ఇంతకు ముందు చెప్పుకున్న పెళ్ళి కబుర్లన్నీ ఒకే దగ్గర పెట్టాను. అన్నింటికీ లింక్స్ ఉన్నాయి ఏది చదవాలనుకుంటే దాని మీద నొక్కితే వేరే పేజ్ లో ఓపెన్ అవుతుంది, అది చదువుకోవచ్చు.
Wednesday, April 14, 2021
Monday, April 12, 2021
పారిజాత పరిమళాలు
“పెళ్ళిసందడి అంతా సరదాగా వ్రాసారు, లోపల జరిగే చికాకులు ఎవరైనా చెప్పుకుంటారా ఏమిటి?” అనుకుంటున్నారు కదూ!
మా అమ్మాయికి పెళ్ళి చేస్తే మాకు ఎలాంటి అల్లుడు వస్తాడా అని కంగారు పడ్డాం కానీ మా ఇంటికి పెద్ద కొడుకు వచ్చాడు. పెళ్ళికొడుకు, తన అన్నా, వదిన వీళ్ళు ముగ్గురూ కూడా అరేంజ్ మెంట్స్, డెకరేషన్స్, పెళ్ళి బట్టలు ఆర్డర్ ఇవ్వడం ఇలా అన్నింటిలో ఎంతో సహాయం చెసారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన వాళ్ళు పక్కనే ఉన్నారు అనే ధైర్యం కలిగించారు. పెళ్ళి కొడుకు వాళ్ళ అన్నయ్య వయస్సులో చిన్నవాడయినా ఈ పెళ్ళి బాధ్యత అంతా భుజాన వేసుకుని చక్కగా నిర్వర్తించాడు. నవంబర్ వరకూ మాకు ఆరుగురు పిల్లలు ఇప్పుడు తొమ్మిదిమంది.
మా తమ్ముడు వాళ్ళు పెళ్ళి కుదిరిన రోజు నుండీ మా పక్కనున్నట్లే. ప్రతిరోజూ ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజెస్ ఉంటూనే ఉండేవి. ఒక్క ఊరిలో లేమన్న మాటే కానీ ప్రతి నిర్ణయమూ కలసే తీసుకున్నాము. మా మరదలితో నేను మనసులో ఏ మాట చెప్పడానికి ఫిల్టర్ పెట్టనవసరం లేదు. మా కళ్ళ ముందే పుట్టి పెరిగిన మా మేనకోడలు ఇంట్లో జరుగుతున్న ప్రతి పనిని, సరదా సన్నివేశాలను ఫోటోలు వీడియోలు తీసి పెళ్ళి తరువాత ‘బిహైండ్ ది సీన్స్’ వీడియో పంపించింది. ఇన్ని రోజుల సంతోషానికి తీపి గుర్తు అది. ఏడుగంటలు ప్రయాణం చేసి మా మరిది వాళ్ళను వాషింగ్టన్ డి సి నుండి తీసుకొచ్చి మళ్ళీ అక్కడకు వెళ్ళి ఎక్కించే బాధ్యతను మా తమ్ముడు మరో కజిన్ తీసుకున్నారు.
వీళ్ళే కాక బెంగుళూరులో వున్న కజిన్ చేసిన సహాయం అక్షరాలకు అందనిది. నేను చెప్పినవే కాక పెళ్ళికి ఇంకేం కావాలో కూడా చెప్పి అన్నీ తీసుకుని పంపించింది. తన సహాయం లేకపోతే డెకరేషన్ కానీ, పెళ్ళికి కానీ కావలసిన వస్తువులను సేకరించడంలో బాగా ఇబ్బంది పడేవాళ్ళం. కూతురు పెళ్ళి జరిగి మూడు రోజులవ్వలేదు “పెళ్ళి పనులు ఎంతవరకు వచ్చాయని” పలకరించి అతి పెద్ద బాధ్యత భుజాన వేసుకుని కావసిన నగల ఎంపికకు సహాయం చేసారు నంద్యాలలో ఉన్న మరో ఫ్రెండ్. అన్నీ కొనడం అయిందా ఇంకేమైనా కావాలా అంటూ పలకరించి నెల్లూరు లో ఉన్న ఓ ఫ్రెండ్ మిగిలిన షాపింగ్ అంతా పూర్తి చేసారు.
మా పాప క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు పెళ్ళికి ఐదురోజుల ముందే వచ్చి, పెళ్ళి కూతురికి కావలసివాటి దగ్గర నుండీ ప్రతి ఈవెంట్ కి ముందుగానే కావలసిన బట్టలు నగలు తీసి పెట్టడం వరకూ అన్నీ వాళ్ళే చూసుకున్నారు. ఇవే కాక ఇంట్లో అన్ని పనులూ అందుకున్నారు. ఈ పిల్లలిద్దరూ వచ్చాక నేను పెళ్ళి కూతురి గురించి ఆలోచించ కుండా పెళ్ళి పనులు చూసుకునే వీలు చిక్కింది. వీళ్ళలో ఒకరికి ఈ మధ్యనే పెళ్ళయింది. ఆ అమ్మాయి వాళ్ళాయన కలసి వచ్చారు. పెళ్ళి కూతురికి పూల పందిరి పట్టుకోవడానికి ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు నాలుగో వాళ్ళు ఎవరూ అని వెతుక్కుంటుంటే “నేను పట్టుకుంటాను ఆంటీ, తన ఫ్రెండ్ అంటే నా చెల్లి” అంటూ ఆ అబ్బాయి చెప్పడం నేను ఎప్పటికీ మరచిపోలేను.
“పెళ్ళికి పిలవక్కర్లేదు కానీ పనులు మాత్రం చెప్పండి” అంటూ మొత్తం అన్ని రోజులూ మా పక్కనే ఉండి సహాయం చేసిన వారొకరు, “ఏమన్నా హెల్ప్ కావాలా?” అని వాట్సాప్ లో నాలుగు రోజులకు ఒకసారి మెసేజ్ పెట్టి మరీ సహాయం చేసిన వారొకరు. కొబ్బరి బోండాం ను అందంగా అలంకరించిన వారొకరు, దాదాపుగా ప్రతి రోజూ మేము ఏం చేస్తున్నామో కనుక్కుని ఏమన్నా సహాయం కావాలా అంటూ వెన్నంటే ఉన్నవారొకరు.
పెళ్ళి, హంగామా అంటేనే ఎన్నెన్ని నిర్ణయాలు తీసుకోవాలి? ఎంత ఎమోషనల్ సపోర్ట్ కావాలి. ఏ సమయంలో ఫోన్ చేసినా ఓపిగ్గా విని తగిన సలహాలు ఇచ్చిన వారొకరు. జ్యూయలరీ కొనడం దగ్గర నుండీ కావలసిన సమాచారం అందిస్తూ దాదాపుగా రెండు నెలలు పక్కనే ఉండి సహాయం చేయడమే కాక, పెళ్ళికూతురి చీరలన్నీ పొందికగా కుచ్చిళ్ళు పెట్టి చక్కని మడతలు వేసిచ్చిన వారొకరూ. నలుగు పెట్టడానికి వచ్చి వంటగది మొత్తం హాండ్ ఓవర్ చేసుకున్న వారొకరు. కావలసిన వస్తువులన్నీ పంతులు గారికి అందిస్తూ పెళ్ళిపెద్ద బాధ్యత వహించిన వారొకరు. మండపానికి వెళ్ళి కావలసిన ఏర్పాట్లన్నీ చూసుకున్నవారు కొందరు. పూల కార్లను ముస్తాబు చేసిన వారు మరికొందరు.
ఇందరి అభిమానం మా మనసులలో పారిజాతాలై కురిసింది. మా హృదయాలలో ఆ పారిజాత పరిమళాలు ఎప్పటికీ వెదజల్లుతూనే ఉంటాయి.
ఇల్లు దాటి బయటకు అడుగు పెట్టడానికి కూడా సందేహించే ఈ రోజుల్లో పెళ్ళికి రావడం సాహసమనే చెప్పాలి. ఎంతో అభిమానంతో పెళ్ళికి వచ్చి వధూవరులను ఆశీర్వదించిన బంధువులకు, మిత్రులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
ఈ పెళ్ళి కబుర్లు రాయాలని పట్టుబట్టి నాచేత రాయించి, మొదటి ప్రతి చదివి అద్బుతంగా ఉంది బ్లాగ్ లో పోస్ట్ చేయాల్సిందే అన్నారు ఓ ఆత్మ బంధువు. రాసుకున్నాం సరే పబ్లిక్ పోస్ట్ అవసరం లేదు కాదా అంటే "కరోనా కాలంలో పెళ్ళిళ్ళు ఎలా జరిగాయో భవిష్యత్తులో ఒక రికార్డ్ ఉంటుంది తప్పకుండా బ్లాగ్ లోనే పోస్ట్ చెయ్యాలి" అంటూ ప్రోత్సహించిన తనకు ప్రత్యేక ధన్యవాదాలు. తన ప్రోత్సాహమే లేకపోతే ఈ పోస్ట్ ఇలా పబ్లిక్ లోకి వచ్చేదే కాదు.
