యూటా(Utah)లోని మైటీ ఫైవ్ నేషనల్ పార్క్స్ (Mighty Five National Parks)లో ఆర్చెస్ నేషనల్ పార్క్ (Arches National Park) అన్నింటికన్నా చిన్నదీ, ఎక్కువగా విజిట్ చేసేదీ కూడా. ఆ పార్క్ లో సూర్యోదయం చూడాలని ఉదయం ఆరున్నరకే హోటల్ నుండి బయలుదేరాము. మేము నార్త్ విండో ఆర్చ్(North Window Arch) వెళ్ళేసరికి, సూర్యోదయం అవబోతున్న ఛాయలు కనిపిస్తున్నాయి.
ఆ పార్క్ లోని ఆర్చ్ లను చూడడానికి కొన్నింటి కోసం కొంత నడవాల్సి వచ్చింది, కొన్నింటి కోసం కొండలు ఎక్కాము, కొన్ని రోడ్ పక్కనే ఉన్నాయి. ఆ ఆర్చ్ ల పేర్లు గమ్మత్తుగా ఉన్నాయి.
ల్యాండ్ స్కేప్ ఆర్చ్(Landscape Arch)
టనెల్ ఆర్చ్(Tunnel Arch)
పైన్ ట్రీ ఆర్చ్(Pine Tree Arch)
బాలన్స్డ్ రాక్(Balanced Rock)
త్రీ గాసిప్స్ (Three Gossips)
ఇంకా చూస్తే చాలా ఉన్నాయి కానీ అప్పటికే మధ్యాహ్నం అవుతుండడంతో తిరిగి మోఆబ్ కు వెళ్ళిపోయాము. అక్కడ కాక్టస్ జాక్స్(Cactus Jacks) రెస్టరెంట్ దగ్గర కొంచెం సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో చుట్టు పక్కల ఉన్న సూవనీర్ షాప్స్ కు వెళ్ళి సూవనీర్ స్పూన్ కొన్నాము. విజిటింగ్ సెంటర్ లో సీత కుగిఫ్ట్, పబ్లుకు హాట్ తీసుకున్నాం.
ఈ ప్రయాణంలో తరువాత భాగం చదవాలనుకుంటే ఇక్కడకు వెళ్ళండి.
No comments:
Post a Comment
వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.