ఓ తాతయ్య చేతిలో సంచితో గుమ్మం బయట చెప్పులు వదిలి లోపలకు వచ్చారు. బెల్ కొట్టడాలు అవీ అప్పుడు లేవుగా. అందుకే సరాసరి లోపలికే వచ్చేశారు. పొద్దున్న నిద్ర లేచి తలుపు తెరిస్తే రాత్రి పడుకోబోయేముందే తలుపు వేయడం. తలుపులు మూసి ఉంచితే ఇంటికి అరిష్టం కదూ! అంతగా రోడ్లోకి కనిపిస్తున్నామనుకుంటే కర్టన్ వేసుకోవాలిగాని. ఆ తాతయ్య లోపలి వచ్చి
"ఏం పాపా ఎప్పుడొచ్చినావా? మీ తాతయ్య ఉండాడా?" అన్నారు.
నాకేమో ఆ వచ్చిన తాతయ్యెవరో గుర్తు రావడంలేదు. అయినా సరే మీరెవరో నాకు తెలీదండీ అనకూడదు, అది మర్యాద కాదు కదా. "తాతయ్య లేరు బయటకెళ్ళారు. కూర్చోండి అమ్మమ్మను పిలుస్తాను." అని చెప్పి అమ్మమ్మను పిలవమని చిట్టిని పంపాను. తాతయ్య సంచి పక్కన పెట్టి అక్కడున్నఆకుపచ్చ గాడ్రెజ్ కుర్చీలో కూర్చున్నారు. ఈలోగా లోపలనుండి అమ్మమ్మ, పిన్ని వచ్చారు.
"ఏవన్నా బావుండావా. ఇప్పుడేనా రావడం?" అని తాతయ్యను కుశలం అడిగి "తాతయ్యకు మంచినీళ్ళు తీస్కరాపో నాయనా" అని నాతో చెప్పింది.
"పొద్దునొచ్చినానమ్మా. ఎంకట్రెడ్డిని ఆసుపత్రిలో జేర్చినారూ, వాడితో వాళ్ళమ్మ కూడా ఆసుపత్రిలో ఉంటే ఆయమ్మకు అన్నమిచ్చి రమ్మని మీ ఒదిన నన్ను బంపినాది, సరే ఎట్టా నెల్లూరొస్తినే రెడ్డిన్జూసి పోదామని ఇటొచ్చినా". అన్నాడు తాతయ్య.
"నాల్రోజుల్నాడు ఎంకట్రెడ్డి రోడ్డుమీద బోతావుంటే చూసినానన్నా .. కాలు కట్టుకునట్టే ఉందే. అబ్బయ్య బాగా తిరగతా ఉండాడు, తగ్గిపోయింది గావాల్ననుకున్నా. మళ్ళీ తిరగబెట్టిందా?" అడిగిందమమ్మ పైట చెంగుతో చేతులు తుడుచుకుంటూ.
"కాలు బాగయినాక కుదురుగేడుంటాడమ్మా. పొద్దులొస్తం కట్ట మీద పడి తిరుగతా వుళ్ళా, కాస్త ఎండ బెట్ట తగిలినాదంట. రెండ్రోజులు ఆసుపత్రిలో ఉంచి సెలైను గట్టాలంట". అన్నారు. ఈ లోగా నేను స్టీలు గ్లాసు, చెంబుతో నీళ్ళు తెచ్చి పిన్నికిచ్చాను. పిన్ని నీళ్ళు గ్లాసులో పోసి తాతయ్యకిచ్చింది.
"నాకెందుకు తెలీదమ్మా మన ఇజ్యమ్మ కూతురు గదా, అచ్చం చిన్నప్పుడిజ్యమ్మను చూసినట్లే వుళ్ళా...ఎప్పుడొచ్చినారు?" అంటూ గ్లాసులో నీళ్ళు ఎత్తి పట్టకుని గటగటా తాగేసి చేతిలో గ్లాసు కుర్చీపక్కగా పెట్టాడు తాతయ్య.
"అమ్మాయోళ్ళు రాలా..సెలవలియ్యంగనే వాళ్ళ తాత బొయ్యి జోతిని తీసుకొచ్చినాడు." అందమ్మమ్మ. కుర్చీ పక్కనున్న గ్లాసు, అమ్మమ్మ చేతిలో చెంబు తీసుకుని అన్నం సరిపోతుందో మళ్ళీ వండాల్నో చూడడానికి లోపలికి వెళ్ళిపోయింది పిన్ని.
