Friday, May 18, 2012

కడుపు చించుకుంటే...

"సరోజా, నాకేం చెయ్యాలో తోచట్లేదే"
"బాధపడకే కష్టాలు మనుషులక్కాకపోతే మానులకొస్తాయా"
"నీకేం నువ్వెన్నైనా చెప్తావ్, నీదాకా వస్తే కదా తెలిసేది"
"మా అక్క కూడా ఇలాగే బాధ పడేది, ఏం చేస్తాం 'మన ప్రాప్తం ఇంతే' అని సరిపెట్టేసుకోవాలి"
"ఏం సరిపెట్టుకోవడమో నా పరిస్థితికి నా మీద నాకే జాలిగా ఉంది"
"అయ్యో అలా బాధ పడకే...కాలేజీలో 'వీరనారి' అనిపించుకున్న నువ్వేనా ఇలా కృ౦గిపోతుంది?"
"ఈ సంసారంలో పడ్డాక ధైర్యం గీర్యం కొండెక్కి కూర్చున్నయ్"
"అసలా విషయం ఎప్పుడు తెలిసిందే నీకు?"
"ఓ నెల్లాళైంది, అప్పట్నుంచీ నాలో నేనే కుములిపోతున్నానంటే నమ్ము"
"ఓ విషయం అడుగుతాను ఏం అనుకోవుగా..."
"అనుకోవడానికేం ఉంది, అయినా నీ దగ్గర నాకు దాపరికమేమిటే. అడుగూ" 
"అది తెల్లగా అందంగా ఉంటుందటగా"
"ఆ కళా కాంతి లేకుండా తెల్లగా ఉంటుంది...మా అయన దాన్ని చూసి మెరుపుతీగ అని మురిసిపోతుంటే ఒళ్ళు మండిపోతుందనుకో" 
"ఏంటీ....నీ ముందే అలా అన్నారా!"
"ఆ...నా ముందే అన్నారు."
"దాన్ని ఎలాగోలా ఒదిలించుకోలేకపోయావా?"
"ఆ ప్రయత్నమూ అయింది. నానా గడ్డీ పెట్టాక మొహం నల్లబరచుకుని ఓ రెండువారాలు౦టుంది, తరువాత మళ్ళీ మామూలే. జీవితాంతం నేను దీన్ని భరించాల్సిందేనే.. ఇలాంటి కష్టం పగవాళ్ళక్కూడా రాకూడదు బాబూ."
"ఊరుకోవే ఇంక చేసేదేముంది సర్దుకుపోవడమే.."
"ఎలానే సర్దుకునేది, ఎక్కడికెళ్ళినా నాతోనే, దాన్ని చూసి నన్ను వరసలు మార్చి పిలుస్తుంటే ఎలా తట్టుకోమంటావ్.."
"ప్చ్..కష్టమే పాప౦"
"కష్టమని చిన్నగా అంటావా..రాత్రి పగలూ అదే ఆలోచనైపోయింది, ఆ పెద్దమ్మ నా నెత్తికెక్కాక మనశ్శాంతి లేకుండా పోయింది. ఏదైతే నా ఎదటికి రాకూడదనుకున్నానో, దేన్నైతో ఎదుర్కోవడానికి ఇంత కాలం భయపడ్డానో అది దాపురించాక 'నలుగురితోపాటు నారాయణా' అని అనుకోలేకపోతున్నాను."
"పోనీ ఎవరినైనా సలహా అడుగుదామా..."
"అదీ అయింది....ఎవరికి తోచినవి వాళ్ళు చెప్పారు, అన్నీ ప్రయోగించా మహా మొండిది కదూ అంత త్వరగా వదుల్తుందా.."
"మరెలా..పోనీ మీ అత్తగారితో ఓ మాట అనక పోయావా.."
"చెప్పకుండానే ఉంటానా...దానికావిడ "మాకూ వచ్చిందమ్మా ఈ కష్టం, ఏదో గుట్టుగా నోరు మూసుకుని ఊరుకున్నాం కానీ నీలా ఇల్లెక్కి గోల పెట్టలేదు" అన్నారు.
"ఇక ఊరుకునేది లేదు" 
"ఇ౦కా వినూ....తరవత్తవాత దాని బంధుగణాన్నంతా తీసుకొస్తుందని కూడా అన్నారావిడ" 
"మనమేం చేతులు ముడుచుక్కూర్చున్నామా, అందాకా వస్తే...."
"ఆ వస్తే ఏం చెయ్యనే..."
"ఒక్క తెల్ల వెంట్రుకని ఊరుకున్నాం కానీ తలంతా వస్తే....ఎంచక్కా పార్లర్ కి వెళ్లి రంగేయించుకో, లేకపోతే హెన్నా అయినా పెట్టించుకో"
"అంతేనంటావా"
"ఆ..అంతే మరి"
        

48 comments:

 1. హ..హ..భలే పోస్టు రాశారు జ్యోతి గారు..:-)

  ReplyDelete
  Replies
  1. నాగిని గారూ :) ధన్యవాదాలు.