"ఏమిటండీ ఇంకా పెళ్ళి కబుర్లు రాయలేదు, మేమంతా ఎదురుచూస్తున్నాం" అంటూ ఫోన్స్ చేసి నాకు రాయాలనే ఆలోచన కలిగించిన వాళ్ళకు, ప్రతి పోస్ట్ చదివిన వెంటనే తనకు నచ్చిన ప్రతి వాక్యం, ప్రతి సన్నివేశం నాతో పంచుకున్న వారికి, కామెంట్ లతో, లైక్స్ తో నన్ను ఉత్సాహ పరిచిన మీకందరకూ కూడా పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
మిత్రులు ఎవరు సహాయం చేయడానికి ముందుకు వచ్చినా మనకేం కావాలో తెలిస్తే కదా వారు ఏమైనా చేయగలిగేది. లేకపోతే అంతా గందరగోళమే. ఇద్దరికీ అంతా కొత్త, అన్ని తెలుసుకుంటూ నేర్చుకుంటూ గమ్యం చేరాం. అన్నింటికీ మించి పెళ్ళి కుదిరిన రోజునే ఈయన “అమ్మడూ, పెద్ద బాధ్యత నెరవేర్చబోతున్నాం. పెళ్ళి పెద్దలం గృహస్థుల౦ రెండూ మనమే. ఈ పెళ్ళి జీవితాంతం మనకొక తీపి జ్ఞాపకంగా ఉండాలంటే మనిద్దరం ఎటువంటి పరిస్థితిలో కూడా సహనం కోల్పోకూడదు.” అని చెప్పారు. అదే మాట మీద ఉన్నాం ఇద్దరమూనూ. మేము చేసిన మా అమ్మాయి పెళ్ళి మా పెళ్ళికంటే తియ్యని జ్ఞాపకం.
రెండు కుటుంబాల కలయిక ఇంత ఆహ్లాదంగా జరిగింది కాబట్టే నిస్సంకోచంగా నాకనిపించివి అన్నీ ఇలా రాయగలిగాను. ఇంత సరదాగా జరుగవలసిన వేడుకలు మగ పెళ్ళి వారు, మర్యాదలూ, కట్నాలూ, కానుకలూ అంటూ ఎందుకంత క్లిష్టతరం చేసుకుంటున్నామో ఆడపెళ్ళివాళ్ళం కాస్త తగ్గి ఉండాలంటూ అమ్మాయిలను ఎందుకు చిన్న బుచ్చుతున్నామో మనందరం మరొక్కసారి ఆలోచిస్తే బావుంటుందేమో! పెళ్ళితో దగ్గరవ వలసిన రెండు కుటుంబాలు సాంప్రదాయాలు, పెట్టుపోతల పేరుతో పెళ్ళి పందిట్లోనే మనస్పర్ధలు పెంచుకోవడం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. దానికి ముఖ్య కారణం మీరూ మేమూ అనే తేడా చూపడం, ఏవేవో ఆశించడం అవి జరగనప్పుడు కోపాలు, అసహనాలు. అప్పుడు మొదలైన విభేదాలు కుటుంబాల మధ్యే కాదు కొత్త దంపతుల మధ్య కూడా అడ్డుగోడలు ఏర్పడడానికి అవకాశం ఇస్తాయి.
ఇక్కడ మా వదిన అన్న మాటను మరోసారి గుర్తుచేస్తాను. “మేము ఎప్పుడు మా అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా కోడలు అత్తయ్యా, మామయ్యా వచ్చారా అని సంబరంగా ఎదురు వచ్చేలా మేమే చేసుకుంటాం. మా ప్రవర్తన బట్టే కదా వదినా మా కోడలు మెలిగేది” అని. ఎంత గొప్ప ఆలోచన ఇది.
మనకు కాళ్ళు చేతులే కాదు రెక్కలు కూడా ఉంటాయి. ఆ రెక్కలకేగా మనం ఊహలు తగిలించి, కలలు, కోరికలు కలగలిపి జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. మమ్మల్నిద్దర్నీ ఎక్కడా తల వంచనీయని ఈ పెళ్ళి మా రెక్కలు మరింత విశాలమై మరిన్ని దూరాలు ఎగరడానికి దోహదం చేసింది.
మా అమ్మాయికి పెళ్ళి చేస్తే మాకు ఎలాంటి అల్లుడు వస్తాడా అని కంగారు పడ్డాం కానీ మా ఇంటికి పెద్ద కొడుకు వచ్చాడు. పెళ్ళికొడుకు, తన అన్నా, వదిన వీళ్ళు ముగ్గురూ కూడా అరేంజ్ మెంట్స్, డెకరేషన్స్, పెళ్ళి బట్టలు ఆర్డర్ ఇవ్వడం ఇలా అన్నింటిలో ఎంతో సహాయం చెసారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన వాళ్ళు పక్కనే ఉన్నారు అనే ధైర్యం కలిగించారు. పెళ్ళి కొడుకు వాళ్ళ అన్నయ్య వయస్సులో చిన్నవాడయినా ఈ పెళ్ళి బాధ్యత అంతా భుజాన వేసుకుని చక్కగా నిర్వర్తించాడు. నవంబర్ వరకూ మాకు ఆరుగురు పిల్లలు ఇప్పుడు తొమ్మిదిమంది.
మా అదృష్టం ఏమిటంటే ఇటు అమెరికాలో ఉన్న మా తమ్ముడు వాళ్ళు, ఇండియాలో ఉన్న మా మరిది వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకోవడం. మా మరిది వాళ్ళు మేము ఇక్కడి నుండి వెళ్ళనవసరం లేకుండా పెళ్ళికి కావలసిన వస్తువులన్నీ ఇండియా నుండి తీసుకుని వచ్చారు. ఈ కరోనా టైమ్ లో కూడా సకుటుంబ సమేతంగా వచ్చారు. అసలు వాళ్ళంతా రాకపోతే ఇంత సందడే ఉండకపోను. ఇక్కడ మేము చేస్తున్న పనులేవీ వాళ్ళకు అలవాటు లేకపోయినా నలుగురూ ప్రతి పనిలో సాయం చేసారు. పెద్దావిడ మా అత్తయ్య కూడా మనవరాలి పెళ్ళి చూడడానికి ఇండియా నుండి ఇంత దూరం వచ్చారు.
మా తమ్ముడు వాళ్ళు పెళ్ళి కుదిరిన రోజు నుండీ మా పక్కనున్నట్లే. ప్రతిరోజూ ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజెస్ ఉంటూనే ఉండేవి. ఒక్క ఊరిలో లేమన్న మాటే కానీ ప్రతి నిర్ణయమూ కలసే తీసుకున్నాము. మా మరదలితో నేను మనసులో ఏ మాట చెప్పడానికి ఫిల్టర్ పెట్టనవసరం లేదు. మా కళ్ళ ముందే పుట్టి పెరిగిన మా మేనకోడలు ఇంట్లో జరుగుతున్న ప్రతి పనిని, సరదా సన్నివేశాలను ఫోటోలు వీడియోలు తీసి పెళ్ళి తరువాత ‘బిహైండ్ ది సీన్స్’ వీడియో పంపించింది. ఇన్ని రోజుల సంతోషానికి తీపి గుర్తు అది. ఏడుగంటలు ప్రయాణం చేసి మా మరిది వాళ్ళను వాషింగ్టన్ డి సి నుండి తీసుకొచ్చి మళ్ళీ అక్కడకు వెళ్ళి ఎక్కించే బాధ్యతను మా తమ్ముడు మరో కజిన్ తీసుకున్నారు.
వీళ్ళే కాక బెంగుళూరులో వున్న కజిన్ చేసిన సహాయం అక్షరాలకు అందనిది. నేను చెప్పినవే కాక పెళ్ళికి ఇంకేం కావాలో కూడా చెప్పి అన్నీ తీసుకుని పంపించింది. తన సహాయం లేకపోతే డెకరేషన్ కానీ, పెళ్ళికి కానీ కావలసిన వస్తువులను సేకరించడంలో బాగా ఇబ్బంది పడేవాళ్ళం. కూతురు పెళ్ళి జరిగి మూడు రోజులవ్వలేదు “పెళ్ళి పనులు ఎంతవరకు వచ్చాయని” పలకరించి అతి పెద్ద బాధ్యత భుజాన వేసుకుని కావసిన నగల ఎంపికకు సహాయం చేసారు నంద్యాలలో ఉన్న మరో ఫ్రెండ్. అన్నీ కొనడం అయిందా ఇంకేమైనా కావాలా అంటూ పలకరించి నెల్లూరు లో ఉన్న ఓ ఫ్రెండ్ మిగిలిన షాపింగ్ అంతా పూర్తి చేసారు.
