ఇంతకు ముందు భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.
అయితే మా ఐటెనరీలో ఆ ఒక్కరాత్రిని పట్టించలేక పోయాము. రాత్రి అక్కడ ఉండకపోయినా ఫరవాలేదు ఆ ఊర్లు చూసి వద్దామని ముందు టూర్ బుక్ చేసుకున్నాం. ఫ్లోరెన్స్(Florence) నుండి చిన్క్వెటెర్రె కు నేరుగా వెళ్ళే ట్రైన్ గానీ బస్ కానీ లేదు. టూర్ వాళ్ళు మినీ బస్ లో లాస్పెట్జ్యా(La Spezia) వరకూ తీసుకుని వెళ్ళి అక్కడి నుండి చిన్క్యు టెర్రె కు లోకల్ ట్రైన్ లో తీసుకుని వెళతారట. ప్రతి ఊర్లోనూ దిగి ఊరు చూడడానికి కొంత టైమ్ ఇస్తారట. ఒక ఊరిలో కాసేపు హైకింగ్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఎక్కువ సేపు కాదు. మళ్ళీ తిరిగి రాత్రి ఏ తొమ్మిది గంటల ప్రాంతంలోనే ఫ్లోరెన్స్ కు తీసుకొచ్చేస్తారట.
మిలాన్(Milan), వెనిస్ (Venice)లలో ట్రైన్ ప్రయాణాలు, వెనిస్ లో వేపరెట్టో(Vaporetto) ఎక్కడం లాంటివి చేసాక మేము స్వంతంగా ఎక్కడికైనా వెళ్ళగలమనే నమ్మకం వచ్చి ఆ టూర్ కాన్సిల్ చేసాం. మేం చేసిన మంచి పనుల్లో అది ఒకటి. ఆన్లైన్ లో లాస్పెట్జ్యా కు టికెట్ టీసుకున్నాం కానీ ఆ ట్రైన్ నేరుగా లాస్పెట్జ్యా కు వెళ్ళదు. పీసా దగ్గర ఫ్లాట్ ఫార్మ్ మారి వేరే ట్రైన్ ఎక్కాలి. అందువలననేమో టూర్ వాళ్ళు మినీ బస్ లో తీసుకుని వెళ్ళేది. అక్కడి నుండి చిన్క్వె టెర్రెకు ట్రైన్ లో వెళితే రష్ గా ఉంటుందని ఫెర్రీలో వెళ్ళాలని అనుకున్నాము.
ఉదయం ఆరుగంటలకు ఫ్లోరెన్స్ లోని అపార్ట్ మెంట్ నుండి ట్రైన్ స్టేషన్ కు బయలుదేరితే, ముందు రోజు హడావిడి అంతా ఏమైందో పసిపాప నిద్రలేవక ముందు ఇల్లెలా ఉంటుందో అలా ఉన్నాయి ఫ్లోరెన్స్ వీధులు.
స్టేషన్ లోని కఫేలో కాఫీ, క్రొషంట్ తీసుకుని ట్రైన్ ఎక్కాము. మా పక్కన ఒక ఇరవై ఏళ్ళ అబ్బాయి కూర్చున్నాడు, తను పీసా యూనివర్సిటీలో చదువుతున్నాడట, పరీక్షలు ఉన్నాయని ఏదో రాసుకుంటూ ఉన్నాడు. మా ఎదురుగా కూర్చున్న అమ్మాయి వాళ్ళది ఫ్లోరెన్స్ దగ్గరలోని ఉన్న పల్లెటూరట, వ్యవసాయ కుటుంబం. తాను ఫ్లోరెన్స్ లో ఏదో ఆఫీస్ లో పని చేస్తోందట. తన ఫ్రెండ్ తో గడపడానికి లూకా వెళ్తోంది. తను ఇటాలియన్ లైఫ్ గురించి చెప్తుంటే భాషే తేడా కానీ అంతా మన తెలుగు వాళ్ళ జీవితంలాగే ఉంది అనుకున్నాము.
