు రవిశేఖర్ గారూ..
ReplyDelete@ నాగిని గారూ స్వాగతం. కవిత నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.
@ వెన్నెల గారూ కౌముది నా అభిమాన పత్రిక, మీక్కూడా అని ఇప్పుడే తెలిసింది. కవిత నచ్చిన౦దుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.
@ బాబాయ్ గారూ ఈ కవిత మబ్బులూ, చందమామ అంటూ ఆకాశంలో కాక నేలమీద నడిచింది కదూ..అందుకే మీచేత అద్భుతం అనిపించుకుంది. ధన్యవాదాలు.
ReplyDelete@ రాజీ గారూ మెచ్చుకున్న మీ మంచి మనసుకి ధన్యవాదాలండీ.
@ ఉమాదేవి గారూ హృద్యంగా వ్యాఖ్యానించడం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ధన్యవాదాలు.
@ మంజు గారూ......అమ్మయ్య గారు తీసేశారు, హాయిగా నన్ను పిలుస్తున్నట్లుగా ఉంది. ధన్యవాదాలు.
ReplyDelete@ ప్రిన్స్ గారూ ధన్యవాదాలు.
@ వనజ గారూ మీరు మాటల్లో చెప్పలేనంత బావుంది అన్నారంటే...విషాదంగా ఉన్న కవిత కూడా బోలెడు సంబరపడిపోతోంది. ధన్యవాదాలు.
@ భాస్కర్..నువ్వా కాదా అని గొప్ప సందేహమొచ్చింది. నువ్వు కవితలు చదువుతావని ఇవాళే తెలిసింది. చాలా సంతోషం. థాంక్ యూ..
@జ్యోతిర్మయి గారు మీ కవిత కోసం ఇన్నాలుగా వేచి వేచి ఈరోజు నా ఆశ ఫలించిందండి... మీరు పెట్టిన టపా పేరు నాకు బాగా సరిపోతుంది... "వెఱ్ఱి ఆశ" తో ఎదురుచూసాననుకోండి.... చాలా ప్రస్పుటంగా చెప్పారు ఆశ అనేది ఎన్ని రకాలుగా మనతో మనలో ఉంటుందని... ఒక్కటి చెప్పాలనిపిస్తోంది మనిషి ఆశా జీవే కావచ్చు కాని ఆ ఆశ అన్నది జీవితం పైనే కాకుండా ఆశయం పైన ఉంటే కచ్చితంగా ఋషి అవ్వగలడు....ఆశ పడటం తప్పు కాదు ఆశించడం తప్పు ...కాని ఆ ఆశ కు నిర్ణిత సమయం పెట్టుకుంటే మాత్రం తప్పు చేసినట్టే...బలమైనధైతే కచ్చితంగా ఎప్పటికైనా నెరవేరుతుంది... తెలుసా నేను ఇంటర్ చదివేటప్పటినుంచి "వేణువు" అంటే చాలా ఇష్టం ఎప్పటికైనా కొనాలి వాయించాలి అనే తపన... కాని ఎందుకో కొనలేకపోయాను.. ఎవ్వరు ఏమి కావాలి అని అడిగినా వస్తుందో రాదో అది కావాలి అని చెప్తా...చివరకు ఎనిమిది ఏళ్ళ తరువాత నాకు ఓ చెలెమ్మ(చుట్టము కాదు స్నేహము కాదు ) పరిచయమైంది .. నేనంటే ప్రాణంగా వుండేది ... నా పుట్టినరోజుకు ఎం కావాలి అన్నయ అని అడిగితే "వేణువు" కావాలి అని చెప్పను...తను తెచ్చిచింది ...ఆరోజు ఎంత ఆనందం కలిగిందో...ఇలా ఎన్నో సంగటనలు ...మళ్ళీ ఆశను గుర్తుచేసినందుకు ధన్యవాదాలు...నా మరో ఆశ మీ అందరిని కలవాలని :)...
ReplyDeleteముందుగా అభినందనలు!
ReplyDeleteకవిత చాలా బాగుంది, ఆశ కాబట్టే తీరినా, తీరకున్నా మరు జన్మకీ కావాలనిపిస్తుంది.
అభినందనలు! జ్యోతిర్మయి గారూ .. కవిత చాలా బాగుంది.
ReplyDelete@ కళ్యాణ్ గారూ చిరకాలపు మీ ఆశ నెరవేరి వేణువు దొరికిందన్నమాట. అందర్నీ కలవాలన్న మీ ఆశ తప్పకుండా నెరవేరుతుందండి. ఎందుకంటే అది మనందరికీ వుండే ఆశే కాబట్టి. అ౦దరం కలసి నప్పుడు మీ వేణుగానం వినిపించాలి. ధన్యవాదాలు.
ReplyDelete@ చిన్ని ఆశ గారూ మరుజన్మ ఉందో లేదో ఈ ఆశ ఆ జన్మలో తీరుతుందనుకుంటే ఊరట కదండీ..ధన్యవాదాలు.
@ శశిధర్ గారూ ధన్యవాదాలు.
యెంత చక్కగా ఉంది...ఇంకా చదవాలి అనిపిస్తుంది
ReplyDeleteధన్యవాదాలు శశి కళ గారూ...
Deleteబాగుందండీ.. అభినందనలు..
ReplyDeleteధన్యవాదాలు వేణు గారూ..
Deleteమీ కవిత చదువుతుంటే వెన్నెలకంటి రాసిన కవిత ఒకటి గుర్తొస్తోంది..
ReplyDelete"చిరునవ్వుల వరమిస్తావా
చితినుండి లేచొస్తాను
మరుజన్మకు కరుణిస్తావా
ఈ క్షణమే మరణిస్తాను.."
అని వుంటుందా కవిత.
గుండెని తడిమారండీ...
శ్రీ లలిత గారూ...కలతపడిన మనసుతో వ్రాసిన కవితండీ ఇది. ధన్యవాదాలు
Deleteజ్యోతి,
ReplyDeleteమీ కవిత చాల బాగున్నది. మరచిపోలేని వారి స్మృతులు పదే పదే గుర్తుకొస్తుంటే పడే (తీయని జ్ఞాపకాల) బాధ, భావాలలో వ్యక్తికరించ గలగటం కూడా అదృష్టమే.
శ్యాం.
శ్యాం గారూ నా బ్లాగుకు స్వాగతమండీ...ఓ విషాద౦ మనసులో రేపిన కలతకు ఇచ్చిన అక్షరరూపం ఇది. ఇక అదృష్టమంటారా...నేను అనుగ్రహమనుకున్తున్నాను. ధన్యవాదాలు.
ReplyDeleteJyothirmayi garu, You have a top class compilation of Kavithalu, its a wholesome feeling going through them.
ReplyDeleteమధు గారూ నేను కవితలు వ్రాసి చాలా కాలమై౦ది. మీ వ్యాఖ్యతో మళ్ళీ వ్రాయాలనిపిస్తోంది. ధన్యవాదాలు.
Deleteవెర్రి ఆశ...బతుకంతా ఆశల వెనుక పరుగులే...అద్భుతంగా వుంది మీ కవిత జ్యోతిర్మయి గారు
ReplyDeleteప్రవీణ గారూ...ధన్యవాదాలు.
Delete