మా పాప క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు పెళ్ళికి ఐదురోజుల ముందే వచ్చి, పెళ్ళి కూతురికి కావలసివాటి దగ్గర నుండీ ప్రతి ఈవెంట్ కి ముందుగానే కావలసిన బట్టలు నగలు తీసి పెట్టడం వరకూ అన్నీ వాళ్ళే చూసుకున్నారు. ఇవే కాక ఇంట్లో అన్ని పనులూ అందుకున్నారు. ఈ పిల్లలిద్దరూ వచ్చాక నేను పెళ్ళి కూతురి గురించి ఆలోచించ కుండా పెళ్ళి పనులు చూసుకునే వీలు చిక్కింది. వీళ్ళలో ఒకరికి ఈ మధ్యనే పెళ్ళయింది. ఆ అమ్మాయి వాళ్ళాయన కలసి వచ్చారు. పెళ్ళి కూతురికి పూల పందిరి పట్టుకోవడానికి ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు నాలుగో వాళ్ళు ఎవరూ అని వెతుక్కుంటుంటే “నేను పట్టుకుంటాను ఆంటీ, తన ఫ్రెండ్ అంటే నా చెల్లి” అంటూ ఆ అబ్బాయి చెప్పడం నేను ఎప్పటికీ మరచిపోలేను.
“పెళ్ళికి పిలవక్కర్లేదు కానీ పనులు మాత్రం చెప్పండి” అంటూ మొత్తం అన్ని రోజులూ మా పక్కనే ఉండి సహాయం చేసిన వారొకరు, “ఏమన్నా హెల్ప్ కావాలా?” అని వాట్సాప్ లో నాలుగు రోజులకు ఒకసారి మెసేజ్ పెట్టి మరీ సహాయం చేసిన వారొకరు. కొబ్బరి బోండాం ను అందంగా అలంకరించిన వారొకరు, దాదాపుగా ప్రతి రోజూ మేము ఏం చేస్తున్నామో కనుక్కుని ఏమన్నా సహాయం కావాలా అంటూ వెన్నంటే ఉన్నవారొకరు.
పెళ్ళి, హంగామా అంటేనే ఎన్నెన్ని నిర్ణయాలు తీసుకోవాలి? ఎంత ఎమోషనల్ సపోర్ట్ కావాలి. ఏ సమయంలో ఫోన్ చేసినా ఓపిగ్గా విని తగిన సలహాలు ఇచ్చిన వారొకరు. జ్యూయలరీ కొనడం దగ్గర నుండీ కావలసిన సమాచారం అందిస్తూ దాదాపుగా రెండు నెలలు పక్కనే ఉండి సహాయం చేయడమే కాక, పెళ్ళికూతురి చీరలన్నీ పొందికగా కుచ్చిళ్ళు పెట్టి చక్కని మడతలు వేసిచ్చిన వారొకరూ. నలుగు పెట్టడానికి వచ్చి వంటగది మొత్తం హాండ్ ఓవర్ చేసుకున్న వారొకరు. కావలసిన వస్తువులన్నీ పంతులు గారికి అందిస్తూ పెళ్ళిపెద్ద బాధ్యత వహించిన వారొకరు. మండపానికి వెళ్ళి కావలసిన ఏర్పాట్లన్నీ చూసుకున్నవారు కొందరు. పూల కార్లను ముస్తాబు చేసిన వారు మరికొందరు.
ఇందరి అభిమానం మా మనసులలో పారిజాతాలై కురిసింది. మా హృదయాలలో ఆ పారిజాత పరిమళాలు ఎప్పటికీ వెదజల్లుతూనే ఉంటాయి.
ఇల్లు దాటి బయటకు అడుగు పెట్టడానికి కూడా సందేహించే ఈ రోజుల్లో పెళ్ళికి రావడం సాహసమనే చెప్పాలి. ఎంతో అభిమానంతో పెళ్ళికి వచ్చి వధూవరులను ఆశీర్వదించిన బంధువులకు, మిత్రులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
ఈ పెళ్ళి కబుర్లు రాయాలని పట్టుబట్టి నాచేత రాయించి, మొదటి ప్రతి చదివి అద్బుతంగా ఉంది బ్లాగ్ లో పోస్ట్ చేయాల్సిందే అన్నారు ఓ ఆత్మ బంధువు. రాసుకున్నాం సరే పబ్లిక్ పోస్ట్ అవసరం లేదు కాదా అంటే "కరోనా కాలంలో పెళ్ళిళ్ళు ఎలా జరిగాయో భవిష్యత్తులో ఒక రికార్డ్ ఉంటుంది తప్పకుండా బ్లాగ్ లోనే పోస్ట్ చెయ్యాలి" అంటూ ప్రోత్సహించిన తనకు ప్రత్యేక ధన్యవాదాలు. తన ప్రోత్సాహమే లేకపోతే ఈ పోస్ట్ ఇలా పబ్లిక్ లోకి వచ్చేదే కాదు.
"ఏమిటండీ ఇంకా పెళ్ళి కబుర్లు రాయలేదు, మేమంతా ఎదురుచూస్తున్నాం" అంటూ ఫోన్స్ చేసి నాకు రాయాలనే ఆలోచన కలిగించిన వాళ్ళకు, ప్రతి పోస్ట్ చదివిన వెంటనే తనకు నచ్చిన ప్రతి వాక్యం, ప్రతి సన్నివేశం నాతో పంచుకున్న వారికి, కామెంట్ లతో, లైక్స్ తో నన్ను ఉత్సాహ పరిచిన మీకందరకూ కూడా పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
మిత్రులు ఎవరు సహాయం చేయడానికి ముందుకు వచ్చినా మనకేం కావాలో తెలిస్తే కదా వారు ఏమైనా చేయగలిగేది. లేకపోతే అంతా గందరగోళమే. ఇద్దరికీ అంతా కొత్త, అన్ని తెలుసుకుంటూ నేర్చుకుంటూ గమ్యం చేరాం. అన్నింటికీ మించి పెళ్ళి కుదిరిన రోజునే ఈయన “అమ్మడూ, పెద్ద బాధ్యత నెరవేర్చబోతున్నాం. పెళ్ళి పెద్దలం గృహస్థుల౦ రెండూ మనమే. ఈ పెళ్ళి జీవితాంతం మనకొక తీపి జ్ఞాపకంగా ఉండాలంటే మనిద్దరం ఎటువంటి పరిస్థితిలో కూడా సహనం కోల్పోకూడదు.” అని చెప్పారు. అదే మాట మీద ఉన్నాం ఇద్దరమూనూ. మేము చేసిన మా అమ్మాయి పెళ్ళి మా పెళ్ళికంటే తియ్యని జ్ఞాపకం.
*********************
ఇక్కడ మా వదిన అన్న మాటను మరోసారి గుర్తుచేస్తాను. “మేము ఎప్పుడు మా అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా కోడలు అత్తయ్యా, మామయ్యా వచ్చారా అని సంబరంగా ఎదురు వచ్చేలా మేమే చేసుకుంటాం. మా ప్రవర్తన బట్టే కదా వదినా మా కోడలు మెలిగేది” అని. ఎంత గొప్ప ఆలోచన ఇది.
మనకు కాళ్ళు చేతులే కాదు రెక్కలు కూడా ఉంటాయి. ఆ రెక్కలకేగా మనం ఊహలు తగిలించి, కలలు, కోరికలు కలగలిపి జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. మమ్మల్నిద్దర్నీ ఎక్కడా తల వంచనీయని ఈ పెళ్ళి మా రెక్కలు మరింత విశాలమై మరిన్ని దూరాలు ఎగరడానికి దోహదం చేసింది.
ఎంత జాగ్రత్తగా ఉన్నా రకరకాల ప్రాంతాల వాళ్ళం ఒకదగ్గర కలిసాము అని భయపడుతూనే ఉన్నాం. కానీ మా ఇంట్లో వాళ్ళకు కానీ పెళ్ళి కొచ్చిన వాళ్ళకు కానీ ఎవ్వరికీ కోవిద్ రాలేదు. అందరం క్షేమంగా ఉన్నాం.
పెళ్ళి కబుర్లన్నీ ఓపిగ్గా చదివి మా సంతోషంలో పాలుపంచుకుని వధూవరులకు ఆశీస్సులు అందజేసిన పెద్దలకూ మిత్రులకూ అందరికీ ధన్యవాదాలు. 🙏
పెళ్ళి కబుర్లన్నీ ఓపిగ్గా చదివి మా సంతోషంలో పాలుపంచుకుని వధూవరులకు ఆశీస్సులు అందజేసిన పెద్దలకూ మిత్రులకూ అందరికీ ధన్యవాదాలు. 🙏
*********************
పెళ్ళి కబుర్లు అమెరికాలో తెలుగుపెళ్ళి, ఆచారాలు వ్యవహారాలు, పెళ్ళికి కావలసినవి, అలంకరణ, అరిసెలూ అవాంతరాలు, స్వప్నలోకం, నిశ్చయ తాంబూలాలు, మెహెందీ , సంగీత్ , పెళ్ళికూతురు, వివాహ మహోత్సవం. అన్నింటికీ లింక్స్ ఉన్నాయి. దేనిమీద నొక్కితే ఆ కబుర్లు చదవొచ్చు.
Saturday, April 10, 2021
వివాహ మహోత్సవం
ఇన్నాళ్ళుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. సాయంత్రం ఏడుగంటల పదిహేను నిముషాలకు పెళ్ళి.