ఫోరెన్స్ నుండి పీసాకు గంట ప్రయాణం, పీసా(Pisa)లో ట్రైన్ ఆగగానే బయటకు వచ్చిచూస్తే మెమున్నదొక్కటే ఫ్లాట్ ఫారం మరొకటి కనిపించలేదు. అందరూ అక్కడ మెట్లు దిగి అండర్ గ్రౌండ్ కి వెళ్తున్నారు. మేమూ కిందకు వెళ్ళి చూస్తే అర్థం అయింది ఆ స్టేషన్ లో ప్లాట్ ఫార్మ్ మారాలంటే అండర్ గ్రౌండ్ నుండే వెళ్ళాలని. ప్లాట్ ఫార్మ్ మారి లాస్పెట్జ్యా కు వెళ్ళే ట్రైన్ ఎక్కాము. పీసా వెళ్ళినా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పీసా టవర్ చూడలేకపోయాము, ఊరిలోకి వెళితే చిన్క్యు టెర్రా చూసి వెనక్కు వచ్చే టైమ్ ఉండదని.
పీసా నుండి గంటా పదిహేను నిముషాలు ప్రయాణం తరువాత తొమ్మిదిన్నరకు లాస్పెట్జ్యా కు చేరాం. ట్రైన్ స్టేషన్ నుండి పోర్ట్ కు వెళ్తుంటే కొండ దిగుతున్నట్లుగా ఉంది, దారంతా షాప్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. ఒక్క ఇరవై నిముషాలలోనే పోర్ట్ కు చేరుకున్నాం.

మేం ఎక్కిన వెంటనే ఫెర్రీ బయలుదేరింది. లాగేరియన్ సముద్రపు గాలి చల్లగా వీస్తోంది, అక్కడక్కడా కొండల మీద ఇళ్ళు, కొండ వాలుల్లో ఊర్లు కనిపిస్తున్నాయి. ఒక్క చిన్క్యు టెర్రాలోనే కాదు, అక్కడ చాలా ఊర్లు అలా కొండ వాలుల్లోనే ఉంటాయని అర్ధం అయింది. ట్రైన్ కాకుండా ఫెర్రీ తీసుకుని మంచి పనే చేసామనిపించింది.
ఊరిలోకి వెళ్ళగానే బుల్లి షాప్స్, రెస్టరెంట్స్ లు ఉన్నాయి. ఊరిలోకి వెళ్ళడం అంటే అక్కడ ఇళ్ళ మధ్యలో తిరగడమే, ఎటువైపు వెళ్ళినా కొండ పైకి ఎక్కినట్లే ఉంది. ఆ రోజు మా లంచ్ పెస్తో ఫొకేషియా. అక్కడే పండిన బేసిల్(తులసి), ఆలివ్ ఆయిల్ లతో పేస్ట్ చేసి, అప్పుడే చేసిన బ్రెడ్ మీద ఆ పేస్ట్ వేసి, పైన చీజ్ చల్లి బేక్ చేస్తారు. అది అక్కడ పాపులర్ ఫుడ్. భోజనం అయ్యాక ఒక గంట అక్కడే గడిపి వేరే ఊరు వెళ్ళడానికి పోర్ట్ దగ్గరకు వచ్చాము.
హడావిడి అంతా ఏమైందో పసిపాప నిద్రలేవక ముందు ఇల్లెలా ఉంటుందో....
ReplyDeleteతల్లి మనసు ఎక్కడికెళ్ళినా .....
:)
అద్బుతః పీసాటవర్ వెళ్లక పోవడమా!
బావుంది
జిలేబి గారు థాంక్యు. అవునండీ, పీసా టవర్ దగ్గర కామా పెట్టాము, మరెప్పుడైనా వెళ్ళగలమేమో చూద్దాం.
Delete