పొడవైన
పచ్చని చెట్లు, కొండవాలుగా వంపులు తిరిగిన సన్నని రోడ్లు, కదిలే మేఘాలు, కోనసీమ
పలకరింతల్లా కురిసే జల్లులు వెరసి ‘సియాటిల్’.
ముందుగా ‘వే౦కూవర్’ వెళ్ళాము. అక్కడ నుండి ‘గ్రౌస్ మౌంటైన్’ అనే ఎత్తైన పర్వతం చూడడానికి ట్రామ్ లో వెళ్ళాము. పద్దెనిమిది అడుగుల ఎత్తున్న చక్కతో చేసిన బొమ్మలు, 'ల౦బర్ జాక్ షో’ ‘కెనడా ఈగల్ షో’ (గద్ద ఎలా చూస్తుందో అలా తీసిన వీడియో) అక్కడి ఆకర్షణలు. ఆ రాత్రి అక్కడే ఉండి
తరవాత రోజు ఉదయం ‘విజ్లర్’ బయలుదేరాము.
ఒక
వైపు లేక్, ఒక వైపు పర్వతాలు, అప్పుడప్పుడూ చిరుజల్లులు చాలా అందంగా ఉందా
ప్రాంతమంతా. వెళ్ళే దారిలో ‘బి సి అఫ్ మైనింగ్’ చూశాము. అది కాపర్ మైనింగ్, వంద
సంవత్సరాల క్రితందైనా చక్కగా కాపాడుతున్నారు. వర్కర్స్ హేట్ పెట్టుకుని టార్చ్
లైట్ వెలుగులో ఆ మైన్స్ లో చాలా దూరం వెళ్ళాము. తరువాత మజలీ ‘షానన్ ఫాల్స్’. బ్రిటీష
కొలంబియాలో ఉన్న పొడవైన జలపాతాల్లో ఇది కూడా ఒకటి. మొత్తం మూడు లెవెల్స్ లో
ఉంటుంది. రెండొవ లెవెల్ వరకూ వెళ్ళాము. నీళ్ళు ప్రవహిస్తున్నదగ్గర రాళ్ళ మీద నడుస్తున్నప్పుడు ‘కొండా కోనల్లో లోయల్లో గోదారి
గంగమ్మా పాయల్లో’ పాట గుర్తొచ్చింది.
‘విక్టోరియా’ అంతా ఓల్డ్ బ్రిటిష్ కట్టడాలు ఉన్నాయి. అక్కడ ‘ఎంప్రస్’ హోటల్, 'మ్యూజియం', ‘డైనోసర్ అండ్ వైల్డ్
లైఫ్ ఎగ్జిబిట్స్’, ఐ మాక్స్ లో ‘టైటానిక్’ చూసి ఓ గంట దూరంలో ఉన్న ‘బుచర్డ్
గార్డెన్స్’ కి వెళ్ళాము. అద్భుతమైన తోట. ఎటు చూసినా పచ్చదనం, రంగు రంగుల పువ్వులు,
పచ్చని పచ్చిక ఫౌంటైన్స్. ఆ మధ్యాన్నం అంతా ఆ తోటలో విహారం, అస్సలు కదలాలనిపించ లేదు. కానీ తప్పదుగా సాయంత్ర౦ వరకూ ఉండి, ఆ తోటకు చివరి వీడ్కోలు పలికి మళ్ళీ ఫెర్రీ లో
వేంకూవర్ కి వెళ్ళాము.
అందమైన
‘సియాటిల్’ రోడ్డు మీద కారు కదిలిపోతుంది, పక్కన ఎత్తైన పచ్చని చెట్లు, నడి
వేసవేమో సియాటిల్ ని అంటి పెట్టుకునుండే వర్షానికి కాస్త విశ్రాంతి. అప్పటికీ
ఉండుండి పలకరిస్తూనే వుంది.
కెనడా వైపుగా ప్రయాణం, కారులో దేశం దాటడం...పిల్లల్లకు మహా సరదాగా ఉంది. మూడు గంటల ప్రయాణం తరువాత సరిహద్దు దగ్గరకు వచ్చాం. అక్కడ వరుసగా చాలా గేట్లు
ఉన్నాయి. పెద్ద పెద్ద ట్రక్కులు, కార్లు దాటడానికి వేచి ఉన్నాయి. సరిహద్దు దళం
ఒక్కక్క వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. మా కారు దగ్గరకు కూడా
వచ్చి ‘ఐడి’, ‘పాస్పోర్ట్’ చూపించమన్నారు. అవి ఇచ్చేలోగా విండో లోంచి వెనుక సీట్లో
పిల్లల్ని అనుమానంగా చూసి, ట్రంక్ చూసి ఎట్టకేలకు “ఎంజాయ్ యుర్ ట్రిప్” అంటూ
పంపించారు. అంతవరకూ ఒక్క మాట కూడా
మాట్లాడని పిల్లలు బోర్డర్ దాటగానే ‘ఏ’ అని అని అరుస్తూ సంతోష పడిపోయారు.
అక్కడినుండి బయలుదేరి 'ట్రైన్ మ్యూజియుం' దగ్గర ఆగాము. అక్కడ బుజ్జి ట్రైన్ ఏదో బొమ్మలాగా ఉంది. ఆ బుల్లి ట్రైన్, స్టేషన్ అంతా తిప్పి
చూపించింది. దారిలో కుందేళ్ళు, పువ్వులు... భలే సరదా రైలు బండి. ఆ స్టేషన్ లో పాత
రోజుల్లో ఉండే ట్రైన్స్ ఉన్నాయి.