పెళ్ళికి కావలసిన వస్తువులన్నీ పురోహితులు లిస్ట్ ఇచ్చారు. అందులో పెళ్ళి పీటలు, తలంబ్రాల పళ్ళాలు, ఉంగరాల బిందె లాంటి పెద్ద పెద్ద వస్తువులన్నీ ముందుగానే అట్టపెట్టెలలో పెట్టేసాము. మిగిలిన వస్తువులు అంటే పసుపు, కుంకుమ, కర్పూరం లాంటి పూజా సామగ్రి, గంధపు చెక్క, సాన, ఎండు కొబ్బరి చిప్పలు, కొత్త టవల్స్ లాంటి పెళ్ళికి కావలసినవి వస్తువులు అన్నీ చూసి పక్కన పెట్టుకున్నాము. గరిక ముంతలు లాంటివి జాగ్రత్తగా పాక్ చేసాము.
పెళ్ళి కూతురికి మేకప్ చేయడానికి 'ఎమి పటేల్' అనే మేకప్ ఆర్టిస్ట్ ముందు రోజే అట్లాంటా నుండి వచ్చారు. ఆవిడ పెళ్ళిరోజు ఉదయం పదిగంటలకే మేకప్ చేయడం మొదలు పెట్టారు కానీ పూర్తయ్యేసరికి ఒంటిగంట అయ్యింది. మిగిలిన పిల్లలకు పూలజడలు వేయడానికి, మేకప్ చేయాడానికి ఒకరిద్దరిని చూసాం కానీ నచ్చలేదు. ఇంకెవరినైనా చూద్దామన్నా ఈ కరోనా ఒకటి. ఒక్కొక్కళ్ళు ఇంటికి వస్తుంటే రిస్క్ పెరుగుతూ ఉంటుంది కదా! మా మరిది వాళ్ళ చిన్నపాప అందరికీ చక్కగా మేకప్ వేసింది. ఎక్కడ నేర్చుకున్నావురా అంటే యూట్యూబ్ పెద్దమ్మా అంది. "మనందరం సేమ్ స్కూల్, మీ పెదనాన్న, నేనూ యూ ట్యూబ్ నుండే పెళ్ళి చేయడం నేర్చుకున్నాము". అని నవ్వుకున్నాము.
రెండు గంటలకల్లా పెళ్ళికూతురు, పెళ్ళి కొడుకు మండపం దగ్గరకు వెళ్ళాలి. ఆ తరువాత వాళ్ళకు ఫోటో షూట్ ఉంటుందిట. పెళ్ళి కొడుకు వాళ్ళను మండపానికి తీసుకుని రావడానికి మా తమ్ముడు పూలకారు తీసుకుని పన్నెండు గంటలకే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.
అంటూ పాట వినిపిస్తూ ఉండగా పెళ్ళి కొడుకు తన కుటుంబ సభ్యులతో కలిసి మండపానికి తరలి వచ్చారు. పూజారిగారు పెళ్ళికొడుకును, తన అమ్మానాన్నలను కూర్చబెట్టి పూజ చేయించారు.
ఆ తరువాత వధువుకు తన అత్తామామలు, వరునికి మేము బట్టలు పెట్టాము.
తలంబ్రాల బట్టలు మార్చుకుని వచ్చాక పురోహితుడు వారివురితో పూజ చేయించి, వరునితో మంగళ ధారణ చేయిస్తూ ఈ మంత్రం చెప్పించారు. "మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా / కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతమ్". దాని అర్థం నా జీవితానికి కారణం నువ్వు. అలాంటి నువ్వు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సూత్రాన్ని నీ మెడలో కడుతున్నాను. అని అట.
ఆ తరువాత వారిరువురితో దండలు మార్పించారు. దీని అర్థం పరస్పరం ఆదరాభిమానాలు పంచుకుంటూ పూలు పరిమళించినట్లుగా మన మధ్య స్నేహం పరిమళించాలి అనిట.
ఇక పిల్లలు, పెద్దలు అంతా ఎదురుచూస్తున్న వేడుక తలంబ్రాలు పోసుకోవడం. వధూవరులు ఒకరిపై ఒకరు పసుపు కలిపిన బియ్యాన్ని దోసిళ్ళతో పోసుకోవడం చూసే వారికి ఎంతో వేడుకగా ఉంటుంది.
ఇక ఆ రోజు సర్దుకోవలసినవి తమలపాకులు, పువ్వులు, పూల దండలు, మామిడాకులు లాంటివి. అంతకు ముందురోజు అట్లాంటా లో ఉన్న వివేక్ ఫ్లవర్స్ నుండి తెలిసిన వాళ్ళు పూల మాలలు, పువ్వులను తీసుకుని ట్రక్ లో పెట్టి గ్రీన్స్ బరో వరకు పంపిస్తే, ఆ రాత్రి ఒక ఫ్రెండ్ వెళ్ళి అక్కడినుండి తీసుకొనివచ్చారు.
పెళ్ళి సమయంలో కావలసినవి అన్నీ పంతులుగారికి అందించే బాధ్యత తీసుకున్న ఫ్రెండ్ ఆ రోజు ఉదయాన్నే ఎనిమిది గంటలకల్లా వచ్చేసారు. లిస్ట్ తీసుకుని తాను మళ్ళీ అన్నీ సరిచూసుకుని అట్టపెట్టెలలో సర్దేసారు. ఈలోగా మరో నలుగురు ఫ్రెండ్స్ వచ్చి పెళ్ళి మండపానికి తీసుకుని వెళ్ళవలసినవి అన్నీ వాన్ లలో పెడుతున్నారు.
ముందు అన్నీ ఎంత ఆర్గనైజ్డ్ గా సర్దిపెట్టినా డెకరేషన్ సామన్లు, సంగీత్ కోసం కొన్న వాటిలో మిగిలిపోయిన సామాన్లు ఇంకా రకరకాల వస్తువులతో, అట్ట పెట్టెలతో గరాజ్ అంతా నిండి పోయి ఉంది. అందుకే కావలసినవి అన్నీ మరో సారి జాగ్రత్తగా చూసుకుంటున్నాము. ఒక్క వస్తువు మరచిపోయినా ఇంటికి వచ్చి తీసుకుని వెళ్ళడానికి ఒకటిన్నర గంట పడుతుంది. పెళ్ళి జరిగే సమయంలో అది వీలుపడదు. కావలసినవన్నీ తీసుకుని పది గంటలకంతా నలుగురు ఫ్రెండ్స్, మా వారు పెళ్ళి మండపానికి వెళ్ళారు.
పెళ్ళి కూతురికి మేకప్ చేయడానికి 'ఎమి పటేల్' అనే మేకప్ ఆర్టిస్ట్ ముందు రోజే అట్లాంటా నుండి వచ్చారు. ఆవిడ పెళ్ళిరోజు ఉదయం పదిగంటలకే మేకప్ చేయడం మొదలు పెట్టారు కానీ పూర్తయ్యేసరికి ఒంటిగంట అయ్యింది. మిగిలిన పిల్లలకు పూలజడలు వేయడానికి, మేకప్ చేయాడానికి ఒకరిద్దరిని చూసాం కానీ నచ్చలేదు. ఇంకెవరినైనా చూద్దామన్నా ఈ కరోనా ఒకటి. ఒక్కొక్కళ్ళు ఇంటికి వస్తుంటే రిస్క్ పెరుగుతూ ఉంటుంది కదా! మా మరిది వాళ్ళ చిన్నపాప అందరికీ చక్కగా మేకప్ వేసింది. ఎక్కడ నేర్చుకున్నావురా అంటే యూట్యూబ్ పెద్దమ్మా అంది. "మనందరం సేమ్ స్కూల్, మీ పెదనాన్న, నేనూ యూ ట్యూబ్ నుండే పెళ్ళి చేయడం నేర్చుకున్నాము". అని నవ్వుకున్నాము.
మా తోడికోడలు, పిల్లలకు జడలు వేసి వేణీలు పెట్టింది. ఏ గదిలో చూసినా పువ్వులు, జడ బిళ్ళలు, జడ పిన్నులు, పిన్నీసులు, వేణీలు, పట్టు చీరలు, ఓణీలు, వడ్రాణాలు. “అత్తా నాకు జడ వెయ్యవా?, పిన్నీ నాకు పిన్ పెట్టవా? పెద్దమ్మా పాపిటి బిళ్ళ సరిగ్గానే ఉందా? అత్తా నా నెక్లెస్ ఎక్కడుంది?” ఇలా ఇల్లంతా సందడే సందడి. మరి ఐదుగురు ఆడపిల్లలు పెళ్ళికి తయారవుతుంటే ఇంట్లో ఆ మాత్రం సందడి ఉండదూ?
రెండు గంటలకల్లా పెళ్ళికూతురు, పెళ్ళి కొడుకు మండపం దగ్గరకు వెళ్ళాలి. ఆ తరువాత వాళ్ళకు ఫోటో షూట్ ఉంటుందిట. పెళ్ళి కొడుకు వాళ్ళను మండపానికి తీసుకుని రావడానికి మా తమ్ముడు పూలకారు తీసుకుని పన్నెండు గంటలకే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.
పెళ్ళి కూతురు కోసం మరో పూల కారు సిధ్దం. మా అమ్మాయి మంగళవారం పుట్టింది. శుక్రవారం, మంగళవారం అమ్మాయి పుడితే లక్ష్మీ దేవి పుట్టినట్లట. లక్ష్మీ దేవి ఇంటి నుండి వెళ్ళేప్పుడు ఒక రూపు కనుక తన తల్లికి కడితే ఆ లక్ష్మి ఆ ఇంటి దగ్గరే ఉంటుందిట. భలే ఉంటాయి కదూ ఇలాంటి ఆచారాలు, నమ్మకాలు.
