కబుర్లు, పాటలు, సినిమాల మధ్య కారులో పదహారు గంటల ప్రయాణం. ఓ నాలుగ్గంటలు మాకు తోడుగా వర్షం. కారు దిగిన వెంటనే ఆత్మీయుల పలకరింపులు. చెణుకులు, చెలోక్తుల మధ్య పులిహోర, గో౦గోరలతో భోజనాలు, తీపితీపి అరిసెలు. తరువాత రోజు మరో స్నేహితుల ఇంట్లో బ్రంచ్ ఇడ్లీ, వడ, దోశ, ఇదీ అదీ అనేమిటి ఏ పేరు చెప్తే ఆ పలహారం పెట్టేశారనుకోండి.
'స్టాకీ యార్డ్' లో 'మేజ్' బావుంది, పిల్లల బుల్ ఫైట్లు బావున్నాయి. అందరం వరుసగా నిలబడి తోసుకుని మరీ దున్నపోతుల్ని చూడడం మరీ బావుంది. రామురామన్న పిల్లలుకూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. నలుగురూ కలిస్తే అంతేగామరీ, ఎక్కడున్నా సందడే సందడి.
మెహందీ పెట్టడం కొత్తగా నేర్చుకున్నానేమో పాప౦ బోలెడుమంది వాళ్ళ చేతులిచ్చి మరీ ప్రోత్సహించారు. చాలా ఏళ్ళ తరువాత పెట్టుకున్న గోరింటాకు చేతిలో ఇంకా ఎర్రగానే ఉంది. ఒక్క రాత్రిలో ఆంటీ హారతి పాట నేర్పి౦చేశారు. ఇక ఎక్కడ ‘హారతి’ మాట వినపడినా నేర్చుకున్న అమ్మాయిలందరూ పాడడానికి చాలా ఉత్సాహ౦గా ఉన్నారట.
ఈ విహారం పిల్లలకు ఇష్టారాజ్యం....వాళ్ళెప్పటికీ ఈ సెలవలను మరచిపోలేరేమో! ఓ చిట్టితల్లి ఓణీల వేడుకలో చిన్నా పెద్ద అందర౦ సందడిగా గడిపేశా౦. ఆ రాత్ర౦తా కబుర్లు, ఆసక్తికరమైన అనేక విషయాలు అలవోకగా దొర్లిపోయాయి. అందరం ఒకే రకం దుస్తులు వేసుకుని ప్రత్యేకంగా తీసుకున్న పార్క్ లో ఫోటోలు భలేగా ఉన్నాయి.
ఆఖరి రోజు అన్ని రకాల వంటలున్నా సాంబారు, ఆవకాయతో అందర౦ అన్నం వండి౦చుకుని మారీ, ఇష్టంగా భో౦చేశా౦. ఉదయాన్నే కుర్తీలకోసం చేసిన సరదా ప్రయాణం, దారిలో 'రాయల్ స్వీట్స్' లో తిన్న మసాలా దోసెలు ఇప్పటికీ మురిపిస్తూనే ఉన్నాయి. సాయంత్రం అందర౦ కలసి పలికిన పాత సంవత్సరానికి వీడ్కోలు, నూతన సంవత్సరానికి స్వాగతం బావుంది. ఆటలు, పాటలు, పద్యాలు, కాలేజి రోజుల ఫోటోలు అన్నీ అలరించాయి.
చిన్నప్పుడెప్పుడో 'మిసిసిపి' నది గురించి చదువుకున్న జ్ఞాపకం. ఒక్కసారి చూడాలనిపించే కోరిక ఈ ప్రయాణంలో తీరింది. సూర్యాస్తమయంలో అందమైన మిసిసిపిని చూడగలిగాము.
మైత్రీ వనానికి కొత్త మొక్కలు తోడయ్యాయి. స్మృతి హారానికి కొత్త సొగసులు చేకూరాయి. మాటల మధ్యలో మనసెక్కడో జారవిడుచుకున్నట్టున్నాను, ఇంటికి వచ్చినా అది డెల్లాస్ చుట్టూనే తిరుగుతున్నట్టుగా ఓ చిన్న అనుమానం. పరిచయం లేకపోయినా తప్పక రావాలని పిలిచిన సంస్కారానికి జోహారు. మీరాక మాకెంతో సంతోషమన్న అభిమానానికి ధన్యవాదాలు.
సర్ప్రైజ్ పేరుతో పంచిన సంతోషానికి శభాషు. వండి వడ్డించిన చేయికి ఆ రుచి ఎన్నటికీ మరువలేమంటున్న ఆప్యాయతలు...కలగలసిన మొన్నటి వారం మదిలో సుస్థిరస్థానం ఏర్పరచుకుంది. కాలాన్ని ఆపగలిగిన గర్వం ఓ చివర తళుక్కుమంటూనే ఉంది. నూతన సంవత్సరం అత్మీయుల మధ్యలో గడపడం మాకో గొప్ప అనుభవం. ఇలాంటి వేడుకలు ఏటేటా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ అందరి దగ్గరా సెలవు తీసుకున్నాము.