"ఇజ్యమ్మకు స్కూల్ సెలవలేగా, రమ్మన్జెప్పలా?"
"జెప్పినావన్నా..రామకిష్టయ్యకు సెలవల్లేవ౦ట. వచ్చేనెల్లో వస్తారంట." అంది.
"ఏం పాపా నేను గుర్తు౦డానా?" అని అడిగాడు తాతయ్య నా వైపు చూస్తూ.
తల అడ్డంగా నిలువుగా పక్కగా తిప్పాను. గుర్తు పట్టలేదంటే బావుండదు గదా. ఈ పెద్దవాళ్ళు అప్పుడప్పుడు భలే ఇరకాటంలో పెట్టేస్తారు. నా ఇబ్బంది గమనించి "పోయిన ఎండాకాలంగాక అంతకముందు ఎండాకాలమేగా అమ్మాయోళ్ల౦దరూ మీ ఊరికొచ్చి౦ది. అప్పుడే మర్చిపోద్దా" అంది అమ్మమ్మ. ఆ హింటుతో ఆయనెవరో గుర్తొచ్చింది. కోటపాడు తాతయ్య, అంటే తాతయ్య చిన్నప్పటి ఫ్రెండన్నమాట. ఆ తాతయ్య వాళ్ళ ఊళ్లోనే ఎద్దుల బండి మీద ఏటి దగ్గర కెళ్ళింది. చుట్టూ సరుగుడు తోటలు మధ్యలో చిన్న ఏరు పారుతూ ఉంటుంది. ఆ ఏటి ఒడ్డున ఇసుకలో కూచుని ఆడుకున్నాం కూడానూ. ఈ తాతయ్య అప్పుడు తాటికాయలు కొట్టి ఇచ్చాడు.
"అమ్మా రెడ్డెప్పుడొస్తాడు?" అన్నాడు తాతయ్య బుజం మీద ఉన్న టవల్తో మొహం తుడుచుకుంటూ..

ఆ వెంకటరెడ్డి ఎవరో ఎందుకు కాలికి దెబ్బతగిలిందో అమ్మమ్మ తరువాత చెప్పింది. పొలంలో పని చేస్తుంటే కాలుకి ముల్లు గుచ్చుకు౦దంట. ముల్లేగదా యేంజేస్తు౦దిలే అని పట్టించుకోలేదంట. అది సెప్టిక్ అయి చీము పట్టి కాలు తీసెయ్యాల్సిన పరిస్థితొస్తే పెద్దాసుపత్రిలో నెల్రోజులు౦చుకుని కాలు బాగు చేశారంట. ఆ వెంకటరెడ్డి ఎప్పుడూ పొలమూ, పొలమూ అని పొలం చుట్టూనే తిరుగుతా ఉంటాడంట.
"మావా అత్తమ్మ బావుందా" అడిగింది పిన్ని.
"మావా అత్తమ్మ బావుందా" అడిగింది పిన్ని.
"ఆ..ఆ..బావుండాదమ్మా" చెప్పాడు తాతయ్య.
"ఎట్టా నెల్లూరొస్తంటివే ఒదిన్ని దీసుకురాగూడదన్నా చాన్నాళ్ళవలా చూశా" అందమ్మమ్మ.
"మీ ఒదిన కేడ కుదరద్దమ్మా కొడుకూ కోడలూ చీకట్నేపొలం బోత౦ట్రే, పిలకాయల్తో సరిపోతావుళ్ళా" అని నీళ్ళు ఇంకొంచెం పొయ్యమన్నట్లుగా గ్లాసు ముందుకు పెట్టాడు. పిన్ని గ్లాసు నిండుగా నీళ్ళు పోసింది.
"ఇదిగో వస్తా, అదిగో వస్తా అంటానే ఉందిగాని రానే రాదుగా మా ఇంటికి" అని నా వైపు చూస్తూ "మనవరాల్ని గుర్తుబట్నావాన్నా" అందమ్మమ్మ.
"ఎట్టా నెల్లూరొస్తంటివే ఒదిన్ని దీసుకురాగూడదన్నా చాన్నాళ్ళవలా చూశా" అందమ్మమ్మ.