   Delete
 2. Replies
  1. వనజ గారూ...అన్ని స్మైలీలే మీకు బోలెడు ధన్యావాదాలండీ..

   Delete
 3. Replies
  1. ఫణీంద్ర గారూ ధన్యవాదాల౦డీ...

   Delete
 4. అబ్బో! ఎంతోటి కష్టం! పాపం కదా!

  ReplyDelete
  Replies
  1. తెలుగు భావాలు గారూ...అవును కాదా పాపం. :) ధన్యవాదాలండీ...

   Delete
 5. చివరిదాకా సస్పెన్స్ పెట్టి చంపేశారండి బాబోయ్! ప్రతి వాక్యమూ అయ్యేటప్పటికి ఒక్కో ఉహ వస్తుంది తరువాత వాక్యానికి ఇది కాదులే అని తెలుస్తుంది... :)

  ReplyDelete
  Replies
  1. భాస్కర్ గారూ స్వాగతమండీ...మీరంతా ఎంతో గుంభనంగా వ్యాఖ్యలు పెట్టారు. బోలెడు ధన్యవాదాలు.

   Delete
 6. ayyo edo chepputunaru anukunty... ela pelcharu emiti andi... hahaha

  ReplyDelete
  Replies
  1. ప్రిన్స్ గారూ చెప్పాలనుకున్నది ఆఖరికి చెప్పేశాను కదండీ... :)) ధన్యవాదాలు.

   Delete
 7. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ కేక :) భలే ప్రజంట్ చేశారండీ :) టెన్షన్ టెన్షన్ గా చదివి చివరకొచ్చేసరికి గాట్టిగా నవ్వేశాను..

  ReplyDelete
  Replies
  1. వేణు గారూ మీ కేకతో పోస్ట్ దద్దరిల్లిపోయిందండీ...కొత్త పోస్ట్ వ్రాయడానికి బోలెడు ఉత్సాహం కూడా వచ్చేసింది. మీ వ్యాఖ్య చూసి నేను దహా...ధన్యవాదాలు.

   Delete
 8. కేకలు పెట్టే ఓపిక లేదు గానీ.. చాలా చాలా బాగుంది.

  ReplyDelete
  Replies
  1. రమణ గారూ నా బ్లాగుకు స్వాగతమండీ... మీరు కేకలు పెట్టఖ్ఖర్లేదు, బావుందన్న ప్రోత్సాహం చాలు ధన్యవాదాలండీ...

   Delete
 9. జ్యోతిర్మయి గారూ..
  చదవటం మొదలుపెట్టగానే మనస్సంతా అనుమానాల పుట్ట అయ్యిందండీ కాసేపు.. కానీ ఈ మెరుపుతీగసమస్య కూడా అంత తేలిగ్గా తీసేయలేమేమోనండీ నిజంగా చిత్రహింసే :)

  ReplyDelete
  Replies
  1. రాజి గారూ మీ వ్యాఖ్య చదివితే సస్పెన్స్ ఇంకా పెరిగిపోయేలా ఉంది. మెరుపుతీగలు మెరవక ముందు బీరాలు పలుకేదాన్ని...ప్చ్ ఇప్పుడేం చేద్దాం...పైన చెప్పిన పరిష్కారమే...ధన్యవాదాలు.

   Delete
 10. త్వరలో ముగ్గుబుట్ట ప్రాప్తిరస్తు. అదేమిటో అంటారు కదండీ బ్లాండే, మొదటి మెట్టు ఎక్కారన్నమాట....దహా.

  ReplyDelete
  Replies
  1. మొదటిది కాదండీ, చాలా మెట్లే ఎక్కానండీ....ధన్యవాదాలు.