> డెల్లాస్ ప్రయాణం కబుర్లు
ReplyDeleteTX lo dallas?
అవునండీ...
ReplyDeleteఅమ్మాయ్! మంచి కబురు చెప్పేవమ్మా
ReplyDeleteకొత్త సంవత్సరం వేడుకలకు మాంచి ఉత్సాహాన్ని ఇచ్చారన్నమాట ఐతే. బాగున్నాయ్ డల్లాస్ కబుర్లు. ఇలాంటి వేడుకలు ఏటేటా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ..
ReplyDeleteఎంత చక్కగా వివరించారండీ.....
ReplyDeleteమీరు నమ్మరు నేను నా ఫీనిక్స్ ప్రయాణం గురించి రాద్దామనుకున్నాను....
మీది చదివాక చాలా ఆనందంగా ఉంది.... మీరు అంత బాగా అందరితో విలువైన సమయాన్ని గడిపినందుకు సంతోషంగా ఉంది....
మీరు రాసిన తీరు అందరికీ ఎదో ఒక సంఘటన గుర్తుకుతెచ్చే విధంగా ఉంది అనడంలో అతిశయోక్తి లేదు......
@ బాబాయిగారూ మీరందరూ ఎంతలా అలవాటయిపోయరంటే..మీతో ఎప్పుడెప్పుడు ఈ కబుర్లన్నీ చెప్పేద్దామా అనిపి౦చింది. ధన్యవాదాలు.
ReplyDelete@ సుభ, వేడుకలకు మేం ఉత్సాహమిచ్చామా..సుభ మనసుతో ఆలోచిస్తే అంతే మరి. ధన్యవాదాలు
@ మాధవి గారూ ఆలస్యమెందుకింక రాసేయండి మరి..మీ అభిమానానికి ధన్యవాదాలు.
బాగుంది .. అనడం చిన్న మాట. కొత్త పరిచయాలు.. అయినా ఎప్పటివో.. పాత నేస్తాలలా పంచిన ఆప్యాయతలు .. నూతన ఉత్సాహం.. మనసు జారవిడుచుకోవడం .. సో..& సో చాలా బాగున్నాయి.
ReplyDeleteఐతే కొత్త సంవత్సరం చాలా ఉత్సాహంగా గడిపారన్నమాట . మీరెప్పుడూ ఇలాగే గడపాలని కోరుకుంటూ , హాపీ న్యూ ఇయర్ .
ReplyDeleteడెల్లాస్ నా హా హా హా రెడీ తెలుగు మూవీ గుర్తుకు వచ్చేసింది
ReplyDelete"నలుగురూ కలిస్తే అంతేగామరీ, ఎక్కడున్నా సందడే సందడి."
ReplyDeleteనిజమేనండీ అందరూ వున్నప్పుడు ఆ సంతోషమే వేరు..
@ వనజ గారూ పాత కొత్తల మేలు కలయిక మొన్నటి ప్రయాణం. మొత్తం పదిహేను కుటుంబాల వాళ్ళం కలిశామండి. అదో పెళ్లిలా ఉన్నది మాకు. ధన్యవాదాలు.
ReplyDelete@ మాలాకుమార్ గారూ మీ అభిమానానికి ధన్యవాదాలు.
మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
@ తెలుగు పాటలు గారూ హహహ..అంత సందడిగానూ గడిచింది..ధన్యవాదాలు.
@ రాజి గారూ నాకప్పుడప్పుడూ ఉమ్మడి కుటుంబ౦లో ఉంటే బావుండనిపిస్తుంది. ఎప్పుడూ నలుగురు కలిసే ఉండొచ్చు కదా! ధన్యవాదాలు.
బావున్నాయండి మీ ట్రిప్ విశేషాలు !
ReplyDeleteబాగుంది అనుభూతులను మరికొన్ని మూతకట్టుకొచ్చారనమాట! బాగున్నాయి మీ కబుర్లు! నాకు కోన్ మెహందీ ఇష్టం లేదు బాబు! నేను గోరింటాకు రుబ్బినది పెట్టించుకుంటాను!
ReplyDelete@ శ్రావ్య గారూ ధన్యవాదాలు.
ReplyDelete@ రసజ్ఞా ...నువ్వేదంటే అదే.. వచ్చేసెయ్ పెట్టేస్తాను.
ధన్యవాదాలు.
జ్యోతి,
ReplyDeleteచాల చక్కగా వ్రాసారు. మంచి కథ చదువుతున్నట్లు వుంది.
Keep it up...
అజ్ఞాత గారూ ధన్యవాదాలు. మీ పేరు తెలుసుకోవలనివుంది..
ReplyDelete