"మీ ఒదిన కేడ కుదరద్దమ్మా కొడుకూ కోడలూ చీకట్నేపొలం బోత౦ట్రే, పిలకాయల్తో సరిపోతావుళ్ళా" అని నీళ్ళు ఇంకొంచెం పొయ్యమన్నట్లుగా గ్లాసు ముందుకు పెట్టాడు. పిన్ని గ్లాసు నిండుగా నీళ్ళు పోసింది.
"ఇదిగో వస్తా, అదిగో వస్తా అంటానే ఉందిగాని రానే రాదుగా మా ఇంటికి" అని నా వైపు చూస్తూ "మనవరాల్ని గుర్తుబట్నావాన్నా" అందమ్మమ్మ.
"నాకెందుకు తెలీదమ్మా మన ఇజ్యమ్మ కూతురు గదా, అచ్చం చిన్నప్పుడిజ్యమ్మను చూసినట్లే వుళ్ళా...ఎప్పుడొచ్చినారు?" అంటూ గ్లాసులో నీళ్ళు ఎత్తి పట్టకుని గటగటా తాగేసి చేతిలో గ్లాసు కుర్చీపక్కగా పెట్టాడు తాతయ్య.
"అమ్మాయోళ్ళు రాలా..సెలవలియ్యంగనే వాళ్ళ తాత బొయ్యి జోతిని తీసుకొచ్చినాడు." అందమ్మమ్మ. కుర్చీ పక్కనున్న గ్లాసు, అమ్మమ్మ చేతిలో చెంబు తీసుకుని అన్నం సరిపోతుందో మళ్ళీ వండాల్నో చూడడానికి లోపలికి వెళ్ళిపోయింది పిన్ని.
"ఇజ్యమ్మకు స్కూల్ సెలవలేగా, రమ్మన్జెప్పలా?"
"జెప్పినావన్నా..రామకిష్టయ్యకు సెలవల్లేవ౦ట. వచ్చేనెల్లో వస్తారంట." అంది.
"ఏం పాపా నేను గుర్తు౦డానా?" అని అడిగాడు తాతయ్య నా వైపు చూస్తూ.
తల అడ్డంగా నిలువుగా పక్కగా తిప్పాను. గుర్తు పట్టలేదంటే బావుండదు గదా. ఈ పెద్దవాళ్ళు అప్పుడప్పుడు భలే ఇరకాటంలో పెట్టేస్తారు. నా ఇబ్బంది గమనించి "పోయిన ఎండాకాలంగాక అంతకముందు ఎండాకాలమేగా అమ్మాయోళ్ల౦దరూ మీ ఊరికొచ్చి౦ది. అప్పుడే మర్చిపోద్దా" అంది అమ్మమ్మ. ఆ హింటుతో ఆయనెవరో గుర్తొచ్చింది. కోటపాడు తాతయ్య, అంటే తాతయ్య చిన్నప్పటి ఫ్రెండన్నమాట. ఆ తాతయ్య వాళ్ళ ఊళ్లోనే ఎద్దుల బండి మీద ఏటి దగ్గర కెళ్ళింది. చుట్టూ సరుగుడు తోటలు మధ్యలో చిన్న ఏరు పారుతూ ఉంటుంది. ఆ ఏటి ఒడ్డున ఇసుకలో కూచుని ఆడుకున్నాం కూడానూ. ఈ తాతయ్య అప్పుడు తాటికాయలు కొట్టి ఇచ్చాడు.
"అమ్మా రెడ్డెప్పుడొస్తాడు?" అన్నాడు తాతయ్య బుజం మీద ఉన్న టవల్తో మొహం తుడుచుకుంటూ..
"కోర్టు పనిమీద వకీలుకాడికి బోయినాడన్నా, ఈ పాటికి వస్తా వుండాల" అంటూ వీధి వైపు చూసింది.
సరిగ్గా ఆ సమయానికే గేటు దగ్గర రిక్షా ఆగింది. అందులో నుండి తాతయ్య దిగి రిక్షా అతనికి డబ్బులిచ్చి గేటు తీసుకుని లోపలికి వచ్చి, "ఆ రిక్షా అబ్బాయికి మంచి నీళ్లీ" అని చెప్పారు జనాంతికంగా. తాతయ్య అమ్మమ్మను పిలవాలంటే పేరుండదు మరి. చాలా రోజుల వరకూ అమ్మమ్మకి పేరు౦టుందని నాకూ తెలీదు. అందరూ అమ్మమ్మని అత్తా, ఒదినా, పెద్దమ్మా, నాయనమ్మా, అక్కా ఇలాగేగా పిలుస్తారు.
