“అమ్మా
ఇవాళ టిఫినే౦టి?” మేడ మెట్లు దిగుతూ మా అమ్మాయి.
“ఏం
కావాలి నాన్నా?”
“దోశ వు౦దా?”
ఇప్పుడే
పిండి గ్రైండ్ చేశాను. రేపటికి రెడీ అవుతుంది.
“ఇడ్లీ
ఉందా?” ఫ్రిడ్జ్ డోర్లు రెండూ తీసి పట్టుకుని.
“లేదు,
ఉప్మా చెయ్యనా?”
“ఇంకేం
లేదా?” ఇంకా ఫ్రిజ్ లోనే వెతుకుతూ..
“ఉహూ..”
“సరే
చెయ్యి”
లాప్
టాప్ తీసి పక్కన పెట్టి లేవబోయాను.
“అమ్మ
ఏదో రాసుకు౦టున్నట్లుంది. ఇవాళ టిఫిన్ మనం చేద్దాం" అంటూ ఒళ్ళో ఉన్న లాప్టాప్ పక్కన పట్టి వంట గదిలోకి వెళ్ళారు శ్రీవారు.
రాయడం మొదలెట్టాను
‘బీటలు
వారిన నేలపై
స్వాతి
చినుకుల
“ఉల్లిపాయలు, చిల్లీస్ ఇంకా ఏం కావలి జ్యోతీ
ఉప్మాకి”
“ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీడిపప్పు”
“గుర్తొచ్చాయిలే నువ్వు రాసుకో”
బీటలు
వారిన నేలపై
జీడిపప్పుల
సంబరం!
ఛీ ఛీ జీడిపప్పేమిటి
స్వాతి చినుకుల సంబరం!
"అమ్మలూ ఇది ఉప్మా రవ్వో ఇడ్లీ రవ్వో అమ్మని
అడిగిరా డిస్టర్బ్ చేయకుండా వచ్చెయ్ ఏదో రాసుకుంటుంది పాపం."
ఆ రవ్వేదో
చూపించాను.
మోడువారిన
రవ్వపై ఏ రవ్వబ్బా, ఏ రవ్వేమిటి నా మొహం
మోడువారిన
నేలపై
చివురాకుల
కలకలం!
"జ్యోతీ టమోటోలు అయిపోయినట్లున్నాయే?"
"గరాజ్ ఫిడ్జ్
లో ఉన్నాయ్"
"ఎన్ని
టమోటోలు వెయ్యను?"
"రెండు
వెయ్యండి."
"మూడు
వేస్తా."
"ఎన్నోకన్ని
వెయ్యండి."
"అంత చిరాకెందుకు రాసుకునేప్పుడు చాలా ప్రశాంత౦గా ఉండాలి”
వసివాడిన
పసిమొగ్గ
"లవంగాలు
ఎక్కడున్నాయ్?"
"పా౦ట్రీలో
చిన్న బాక్స్ లో ఉన్నాయ్."
వికసిస్తున్న
లవంగం!
నాన్నా
లవంగాలు వద్దు “ఐ హేట్ లవగంస్.”
“తీసెయ్యడానికి వీలుగా సగం దంచి వేస్తాగా”
“సగం దంచుతారా! ఇంకా నయం సగం దంచి వేస్తే తీయడం కష్టం. పౌడర్ చెయ్యండి కలసి పోతుంది. లేకపోతే మొత్తంగా వేస్తే పిల్లలకు తీయడానికి వీలుగా ఉంటుంది. ”
“యు
ఆర్ రైట్, యు నో వాట్, యువర్ అమ్మా ఈజ్ సో స్మార్ట్”
ఒ౦టరియైన
ఆమ్మకు
నెలవంక
స్నేహితం!
"ఉప్మా ఈజ్
రెడీ. అమ్మలూ ప్లేట్లు గ్లాసులు పెట్టు"
ముసురేసిన
ప్లేటును దాటి
"అమ్మా
డిష్ వాషేర్లో ప్లేట్స్ కడిగినవేనా?"
"ఆ కడిగినవే."
