ఇది నిజమా..నిజంగానేనా, నిజంగా నేనేనా...ఏమిటో కొత్తకొత్తగా... వింతగా... కొండంత ఆనంద౦, ఒకింత ఆశ్చర్యంతో కలసి ఈ చిన్న మదిలో సందడి చేస్తోంది..
ఈ ఆకాశం ఇంత నీలంగా, నిర్మలంగా ఉందేవిటి...వెండి మబ్బులు ముసిముసి నవ్వులు రువ్వుతూ వెళుతున్నట్లుగా లేవూ...చల్లగాలి మరింత హాయిగా వీస్తోంది. రోజూ చూసే ఈ మందారం ఇవాళ మరింత అందంగా పూసిందే...ఆ రావి చెట్టు ఆకులన్నీ వింత నాట్యం చేస్తున్నట్లుగా ఎలా ఊగుతున్నాయో...గోడమీద కాలెండర్ మీదన్న బోసినవ్వుల పసి పాపలను చూస్తోంటే కలిగిన పరవశం, మది దాటి అంబరాన ఇంద్రధనస్సై మెరిసింది.
ఆ నాటి ఆ ఆనందం విహంగమై ఎగురి విహ౦గలో వాలింది.
నా కవిత ప్రచురించిన విహంగ సంపాదకులకు బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఈ ఆకాశం ఇంత నీలంగా, నిర్మలంగా ఉందేవిటి...వెండి మబ్బులు ముసిముసి నవ్వులు రువ్వుతూ వెళుతున్నట్లుగా లేవూ...చల్లగాలి మరింత హాయిగా వీస్తోంది. రోజూ చూసే ఈ మందారం ఇవాళ మరింత అందంగా పూసిందే...ఆ రావి చెట్టు ఆకులన్నీ వింత నాట్యం చేస్తున్నట్లుగా ఎలా ఊగుతున్నాయో...గోడమీద కాలెండర్ మీదన్న బోసినవ్వుల పసి పాపలను చూస్తోంటే కలిగిన పరవశం, మది దాటి అంబరాన ఇంద్రధనస్సై మెరిసింది.
ఆ నాటి ఆ ఆనందం విహంగమై ఎగురి విహ౦గలో వాలింది.
నా కవిత ప్రచురించిన విహంగ సంపాదకులకు బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
మధురమైన సంగతేదో
ఎదనుచేరి మురిసింది!
ఎన్నడూ ఎరుగనిది
ఏమిటో ఈ భావం!
నన్ను నాకే కొత్తగ చూపే
ఓ వింత యోగం!
నీటిని తనలో నింపుకున్న
నీలిమేఘపు పరవశమా!
చినుకు బరువును మోసే వేళ
ముత్తెపుచిప్ప తన్మయమా!
అంకురాన్ని దాచుకున్న
తొలిబీజపు మైమరుపా!
కొత్త చివురులు తొడుగుతున్న
హరిద్రువపు పులకి౦తా!
మది దాగని భావమొకటి
పెదవిన పువ్వై విరిసింది!
ఒడినిండే సంబరమేదో
అ౦బరమై నిలిచింది!!
జ్యోతిర్మయి గారూ.. నీలిమేఘం వర్షించినఫ్ఫటి నుండి పువ్వులు విచ్చేదాకా ప్రకృతి లోని అందాలను చక్కగా వర్ణించారండీ..
ReplyDeleteమీ అంబరాన్నంటిన ఆనందాన్ని చూస్తుంటే నాకు కూడా సంతోషంగా వుంది..అభినందనలు..
అభినందనలండి .
ReplyDeleteబాగుంది. అభినందనలు జ్యోతిర్మయి గారు.
ReplyDeleteరాజి గారూ, మాలాకుమార్, సురేష్ గారూ ధన్యవాదాలు.
ReplyDeleteఆనందం! పరమానందం!!అభినందనలు!!!.
ReplyDeleteధన్యవాదాలు బాబాయిగారూ..
ReplyDeleteఆశ్చర్యమెందుకు... పరవశమై అంబరమంటిన మీ ఆనందమంత అభినందన మీకు.
ReplyDeleteజయగారూ భద్రంగా దాగిన ఆనాటి అనుభూతి, ఈనాడు కవితై అలరించింది. మీ వ్యాఖ్యలతో అప్పటి ఆనందాన్ని మళ్ళీ చవిచూసాను. ధన్యవాదాలు.
ReplyDeleteచాలా బాగుంది జ్యోతిర్మయిగారు
ReplyDeleteధన్యవాదాలు వెన్నెల గారూ..
ReplyDeleteజ్యోతిర్మయి గారు, చాలా ముచ్చటగా రాస్తున్నారు. ఇలాగే తాజాదనపు గుభాళింపులో మీ శర్కరి చక్కని సాహిత్య విందులు చేయాలని ఆశిస్తున్నాను. అలాగని బ్లాగు అన్నది పూర్తిగా ఐచ్చికమైనది అన్న స్పృహ ఎపుడూ విడవను సుమా! :) ఈ క్రింది మాటలు బ్లాగు సాహిత్యానికి మీరింకా దోహదపడాలన్న అభిమానంతో చెప్తున్నవే...
ReplyDeleteఇక, వ్యక్తిగతంగా నేను నమ్మేవివి. - ప్రశంస పన్నీరువంటిది జల్లుకోవటానికే కానీ దాహార్తిని తీర్చలేదు. పొగడ్తలు అగడ్తలు. ఇవి జగద్విదితమైన సత్యాలు. అభిప్రాయాలు మంచివే అయినా, రాతలకి ఆదరణ అందమే అని అంగీకరించినా - నా కవితలు, రచనలని గూర్చి ఇదివరలో ఇలా రాసుకున్నాను "నా మనసు స్పందనని తానే వెలికి తెచ్చుకుంటుంది. నాకోసమే నేను వ్రాసుకుంటాను. అవి చదివి మెచ్చే మరో మనసుంటే దానికి ఓ సార్థకత, అలాగని అదే నా కవితలకి భవిత కాదు."
మీ రచనలకి వస్తున్న ఆదరణకి అభినందనలు. అన్నట్లు మీ తొలి రచన "వాహిని" లో ప్రచారణ అని రాసారు. ఆ పత్రిక వివరాలిస్తారా? సిడ్నీ తెలుగువాహిని కావచ్చా అన్న ఆలోచన తో అడుగుతున్నాను.
ఉష గారూ నేను బ్లాగులో రాస్తున్నవి మీకు నచ్చుతున్నందుకు చాలా సంతోషం. మీరు అభిమాన౦తో చెప్పిన మాటలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నా మనసు దారి మళ్ళినరోజు మీ మాటలు నా మార్గాన్ని నాకు గుర్తుచేస్తాయి. ధన్యవాదాలు.
ReplyDeleteనా కథ ప్రచురితమైనది ఆస్ట్రేలియా 'వాహిని'లో కాదండీ. మా ఊరి 'వాహిని'లో. ఆ పత్రిక లింక్ ఇస్తున్నాను.
http://www.tagca.info/resources/vaahini/Dasara-Diwali-2010.pdf
nice expressions
ReplyDeleteధన్యవాదాలు ఫణీంద్ర గారూ..
ReplyDeletewow...congrats!
ReplyDeleteధన్యవాదాలు సౌమ్య గారూ..
ReplyDelete