మధ్యాహ్నం అన్న౦ తిన్నాక నేనూ, అక్కా వరండాలో మెట్ల మీద కూర్చున్నాం. ఇంతకూ అక్కెవరో చెప్పలేదు కదూ.. తాతయ్యకు తెలిసినవాళ్లమ్మాయి, వాళ్ళ ఊరిలో కాలేజి లేదట. అక్కేమో "నేనింకా చదువుకుంటానంటే", వాళ్ళవాళ్ళేమో "చదివింది జాల్లే నువ్వేం ఉద్యోగాల్జేసి ఊళ్లేలబళ్లా, ఇంట్లోనే వుండి, ఆ పొయ్యికాడ కాస్త ఎగదోస్తా ఉండు, మంచి సంబంధం జూసి పెళ్లి జేస్తాం" అన్నారంట. పాపం అక్కకేమో డాక్టర్ అవ్వాలని కోరికట, అన్నం నీళ్ళు మాని ఏడుస్తూ వుంటే వాళ్ళ అన్నయ్య ఏదో పనుండి నెల్లూరికి వచ్చి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఈ విషయం చెప్పాడంట.
అప్పుడు తాతయ్య, "చదువు మీద అంత శ్రద్ద వున్న అమ్మాయిని మాన్పి౦చొద్దు నారాయణా" అన్నారంట. దానికి వాళ్ళ అన్నయ్య, "ఆడపిల్లకు చదువెందుకులే పెదనాయనా, పైగా మా ఊళ్ళో కాలేజీ లాకపోయ పక్కూరికాలేజీకి రోజూ రెండు మైళ్ళు నడిచిపోవాలి. ఆ కాలేజీలో పోకిరీ పిలకాయలంతా వుంటారు, ఆడపిల్లని అ౦దూరం పంపేదెట్టా" అన్నాడంట. అప్పుడు అమ్మమ్మ "నెల్లూరికి దీసకరా నారాయణా డికేడబ్యూ కాలేజీలో జేర్పిద్దాము, అది ఆడపిలకాయల కాలేజీయేలే" అని చెప్పిందట". "ఆస్టల్లో ఉంచాలంటే శానా కర్చవుతాదిలేమ్మా. మంచి సంబందం ఉంటే చూడండి పెళ్లి చేద్దాము" అని మనసులో మాట చెప్పాడంట. "ఆస్టల్లో బెట్టడం ఎందుకా.. మా ఇంట్లో ఉంటదిలే నాయనా" అన్నదటమ్మమ్మ. "ఎందుకులేమ్మా మీకు ఇబ్బందా" అన్నాడట అన్నయ్య. "ఇబ్బందేముందా మా పిల్లకాయల్తో పాటే వుంటది, కావాల్సినంత చదువుకోనీ" అన్నదట. ఆ విధంగా ఆ అక్క కూడా మా అమ్మమ్మకి ఇంకో కూతురైపోయింది.
వరండాలో కూర్చున్నామా, ఎండ మండిపోతూ ఉంది. వీధీలో అప్పుడో రిక్షా, ఇప్పుడో రిక్షా మాత్రం వెళుతూ వున్నాయి, రిక్షాకి గూడు ఉండడం వల్ల లోపలున్నదెవరో కనిపించడం లేదు. ఇంతలో లోపలనుండి పిన్ని పైట చెంగు బొడ్లో దోపుకు౦టూ వచ్చి స్థంబానికి ఆనుకుని కూర్చుంది. "అక్కా, కావేరిలో చిరంజీవి సినిమా ఆడతందట పోదామా" పిన్నినడిగింది అక్క. "నిన్ననే సినిమా జూసొస్తిమే, అమ్మొప్పుకుంటదా?" పిన్ని సందేహం. "జ్యోతినడగమందాం, అప్పుడయితే అమ్మేమ౦దు." అక్క సలహా. "నేనిప్పుడే వెళ్లి అమ్మమ్మనడిగొస్తా" అంటూ చెంగున లేచాను. పిన్ని చెయ్యిపట్టుకుని ఆపి, "ఈ వారం అప్పుడే రెండు సినిమాలు జూశాం. ఇప్పుడడిగితే అమ్మ సినిమా గినిమా యేంలా, గమ్మున గూసోండి. సినిమా లెక్కువైపోతున్నయ్ మీకు" అని అరుస్తుంది. రేపు పనంతా చేసి అప్పుడడుగుదాం, మద్యాన్నం మాట్నీకి వెళ్ళొచ్చు" అని ఉపాయం చెప్పింది.