దూసుకు
వస్తున్న రవికిరణం!
"జ్యోతీ
రా టిఫిన్ తిందాం."
"ఒక్క
నిముషం ఇది పూర్తిచేసి వస్తున్నా"
భారమైన
టిఫినుకు
ఆలంబన ఉప్మా
వేదం!!
"చూశావా
నేను ఎంత మంచి హస్బెండునో నిన్నసలు డిస్ట్రబ్ చేయకుండా రాసుకోనిచ్చాను."
":)"
"ఇంతకూ కవితకు ఏం పేరు పెట్టావ్?
"ఉప్మా వేదం"
"ఎలా ఉంది ఉప్మా?"
":)"
"ఇంతకూ కవితకు ఏం పేరు పెట్టావ్?
"ఉప్మా వేదం"
"ఎలా ఉంది ఉప్మా?"
బాగుందండి..మీ బ్లాగ్ లోని శ్రీవారి ఉప్మా రుచి గా ఉంది :)
ReplyDeleteఅమ్మో నవ్వలేక చచ్చాను
ReplyDeleteహహ్హహ్హా.. Sweet!
ReplyDeleteఇంతకీ నాకొక విషయం అర్థం కాలేదు. ఉప్మాలో లవంగాలు వేస్తారా?
ఉప్మా ఉల్లి పాయ
ReplyDeleteజీడి పప్పు శ్రీ వారి కిచాను
అయ్యెను కిచడీ ఉప్మా
అమ్మగారి 'లాఫు టాపు
కవిత అయ్యెను టపా ఉప్మా
మా కామెంటు అయ్యెను జిలేబీ చెప్మా !
చీర్స్
జిలేబి.
హ హ హ హ..సూపర్ అండీ..... ఇక్కడ కూర్చుని ఇలా నవ్వుతుంటే జనాలు వింతగా చూస్తున్నారండీ..... :-)
ReplyDelete@ రామకృష్ణ గారూ ధన్యవాదాలు.
ReplyDelete@ రామ్ గారూ ధన్యవాదాలు.
@ మధురవాణి గారూ అది మా వారి స్పెషల్ లెండి. ఉప్మాలో చెక్క, లవంగాలు వేస్తుంటారు. ఇంకా కొంచెం పసుపు కూడా... మా పిల్లలు 'the best upma' అని సర్టిఫికేట్ ఇచ్చేశారు..వాళ్లిచ్చారని కాదు కాని నిజంగానే బావుంటుంది. ధన్యవాదాలు..
@ జిలేబి గారూ ధన్యవాదాలు...
ReplyDelete@ మాధవి గారూ ఏం చెప్పారు మరి వాళ్లకు?
:) ధన్యవాదాలు...
లవంగాల పొడిలో తడిసిన
ReplyDeleteవానచినుకుల ఉప్మా తింటున్న
మీ మదిలోని భావాలను
చెంచాతో లాప్ టాప్ కెక్కించండం
తాంబూలం వేసుకున్నంత
అందంగా వుంది.
నవ్వించారు.. :) చాలా బాగుంది.
ReplyDeleteమా అత్తగారు ఉదయం పూట చేసుకునే పూజ గుర్తొచ్చింది.
చాలా బాగుంది ఉప్మా. ఇంకా నవ్వుతూనే ఉన్నాను.
ReplyDelete:) :) :) చాలా బాగుంది మీ ఉప్మా....కవిత... కిచిడి... ప్చ్ రాయటం రావట్లేదండీ... :) :) :)
ReplyDeleteహహహహ...భలే నవ్వించారండీ.
ReplyDeleteఈ కవితకి మాత్రం "శ్రీవారి ఉప్మా" అని పెట్టాలి పేరు :)
ఉప్మా వేదం!! చాలా బాగుంది :)
ReplyDelete@ శ్రీ లలిత గారూ వ్యాఖ్యలో కూడా కవిత్వం ఒలికించేశారుగా..బావుందండీ...ధన్యవాదాలు.
ReplyDelete@ కృష్ణ ప్రియ గారూ :) ధన్యవాదాలు.