మండపానికి బయలుదేరుతున్న పెళ్ళి కూతురికి ఆడపడుచులు హారతి చ్చారు.
మండపానికి బయలుదేరుతున్న పెళ్ళి కూతురికి ఆడపడుచులు హారతి చ్చారు.
మిగలిన వాళ్ళను మండపం దగ్గరకు తీసుకొచ్చే బాధ్యతను మా తమ్ముడికి, బుజ్జిపండుకి అప్పగించి నేనూ, మావారూ పెళ్ళికూతురిని తీసుకుని బయలుదేరాము. పెళ్ళి కొడుకు వాళ్ళను రిసీవ్ చేసుకోవడానికి మాతో పాటే మరో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా బయలుదేరారు.
పూలు ఎక్కడ రాలి పోతాయో అని ఫ్రీవే లో కాకుండా మామూలు రోడ్స్ లో వెళ్ళాము. పక్కన ఉన్న కార్లు మా కార్ వైపు చూసి నవ్వుతూ థంబ్స్ అప్ చెపుతూ ఉంటే భలే సరదాగా ఉన్నది. ఓ అరగంటలో హోటల్ దగ్గరకు చేరుకున్నాము. కెమెరా మెన్ పెళ్ళి కూతురినీ పెళ్ళి కొడుకునీ ఫోటో షూట్ కి తీసుకుని వెళ్ళాడు. మేమంతా హాల్ దగ్గరకు వెళ్ళాము.
సాయంత్రం ఆరుగంటలకు పూజారిగారు మండపంపైనే ఒక పక్కగా మమ్మల్ని ముగ్గురినీ కూర్చోబెట్టి, పెళ్ళికూతురితో గౌరి పూజ చేయించారు.
పెళ్ళంటే వధూవరులకు బాసికం కట్టడం, జీలకర్ర బెల్లం పెట్టించడం, తాళిబొట్టు, తలంబ్రాలు ఇలా చాలా ఉంటాయి కదా వాటి అర్థాలు తెలుసుకుని పిల్లలకు అర్థం అయ్యే భాషలో వ్రాయడానికి ప్రయత్నించాను. ఎక్కడైనా పొరపాటుగా చెప్పి ఉంటే దయచేసి సవరించ వలసినదిగా పెద్దలను కోరుకుంటున్నాను.
ఫోటో షూట్ అవగానే వధూవరులిద్దరికీ బాసికం కట్టాము. మన శరీరం లోని నాడులలో(వెయిన్స్) ఇడ, పింగళ, సుషుమ్న అనే మూడు నాడులు ముఖ్యమైనవట. వీటిలో సుషుమ్న అనే నాడి కి కుడివైపు సూర్య నాడి, ఎడమ వైపు చంద్ర నాడి ఉంటాయట. ఈ రెండు నాడుల కలయిక అర్ధచంద్రాకారంలో వుంటుంది. దీనిని దివ్యచక్షవు అంటారట. ఈ దివ్యచక్షువుపై ఇతరుల దృష్టి పడి దోషం కలుగకుండా వుండేందుకు వధువరుల నుదుట బాసికం కడతారట.
పెళ్ళి జరిపిస్తున్న పురోహితులు గ్రీన్స్ బరో పూజారి మురళీ కృష్ణ గారు. ఏ సందర్భానికి ఎలాంటి సన్నాయి మేళం, మంగళ వాయిద్యాలు వినిపించాలో ముందుగానే చెప్పారు. మా తమ్ముడు మరో ఫ్రెండ్ అవీ, కొన్ని పెళ్ళి పాటలు సేకరించి, సందర్భానికి తగినట్లుగా వినిపించే లాగా వరుసగా నంబర్స్ వేసి డిజె పవన్ కు ఇచ్చారు. మనమిప్పుడు మ్యూజికల్ వెడ్డింగ్ చూడబోతున్నా మన్నమాట.
ఆరుగంటల ముప్పై నిముషాలకు బావమరుదులు పూల పందిరి పట్టుకోగా
అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి
ఆ పలనాటి బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ"
ఆ తరువాత అన్నా, తముళ్ళు పూలపందిరి పట్టుకోగా
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీ హరి ఇంటి దీపమల్లె కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి
అంటూ పాట వినిపిస్తూ ఉండగా పెళ్ళి కూతరు మండపానికి తరలి వచ్చింది.
పెళ్ళికి రాలేకపోయిన వాళ్ళకు జూమ్ లో పెళ్ళి చూపిస్తున్నారు పిల్లలు. వాళ్ళంతా వాట్స్ ఆప్ లో కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళందరికీ బాగా నచ్చిన సన్నివేశం అట ఇది. పెళ్ళి మండపం లో కంటే జూమ్ లోనే ఎక్కువ మంది ఉన్నారని బుజ్జిపండు బోలెడు ఆశ్చర్యపోయాడు.
పూజారి గారు వధూవరులను తూర్పు పడమరలకు అభిముఖంగా కూర్చోబెట్టారు. ఆడపిల్లలు వారి మధ్యగా అడ్డుతెర పట్టుకున్నారు. మంగళవాద్యాలు మ్రోగుతుండగా పురోహితుడు మంత్రాలు పఠిస్తుండగా ముహూర్త సమయంలో జీల కర్ర బెల్లం కలిపిన మిశ్రమాన్ని వధూవరులు ఒకరితలపై ఒకరు పెట్టుకున్నారు.
ఈ రెండూ కలసిన మిశ్రమం నుండి జీలకర్రను, బెల్లాన్ని విడదీయడం అసాధ్యం. ఏ విధంగా అయితే ఇవి రెండు విడదీయరాని బంధంతో పటిష్టంగా ఉంటాయో అలాగే వధూవరులు కూడా ఆలుమగలుగా కలసిపోయి విడదీయరాని బంధంగా మనుగడ సాగించాలని అర్థమట.
ఆ తరువాత వధువుకు తన అత్తామామలు, వరునికి మేము బట్టలు పెట్టాము.
తలంబ్రాల బట్టలు మార్చుకుని వచ్చాక పురోహితుడు వారివురితో పూజ చేయించి, వరునితో మంగళ ధారణ చేయిస్తూ ఈ మంత్రం చెప్పించారు. "మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా / కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతమ్". దాని అర్థం నా జీవితానికి కారణం నువ్వు. అలాంటి నువ్వు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సూత్రాన్ని నీ మెడలో కడుతున్నాను. అని అట.
ఆ తరువాత వారిరువురితో దండలు మార్పించారు. దీని అర్థం పరస్పరం ఆదరాభిమానాలు పంచుకుంటూ పూలు పరిమళించినట్లుగా మన మధ్య స్నేహం పరిమళించాలి అనిట.
ఆ తరువాత పాణి గ్రహణం చేయించారు. పాణి గ్రహణం అంటే నవ దంపతులు తమ కష్ట సుఖములను పరస్పరము గ్రహించి అన్యోన్యంగా దాంపత్య జీవితము సాగిస్తామని దృఢంగా పెద్దల ఎదుట మాట ఇవ్వడం మని అర్థమట.
ఇక పిల్లలు, పెద్దలు అంతా ఎదురుచూస్తున్న వేడుక తలంబ్రాలు పోసుకోవడం. వధూవరులు ఒకరిపై ఒకరు పసుపు కలిపిన బియ్యాన్ని దోసిళ్ళతో పోసుకోవడం చూసే వారికి ఎంతో వేడుకగా ఉంటుంది.
కుటుంబ శ్రేయస్సు,సమాజ శ్రేయస్సు కాంక్షించే ఉత్తమ సంతానాన్ని ఇవ్వమని మొదటగా వరుడు వధువు తలపై తలంబ్రాలు పోస్తాడు. అందుకు అంగీకరిస్తూ వధువు తలవంచి, అట్టి సంతానాన్ని పెంచే ధన, ధాన్యాలను సమృద్ధి గా ఇవ్వమని వరుని తలపై పోస్తుంది. అందుకు అంగీకరిస్తూ తల వంచుతాడు వరుడు. ధన ధాన్యాలను ఇస్తాను, వీటిని సమయోచితం గా ఉపయోగించమని సూచిస్తూ మరల వధువు తలపై తలంబ్రాలు పోస్తాడు. నీ ప్రతిపాదనకు అంగీకరిస్తున్నాను. ఇకనుండి మనం ఇద్దరమూ సహ జీవనం సాగిస్తూ బ్రతుకు భాద్యతను సమానంగా పంచుకుందాము అని పరస్పర అంగీకారం తెలుపుకుంటూ తల వంచుతూ మిగిలిన తలంబ్రాలను వేగం గా ఒకరిపై ఒకరు పోసుకుంటారు. అప్పటి రోజులకు తగినట్లుగా దీని అర్థం అయ్యి ఉంటుంది కానీ మూలార్థం మాత్రం ఇప్పటి రోజులకు కూడా వర్తిస్తుంది.