"ఏం సుబ్బారెడ్డా చానా సేపయిందా వచ్చి" అని అడిగారు తాతయ్య అక్కడే ఉన్న ఇంకో కుర్చీలో కూర్చుంటూ.
"ఇప్పుడేలే ఓ అర్ధగంటయి౦ది వచ్చి. నువ్వేంది కోర్టుకు బోయినావట్నే?" ఆరాగా అడిగాడు ఇంటికొచ్చిన తాతయ్య.
"ఆ వెంకటరాజు పాలెం కాడ రోడ్డు పక్కన మన స్థలం ఆరంకణాలుళ్లా, దాన్ని గవర్నమెంటోళ్ళు రోడ్డు వెడల్పు జేస్తా కలిపేసుకుంటు౦డారూ. ఆ విషయం మాట్టాడేదానికి వకీలు కాడికి బొయినా.
"ఒంటిగంటవతావుంది. అన్నంది౦దురుగాని లేవండన్నా. సుగుణా బావికాడ గంగాళంలోకి నీళ్ళు తోడతా, మీ నాయనోళ్ళు చేతులు, కాళ్ళు గడుక్కుంటారు." అని లోపలున్న పిన్నికి వినిపించేట్లు గట్టిగా చెప్పి౦ది.
"ఇంటికాడ పొద్దున్నే అన్నం తినేసొచ్చినాను. ఇప్పుడన్నాలవీ ఒద్దులేమ్మా రెండుగంటల బస్సుకి ఊరికి బోవాల" అని మొహమాటపడి పోయారు.

"మిట్టమద్దానం ఎండలో యాడికి బోతావ్లే. మీ చెల్లెలు పొద్దున్న చాపల్దీసుకుంది. అన్నందిని కాసేపు పొణుకో. సాయంకాలం బోవచ్చులే" అని తాతయ్య అన్నాక రెండో తాతయ్య కూడా భోజనానికి లేచారు.
తాతయ్యావాళ్ళు భావిదగ్గరకు పోయాక నేనూ అమ్మమ్మ వంటిట్లోకి పొయ్యాం. అమ్మమ్మ, అంచున్నపెద్ద కంచాలు రెండు తీసి "రవన్ని నీళ్ళు తొలుపుకురా నాయనా" అని ఇచ్చింది. వాటిని సందులో ఉన్న బకెట్లో నీళ్ళతో ఒకసారి కడిగి ఇంట్లోకి తెచ్చాను. ఈలోగా అమ్మమ్మ కూరలన్నీ స్టీలు గిన్నెల్లోకి తీస్తూ ఉంది. నేను లోపలకు వచ్చి రెండు పీటలు వాల్చి, రెండు గ్లాసులు పెట్టి మూలనున్న ఎర్రని కుండలోని నీళ్ళు చెంబుతో ముంచుకొచ్చి పెట్టాను. వాళ్ళు భోజనాలకు కూర్చోగానే పక్కింటి కరుణ వచ్చింది.
ఇద్దరం సందులోనుండి పరిగెత్తుతూ వెళ్లి వేప చెట్టు కింద రాలిపడ్డ వేప పుల్లలేరడం మొదలు పెట్టాం. వాటితో ఏం చేస్తాం అనుకుంటున్నారా..మా బుడ్డీల సంసారానికి చిన్న చిన్న చీపుర్లు కావద్దూ..ఇంకా రెండు చివర్లు తుంచి, మస్తానన్న మిషన్ దగ్గర తెచ్చిన గుడ్డ ముక్కలతో పెళ్లి కూతురు, పెళ్ళికొడుకు బొమ్మలు కూడా చేస్తాం. అప్పుడప్పుడూ పుల్లలాట కూడా వాటితోనే. అసలు పుల్లలాటకు చీపురు పుల్లలైతే బావుంటాయి కానీ "చీపుర్లో పుల్లలన్నీ లాగేసి సన్నంగా జేస్తావు౦డారు చిమ్ముతావుంటే చేతిలో నిలవక ఈడో పుల్ల ఆడో పుల్ల జారిపోతున్నాయని" అమ్మమ్మ కోప్పడిందిగా అందుకని వేప పుల్లలు ఏరుకుంటున్నామన్నమాట.