   Delete
 11. అన్ని కష్టాల్లోకీ కష్టం మనపేరు పోయి ఒక్కసారిగా ఆంటీ / అంకుల్ తాతగారూ / బామ్మగారూ అయిపోడం. కవితకైనా, రచనకైనా ఇంతటి కుతూహలం రేకెత్తేట్టు కథనాన్ని నిర్వహించడం. జ్యోతిర్మయీ అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. అంటీ అని కాకుండా పెద్దమ్మ, అత్త అంటే బావుణ్ణు...అప్పుడసలు కష్టమే అనిపించదు. పైగా ఇష్టంగా కూడా ఉంటుంది. మీ అభిమానమే నాతోడుగా ఉండి ఇవన్నీ వ్రాయిస్తుందండీ...ధన్యవాదాలు మూర్తిగారూ

   Delete
 12. Replies
  1. కృష్ణ ప్రియ గారూ చాల రోజులకు కనిపించారు..బావున్నారా?
   ధన్యవాదాలు.

   Delete
 13. Replies
  1. స్ఫురిత గారూ :)) ధన్యవాదాలు.

   Delete
 14. ఒక్క "మెరుపు తీగ" మీ లాంటి మెరుపు తీగల్ని ఎంత కలవరపెట్టగలదో చదివితే కడుపు తరుక్కు పోతోంది.దాన్నిమెరుపు తీగగా అభివర్ణించిన మీ వారిని అభినందించండి.

  ReplyDelete
 15. సినారే అంటారు
  ' ఊడిపొయే జుత్తును ఎంత ఒత్తినా ఏముందిలే
  రాలిపోయే ఆకును ఎవరాపినా ఏముందిలే '
  అలా ఉంది నీ పరిస్తితి దిగులు పడకు అమ్మడు !!..
  ప్చ్ .... ఎంత కష్టం వచ్చి పడింది
  వైద్యం కూడా తెలిసిందిగా ఇంకేం
  అయినా ఇంత దానికి అంత గాభరా పెట్టాలా

  ReplyDelete
  Replies
  1. :)). సరదాగా వ్రాశాను నాన్నా..ధన్యవాదాలు.

   Delete
 16. గోపాల కృష్ణ గారూ నమస్కారం. మీ అభినందనలు అందచేశానండీ....మా ఇరువురి తరపునా ధన్యవాదాలు.

  ReplyDelete
 17. OMG! అసలు మీకొచ్చిన ఆ కష్టమేమిటా అని ఉత్కంటతో నేను ఊపిరి కూడా తీసుకోకుండా అలా చదివేసా చివరివరకు... తీరా చూస్తే మీ తెల్ల వెంట్రుక గురించా ఈ బాధ అని నేను light తీసుకున్నా...అంతలో అలోచిస్తే అదెంత పెద్ద చిక్కో నాకర్ధం అయ్యింది. హెన్నా బెస్ట్ అని అనుభవంతో చెప్పేస్తున్నా... ఎంత బాగా రాసారో! మీకు అభినందనలు జ్యోతిగారు.

  ReplyDelete
  Replies
  1. వెన్నెల గారూ ఇంకా నయం చదవడం మధ్యలో ఆపేసి మావారి ఫోన్ నంబర్ అడగలేదు. :)). మీ సలహా పాటిస్తున్నాను. ధన్యవాదాలు.

   Delete
 18. అమ్మాయ్! తెగ భయపెట్టేసేవు కదమ్మా! కాసేపు,...వానా వానా వల్లప్పా అని... ఇంకా స్థంబాలు పట్టుకుని ఆడుకుంటున్న అమ్మాయి..... అప్పుడే.... :) :) :)

  ReplyDelete
  Replies
  1. బాబాయి గారూ ఇంకా "వానా వానా వల్లప్పా" అమ్మయినేనా... మీ దృష్టిలో నా బాల్యాన్ని చూసుకుని సంతోషంగా అనిపించింది. ధన్యవాదాలు.

   Delete
 19. నిజమే కదండీ... కష్టాలు మనుషులకు కాక మానులకి వస్తాయా!
  ఎలాగోలా భారిచాల్సిందే... "ఆంటీ గారూ" :D

  ReplyDelete
 20. ఆ..... 'ఆ౦....టీ గారా' ఇంకా నయం అమ్మమ్మ అనలా...ఎవరూ చూడకముందే ఈ వ్యాఖ్య తీసేస్తే పోలా... :))

  మీ వ్యాఖ్య భలే నచ్చేసింది మానస గారూ...ధన్యవాదాలు.