ఇరువైపులా ఫ్రెండ్స్, పిల్లలు బాగా అల్లరి చేసి వాళ్ళకు పోటీ పెట్టారు. పెళ్ళికూతురు, పెళ్ళి కొడుకూ ఇద్దరూ ఒకరికి అందకుండా మరొకరు తలంబ్రాలు పోయడానికి ప్రయత్నించారు. ఆ అల్లరి చేసిన వాళ్ళంతా వేడుక పూర్తవగానే పక్కకు వెళ్ళిపోయారు. అప్పుడు చెప్పారు పంతులు గారు, “చూసారా, మీరిద్దరూ వాళ్ళ మాటలు విని పోటీ పడ్డారు. మిమ్మల్ని రెచ్చగొట్టిన వాళ్ళంతా ఇప్పుడు ఎటో వెళ్ళిపోయారు, చివరకు మిగిలేది మీరిద్దరే. మీరు ఎప్పుడూ ఒకరికి ఒకరుగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని భవిష్యత్తులో మరెప్పుడూ మూడో మనిషిని మీ మధ్యకు రానివ్వకండీ” అని.
చిన్నప్పటి నుండి పెళ్ళి కూతురిని భుజాల మీద వేసుకుని పెంచిన మేనమామ పెళ్ళికూతురి కాలి వేళ్ళకు మెట్టెలు తొడిగాడు. మేనమామ అత్త వధూవరులను ఆశీర్వదించారు.
పంతులు గారు ఇద్దరికీ బ్రహ్మ ముడి వేసారు. ఈ వస్త్రాల వలె మీ జీవితాలు కూడా ముడిపడి ఉన్నాయి అని అర్ధమట.
రాత్రి తొమ్మిదిన్నరకు పురోహితులు అరుంధతీ నక్షత్రం చూపించడానికి వధూవరులను ఆరుబయటకు తీసుకువెళ్ళారు. అక్కడ "ఈ వివాహ బంధంతో మనిద్దరం మిత్రులమైనాము. కనుక పరస్పర అనురాగ బద్ధులమై, అనుకూల దాంపత్యం తో , పరస్పర ఆలోచనా గ్రహితులమై నడచుకుందామని ప్రతిజ్ఞ చేసుకుంటారట" వధూవరులు. అందుకు సాక్షిగా ధ్రువుడు, అరుంధతి వాళ్ళిద్దరినీ అనుగ్రహిస్తారట.
పెళ్ళికి వచ్చిన పెద్దలు అందరూ వధూవరులను ఆశీర్వదించారు, పిల్లలు శుభాకాంక్షలు తెలియజేసారు. ఆ తరువాత ఆడపడుచులు వివాహ ప్రక్రియ కు శుభం పలుకుతూ నూతన దంపతులకు హారతి ఇచ్చారు.
అతిధులు భోజనాలు చేసాక, బయలుదేరే ముందు అందరికీ తాంబూలం ఇచ్చాము.
పెళ్ళి కొడుకు ఫ్రెండ్స్, పెళ్ళి కొడుకు కార్ కు జస్ట్ మారీడ్ అంటూ బోర్డ్ పెట్టి, బెలూన్స్, కోక్ కాన్స్ కట్టి అలంకరించారు. వధూవరులిద్దరూ ఆ కారులో మగపెళ్ళివారింటికి వెళ్ళారు.
అదండీ సంగతి. ఏ విధమైన ఆటంకాలూ లేకుండా అలా జరిగింది పెళ్ళి.
****************************
అంతకు ముందు రెండు రోజుల క్రితం కోవిద్ మూలంగా కర్ఫ్యూ పెట్టబోతున్నాం, సాయంత్రం పది గంటల తరువాత నుండీ ఉదయం ఆరుగంటల లోగా ఎవరూ రోడ్ మీద తిరగకూడదు, ఇంట్లో పది మంది కంటే ఎక్కువ మంది మనుషులు ఉండకూడదు అనే వార్త వచ్చింది. అయితే అది పెళ్ళి తరువాత రోజు నుండి అమలు. పెళ్ళి రోజు నుండీ అయి ఉంటే బాగా ఇబ్బంది పడే వాళ్ళం. మేము భోజనాలు చేసి వస్తువులన్నీ సర్దుకుని ఇంటికి వెళ్ళేసరికి దాదాపుగా ఒంటిగంట అయింది.
తరువాత రోజు ఉదయం కొత్త దంపతులు ఇద్దరూ పెళ్ళి బట్టలతోనే తమ ఇంట్లో సత్యన్నారాయణ వ్రతం చేసుకున్నారు. వ్రతం కూడా మురళీ కృష్ణ గారే చేయించారు. వ్రతానికి ఇంట్లో పెద్దవాళ్ళం మాత్రం వెళ్ళేట్లు, మేం వచ్చేసాక పిల్లలంతా పెళ్ళి దండం పెట్టుకుని భోజనాలు చేసేట్లుగా అనుకున్నాం. అట్లా అయితే ఇంట్లో తక్కువ మందిమి ఉంటాం కదా! కూతురు మీద బెంగ పెట్టుకున్న నాన్న మేము వచ్చేవరకూ కూడా ఆగక ఉదయం ఎనిమిది గంటలల్లా కూతురూ అల్లుడి ఇంటికి వెళ్ళిపోయారు. వెనుకే మేము ఒక గంట తరువాత బయలుదేరాము.
వ్రతం అయిన తరువాత రోజు పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు మా ఇంటికి వచ్చారు. ఇంట్లో ఉన్న ఆడపిల్లలంతా వాళ్ళని గుమ్మం దగ్గరే ఆపేసారు. వెనుకటి రోజుల్లో అయితే గుమ్మం దగ్గర పేర్లు చెప్పించేవారు. ఇప్పుడు ముందే చక్కగా పేర్లతో పిలుచుకుంటున్నారుగా అందుకని ఈ అమ్మాయిలు బోలెడన్ని ప్రశ్నలతో సిధ్ధమయ్యారు కానీ పెళ్ళికూతురు, పెళ్ళికొడుకూ అన్నీ ప్రశ్నలకూ టకాటకా సమాధానాలు చెప్పేసారు. బావమరిది అక్కా బావలకు కాళ్ళు కడిగి స్వాగతం చెప్పాడు.
ఆట పాటలతో ఆ రోజు సరదాగా గడిచింది. పెళ్ళి సందడి ముగిసింది. ఇంకా పెళ్ళి తరువాత చెప్పుకునే ముచ్చట్లు ఉంటాయిగా ఆ కబుర్లు ఇక్కడ చదవొచ్చు.
****************************
ఇప్పటి వరకు అమెరికాలో తెలుగుపెళ్ళి, ఆచారాలు వ్యవహారాలు, పెళ్ళికి కావలసినవి, అలంకరణ, అరిసెలూ అవాంతరాలు, స్వప్నలోకం, నిశ్చయ తాంబూలాలు, మెహెందీ , సంగీత్ , పెళ్ళికూతురు అంటూ పది రోజుల నుండీ కబుర్లు చెప్పుకుంటున్నాం. అన్నింటికీ లింక్స్ ఉన్నాయి. దేనిమీద నొక్కితే అది చదవొచ్చు.
Friday, April 2, 2021
పెళ్ళికూతురు
ముందు రోజు సంగీత్ నుండి ఆలస్యంగా వచ్చామా అయినా త్వరగా లేచేసాం. మరి పెళ్ళికూతురికి తొమ్మిదన్నర లోపు నలుగు పెట్టాలిట. నిద్ర లేచిన వాళ్ళం లేచినట్లు త్వరత్వరగా తయారవుతున్నాం. మా మరదలు, తొడికోడలు పెళ్ళి కూతురిని, పిల్లలను రెడీ చేసే హడావిడిలో ఉన్నారు.
ఇక్కడ ఏ రెస్టారెంట్ లో కూడా వారాంతంలో తప్ప వారం మధ్యలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఇవ్వరు. ఇంటి దగ్గర చేసే వాళ్ళకు ముందుగా చెప్పాను కానీ వాళ్ళకేదో ఇబ్బంది వచ్చిందిట. చేయలేకపోయారు. ఇక త్వరగా అయిపోయేది ఉప్మాయేగా అందుకని ఆ రోజు ఉప్మా చేసాను. అదే చేత్తో సాంబార్ కూడా చేయడం మొదలు పెట్టాను. మిగిలినవన్నీ రెస్టారెంట్ లో ఆర్డర్ ఇచ్చేసాము. ఉదయాన్నే ఎనిమిది గంటలకల్లా ఫ్రెండ్స్ ఐదుగురు వచ్చారు. రావడం రావడం నా చేతిలో గరిటె తీసుకుని ఒక్క కిచెనే కాదు పనులు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. ఇన్ని రోజులు మేము మిస్ అయింది ఇదే. అమెరికాలో ఎవరి ఇంట్లో ఏ ఈవెంట్ ఉన్నా మొదటి నుండి ఈవెంట్ పూర్తి అయి అన్నీ సర్దుకునే వరకు ఓ నలుగురం నిలబడి పోతాం.
మా తోడికోడలు, మరదలు పాపం పెద్ద వాళ్ళు ఎవరూ లేక బాధ్యత భుజాన వేసుకోవాలసి వచ్చింది కానీ వాళ్ళిద్దరూ చిన్నవాళ్ళే. మా ఫ్రెండ్స్ వచ్చారుగా మమ్మల్ని ఈవెంట్స్ ఎంజాయ్ చేయమంటూ ఆ రోజంతా గంధం, అక్షింతలు కలిపినా, టిఫిన్స్ ప్లేట్స్ లో సర్దినా, టీలు, కాఫీలు పెట్టినా అన్నీ వాళ్ళే చూసుకున్నారు.