ఇంతలో "ఐస్, పాలైస్...ఐస్, పాలైస్...చల్లైస్" అని అరుపులు వినిపించాయి. రయ్యిన లోపలకు పరిగెత్తాను. అమ్మమ్మ చాపమీద పడుకుని 'ఆంధ్రజ్యోతి' పత్రిక చదువుతోంది. "అమ్మమ్మా..అమ్మమ్మా" పిలిచాను. "ఏమ్మా" అడిగింది, చుదువుతున్న దగ్గర మధ్యలో వేలు పెట్టి, పత్రికను మొహం మీదనుండి తీస్తూ. "ఐస్" అడిగాను. "పోపుల డబ్బాలో ముప్పావలా ఉంది, ఓ పావలా తీసుకొని కొనుక్కో౦డి అంది. కొట్టుగది దాటి వంటి౦ట్లోకి వెళ్లి అరలో ఉన్న పోపులడబ్బా జాగ్రత్తగా కింద పెట్టి మూతతీస్తే మిరపకాయల ప్లేట్ కనిపించింది. అది కూడా తీస్తే మెంతుల గిన్నెలో రెండు పావలాలు, రెండు పదిపైసళ్ళూ, చతురస్రాకారంలో వున్న ఒక ఐదు పైసలు కనిపించాయి. అందులోనుండి పావలా మాత్రం తీసుకుని మళ్ళీ జాగ్రత్తగా డబ్బా పైన పెట్టి, ఒక్కుదటన పరిగెత్తి గడపలు దాటుకుంటూ వరండాలోకి వచ్చాను. అప్పటికే ఐసబ్బాయి వచ్చిమా ఇంటిముందే బండి ఆపి నిలుచున్నాడు. ఆ అబ్బాయికి మేం కొంటావని తెలుసుగా మరీ..
తెల్లడబ్బా పైన మూత , లాగడానికి వీలుగా డబ్బాకి రెండు కర్రలు, డబ్బా కింద నాలుగు చక్రాలు వున్న ఐసుబండిని చూడగానే నాకు హిమాలయాలను చూసినంత చల్లగా హాయిగా అనిపించింది. బ౦డి దగ్గరకు వెళ్లాను. "యేమైసు కావాల పాపా"అడిగాడు బండెబ్బాయ్. ఒక ద్రాక్షైసు, పాలైసు, సబ్జా ఐసు చెప్పాను. మూత తీసి ఊదా ఐసొకటి, తెల్లైసొకటి, తెల్లగా వుండి చివర సబ్జాలున్న ఐసొకటి ఇచ్చాడు. ఒక చేతిలో రెండు ఐసులు పట్టుకుని రెండో చేతిలో ఉన్న ఐసు చీకుతూ లోపలకు వచ్చి పిన్నివాళ్ళకు ఐసులిచ్చాను. అమ్మమ్మకు కొనలేదు. "పళ్ళు జిల్లుమంటాయమ్మా ఐసు తింటే' అని ఐసు తినదు. కొద్దిసేపటికి చేతిమీదుగా ఐసునీళ్ళు కారడం మొదలెట్టాయి. తలపైకెత్తి నీళ్ళు కిందపడకుండా తిన్నాను, ఎంతసేపని తింటాం మెడ నొప్పిపుట్టి ఐసు మొత్తం కొరుక్కుని తినేశాను.