  ReplyDelete
 21. ఇలాంటి సమస్యలు మాక్కూడా ఉన్నాయండోయ్...
  :-)))))
  మంచి ప్రస్తుతి...
  @శ్రీ

  ReplyDelete
  Replies
  1. శ్రీ గారూ...ఈ కష్టాలు మీరూ పడ్డారన్నమాట..పోనీలెండి పడ్డవారెప్పుడూ చెడ్డవారు కాదు. :))
   ధన్యవాదాలు.

   Delete
 22. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్లు రాయడంలో మీకు మీరే సాటి అంటే నమ్మండి....

  ReplyDelete
  Replies
  1. మాధవి గారూ సస్పెన్స్ త్రిల్లర్ అంటారా.. :)). ధన్యవాదాలు

   Delete
 23. హ హ్హా! జ్యోతిర్మయి గారూ!
  ఉత్కంఠంగా చదువుతూ ఏంటేంటో ఊహించేస్తూ చివరిలో హాయిగా నవ్వకుండా ఉండలేక పోయాం...
  హమ్మయ్య, అందరికీ తప్పదనమాట ఈ గొడవ అయితే ఎప్పుడో ఒకప్పుడు ;)

  ReplyDelete
  Replies
  1. చిట్టి పండు గార్లను హాయిగా నవ్వించానాన్నమాట....
   నిజమేనండీ..ఇప్పుడు పిల్లలకు కూడా ఈ కష్టాలు తప్పడం లేదు. ధన్యవాదాలు.

   Delete
 24. బాగుంది మీ బాధామయ కేశ చరిత్ర విని నవ్వుకోడానికి. ;) మా నాన్న గారు మంచి స్ఫురద్రూపి - అందుకు సింహభాగమైన ఒత్తైన ఉంగరాల జుట్టులో ఒక వెండి తీగెకి ఎంత అల్లాడిపోయారో గుర్తు పెట్టుకున్నాక, నా వంతుకి బాధ పళ్ళేదు పెద్దగా! కాకపొతే, సన్నజాజి మొగ్గ 'పూసిన' తలలో గోరింట 'పండింది' - అంతే అంతే అం...తే! అని పాడుకోడానికి కాస్త సమయం పట్టింది. ఇక, పిల్లలకి ఈ షాంపూల దుష్ఫలితం పుణ్యమాని పట్టుమని పదేళ్ళు నిండకుండానే వాటి బారిన పడుతున్నారనుకోండి. :( మా పిల్లదీ మినహాయింపు కాలేదు...

  ReplyDelete
  Replies
  1. ఉష గారూ నా బాధ విని నవ్వుకుంటున్నారా...ఇదేమన్నా న్యాయంగా ఉందా... :))).
   మీరు చెప్పిన పాట ఏదో కొత్తగా ఉందే...ఆ పాట ఎక్కడిదండీ? చెప్పండి నేనూ పాడుకుంటాను.
   ధన్యవాదాలు

   Delete
 25. :)) Very nice, మీరు కుక్కపిల్ల గురించి చెప్తున్నారేమో అనుకున్నా మొదట. నాకు అవంటే చచ్చే భయం. రోడ్డు మీద కనపడితేనే రోడ్డు దాటాక కానీ నడవను ;).

  మెట్టినింట్లో మా అత్తగారికి తప్ప అందరికీ ఇష్టమే..ఏ అర్థరాత్రో మా తమ్ముడూ నేనూ వెళ్ళి మిలమిల మెరిసే కళ్ళున్న బుజ్జి కుక్క పిల్లను తెచ్చి నీ పక్కన పడుకోబెడతాం చూడంటూ భయపెడుతూ ఉంటారు :)))

  మీవీ నా కష్టాలేమో అనుకున్నా ;)- కాదన్న్నమాట- బెంగపడాల్సినవి ఇంకా ఉన్నాయని రిమైండర్ ఇచ్చారు మీరు.

  ReplyDelete
  Replies
  1. పరిష్కారం తేలిగ్గానే దొరుకుతుందిలెండి. బెంగపడవలసినదేమీ లేదు :))
   ధన్యవాదాలు మానస గారు.

   Delete
 26. మీ అత్తగారు బానే చెప్పారు .. కడుపులో దాచుకోవాలని. మరీ ఒక్క మేరుపు తీగ కోసం ఇంత మందిని భయ పెట్టారు!!!!

  ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.