మాన్యుమెంట్ వ్యాలీ(Monument Valley) నుండి అక్కడికి మూడు గంటల దూరంలో ఉన్న వైర్ పాస్ ట్రైల్ హెడ్ (Wire Pass Trailhead) కు వెళ్ళాలని బయలుదేరాము. 'పేజ్' అనే ఊరిలో లంచ్ చేసి వెళ్తూ ఉంటె దారిలో హార్స్ షూ బెండ్(Horseshoe Bend) కనిపించింది. అక్కడ కొలరాడో నది కొండ చుట్టూ తిరిగి లోయలో ప్రవహించడం చూస్తే అది గుర్రపు డెక్క ఆకారంలో కనిపిస్తుంది.
అది చూసి వెళదామని అక్కడకు వెళ్ళాము. పార్కింగ్ నుండి నది దగ్గరకు వెళ్ళాలంటే ముప్పాతిక మైలు దూరం నడవాలి. ఎక్కడా చిన్న చెట్టు నీడ లేకపోయినా అంతా దిగడమే కాబట్టి మధ్యాహ్నపు టెండ అంత ఇబ్బంది పెట్టలేదు.
 దగ్గరకు వెళ్ళాక చూస్తే కొలరాడో నది దాదాపు వెయ్యి అడుగుల లోతులో ప్రవహిస్తూ ఎర్రని కొండ మెడలో నీలాల పట్టెడ పెట్టినట్లుంది.
దగ్గరకు వెళ్ళాక చూస్తే కొలరాడో నది దాదాపు వెయ్యి అడుగుల లోతులో ప్రవహిస్తూ ఎర్రని కొండ మెడలో నీలాల పట్టెడ పెట్టినట్లుంది. 

వైర్ పాస్ ట్రైల్ హెడ్ వెళ్ళడానికి మెయిన్ రోడ్ వదిలి అడ్డదారి తీసుకునేటప్పటికి దాదాపుగా ఐదు గంటలు దాటుతోంది. అక్కడ మేము చూడాలని అనుకున్న స్లాట్ కెన్యన్(Slot Canyon)కు నడిచే వెళ్ళాలి. వెళ్ళి రావడానికి దాదాపుగా రెండు గంటలన్నా పట్టొచ్చు. ఏడారిలో సూర్యాస్తమయం తరువాత త్వరగా చీకటి పడుతుందట. చీకట్లో అటువైపు వెళ్ళడం అంత క్షేమం కాదని ఆ ప్రయత్నం మానుకుని నేరుగా జ్సయాన్ నేషనల్ పార్క్ (Zion National Park) కు వెళ్ళాలని నిర్ణయించుకున్నాము.
కొలరాడో నది అక్కడి నుండి నేరుగా గ్రాండ్ కెన్యన్(Grand Canyon)కు వెళ్తుంది. ఆ నది కారణంగానే గ్రాండ్ కెన్యన్ ఏర్పడింది. కొలరాడో నది ప్రవహించినన్ని లోయలలో మరే నదీ ప్రవహించి ఉండదేమో!
హార్స్ షూ బెండ్ నుండి పార్కింగ్ కు తిరిగి వచ్చేటప్పుడు ఎండ తీవ్రత తెలిసింది. దారిలో రెండు చోట్ల షెల్టర్స్ ఉన్నాయి కానీ, అవి పెద్దగా ఎండను ఆపడం లేదు, పైగా అంతా ఎక్కడం. హార్స్ షూ బెండ్ చూడాలంటే సూర్యోదయం కానీ, లేదా సూర్యాస్తమయం కానీ మంచి సమయం అనుకుంటూ మా ప్రయాణం కొనసాగించాము.   వైర్ పాస్ ట్రైల్ హెడ్ వెళ్ళడానికి మెయిన్ రోడ్ వదిలి అడ్డదారి తీసుకునేటప్పటికి దాదాపుగా ఐదు గంటలు దాటుతోంది. అక్కడ మేము చూడాలని అనుకున్న స్లాట్ కెన్యన్(Slot Canyon)కు నడిచే వెళ్ళాలి. వెళ్ళి రావడానికి దాదాపుగా రెండు గంటలన్నా పట్టొచ్చు. ఏడారిలో సూర్యాస్తమయం తరువాత త్వరగా చీకటి పడుతుందట. చీకట్లో అటువైపు వెళ్ళడం అంత క్షేమం కాదని ఆ ప్రయత్నం మానుకుని నేరుగా జ్సయాన్ నేషనల్ పార్క్ (Zion National Park) కు వెళ్ళాలని నిర్ణయించుకున్నాము.
మిగిలిన కబుర్లు తరువాత భాగంలో
 
No comments:
Leave your Comment
వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.