ఆ రోజు రాత్రి మిద్దెమీద పడుకున్నప్పుడు రేపటి ప్రణాళిక సిద్దం చేసుకున్నాం. తెల్లవారి నేను లేచేసరికి పక్కన ఎవరూ లేరు, గబగబా పరుపు మడిచేసి కిందకు వెళ్లాను. జలదాట్లో గిన్నెలు తోమేస్తూ పిన్ని, భావిలో నీళ్ళు తోడి గంగాళంలో పోస్తూ అక్క కనిపించారు. నేను మొహం కడుక్కుని వచ్చేసరికి వాళ్ళిద్దరూ గిన్నెలు కడగడం అయిపొయింది. తోమిన గిన్నెలన్నీ వంటి౦ట్లో పెట్టాను. అమ్మమ్మ ఇచ్చిన కాఫీలు అందరికీ ఇచ్చేసి, ఇక ఆ రోజుకి పనిమనిషి రాదని తెలుసుకుని, పెద్దమూట బట్టలు ఉతికేసి, ఇళ్ళూ, వాకిళ్ళూ ఊడ్చేసి, పచ్చడ్లూ, అవీ చేసేసి, మంచి నీళ్ళూ అవీ తెచ్చేసి, అమ్మమ్మ చెప్పిన పన్లూ, చెప్పని పన్లూ అన్నీ చేసి మధ్యాహ్నానికల్లా పనంతా అవగొట్టేశాం. బుద్దిగా అన్నాలు తినేసి, ఒంటిగంటకల్లా వంటిల్లు కూడా శుభ్రం చేశాం.
అప్పుడు పిన్ని, "మా మా సినిమాకెల్తాం మా..." అన్నది. "మొన్ననే గదనే అదేదో సినిమాకు బొయినారు, ఇట్టా రోజు సినిమా అంటే మీ బాబరస్తాడు" అన్నది. "పనంతా జేశా౦ గదమా ఇంక వారం దాకా అడగం మా, చిర౦జీవి సినిమా మా" బతిమలాడింది పిన్ని. "నా దగ్గర ఐదు రూపాయలే ఉండాయి, మీకు టికెట్లకు చాలవు" కొద్దిగా కరిగింది అమ్మమ్మ. "మిగతా డబ్బులు నాదగ్గరున్నయ్ మా" అని అమ్మమ్మతో అని "పాపా బట్టలు మార్చుకు౦దా౦రా" అని హడావిడిగా లోపలకు వెళ్ళింది పిన్ని. అక్కడే ఉంటే మా దగ్గర ఎన్ని డబ్బులు వున్నాయో అమ్మమ్మకు చెప్పేస్తానని పిన్ని భయం. అయిదంటే అయిదే నిముషాలలో రెడీ అయి, "మా పొయ్యొస్తాం" అమ్మమ్మతో చెప్పింది అక్క. "కాస్త తాలండి ఏదైనా రిక్షా వస్తుందేమో జూస్తా ఉండండి. ఎండ మండిపోతా ఉంది, ఈ ఎండలో నడిస్తే వడదెబ్బ తగల్తది" హెచ్చరించింది అమ్మమ్మ. "సినిమాకు టైం అవతావుందిమా, వీధి చివర ఎక్కుతాంలే" అని అమ్మమ్మతో చెప్పి బయటపడ్డాం.
వీధి చివర చెట్టుకింద ఓ రెండు రిక్షాలు ఆగి ఉన్నాయ్. "పిన్నీ రిక్షా ఎక్కుదాం రా" రిక్షా వైపు వెళ్ళబోయాను. పిన్ని ఆపి "మనదగ్గర డబ్బులు లేవు పాపా త్వరగా నడువ్, లేకపోతే టికెట్లు దొరకవు" అంది. ఆ నడి వేసవిలో, మధ్యాహ్నం పూట ఎర్రటి ఎండలో నడుస్తూ, నడుస్తూ ఏమిటిలెండి దాదాపుగా పరిగెడుతూ రైలు పట్టాలు దాటి, మూడు హాళ్ళకెళ్ళి సినిమా చూశాం.