బైట బాగా ఎండగా ఉంది. పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తే "తెల్లారి లేస్తే ఆటలేనా మద్దినేళ రొంతసేపు పడుకోకూడదా" అని కేకలేయ్యక ముందే మా సామానంతా ఉన్న బుట్ట తీసుకుని మిద్దిమీద గదికి ఆనుకున్నగూట్లో చేరిపొయ్యాం.
మొన్నేమో దోసలు, అమ్మమ్మను గుర్తుకు తెచ్చారు.
ReplyDeleteఈ రోజు చిన్నపటి ఆటలు,అమ్మమ్మ ప్రేమతో కొప్పడ్డ రోజులు గుర్తుకు తెచ్చారు.
ఏవమ్మోయ్ జ్యోతి,
ReplyDeleteమా బాగ నెల్లూరు యాస కనిపిస్తా కథనం నడస్తా వుండాదే!
జ్యోతిర్మయీ గారు,
శహభాష్ ! చాలా బాగా రాసారు ! కథనం కళ్ళకు కట్టినట్టు 'ఉండాది' !!
చీర్స్
జిలేబి.
ఈ తాతయ్యలు, బాబయ్యలు ఇంతేనమ్మా, ఉత్తి పిచ్చాళ్ళు. బాగుందమ్మాయ్
ReplyDeleteనాది కూడా జిలేబీగారి మాటే కథనం నెల్లూరు యాసతో బాగుండ్లా.
ReplyDeleteఇంకో పూట నెల్లూరులో తిప్పారు...
ReplyDeleteబలుంది...అచ్చం నెల్లూరు బొయొచ్చినట్టే :)
ఎండాకాలం తాటికాయలు గురించి మరికాస్త చెప్పాల్సింది.
యాస డామినేట్ చేసింది లే ...అయితే ...అల తీస్కెళ్ళి అన్ని చుపించుండ్ల ...భలే ఉంది లే జ్ఞాపకం
ReplyDeleteఏందమ్మా ఇది నెల్లూరు యాసా, కడప యాసనుకుండానే.
ReplyDeleteబాగా వ్రాస్తున్నారు..అచ్చు ఎదురుగా జరుగుతున్న దృశ్యాలని చూస్తున్నట్టే ఉంది మీ టపా చదువుతుంటే! అలా కళ్ల ముందు నిలబెట్టేసారు!
ReplyDelete"జ్యోతిర్మయి" గారూ ...
ReplyDeleteఎండాకాలం ఉదయం ముచ్చట్లు తర్వాత మధ్యాహ్నం కబుర్లు కూడా చెప్పేశారన్నమాట
ఎండవేళలో ఆటల ముచ్చట్లు బాగున్నాయండీ .
మీకు ఉగాది శుభాకాంక్షలండీ..
ReplyDelete@ వెన్నెల గారూ..గుర్తు తెచ్చుకునే కొద్దీ మధురంగా ఉన్నాయి జ్ఞాపకాలు. ధన్యవాదాలు.
ReplyDelete@ జిలేబక్కా..చెప్పేదానికి ఏవుందె...అంతా ఆ రంగనాయుకుల సామి దయ..ఆ సామి నడిపిస్తా ఉండాడు, కథ నడస్తా ఉంది. ఏదో చనువుకొద్దీ అక్కా అన్నాగాని ఏవనుకోబాక.
:) ధన్యవాదాలు.
@ బాబాయ్ గారూ తాతయ్యలు, బాబాయిలు మమతను పంచేవాళ్ళ౦డీ..ఈ రోజుకీ ఫోన్ చేస్తే అదే ఉత్సాహంతో కబుర్లు చెప్తుంటారు. ఈ గ్లోబలైజషణ్ వాళ్ళనేమాత్రం మార్చలేకపోయింది. ధన్యవాదాలు.
ReplyDelete@ విజయమోహన్ గారూ మీలాంటి పెద్దలు మెచ్చుకోవడం చాలా ఆనందం. ధన్యవాదాలు.
