Tuesday, January 3, 2012

కౌముదిలో నా కవిత 'ప్రయాణం'

ఉన్న వూరిని కన్న వాళ్ళని చూసి ఎన్నేళ్లయిందో..
ఉరుకులు పరుగుల నుంచి కాస్తంత ఆటవిడుపు!

కనుచూపు మేరలో ప్రయాణం...
అంగళ్లన్నీ తిరిగి... అవీ ఇవీ పోగేశా౦
అటకమీంచి దుమ్ముదులిపి...పెట్టెలేమో సర్దేశా౦!

ఇంకెంత చుక్క పొడిచే లోపే ఊరు చేరిపోతాం..
అయినవాళ్ళ సందిట్లో వేగిరం వాలిపోతాం!

మురిపాలు, ముచ్చట్లు, కౌగిలింతలు, పలకరింపులు..
పేరు పేరునా పలకరించి... కానుకలేవో ఇచ్చేశాం!

తిరుపతి వెంకన్న, శ్రీశైలం మల్లన్న
మనకోసమే వేచి వున్నారు మరి!

అదిగదిగో బట్టల దుకాణం, ఆ వైపునేమో సూపర్ బజారు,
ఈ పక్కనే నగల కొట్టు, అటు మూలన బోటిక్కు!

తిరిగేశాం...చూశాశాం ...దొరికినవన్నీ కొనేశాం
అవసరముందో లేదో...అక్కడివన్నీ దొరకవుగా!

హడావిడంతా విచ్చు రూపాయలదే...
ఉన్నచోట ఉండక ఒకటే పరుగులు!

ఆవకాయ, నిమ్మకాయ, మాగాయ, వుసిరి,
సోలెడు పసుపు, తవ్వెడు కారం....
పట్టేసాం..దంచేసాం..మూటలన్నీ కట్టేశా౦!

ఇంకెంత పొద్దు వాలే లోగానే..
తట్ట, బుట్ట, పెట్టె, బేడా
నట్టింట చేరినయ్!

అర్ధరాత్రి జేట్లాగ్ భాగ్యంతో..
ఒంటరిగా కూర్చుని తలచుకుంటే..
ఏవీ కన్నవాళ్ళతో గడిపిన నాలుగు క్షణాలు!
ఈ హడావిడిలో విశ్రాంతి ఏ మూల నక్కిందో మరి!!


నా కవిత 'కౌముది'ఇంటర్నెట్ మాసపత్రిక 'జనవరి 'సంచికలో ప్రచురితమైంది.
నా కవితను ప్రచురించిన కౌముది సంపాదకులకు బ్లాగ్ముఖంగా ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను.




24 comments:

  1. అభినందనలు "జ్యోతిర్మయి" గారూ..
    మీ "ప్రయాణం" చాలా బాగుంది.

    ReplyDelete
  2. అభినందనలండీ! బాగుంది...

    ReplyDelete
  3. అభినందనలు. కవిత బాగుందండీ.

    ReplyDelete
  4. అర్ధరాత్రి జేట్లాగ్ భాగ్యంతో..
    ఒంటరిగా కూర్చుని తలచుకుంటే..
    ఏవీ కన్నవాళ్ళతో గడిపిన నాలుగు క్షణాలు!
    ఈ హడావిడిలో విశ్రాంతి ఏ మూల నక్కిందో మరి!!

    అందరిది ఇదే సమస్య అనుకుంటాను. ముఖ్యంగా ఆడపిల్లలకు.

    ReplyDelete
  5. కవిత చాలా బాగుంది జ్యోతిర్మయిగారూ... మావూరును, మావాళ్లను చూసుకున్నట్లుగా ఉంది మీ కవితను చదువుతుంటే... అభినందనలు...

    ReplyDelete
  6. ఏవీ కన్నవాళ్ళతో నాలుగు క్షణాలు.......గుండెనిండా ఆవేదన ఇద్దరికీ!

    ReplyDelete
  7. ఈ నెలలోనే ప్రచురించబడిన కవిత కనుక మీరు వెంటనే బ్లాగ్ లో పెట్టకుండా, కౌముది లింక్ ఇవ్వడం సమంజసమేమో!

    ReplyDelete
  8. చాలా బాగా వ్రాసారు. నాలుగు క్షణాలు ఆత్మీయంగా గడిపే కన్నా... పోగేసే వస్తు సముదాయమే మనుషుల జీవితాన్ని శాశించే అవసరం ఏర్పడుతుంది.

    ReplyDelete
  9. అభినందనలు జ్యోతిర్మయి గారూ..

