Tuesday, February 21, 2012

అమ్మమ్మ గారూ అమెరికా ప్రయాణం

       నాన్నమ్మ, తాతయ్యల మమకారాలను, వారికి వారి మనుమలకూ వుండే భాషా౦తరాలనూ, అమెరికాలో వున్న పిల్లల, పెద్దల సంఘర్షణలను, ఇతివృత్తంగా తీసికుని చేసిన ప్రయత్నమే ఈ 'అమ్మమ్మగారు అమెరికా ప్రయాణం'.

        ఓ అమ్మమ్మగారు అమెరికాలో ఉన్న మనుమరాలిని చూడడానికి వస్తారు. ప్రయాణం గురించిన కబుర్లు మనం అమ్మమ్మ మాటల్లోనే విందాం.
                                                 
అబ్బ ఏం ప్రయాణమే పరమేశ్వరుడు కనిపించాడనుకో"
"అయినా అంత పెద్ద విమానం నడిపేటప్పుడు మంఛి వంట మనిషిని పెట్టుకోనఖ్ఖర్లా"
"ఆ విమానం బాత్రూముల్లో కనీసం మగ్గులన్నా పెట్టలేదేమే. మన రైళ్ళలోనే నయం. చదవేస్తే ఉన్న మతి పోయిందని"

అమ్మమ్మగారు ఏం తెచ్చారో చూడండి. 

"ఆ ఏమి లేవు అవకాయఉసిరికాయనిమ్మకాయచితకాయ తొక్కుటొమాటో పచ్చడిఉప్పుమిరిపకాయలుకాసిని జంతికలు సున్నుడలుఅరిసెలు"

ఇండియా వెళ్లి తమతో గడపడం లేదన్న బాధతో అమ్మమ్మ వేసిన చెణుకులు

ఆ...చూసి నాలుగేళ్ళవలా ఏం గుర్తుపడతార్లేఆ..అ వచ్చినప్పుడు కూడా షాపింగులనీ , చుట్టాలనీగుళ్లనీ, గోపురాలని తిరుగుతూనే వుంటారాయె."

పిల్లలు కోసం పెద్దల ఆరాటం....వారి మధ్య అడ్డుగోడగా నిలిచిన భాష గురించి బాధతో అమ్మమ్మ గారు ఏమన్నారంటే 

"రెండు నెల్లున్నారమ్మా... అయినా అలవాటే అవలా. ఆ శాంతమ్మవాళ్ళాయన ఆ పిల్లల కోసం కళ్ళలో ఒత్తులేసుకుని ఎదురు చూశారంటే నమ్ము. ఒక్కగానొక్క కూతురాయ."
"అందుకే మరి చిన్నప్పట్నుంచి మన భాష నేర్పితే ఈ రోజు ఈ పరిస్థితి రాదుగా. అమ్మమ్మలునాన్నమ్మలు అనుకున్నప్పుడల్లా వీళ్ళని చూడలేరు. చూసినప్పుడన్నా కరువుతీరా కబుర్లు చెప్పుకోవద్దా."

నాటికలో కొత్త పాత్రల ప్రవేశం. వాళ్ళెవరో ఎక్కడికెళ్ళొచ్చారో చూద్దాం.  

 నళిని : కోల్స్ నుంచి 10 డాలర్స్ ఫ్రీ కూపన్ వచ్చిందని వెళ్ళాం. 
రాధిక : ఓ దానికోసం వెళ్ళారా ఏం కొన్నరేమిటి?
నళిని : ఓ 2పిక్చర్ ఫ్రేములురెండు కార్పెట్లు కొన్నాం.
రాధిక : ఏమిటీ 10 డాలర్స్ కే అన్నొచ్చాయా?
కావేరి: కాదులే బావున్నాయని కొన్నా౦.

టీనేజ్ పిల్లలకు పెద్దలకు మధ్య సంఘర్షణ. 

"ఇంట్లో ఏం వండినా" I don't like this" అంటారు. పోనీ ఏం కావాలో చెప్తారా అంటే అదీ లేదూ. ఒక్కోసారి స్కూల్ నుండి రావడం రావడమే "mom we need to go to staples" అని ఒకటే హడావిడి. వీకెండ్ దాకా ఆగమంటే కుదరదేస్టౌ మీద కూర సగంలో ఆపేసి అలా ఎన్ని సార్లు షాపులకి పరిగెత్తానో..."

వాళ్ళ సమస్యలు విని అమ్మమ్మ ......