సంగీత్ కు వెళ్ళేముందే బ్యాక్ డ్రాప్ పెట్టేసామని చెప్పాను కదా! దాని ముందు ముగ్గు వేసి మూడు పీటలు వాల్చి వాటి మీద అంచున్న తెల్లని కొత్త పంచె పరిచాము. ఒక పళ్ళెంలో నెయ్యి, సున్నిపిండి, గంధము, కుంకుమ, అక్షింతలు పెట్టి, మరో పళ్ళెంలో తమలపాకులు, వక్కలు అరటిపళ్ళతో తాంబూలాలు సిధ్ధం చేసాము.
న్యూజెర్సీ నుండి వచ్చిన కజిన్స్ కు ఇద్దరు ట్విన్స్ ఉన్నారు, ఆ బుజ్జి పిల్లలే తోడుపెళ్ళికూతుర్లు. తొమ్మిది గంటలకు పెళ్ళికూతురిని, తోడు పెళ్ళికూతుర్లను పీటలమీద కూర్చోబెట్టాము.
మా అమ్మ కూడా ఇలాగే అనుకుని ఉంటుంది కదూ! ఇవాళ మా ఇంట్లో జరుగుతున్న ఇలాంటి హడావిడి మా పెళ్ళి వీడియోలో ఎన్నో సార్లు చూసాను. అమ్మ, పిన్నీ వాళ్ళు, అత్తా వాళ్ళు, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ అందరి మొహాల్లో సంబరం. మా పెళ్ళి తరువాత అమ్మ ఎలా ఫీల్ అయి ఉంటుంది? తాను ఉండి ఉంటే ఆ కబుర్లన్నీ చెప్పుకునేవాళ్ళం. ఈ వేడుకలేవీ చూడకుండానే, అసలే వేడుకలూ చూడకుండానే హఠాత్తుగా వెళ్ళిపోయింది. తాను ఊహించినట్లుగా నా జీవితం మలుపు తిరిగే నాటికి తానే తిరిగి రాని దూరాలకు వెళ్ళిపోయింది. ఆపుకోలేని దుఃఖం ఆ క్షణాన నన్ను కమ్మేసింది. అమ్మ పెళ్ళిలో నాకిచ్చిన కానుకలు రూపం మార్చి అమ్మమ్మ జ్ఞాపకంగా చిట్టితల్లికి ఇచ్చాను.
ఒకరోజు ఏదో పెళ్ళి వీడియో చూస్తూ మనం కూడా ఇలా పెళ్ళికూతురికీ, పెళ్ళికొడుక్కీ మంగళ స్నానాలు కలిపి చేయిస్తే బావుంటుంది అనుకున్నాం. అనుకున్నదే తడవుగా పెళ్ళికొడుకు వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకుని పెరట్లో పందిరి వేసి కావల్సిన కర్టెన్స్ ఇండియా నుండి తెప్పించి చలిలో నాలుగు గంటల పాటు ఆ పందిరిని ముస్తాబు చేసారు. ఏర్పాట్లయితే చేసాము కానీ అమెరికాలో డిసెంబర్ నెలలో ఆరుబయట మంగళ స్నానాలు కుదిరేపని కాదనే నిర్ణయానికి వచ్చాం. ఆశ్చర్యంగా ఆ రోజు వాతావరణం చాలా బావుంది.
మగపెళ్ళివాళ్ళు కూడా ఆ రోజు ఉదయమే వాళ్ళింట్లో పెళ్ళికొడుకుని చేసుకుని మధ్యాహ్నం ఇక్కడకు వచ్చారు. ఇంట్లో అందరం పసుపు బట్టల్లోనూ, పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు మాత్రం అరేంజ్ కలర్ బట్టల్లోనూ ముస్తాబయ్యారు. పెళ్ళికూతురు పువ్వులతో చేసిన అభరణాలు పెట్టుకుని గమ్మత్తుగా తయారయ్యింది.
లోవ్స్ నుండి పెద్ద పెద్ద పాట్స్ తెచ్చాము కానీ, వాటిలో నీళ్ళు పోయగానే కింద ఉన్న రంధ్రం నుండి అన్నీ కారిపోయాయి. ఇలా కాదని ఇంట్లో వున్న చిన్న చిన్న బకెట్లు, చెంబులతో వేడినీళ్ళు పట్టి జల్లెడ మీదుగా పోసి మంగళ స్నానాలు చేయించాం. ఈ పువ్వులు కట్టడం పువ్వులు కలపడం అన్నీ అప్పటికప్పుడు చేసుకున్నాం.
మంగళ స్నానాల అర్థం ఏమిటంటే సిరిసంపదలతో సంతోషంగా ఉండమని ఆశీర్వదిస్తూ వధూవరుల మంగళం కోరుకుంటూ చేయిస్తారట.
స్నానాలవగానే మగపెళ్ళివాళ్ళంతా టీ లవీ తాగేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. పెళ్ళికూతురు ప్రదానానికి తయారయ్యేలోగా నేనూ, మా తొడికోడలు, మా మరదలు ఇంకా ఫ్రెండ్స్ కూడా ఉన్నారుగా అందరమూ కూర్చుని తలంబ్రాల బియ్యం కలిపా౦. ఈ బియ్యం కలపడానికి ఓ లెక్క ఉంటుందట. దాని ప్రకారమే కలిపాము. అప్పుడే వడికట్టు బియ్యం కూడా కలిపి ఒక టవల్ లో మూట కట్టాము.
అందులో ఆకులు, వక్కలూ, బెల్లమూ, కొబ్బరి చిప్పలూ, మంగళ సూత్రం, పండ్లు, పువ్వులూ, చీరలూ, నగలూ, మేకప్ ఐటమ్స్ తెచ్చారు. మిగిలనవన్నీ తీసి ఆకులు వక్కలూ కొబ్బరి చిప్పలూ మాత్రం ట్రేలో ఉంచాము. పెళ్ళికూతురు మూడు దోసిళ్ళతో తీసి ఒళ్ళో వేసుకుని అందులోంచి మూడు పిడికిళ్ళు తీసి మళ్ళీ ట్రే లో వేయాలట. అది ఎందుకో ఏమిటో నాకు తెలియదు.
పెళ్ళికొడుకు వాళ్ళే ఇంట్లో అందరికీ రామ్ రాజ్ పంచలు, సిల్క్ చొక్కాలు తీసుకుని వచ్చారు. ఆ బ్యాక్ డ్రాప్ వెనుక కత్తులు, కొడవళ్ళు లాంటివేమీ లేవు. పామిస్ :).
ఇప్పటివరకూ అన్నీ అనుకొన్నవి అనుకున్నట్లుగానే జరిగాయి. పైకి అనుకోలేదు కానీ మనసులో మాత్రం భయంగానే ఉంది. ఇంకొక్క రోజు సరిగ్గా గడిస్తే అన్నీ నిర్విఘ్నoగా జరిగినట్లే.
ముగ్గురికీ ముందు నెయ్యి, సున్నిపిండి రాసి ఆ తరువాత గంధం రాసి బొట్టు పెట్టి అక్షింతలు వేసాము. పిల్లలిద్దరూ కూడా బుద్దిగా కూర్చుని అన్నీ చేయించుకున్నారు.
మెడలో స్టెత్ వేసుకుని కాలేజ్ కి పరిగెత్తే వీళ్ళిద్దరినీ ఇలా చూస్తుంటే భలే గమ్మత్తుగా అనిపించింది.నలుగు పెట్టిన వారందరికీ పెళ్ళికూతురు, తోడు పెళ్ళికూతుర్లు ఇద్దరూ తాంబూలాలు ఇచ్చారు.
అత్త మామ, పిన్ని బాబాయి, నాన్నమ్మ పెళ్ళికూతురిని ఆశీర్వదించి వాళ్ళు ఇవ్వాలనుకున్న కానుకలు ఆ వేళే ఇచ్చారు. మాకైతే వాళ్ళు అందరూ ఇంత దూరం రావడమే అతి పెద్ద కానుక అనిపించింది, ఇలాంటి రోజుల్లో. పెళ్ళికి వచ్చిన బంధువులు, నలుగు పెట్టడానికి వచ్చిన ఫ్రెండ్స్ అక్షింతలు వేసి ఆశీర్వదించారు. పెళ్ళికూతురు సిగ్గు పడలేదు కాని ఆ బుజ్జి పాప సిగ్గుపడి పోయి వంచిన తల ఎత్తలేదు.
అత్తలందరూ పెళ్ళికూతురికి ఎర్ర నీళ్ళతో దిష్టి తీసారు.
ఆ కార్యక్రమం పూర్తయ్యాక స్నానం చేసి ఈ రోజు కోసమని వాళ్ళ పిన్ని ముచ్చటపడి కంచి నుండి తెచ్చిన గులాబీ రంగు పట్టు చీర కట్టుకుని వచ్చింది పెళ్ళికూతురు. కళ్యాణం బొట్టు, బుక్కన చుక్క పెట్టడంతో పెళ్ళికళ వచ్చేసింది.