ఓ సారి పిన్ని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికని బయలుదేరి నర్తకి థియేటర్ కి వెళ్ళాం. అక్కడికే వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది. ఝామ్మని సినిమా చూశాము, ఈ ఏర్పాట౦తా మా పిన్ని కుట్ర..ఒట్టు నాకస్సలు తెలీదు. సినిమా చూసి ఇంటికొచ్చామా ఇంటి నిండా మనుషులున్నారు. మా పెద్ద పిన్ని, "మంచి వాసనొస్తావుంది యేడా" అనగానే మా పై ప్రాణాలు పైనే పొయ్యాయి. గబగబా లోపలికి పొయ్యి బట్టలు మార్చుకుని వచ్చాం. నర్తకి హాలు ఆ వారమే మొదలయ్యింది. ఎసిలో మంచి వాసన ఒచ్చే పెర్ఫ్యూం ఏదో కలిపినట్లున్నారు, ఇంటికొచ్చాక కూడా మా బట్టలు అవే వాసనలొస్తూ ఉన్నాయి. లీలామోహన్ కెళితే మాత్రం వస్తూ సుండలు కొనుక్కుని ఇంటికొచ్చి తినేవాళ్ళం. మరి వీధిలో తినకూడదు కదా...
అలా నెల్లూరులో ఎన్నో సినిమాలు చాశాం, ముఖ్యంగా కృష్ణా, కావేరీ, కళ్యాణీలలో. ఆ సినిమాలన్నీ అద్భుతంగా అనిపించేవి. తరవాత్తరత ఎన్నో థియేటర్లలో ఎన్నో సినిమాలు చూసినా అప్పటి ఆ అనుభవాలు మాత్రం పదిలంగా వుండిపోయాయి.

idi intaku mundu chadivina ani gurthu undhi.. nijamena andi
ReplyDeleteపుల్ల ఐసు(మేమలాగే అనే వాళ్ళం) తింటూ మిట్ట మధ్యాహ్నం హాల్లో సినిమా చూసిన అనుభూతి కలిగిందండీ మీ టపా చదువుతూ వుంటే...నిజవే...చిన్నప్పుడు ఏ సినిమా చూసినా అద్భుతం గానే అనిపించేది...
ReplyDelete@ తెలుగు పాటలు గారూ ఇంతకుముందే చదివారా..నా బ్లాగ్ చదివి చదివి నా మనసులో అనుకున్నవి కూడా తెలిసిపోతున్నాయా ఏమిటి..ఇవాళే వ్రాశానండీ..ఇంతకూ మీకు నచ్చిందో లేదో చెప్పలేదు. ధన్యవాదాలు.
ReplyDelete@ స్ఫురితగారూ 'పుల్లైసు' బాగా గుర్తుచేశారు. మామూ అలాగే అనేవాళ్ళం. మధ్యాహం వేళ సినిమా చూపించానంటారు. ధన్యవాదాలు.
హలో అండి జ్యోతి గారు... మీరు ఐసులు గురించి చెపినవన్నీ చాలా నిజం అన్దీ... ఆ సబ్జా ఐసు నా కిష్టం :) కష్టపడి సినిమా లు చూసిన ఆ రోజులే బావున్నాయి అనిపిస్తుంది నాకు ... :)very nice memories..
ReplyDelete"గుర్తుకొస్తున్నాయి...గుర్తుకొస్తున్నాయి...ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్ర లేస్తున్నాయి" అవునా జ్యోతిర్మయి గారు? మీ జ్ఞాపకాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు
ReplyDelete@ శిరీష గారూ ఆ రోజుల్లో సినిమాలకు వెళ్ళడానికి కష్టపడే వాళ్ళం, అదీ ఇష్టంగానేలెండి. ఈ రోజుల్లో సినిమా చూడ్డానికి కష్టపడుతున్నాం కదండీ..ధన్యవాదాలు.
ReplyDelete@ వెన్నెల గారూ...సరిగ్గా చెప్పారండీ..ఏ మూలో నిదురించిన జ్ఞాపకాలను నిద్రలేపాను. అవి ఆ రోజుల్లోకి అలా నడిపించుకుని వెళ్లిపోయాయి. ధన్యవాదాలు.