సాయంత్రానికి ‘విజ్లర్’ వెళ్ళాము. అప్పుడు ఆ
ఊరంతా ‘వింటర్ ఒల౦పిక్స్’ కోసం కొత్త అందాలు సంతరించుకుంటోంది. ఇప్పటివరకూ చూసిన ప్రదేశాలకెల్లా
అత్యంత సుందరమైన ప్రదేశం. ఎక్కడా హడావిడి లేని ప్రశాంత వాతావరణం. అమెరికాలో చూడని ఒక
చక్కని దృశ్యం కనిపించింది, వాహనాల హడావిడి చాలా తక్కువ ఉన్న ఆ వీధుల్లో మనుష్యులు
వ్యాహ్యాళి కెళ్తుతున్నట్లుగా నిదానంగా చేతిలో చేయివేసుకుని నడుస్తూ
కనిపింస్తారు. ఆ ఊరు, వాతావరణము, ప్రశాంతత ఏదో చిత్రపటం చూస్తున్నట్లుగా
అనిపించింది. ఆ రాత్రి అక్కడ ఉండి తరువాత రోజు ఉదయన్నే విక్టోరియాకు బయలుదేరాము.
విజ్లర్ విలేజ్ |
‘విక్టోరియా’కి వెళ్ళాలంటే లేక్ దాటి వెళ్ళాలి. ‘ఫెర్రీ’లో ప్రయాణం, క్రింద కార్ పార్కింగ్ పైన పాసింజర్స్. కొండల మధ్యగా ఫెర్రీ వెళుతూ ఉంటే, లేక్ మీద నుంచి చల్లగాలి, చుట్టూతా నీళ్ళు, ప్రకృతి
అందాలలో మనసంతా నిండిపోయింది.
తరువాత
రోజు ‘వే౦నకూవర్’ లో ఇండియన్ షాప్స్ ఉన్న వైపుకు వెళ్ళాము. ఆశ్చర్యం అది అచ్చంగా
ఇండియా లాగే ఉంది. ఒక వీధంతా ఇ౦డియన్ షాప్స్.. చిన్నచిన్న రెస్టారెంట్స్, పాన్ షాప్స్
ఉన్నాయి. ఒక వీధిలో ఇంటి మెట్ల మీద కూర్చుని తల దువ్వుకుంటున్న అమ్మాయిలు, రోడ్డు
మధ్యలో ఆడుతున్న చిన్నపిల్లలు... ఏదో మన ఇండియాలో చిన్న ఊరికి వచ్చినట్లనిపించిది. బోలెడన్ని అనుభూతలను మూట కట్టుకుని సాయంత్రానికి తిరిగి సియాటిల్ బయలుదేరాము. ఆ రోజు జూలై ఫోర్త్, కెనడా బోర్డర్ దాటి అమెరికా
వచ్చేసరికి రాత్రయింది. దారంతా 'ఫైర్ వర్క్స్' చూస్తూ అర్ధరాత్రికి ఇంటికి చేరాము.
maa intiki raakundaa alaa vellipoyaarentee...!!!!vachchi untey, maa raavu gaari intlonchi konni pustakaalu choree chesi ichchi unDEdaanni inkaa vEdi pakodeelu+blue sea chay koodaa...pch..pch..miss ayipoyaaru...next time randi mari sarenaa?
ReplyDeleteచూడలేకపోయే మాలాంటివాళ్ళకి మీకలం, బొమ్మల ద్వారా చూపించారు.
ReplyDeleteశర్కరీ వారు,
ReplyDelete'సియా' టిల్టా, తో, కనడా,కానదా!
బాగున్నాయి కబుర్లు...... కానీ ఇది ఎప్పటి ప్రయాణం....??
ReplyDeleteమీరుంటున్నది సియాటిల్ లోనా.....??
@ ఎన్నెల గారూ మీ ఇల్లు మరీ దూరమైపోయింది.ప్చ్ చాలా మిస్ అయిపోయాం. ఈ సారి తప్పకుండా ఒస్తాంగా
ReplyDeleteధన్యవాదాలు.
@ బాబాయిగారూ అమెరికా వచ్చిన కొత్తల్లో అమ్మావాళ్ళకు ఇక్కడ విశేషాలన్నీ ఇలాగే ఉత్తరంలో వ్రాసేదాన్ని చాలా రోజుల తరువాత మళ్ళీ అలా వ్రాశాను,ధన్యవాదాలు
@ జిలేబీ గారూ మీరేం అన్నారో వెలగలేదండీ.
ReplyDelete@ మాధవి గారూ ఈ ప్రయాణం నాలుగేళ్ళ క్రితంది. డైరీ చూసి విశేషాలు వ్రాశాను. సియాటిల్లో ఉన్న ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి అక్కడి నుండి కెనడా వెళ్ళాము. ధన్యవాదాలు.
శర్కరి అంటే మీరు కలం అన్న అర్థం ఇచ్చారు అప్పుడెప్పుడో
ReplyDeleteసియా - స్యాహీ, అంటే ఇంకు.
శర్కరీ వారి సియా, టిల్టా తో (హిందీ) (హిందీ లో టిల్టా అంటే ఒలికితే- కలం కదిలితే) కెనడా, కానదా! - కెనడా కనిపించదా !!
అని.
చీర్స్
జిలేబి.
జిలేబి గారూ మీరు మామూలు జీనియస్ కాదండీ బాబూ..సూపర్ డూపర్ జీనియస్. ధన్యవాదాలు.
ReplyDeletejyothigaru,mee prayanam gurinchi kallaku kattinattuga chepparu..
ReplyDeleteరామకృష్ణ గారూ మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.
ReplyDelete