బుజ్జి పండు ఈ వేడుక నంతా పెళ్ళికి రాలేని మా నాన్నకు ఇంకా దగ్గరి బంధువులకు జూమ్ లో చూపించాడు.
పెళ్ళి కుదిరే వరకూ త్వరగా కుదిరితే బావుండని అనుకున్నాను. ఇప్పటి వరకూ పెళ్ళి హడావిడిలో పెద్దగా అనిపించలేదు కానీ ఇవాళ మాత్రం కొంచెం బాధ సంతోషం కలగలిసిన భావన. చిట్టితల్లికి ఇక నుండీ తన ఇల్లు, తన సంసారం, తన లోకం తనది కాబోలు. హఠాత్తుగా మనస్సు ముప్పై ఏళ్ళ వెనక్కి వెళ్ళింది. పెళ్ళి ఏర్పాట్లు మొదలు పెట్టినప్పటి నుండీ అప్పుడప్పుడూ తొంగిచూస్తున్న జ్ఞాపకాలు ఇవాళ మూకుమ్మడిగా చుట్టుముట్టాయి. మా అమ్మ కూడా ఇలాగే అనుకుని ఉంటుంది కదూ! ఇవాళ మా ఇంట్లో జరుగుతున్న ఇలాంటి హడావిడి మా పెళ్ళి వీడియోలో ఎన్నో సార్లు చూసాను. అమ్మ, పిన్నీ వాళ్ళు, అత్తా వాళ్ళు, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ అందరి మొహాల్లో సంబరం. మా పెళ్ళి తరువాత అమ్మ ఎలా ఫీల్ అయి ఉంటుంది? తాను ఉండి ఉంటే ఆ కబుర్లన్నీ చెప్పుకునేవాళ్ళం. ఈ వేడుకలేవీ చూడకుండానే, అసలే వేడుకలూ చూడకుండానే హఠాత్తుగా వెళ్ళిపోయింది. తాను ఊహించినట్లుగా నా జీవితం మలుపు తిరిగే నాటికి తానే తిరిగి రాని దూరాలకు వెళ్ళిపోయింది. ఆపుకోలేని దుఃఖం ఆ క్షణాన నన్ను కమ్మేసింది. అమ్మ పెళ్ళిలో నాకిచ్చిన కానుకలు రూపం మార్చి అమ్మమ్మ జ్ఞాపకంగా చిట్టితల్లికి ఇచ్చాను.
****
ఒకరోజు ఏదో పెళ్ళి వీడియో చూస్తూ మనం కూడా ఇలా పెళ్ళికూతురికీ, పెళ్ళికొడుక్కీ మంగళ స్నానాలు కలిపి చేయిస్తే బావుంటుంది అనుకున్నాం. అనుకున్నదే తడవుగా పెళ్ళికొడుకు వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకుని పెరట్లో పందిరి వేసి కావల్సిన కర్టెన్స్ ఇండియా నుండి తెప్పించి చలిలో నాలుగు గంటల పాటు ఆ పందిరిని ముస్తాబు చేసారు. ఏర్పాట్లయితే చేసాము కానీ అమెరికాలో డిసెంబర్ నెలలో ఆరుబయట మంగళ స్నానాలు కుదిరేపని కాదనే నిర్ణయానికి వచ్చాం. ఆశ్చర్యంగా ఆ రోజు వాతావరణం చాలా బావుంది.
మగపెళ్ళివాళ్ళు కూడా ఆ రోజు ఉదయమే వాళ్ళింట్లో పెళ్ళికొడుకుని చేసుకుని మధ్యాహ్నం ఇక్కడకు వచ్చారు. ఇంట్లో అందరం పసుపు బట్టల్లోనూ, పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు మాత్రం అరేంజ్ కలర్ బట్టల్లోనూ ముస్తాబయ్యారు. పెళ్ళికూతురు పువ్వులతో చేసిన అభరణాలు పెట్టుకుని గమ్మత్తుగా తయారయ్యింది.
లోవ్స్ నుండి పెద్ద పెద్ద పాట్స్ తెచ్చాము కానీ, వాటిలో నీళ్ళు పోయగానే కింద ఉన్న రంధ్రం నుండి అన్నీ కారిపోయాయి. ఇలా కాదని ఇంట్లో వున్న చిన్న చిన్న బకెట్లు, చెంబులతో వేడినీళ్ళు పట్టి జల్లెడ మీదుగా పోసి మంగళ స్నానాలు చేయించాం. ఈ పువ్వులు కట్టడం పువ్వులు కలపడం అన్నీ అప్పటికప్పుడు చేసుకున్నాం.
మంగళ స్నానాల అర్థం ఏమిటంటే సిరిసంపదలతో సంతోషంగా ఉండమని ఆశీర్వదిస్తూ వధూవరుల మంగళం కోరుకుంటూ చేయిస్తారట.
నీళ్ళు చూసేసరికి పిల్లలంతా చాలా సరదా పడ్డారు.
స్నానాలవగానే మగపెళ్ళివాళ్ళంతా టీ లవీ తాగేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. పెళ్ళికూతురు ప్రదానానికి తయారయ్యేలోగా నేనూ, మా తొడికోడలు, మా మరదలు ఇంకా ఫ్రెండ్స్ కూడా ఉన్నారుగా అందరమూ కూర్చుని తలంబ్రాల బియ్యం కలిపా౦. ఈ బియ్యం కలపడానికి ఓ లెక్క ఉంటుందట. దాని ప్రకారమే కలిపాము. అప్పుడే వడికట్టు బియ్యం కూడా కలిపి ఒక టవల్ లో మూట కట్టాము.
మగపెళ్ళి వాళ్ళు ఆ సాయంత్రం ప్రదానం తీసుకుని వచ్చారు.
మామూలుగా అయితే అత్తవారు పెట్టిన చీర కట్టుకుని ఈ ఆకు వక్క తీసుకోవడం చేయాలిట. చెప్పాగా మా కంతా కొత్త పైగా పెళ్ళికొడుకు వాళ్ళకు ఇలా ప్రదానం తీసుకువచ్చే ఆచారం లేదట. వాళ్ళ వైపు ఎవరితోనైనా పంపిస్తారట. పెళ్ళికూతురు ఆ కొత్త చీర కట్టుకుని అందరికీ తాంబూలం ఇచ్చింది.
పెళ్ళికొడుకు వాళ్ళే ఇంట్లో అందరికీ రామ్ రాజ్ పంచలు, సిల్క్ చొక్కాలు తీసుకుని వచ్చారు. ఆ బ్యాక్ డ్రాప్ వెనుక కత్తులు, కొడవళ్ళు లాంటివేమీ లేవు. పామిస్ :).
ఆ రోజు రాత్రి పులిబంగరాలు(పునుగులు), మునక్కాయ టమోటో కూర, బెండకాయ వేపుడు, బీరకాయ పచ్చడి, పులిహోర, సాంబారు, అరిసెలు, మైసూర్ పాక్ లతో భోజనం చేసాము.
ఆ రోజు ఉదయం వచ్చిన ఫ్రెండ్స్ మంగళస్నానాలు అయ్యాక వెళ్తామన్న వాళ్ళు కాస్తా సాయంత్రం ప్రదానం పంచుకునే వరకు అలాగే ఉండి పోయారు. ఒకదాని తరువాత ఒకటి ఈవెంట్స్ అవుతూనే ఉన్నాయి మరి. మమ్మల్ని ఆ హడావిడిలో వదిలి వెళ్ళడానికి వాళ్ళకు కష్టంగా అనిపించిందిట.
పెళ్ళికి వచ్చిన వాళ్ళలో ఒక్కరో ఇద్దరో తప్ప అందరూ డ్రైవ్ లోనే వచ్చారు. ఫ్లైట్ లో వచ్చిన ఆ ఒకరిద్దరూ కూడా కోవిద్ టెస్ట్ చేయించుకుని వచ్చారు. ఎప్పటినుండో మా అమ్మాయి పెళ్ళికి రావాలని ఎదురుచూస్తున్న దగ్గర బంధువులు స్నేహితులు కూడా ఫ్లై చేయడం రిస్క్ అని రాలేకపోయారు. వాళ్ళు కూడా ఉంటే బావుండేదని చాలా సార్లు అనుకున్నాము.
ఇప్పటివరకూ అన్నీ అనుకొన్నవి అనుకున్నట్లుగానే జరిగాయి. పైకి అనుకోలేదు కానీ మనసులో మాత్రం భయంగానే ఉంది. ఇంకొక్క రోజు సరిగ్గా గడిస్తే అన్నీ నిర్విఘ్నoగా జరిగినట్లే.
ఇప్పటి వరకు అమెరికాలో తెలుగుపెళ్ళి, ఆచారాలు వ్యవహారాలు, పెళ్ళికి కావలసినవి, అలంకరణ, అరిసెలూ అవాంతరాలు, స్వప్నలోకం, నిశ్చయ తాంబూలాలు, మెహెందీ , సంగీత్ అంటూ తొమ్మిది రోజుల నుండీ కబుర్లు చెప్పుకుంటున్నాం. నిన్నటి కబుర్లు ఇక్కడ చదవొచ్చు.