జ్యోతిర్మయి గారు మీరు అన్నదే నిజం అనుకుంటాను... మీరు వ్రాసిన ప్రతి విషయం నాకు తెలిసినట్లే ఉన్నది... బాగుంది అండి...
ReplyDeletegood
ReplyDelete:-) Very Nice.
ReplyDeleteమీ భావాలే నండి నావి కూడా!కృష్ణ,కావేరి,కల్యాణి,లలో చూసిన సినిమాలు,చూడని రోజు సాయంత్రం అక్కడిదాకా షికారు,town hall దగ్గరేవుండి చదివాము సర్వోదయాలో,సాయంత్రం trunk road రోడ్ ఫై షికారు ఎంత హాయి నెల్లూరు లో !మీ నెల్లూరు యాస చదివినప్పుడల్లా ఆ రోజుల్లో అన్ని రీల్ లాగా తిరుగుతాయి.మేమున్నప్పుడే నర్తకి ఓపెన్ చేసారు.అంటే ఆ టైం లో మీరు అక్కడే వున్నారు .
ReplyDeleteపుల్లైసు భలే ఉండేదండి! ఎండవేళ సోడా బండివాడు కుయ్యి మని కొట్టిచ్చే నిమ్మకాయ సోడా తాగేసి చెమటలు కక్కుతూ క్యులో టికెట్లు సాధించి చిరంజీవి సినిమా చూట్టంలో ఉన్న ఆనందం మళ్లీ రాదు. ఇంటర్వల్ లో చిన్ని ఉల్లిపాయ సమోసాలు కూడా భలే ఉండేవండి! పాప్కార్న్ ఏమిటి, గడ్డి!
ReplyDeleteu've shown a good movie :)
ReplyDeleteగుర్తుకొస్తున్నాయీ గుర్తుకొస్తున్నాయీ....భలే రాసారు నెల్లూరి యాస కలిపి!
ReplyDeleteపుల్లైసు, పాలైసు, సేమ్యా ఐసు...అబ్బ..ఏవేవో చల్లని, తీపి జ్ఞాపకాలు!
చల్లనైన తీపి సినిమా జ్ఞాపకాలు బాగున్నాయండీ :)
ReplyDeleteమీ సినిమా , పుల్లైసు తీపి గుర్తులు బాగున్నాయండి .
ReplyDeleteఎండా కాలంలో మల్లె పూల మాదిరి మాంచి వాసనొస్తావుండాదమ్మా నీ కత.
ReplyDeleteమేను పులకించె జదువగ
ReplyDeleteనేనూ నెల్లూరి వాడనే యగుటన్ , యీ
మీ నెల్లూరి వశేషా
లానంద పరవశము లిడె నమ్మా జ్యోతీ !
మనము హాయిగా మాటాడు భాషలోన
వ్రాయగా గల్గు హాయి – బీరములు బలుకు
పండితుల భాషలో రాదు , మొండికేసి
జనులు మాటాడు భాష “అసాధు” వండ్రు
మీబోటి తెలుగు బ్లాగరు
లీభాషకు భూషణమ్ము లింత సహజమై
శోభించు రచన వల్లనె
వైభవములు హెచ్చు తెలుగు వాడుక భాషన్
తెలుగుపాటలు గారూ, బాబాయిగారూ, మాధవిగారూ ధన్యవాదాల౦డీ.
ReplyDelete@ రవిశేఖర్ గారూ..టౌన్ హాల్, సర్వోదయా ఇలాంటి పదాలు చూసినప్పుడల్లా నాకు మా అమ్మ చెప్పే కబుర్లు గుర్తొస్తుంటాయండీ. ఎన్నిన్ని కబుర్లు చెప్పేదో..నర్తకి థియేటర్ కట్టినప్పుడు అక్కడ వున్నానో లేనో గుర్తులేదు కానీ, ఆ కొత్తల్లోనే ఆ హాల్లో ఏదో సినిమా చూశాము...ధన్యవాదాలు.