    ReplyDelete
  10. ముందుగా అభినందనలండీ.. వేరే దేశాల్లో ఉండే అందరి పరిస్థితీ ఇదేనంటారా? వేరే దేశాలేంటి లెండి..ఇక్కడే ఉండి కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా చాలా మందే ఉంటారు.

    ReplyDelete
  11. రాజి గారూ, చిన్ని ఆశ గారూ, సుబ్రహ్మణ్యం గారూ ధన్యవాదాలండీ..

    ReplyDelete
  12. @ గీత యశస్వి గారూ..ఆడపిల్లలే కాదులెండి అబ్బాయిలిలది కూడా ఇదే పరిస్థితి. మనకేం కావాలో తెలుసుకోలేనంత వరకు ఈ పరిస్థితి ఇలా కొనసాగుతూనే ఉంటుంది..ధన్యవాదాలు.

    @ శోభ గారూ ధన్యవాదాలు.

    @ బాబాయి గారూ ఉన్న నాలుగు రోజులయినా కదలకుండా ఇంటిపట్టున ఉంటే అదో తృప్తి. మేము తీసే ఈ పరుగులు దేనికోసమో అర్ధం కాదు...ధన్యవాదాలు..

    ReplyDelete
  13. @ అజ్ఞాత గారూ సంపాదకులతో సంప్రదించి వారి అనుమతితోనే బ్లాగులో పెట్టానండి. కవిత కింద సంపాదకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కౌముది లింక్ కూడా ఇచ్చాను. మీ సూచనకు ధన్యవాదాలు.

    @ వనజగారూ దీనికి కారణము తెలిసి తెలియనితనమే అని నాకనిపిస్తుంది..ఏదో చేసేయాలనే తపన..పోయినసారి ఇండియా వెళ్ళినపుడు..ఈ షాపింగ్ దాదాపుగా తగ్గించుకున్నాము. ఇంట్లో వాళ్ళతో ఎక్కువ సమయం గడపగాలిగాము. ధన్యవాదాలు.

    ReplyDelete
  14. @ అరుణ్ గారూ ధన్యవాదాలు..

    @ సుభా వేరే దేశాలలో ఉండేవాళ్ళకు ఇండియాలో గడిపే తక్కువ సమయం కదా..మనం ఎందుకు వెళుతున్నామో, మన కోసం ఎదురుచూసేవాళ్ళకు ఏం కావాలో స్పష్టంగా తెలుసుకోగలిగితే... మనం ఏం చెయ్యాలో తెలుస్తుంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  15. @జ్యోతిర్మయీ గారు,

    ఖండాంతరాల ఈ 'స్మగ్గ్లింగు' బావుందండీ !

    ఇటువైపువి అటువైపు , అటు వైపు వి ఇటు వైపు !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  16. చాలా బాగుందండీ.... ఎంత చక్కగా వివరించారు స్వదేశ ప్రయాణం గురించి.....

    ReplyDelete
  17. @ జిలేబి...ఎయిర్ లైన్స్ వాళ్ళు ఒక్క లగేజ్ మాత్రమె అన్నందుకు చాలా సంతోషించాను..ఈ స్మగ్లింగ్ బాధ కొంత తగ్గినందుకు..ధన్యవాదాలు

    @ మాధవిగారూ ధన్యవాదాలు..

    ReplyDelete
  18. kavitha baagumdi kadilimchimdi

    ----naanna

    ReplyDelete
  19. అభినందనలండీ!

    ReplyDelete
  20. @ నాన్నా కవిత నీకు నచ్చినందుకు చాల ఆనందంగా ఉంది..ధన్యవాదములు.

    @ శైలబాల గారూ ధన్యవాదములు..

    ReplyDelete
  21. ఇండియా బయట ఉన్న నాలాంటి వాళ్లందరూ ఓ సారి మరీ భుజాలు కాకపోయినా మనసు తదుముకున్నట్టుగా ఉంది...మీ మరో బ్లాగ్ "కనిపించే అందాలె" లో నా కామెంట్ పోస్ట్ చెయ్యటం కుదరట్లేదు....వివరించగలరా

    ReplyDelete
  22. వాసుదేవ్ గారూ సమయం వెచ్చించి చదువుతున్నందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు..ఈ మధ్య మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఆవేదనగా అన్న మాట నా కవితకు ప్రేరణ..

    'కనిపించే అందాలే' బ్లాగులో కామెంట్ పెట్టాలంటే పేజి కిందకు స్క్రోల్ చేస్తే కామెంట్ బాక్స్ కనిపిస్తు౦ద౦డీ..
    ధన్యవాదాలు.

    ReplyDelete
  23. భుజాలు తడుముకున్న ఓ నిట్టుర్పు...

    ReplyDelete
    Replies
    1. ప్రవీణ గారూ :-( ధన్యవాదాలు.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.