@ చిన్ని ఆశ గారూ నెల్లూరు వెళ్ళొచ్చారా చాలా సంతోషం. ఇంతకూ మూడు హాళ్ళలో సినిమా చూశారా లేదా..
తాటికాయల గురించి ఇంకో పెద్ద పోస్ట్ రాసుకుందాం లెండి. ధన్యవాదాలు.
@ శేఖర్ గారూ మీరు తొలిసారిగా నా బ్లాగుకు వచ్చారనుకుంటాను. స్వాగతం. మీరన్నట్టు ఈ పోస్ట్ లో నెల్లూరు భాష ఎక్కువగా కనిపించి౦ది. నా జ్ఞాపకాలు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.
ReplyDelete@ అజ్ఞాత గారూ..ఏమైనా తప్పులుంటే మన్నించండి. నేను నా చిన్నప్పుడు కొన్ని వేసవులు నెల్లూరులో గడిపాను కాని అక్కడ పెరగలేదు. మీ పేరు చెపితే బావుండేది. ధన్యవాదాలు.
@ సిరిసిరిమువ్వ గారూ అంతా మీ అభిమానమండీ..ధన్యవాదాలు.
@ రాజి గారూ వేసవి మధ్యాహ్నాలు భలే వుండేవి. ఎండ, వేడి ఆ వయసులో తెలిసేవి కావసలు. ప్రతి టపా చదివి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు బోలెడు ధన్యవాదాలు.
ReplyDelete@ సుభా నీక్కూడా ఉగాది శుభాకాంక్షలు..
ఇప్పుడు మూడు హాళ్ళు భలే వున్నాయి కదా జ్యోతిర్మయి గారూ బిజినెస్ మెన్ ఆడే చూసొచ్చా .పోస్ట్ బాగుంది
ReplyDeleteనెల్లూరి ఇల్ళేరమ్మ కతలన్నమాట. రాయండి రాయండి
ReplyDelete@ సామాన్యగారూ మూడు హాళ్ళకు వెళ్ళొచ్చారా ఎంతదృష్టం..ఇంకా ఆ హాళ్ళు అప్పటిలానే ఉన్నాయా..ఈ సారి ఇండియా వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అందులో సినిమా చూడాలి. ధన్యవాదాలు.
ReplyDelete@ నారాయణ స్వామిగారూ ఇల్లేరమ్మ కథలతో పోల్చారా..మీ అభిమానానికి ధన్యవాదాలండీ..
జ్యోతిర్మయి గారు.. కృష్ణ,కావేరి,కల్యాణి ..నాకు తెలుసు. కల్యాణి వారు అయితే మా ప్రక్కనే కూడా. ఏమిటో..ఓ..పద్నాలుగేళ్ళు పెన్నా తీరాన ఉండి..నెల్లూరు వీది వీధి తిరిగి..అంతా మన సొంతమే అనుకున్నాను. కానీ అలా కాకుండా జారిపోయినా..జ్ఞాపకాలలో..పచ్చిగా..మా నెల్లూరు అనుకుని మురిసి పోతాను. గూగుల్ మ్యాప్ లో మా అనుకున్నవాటిని చూసి వస్తుంటాం. అనుబందం అంటేను అప్పని.. ఇంకా తీరలేదు.. తీరవు కూడా.
ReplyDeleteనెల్లూరు లో డిగ్రీ చదివాను.ఆ యాస తో పరిచయం బాగా వ్రాశారు.
ReplyDeleteజ్యోతిర్మయి గారు, మీరు నెల్ల్లూరి యాస బాగా రాసారు. నా రెడ్డి మిత్రులు వాడే పదాలన్నిటిని సుమారుగా కవర్ చేశారు. మీరు కూడా రెడ్డెమ్మ ఐతే కొంచెం ఎక్కువగా ఆనందిస్తాను. మహిళా రచయితలలో ఈ వర్గం నుంచి అతి తక్కువ మంది ఉన్నారు. అన్ని వర్గాల నుండి రచనలు ఎన్ని వస్తే, అంతగా ఇతరుల అభిప్రాయాలను అర్థం చేసుకోవటం జరుగుతుంది కదా! ఇక ఒకప్పుడు నెల్లురి నుంచి డాక్టర్|| సోమిరెడ్డి జయప్రద గారు నవలలు రాసేవారు. ఆతరువాత మహిళల కేటగిరిలో పెద్దగా రచయితలు ఉన్నట్లు తెలియదు. మీ బ్లాగు గురించి జమిన్ రైతు పేపర్ వారికి ఎవరైనా తెలియజేస్తే మీ గురించి ఆపేపర్లో రాస్తారే చూడాలి.