ReplyDelete@ సన్నజాజి గారూ బాల్యంలో ముచ్చట్లన్నీ మధురాతి మధురాలు కదూ..మళ్ళీ గుర్తుచేసికుంటుంటే ఎంత ఆనందంగా ఉందో...ధన్యవాదాలు.
@ ఫణీ౦ద్ర గారూ నా రాతల్లోనే మీరు సినిమా చూసోచ్చినందుకు మీకు బోలెడు ధన్యవాదాలు.
ReplyDelete@ సౌమ్యగారూ ఆ ఐసు రుచే వేరు కదండీ.. అదీ ఎండలో తినడం..జ్ఞాపాకాల తలుపులు తెరిస్తే అలా చల్లగాలి వీచింది. ధన్యవాదాలు.
@ హర్ష గారూ స్వాగతం. మీరు కూడా ఇదే పనిలో ఉన్నారుగా, తవ్వేకొద్దీ ఊరుతూనే ఉన్నాయి జ్ఞాపకాలు.. ధన్యవాదాలు.
@ మాలాకుమార్ గారూ ధన్యవాదాలు.
ReplyDelete@ నాగేస్రావ్ గారూ ఎండాకాలం మల్లెపూలు..ఎంత బాగా పోల్చారండీ..ధన్యవాదాలు.
@ వెంకట రాజారావు గారూ మాటల్లేవ౦డీ....మీ వ్యాఖ్యలన్నీ పదిలంగా దాచుకు౦టున్నాను. మీలాంటి పెద్దల ఆశీర్వాదమే నాతో ఇవన్నీ రాయిస్తున్నది. ధన్యవాదములక౦టే మించిన పదమేదీ లేకపోయేనే నా భావం తెలిపేందుకు..
మీ చిననాటి కబుర్లు మీరు చెప్పాలి.. మేం వినాలి. బాగు బాగు. :)
ReplyDeleteకొత్తావకాయ గారూ ధన్యవాదాలు.
ReplyDeleteJyoti, Good naration and many sweet memories, your a girl and blessed with good Mammma who could finance your pala ice and movie needs,but I am male and less resourceful I use to raise finance by means of commision in my local purchase,once again thank you sweet memory
ReplyDeleteకోటేశ్వర్రావు గారూ స్వాగత౦. నేను అదృష్టవంతురాలినేనండీ. పసితనాన్ని ఆత్మీయుల మధ్య గడపగిగినందుకు, ఆ జ్ఞాపకాలను పదిలంగా దాచుకోగలిగినందుకు కూడా.. ధన్యవాదాలు.
ReplyDeleteజ్యోతిర్మయి గారూ!
ReplyDeleteఎప్పటిలా నెల్లూరుని మళ్ళీ మా ముందుంచారు...
పాలైస్...ఐదు, పదీ, పదిహేను,ఇరవై, పావల...ద్రాక్షా, పాలా, సేమ్యా ఐస్...బాగుంది
పోపుల డబ్బాని తాలింపు డబ్బా అనీ...బట్టలని గుడ్డలు అనీ అంటారేమో... ;)
కృష్ణా, కావేరీ, కళ్యాణీ లలో ప్రతి సినిమా అద్భుతంగానే ఉండేది...ఎంత చెత్త సినిమా అయినా సరే...అదీ ఆ హాళ్ళ మహత్యం...అందులో సినిమా అనుభూతి మరెక్కడా రాదట కదూ!
చాలా బాగా రాశారు...మరిన్ని అనుభూతులు రాయండి.
చిన్ని ఆశ గారూ ఆలశ్యంగా సమాధానమిస్తున్నాను ఏమీ అనుకోకండి. నెల్లూరులో తాలింపు డబ్బా, గుడ్డలు అంటారని మీరు చెప్పింది సరైనదే. అది మార్చాను. ఇక బట్టలు పిన్ని భాషలో కదండీ, ఆ పాత్ర పూర్తిగా నెల్లూరు భాషలో మాట్లాడడం లేదు. అందువల్ల అలా ఉంచేశాను. ఇంకేమైనా పొరపాట్లు ఉంటే దయచేసి తెలియజేయండి. ధన్యవాదములు.
ReplyDelete