Wednesday, March 20, 2013

ముఖాముఖి

"శర్కరీ"
"ఊ..."
"మల్లీశ్వరి గారు చిన్న ముఖాముఖి  ఏర్పాటుచేశారు"
"ఎవరిదీ?"
"ఎవరిదంటే..."
"తెలిసి౦ది లేవోయ్...నీదే కదూ"
"నాది కాదు మనది"
"మనదా?"
"ఆ మనదే...మన గురించి నాలుగు మాటలడిగారు"
"అన్నీ సరిగ్గా చెప్పావా లేక..."
"అబ్బే.... అడిగినవాటన్నటికీ సూటిగా సమాధానాలు చెప్పాను"
"అందరికీ చక్కని పేర్లిస్తున్నారట. నిన్నేమన్నారేమిటి?"
"'బుద్దిమంతురాలినని మెచ్చుకున్నారు"
"నీ గురించి నాకు తెలియదా...నిజంగా బుద్దిమంతురాలివే"
"   :-)  "
"సరే వచ్చినవాళ్ళకు జాజిమల్లి బ్లాగుకు దారి చూపించు" 

ఇలా ముఖాముఖి వెంట వెళ్ళామనుకోండి జాజిమల్లి బ్లాగుకు వెళ్ళొచ్చు.

రెండు మెట్లు పైకెక్కుతున్నామంటే నాలుగు మెట్లు కిందకులాగే ప్రయత్నాలు చేస్తున్న ఈ రోజుల్లో చెయ్యిపట్టి నిచ్చెన ఎక్కిస్తున్న మల్లీశ్వరి గారికి ధన్యవాదాలు తెలియజేయడం చిన్నమాటే అవుతుంది. మనసులో భావాన్ని తెలుపడానికి నాకంతకంటే పెద్దపదం తెలియదు. నన్ను పరిచయం చేస్తునందుకు మల్లీశ్వరి గారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 17 comments:

 1. అభినందనలు జ్యోతిర్మయి గారు!

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు సురేష్ గారు.

   Delete
 2. Replies
  1. ధన్యవాదాలు నారాయణస్వామి గారు.

   Delete
 3. జ్యోతిర్మయి గారూ,
  ఇంత అభిమానం తీసుకోవడానికి కూడా ఎంత మొహమాటంగా ఉందో! చేస్తోంది గోరంత అయినా కొండంత దొరుకుతున్నట్లుగా ఉంది.
  ధన్యవాదాలు.
  నారాయణ స్వామి గారు చెప్పినట్లు క్యూట్ గా రాసారు. విభిన్నంగా చెప్పాలనే తపన మీ శైలికి బలం. మీరు సాహిత్య సృజనలో మరిన్ని కొత్త కోణాలను ఆవిష్కరించాలని కోరుకుంటున్నాను. అభినందనలు
  మల్లీశ్వరి

  ReplyDelete
  Replies
  1. అది మీ మంచిమనస్సు మల్లీశ్వరి గారు. జాజిమల్లి కథలు చదివి మీ అభిమానినయ్యాను. ఈ ముఖాముఖి ద్వారా మీ పరిచయం కలగడం నా అదృష్టం. ధన్యవాదాలు.

   Delete
 4. చాలా బావుంది..

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు అర్జునరావు గారు.

   Delete
 5. అభినందనలు జ్యోతిర్మయి గారు.
  ఇంటర్వ్యూకి మీరిచ్చిన జవాబులు విభిన్నంగా చాలా చాలా బాగున్నాయి :-)

  ReplyDelete
  Replies
  1. :-) ధన్యవాదాలు వేణు గారు.

   Delete
 6. గ్రామీణ తెలుగిండ్ల కథన చాతురి కల్మి
  భాషా మతల్లికి పట్టు గొమ్మ

  తెలుగుపై మమకార మొలుకు నాలోచనన్
  పాఠశాల నడుపు పంతులమ్మ

  సునిశిత శోథనా జనిత శేముషి కల్మి
  కుదురైన రచనలన్ చదువులమ్మ

  నవ నవోన్మేష ప్రజ్ఞా విశేష ప్రక్రియల్ కల్మి
  విరిసిన ప్రతిభల విరుల కొమ్మ

  కాదు పొగిడింపు – జ్యోతమ్మ కలము లోన
  కలవు ప్రత్యేకతలు – తెల్గు కలలు మీరు ,
  భాషలో భావమున కూడి పరిఢవిల్లి
  రచన లందున తెలుగిట్లు గ్రాల వలయు .

  ReplyDelete
  Replies
  1. రాజారావు గారు నా జన్మ ధన్యమైపోయిందండి. మీ అభిమానపు జల్లులో పూర్తిగా తడిసిపోయాను. జీవితంలో ఒక్కసారైనా మిమ్మల్ని చూడాలని వుంది. అభివందనం.

   Delete
 7. మనస్ఫూర్తి అభినందనలు జ్యోతిర్మయిగారు.. మల్లీశ్వరి గారి ప్రయత్నానికి నిజంగా హ్యాట్సాఫ్...!!!

  ReplyDelete
 8. జాజిమల్లి బ్లాగ్ లో మీ ముఖాముఖి చాలా బాగా ఉందండి.మంచి ప్రయోగం.మల్లీశ్వరి గారి ప్రయత్నం అభినందనీయం.

  ReplyDelete
 9. మీ ఇంటర్వ్యూ ఎంత చక్కగా ఉందంటే, నాకు ఈర్ష్య గా అనిపించింది. ఇలాగ నేనెందుకు ఆలోచించలేక పోయానా అని.

  జాజిమల్లి గారికి కూడా థాంక్స్..

  ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.