ReplyDeleteRegds,
beautiful
ReplyDeleteఅది ఏ జిల్లా యాస అయినా సరే చక్కగా ఉన్నదున్నట్టుగా రికార్డు చేసి వ్రాసిన దేదైనా చదివితే నాకు అన్నం తినకుండానే కడుపు నిండిపోతుంది.కథ కథనం అక్కరలేదు. మామూలు కబుర్లే చాలు. ఆ మాటలే అక్కడి మనషుల్ని సజీవంగా మాముందు నిల్పుతాయి.చాలా బాగా రాసేరు. ఇంకా రాయండి. రాస్తూ ఉండండి.నాకది షడ్రసోపేత భోజనం.
ReplyDelete@ వనజ గారూ నా జ్ఞాపకాల సవ్వడి మీ జ్ఞాపకాల్ని నిద్ర లేపినట్లు౦ది. ఆ వూరితో వున్న అనుబంధం అలాంటిది. ఈ కబుర్లన్నీ ఎప్పటి మాటో మరి..మనసులో నిలిచి వెన్నెల్లు కురిపిస్తున్నాయి. ధన్యవాదాలు.
ReplyDelete@ రవిశంకర్ గారూ ఎండాకాలం అమ్మమ్మగారింటికి వెళ్ళిన అనుబంధమేనండీ. ఆ భాష వింటే ఎందుకో మనసు పులకిస్తుంది. ధన్యవాదాలు.
@ అజ్ఞాత గారూ ఒక ప్రాంతానికి సంభందించిన భాష ఒక వర్గానికి పరిమితం కాదేమో నండీ..ఆ వూరి మీద వుండే అభిమానంతో అదే భాషతో నా జ్ఞాపకాలను పంచుకున్నాను. మీ అభిమానానికి ధన్యవాదాలు.
ReplyDelete@ ఫణిగారూ ధన్యవాదాలు.
@ గోపాలకృష్ణ గారూ మీ వ్యాఖ్యతో నా కడుపు నిండిపోయింది. మీలాంటి పెద్దల ఆశీర్వాదంతో ఇంకా రాయగలననే అనుకుంటున్నాను. మీ అభిమానానికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను.
కూసింత సేపు కూకోనేవు గందా... నేత్రీ పగలూ నేకుండా మయాన్న కాల్లకడ్డం పడుతూ ఒకటే ఈ గోల ఏటంటే సేప్పినావు గదా జోతెమ్మా ... ఒకేపాలి వూష్ణమంత వేసంకాలన్ని .. ఐసు ప్రూటు లా సేసేసినావు .. అద్గదీ నెక్క .. !!
ReplyDeleteహ హ ఇది మా యాస. చాలా బాగా రాసేరండీ జ్యోతి గారూ పోస్ట్ .. భలే ఫీల్
--సాయి పద్మ
సాయి పద్మ గారు ముందుగా నా బ్లాగుకు స్వాగతం.
Deleteమీ వ్యాఖ్య కూడా అలాగే వుంది పద్మ గారు. :))
ధన్యవాదాలు.
జ్యొతిర్మై గారు ఛాల బాగ రాసారండీ.ఛదువు తుంటె ఛాలా హాఇగ ఉంది.
ReplyDeleteధన్యవదాలు సుబ్రహ్మణ్యం గారు.
Deletemeeku bavukatha mariu telugu basha meeda inta pattu ela vachindi
ReplyDeletenizamga bale thrill ga untundi.
తెలీదండి. భాష మీద కృషి చేయవలసింది ఇంకా చాలా ఉంది. థాంక్యు సుబ్రహ్మణ్యం గారు.
DeleteGood taste . You look familiar , do you have elder or younger sisters who studied in polytechnic college.
ReplyDeletegood luck
అజ్ఞాత గారూ మా అక్కచెల్లెళ్ళు ఎవరూ పాలిటెక్నిక్ కాలేజ్ లో చదవలేదండీ. థాంక్యు
Delete