"అది మీ మనసులలో ఉన్న సంఘర్షణ కావేరీ. మీరు ఊహించుకున్న జీవితం వేరు. ఇక్కడ మీరేదుర్కుంటున్న పరిస్తితులు వేరు. అందుకే అన్ని సుఖాలు అందుబాటులో వున్నా మీకు జీవితం వెలితిగానే అనిపిస్తుంది."
"వాళ్ళకు మన౦ ఇంట్లో చెప్తున్నవి వేరు బయట వాళ్ళు చూస్తున్నవి వేరు. ఈ సంఘర్షణలో వాళ్ళు నలిగిపోతూ వుంటారు. అది అర్ధం చేసికొని మసలుకోమంటున్నా"
  
తెలుగు నేర్చుకోవాలన్న సరదా....రోజుకు పదిగంటలు ఇంగ్లీష్ ప్రంపంచంలో మెలగాల్సిన పరిస్థితులు...ఇక వాళ్ళ తెంగ్లీషు..

"మను: రేపు కూడా యేవో ప్రాక్టీసులున్నైకాని మానేసి వచ్చేశా౦"
అమ్మమ్మ: రేపు మానెయ్యడమేమిట్రా ?
శ్రీకర్: రేపు కాదురా ఇవాళ. ఇ...వా...ళ. వీడు ఈ మధ్యే తెలుగు నేర్చుకు౦టున్నాడు జేజమ్మా?
మను: ఓకే...ఓకే.... ఈవల.

అమ్మమ్మ గారు, పిల్లలకు పెద్దలకు మధ్య సారధ్యం వహించి పెద్దరికంతో సలహాలిస్తారు. అదండీ కథ. 
మొదటి భాగం 
రెండొవ భాగం 

       ఎప్పుడో విన్న కవితను కొంచెం మార్చి ఓ కవిత వ్రాసి ఈ నాటికలో ఒక పాత్రతో చెప్పించాను. కవి/కవయిత్రి అనుమతి తీసుకోవాలంటే ఎక్కడ ఎప్పుడు చదివానో గుర్తులేదు. ఈ నాటికను ఆదరించిన మా ఊరివాళ్ళకు, నాటికలను ప్రోత్సహిస్తున్న మా తెలుగు అసోసియేషన్ కు, స్ఫూర్తిదాయకమైన కవితను వ్రాసిన కవి/కవయిత్రికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకు౦టున్నాను. 




17 comments:

  1. Quite interesting. very good

    ReplyDelete
  2. అమ్మమ్మగారూ అమెరికా ప్రయాణం బాగుందండి .ఇందులోమీరు కూడా ఏదైనా పాత్ర వేసారా ?

    అభినందనలు .

    ReplyDelete
  3. నేను ఇప్పుడు ఒక్క మాట మాత్రమే చెప్పగలను... కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ కేక.. అమ్మమ్మగారైతే నాకు తెగ నచ్చేసారు..

    ReplyDelete
  4. చాలా బాగుందండీ! నిజంగా విదేశాలలో ఉన్న పిల్లలకి అమ్మమ్మ-తాతయ్యలతో..వారి భాషలో మాట్లాడే వెసులు ఉందా? నిన్ననే మేము ఈ విషయం చర్చించుకున్నాం.పెద్దలు ఉన్నప్పుడు ఆ ఇంటికి ఉన్న బరోసానే వేరు. భిన్న సంస్కృతులలో.. పిల్లలు నలుగుతూ.. కేవలం మన పిల్లలుగా మేలగాగాల్గాలి అంటే..చాలా కష్టమేమో.. విదేశాలలో ఉన్న తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయమే కదా!. అందుకే మాతృ భాషని చిన్నప్పటి నుండి నేర్పడం అవసరం . మంచి పోస్ట్ వ్రాసారు. నాకు బాగా నచ్చింది.

    ReplyDelete
  5. 'అమ్మమ్మ' గారి పాత్ర - ఏదన్నా నిజ సంఘటన ప్రేరణా లేక కాల్పనికమా? నిజంగా అంత అమాయకంగా ఉంటారటండి? ఇప్పుడు లేరు కానీ, మా అమ్మ fork తో దోశ తినటం ఇప్పటికీ నాకు గుర్తు. ఈ నాటికీ నాకు fork తో దోశ తినటం రాదు.

    ReplyDelete
  6. మాతృదేశానికి దూరంగా వున్నా మాతృభాష మీద మీకున్న మమకారం మెచ్చుకోదగింది. విదేశాలలో పెరుగుతున్నపిల్లలు ఇంటా బయటా ఎదుర్కుంటున్న ఇబ్బందులు అన్నీ కూడా అమ్మమ్మ మాటల్లో చాలా బాగా చెప్పేరు.. అభినందనలు...

    ReplyDelete
  7. చాలా బాగుంది అండి జ్యోతిర్మయి గారు.. మీరు దర్శకత్వం కూడా చేస్తారా? బాగా తీశారు అండి మీకు మా అభినందనలు.. మీరు ఇలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసి మాతో పంచుకోవాలి ఆశిస్తున్నాము..