@ సుబ్రహ్మణ్యం గారూ ధన్యవాదాలు
@ సునీత గారూ అన్ని స్మిలీలిచ్చారు చాలు. ధన్యవాదాలు.
ReplyDelete@ సౌమ్య గారూ అలాగే పెట్టేద్దాం. :) ధన్యవాదాలు
@ రాజి గారూ ధన్యవాదాలు.
మీ ఉప్మా కవిత బాగుందండి :)
ReplyDelete@ శ్రీ లలిత గారూ చెప్పడం మరిచాను. మీరు నా బ్లాగుకు రావడం చాలా ఆనందంగా వుంది.
ReplyDelete@ మాలా కుమార్ గారూ ధన్యవాదాలు.
lol
ReplyDeleteరోజూ ఇంటిలో జరిగే భాగవతాన్ని ఎంత బాగా చెప్పారండి? నవ్వు ఆపుకోలేక పోతున్నాను..
ReplyDeleteరసజ్ఞా, మంజుల గారూ ధన్యవాదాలు.
ReplyDeleteచాలా బాగుంది
ReplyDeleteఉప్మాలో లవంగాలు వేస్తారా?
శైలజ గారూ స్వాగతం....ఉప్మాలో లవంగాలు వేయమండీ. కానీ మా ఇంట్లో చేస్తున్నది టొమాటో బాత్ పిల్లలు ఎందుకో ఆ పేరు చెపితే తినరు అందుకని మాక్కూడా ఉప్మా అనే అలవాటయిపోయింది. ధన్యవాదాలు.
ReplyDeleteఉప్మాలో లంగాలు, దాల్చిన చెక్క ఏమిటి? తిష్టంగాతినే వారుంటే జాజికాయ, రాతిపువ్వు, మిరియాలు, ధనియాలు, మెంతులు, గసాలు, పలావ్ ఆకులు, జింజర్-గార్లిక్ పేస్టు కూడా వేసుకోవచ్చు. కావాలనుకుంటే దాన్ని పలావుప్మా అని పిలుచుకోవచ్చు.
ReplyDeleteబావా ఉప్మా - అదిరింది
ReplyDeletehahahah....baagundee nenuu mmargadarshilo sabhyatvam teesukuntaa....
ReplyDelete@ అజ్ఞాత గారూ కొత్త అయిడియా ఇచ్చారు ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.
ReplyDelete@ సుధీర్..రెగ్యులర్ గా బ్లాగ్ చూస్తున్నావన్నమాట. చాలా సంతోషం
@ ఎన్నెల గారూ సభ్యత్వ౦ ఎందులో అర్ధం కాలేదు. మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.
బీటలు వాడిన నేలపై
ReplyDeleteజీడిపప్పుల సంబరమా...
భలే భలే ....బాగుంది మీ ఉప్మా వేదం
శ్రీకరుడు గారూ..స్వాగతమం....వెనక్కి వెళ్ళి మరీ చదివి మీ అభిప్రాయం తెలిపారు. ధన్యవాదాలండీ..
DeleteO stri vijayam venuka garite pattina magadumtadanna mata. :)
ReplyDeleteఫణీంద్ర గారూ...వెనుక కాదండీ తోడుగా..ధన్యవాదాలు.
Deleteసూపర్ జ్యోతిర్మయిగారు... చూడండి మీవారూ, మీ అమ్మలూ ఎంత మంచివాళ్లో... మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయకుండా క్షణాల్లో ఉప్మా తయారు చేసేశారు... :)
ReplyDeleteశోభ గారూ....అవునండి చాలా మంచివారు. ఇలా కవితలు ప్రోత్సాహం ఇస్తున్నారు కదా.. :) ధన్యవాదాలు.
DeleteSuper :)
ReplyDeleteధన్యవాదాలు హర్షా.
DeleteLOL. Brilliant! స్వీట్‌హోం లో విమల రాసుకోడం, బుచ్చిబాబు వంట చెయ్యడం గుర్తొచ్చాయి.
ReplyDelete:-) ధన్యవాదాలు కొత్తపాళీ గారు.
Delete