    ReplyDelete
  8. జ్యోతిర్మాయీ గారు,

    చాలా బాగా రాసారండీ నాటిక!

    ఇక బుడతల అందరి నటన అమోఘం !

    అమ్మమ్మ గారు, అమ్మాయి, మిత్రులు అందరూ తమ తమ ప్రత్యేకమైన శైలి లో మాటల పద విరుపు బాగా చేసారు. !!

    కీప్ ఇట అప్ !

    నాటిక వీడియో తరువాయి వాయిస్ ఓవర్ చేసారా? (ఆడియో నాయిస్ లేకుండా క్లియర్ గాఉంది - కొంత వాయిస్ లేగ్ వున్నా అది మీ వచ్చే నాటికల్లో సరి దిద్దు కోవచ్చు కొంత లేగ్ పెట్టి అనుకుంటాను - ఎవరైనా ఆడియో మిక్సింగ్ తెకినీకులు తెలిసిన వారు దాన్ని సరి చేయ్యగాలరనుకుంటాను)


    త్రీ చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  9. @ బాబాయ్ గారూ ధన్యవాదాలు.

    @ మాలాకుమార్ గారూ మీకు నచ్చినందుకు చాలా సంతోషం. నేను కూడా ఉన్నానండీ అందులో..ధన్యవాదాలు.

    @ సుభా అబ్బ అంత పెద్ద కేక పెట్టావు దడుచుకున్నాను.
    అమ్మమ్మగారికి ఆ విషయం చెప్తాను. ధన్యవాదాలు.

    ReplyDelete
  10. ఇది చాలామంది అమ్మమ్మల, తాతయ్య ల మనసులకు ప్రతిబింబం. బాగుందండి.

    ReplyDelete
  11. ఏమండోయ్,

    బుజ్జి పండు తెలుగు చదువు శ్రీ శంకర విజయం నాటిక వేయించండి మీ పిల్లల చేత రాబోయే ఉగాది కి !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  12. @ వనజగారూ విదేశాలలో ఉన్నా అమ్మమ్మ తాతయ్యలతో రోజుకోకసారి ఫోన్ లో మాట్లాడే పిల్లలు ఉన్నారండీ. భిన్న సంస్కృతులతో పెరుగుతున్నప్పటికీ ఇక్కడ చుట్టూ తెలుగు వారు ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల ఆ తేడా పెద్దగా ఉండడం లేదు. ఇక భాష విషయంలో చిన్నతనంలోనే శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధన్యవాదాలు.

    @ తెలుగు భావాలు గారూ అమ్మమ్మ పాత్ర కల్పితమేనండీ..ధన్యవాదాలు.

    @ శ్రీలలిత్ గారూ అది మన భాష కదండీ మరి. మీకు నచ్చినందుకు చాలా సంతోషం ధన్యవాదాలు.

    ReplyDelete
  13. @ బాలూ(తెలుగు పాటలు)గారూ మీ పేరు ఈ మధ్యనే తెలిసింది. నేను రాసినది పత్రికకు వెళ్ళక ముందు తెరమీదకే వెళ్లి౦దండీ. ఇంకో మూడు నాటికలు కూడా బ్లాగులో ఉన్నాయి.రెండు పిల్లలతో వేయించినవి ఒకటి పెద్దవాళ్ళు వేసినది. మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

    @ మాధవి గారూ బో........లెడు ధన్యవాదాలు.

    ReplyDelete
  14. @ జిలేబిగారూ మీ మాట అందులో నటించినవాళ్ళ౦దరికీ చెప్పాను. చాలా సంతోషపడ్డారు. నాటిక వాయిస్ ముందు రికార్డ్ చేసి నాటిక వేశామండీ. స్టేజి మీద డయలాగ్స్ చెప్పడానికి మైకు పట్టుకుంటే నటన సరిగ్గా ఉండడం లేదు. అందువల్ల కూడా ఆ సమస్య వచ్చివుంటుంది. మీకు నచ్చినందుకు చాలా సంతోషం ధన్యవాదాలు.

    @ శ్యామలీయ౦ గారూ స్వాగతమండీ..మీ లాంటి పెద్దలు బావుందన్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  15. @ బాలూగారూ నాటిక చూసిన తల్లిదండ్రులు ఈ సమస్య గురించి అలోచించి తగిన చర్య తీసుకుంటే నాటిక ప్రయోజనం ఫలించినట్లే. ధన్యవాదాలు.

    @ అజ్ఞాత గారూ మీ పేరు చెపితే బావుండేది. మంచి సలహా ఇచ్చారు. ధన్యవాదాలు.

    @ శైలజ గారూ ధన్యవాదాలు.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.