Monday, December 5, 2011

మా బుజ్జోడి భోజనం

“బుజ్జి పండూ అన్నం తిందువు రా నాన్నా...”
“నాకన్నమొద్దు..”
“బంగారు కదూ.. రామ్మా. కథ చెప్తాగా”. తీసుకొచ్చి హై చైర్ లో కూర్చోపెట్టాను.
ప్లేట్ వైపు చూసి “నాకు బెండంకాయ వద్దు.”
“బె౦డకాయ కాదు ఇది టమోటా కూర”
“నాకు టంటంమ్మో వద్దు.”
“సరే టమోటో వద్దులే కథ విను.”
“ఒక సారి ఏమయ్యిందో తెలుసా! ఒక ముద్ద నోట్లో పెట్టాను. “పెద్ద గాలొచ్చింది....చెట్లన్నీ ఊగిపోతున్నాయి“ రెండో ముద్ద, చిన్నగా వర్షం మొదలయ్యింది.” మూడో ముద్ద పెట్టబోతుండగా..
“నాకు ట౦ట౦మ్మో వద్దూ..”
వర్షం కాస్తా పెద్దదయింది. చెట్లు, పక్షులూ, జంతువులూ అన్నీ తడిసిపోతున్నాయి. ఇంకో రెండు ముద్దలు పెట్టేసాను.
“చైకిలు కూదానా?”
“ఆ సైకిలు కూడా”...ఇంకో ముద్ద పెట్టేసా.
“అప్పుడు నువ్వెక్కదున్నావ్?”
“నేను, అమ్మమ్మ, మామయ్య, తాతయ్య అందరం ఇంట్లో ఉన్నాం. ఇల్లంతా చీకటి.” ఇంకో రెండు ముద్దలు.
“మరి నాన్న ఎక్కద వున్నాలు?”
“నాన్న అప్పుడు నాకు తెలీదుగా.” ఇంకో ముద్ద..
“ఎందుత్తెలీదు?”
“ఎందుకంటే అప్పుడు నేను చిన్నదాన్ని కదా అందుకని.” ఇంకో ముద్ద...
“మలి నేను చిన్న నాకు నాన్న తెల్చుగా..”
ఈ నేపధ్య౦లో కూరన్నం పెట్టడం పూర్తయ్యింది.
“పెరుగన్నం పెట్టనా?”
“నాకు పెలుగొద్దు.”
“అదికాదు నాన్నా అప్పుడేమో ఒక పెద్ద వేపచెట్టు ఉండేది మా ఇంటి వెనుక.” అన్నం కలుపుతూ..
“వేప చెత్త౦తే?”
“వేప చెట్టంటే బే ట్రీ లాగా అదో పే....ద్ద చెట్టు. నీకు ఇండియా వెళ్ళినప్పుడు చూపిస్తాలే.” ఒక ముద్ద పెడ్తూ...
“నిమ్మతాయి పెత్తావా?”
“ఆ నిమ్మకాయ పెట్టాను, నువ్వు తిను మరీ..”
“అప్పులేమైంది?”
“అప్పుడూ గాలికి చెట్టు ఊగుతుందా..ఎప్పుడు ఇంటి మీద పడుతుందో అని భయం. రాత్రంతా వర్షం గాలి తగ్గలా..” ఇంకో ముద్ద....
“ఆ వర్షం రాత్రి అలానే నిద్ర పోయాం.” అమ్మయ్య అన్నం పెట్టడం పూర్తయ్యింది.
“నిద్ర లేచిసరికి గాలివాన తగ్గింది. ఆ చేట్టేమో వేరేవైపుకు పడిపోయింది."
"ఇంతి మీద పదలేదా?"
"లేదు వేరేవైపు పడిపోయింది." అన్నాను మూతి తుడుస్తూ.
"పాపం చెత్తు."
"అవును నాన్నా పాపం చెట్టు".

వాడికి నాలుగు నిండేదాకా ఈ విధంగా ఉండేది ప్రతి పూటా మా బుజ్జోడి భోజన కార్యక్రమం. కథలో మునిగిపోయి ఏం పెట్టినా తినేసేవాడు. మా కథల్లోకి భూకంపాలు, వాల్కనోలు, వరదలు వచ్చేస్తు౦డేవి. అప్పుడప్పుడూ పిల్లి, నక్క, ముసలి, ఎలుగుబంటి లాంటివి, మరికొన్ని రోజులు మర్యాద రామన్నలు, లవకుశులు..వీరు కూడా వచ్చేవార౦డోయ్. ఇలా మాట్లాడబట్టేమో మా పిల్లలిద్దరికీ భాషతో సమస్య రాలేదు. వాళ్ళు ఇండియా వెళ్ళినప్పుడు కూడా అందరితో స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడగలుతున్నారు.

30 comments:

  1. అమ్మాయ్! జ్యోతిర్మయీ!
    నీ లాంటి తల్లులు కావాలమ్మా దేశానికి. అప్పుడే పిల్లలు బాగుంటారు.

    ReplyDelete
  2. బే త్లీ అంతే ఏంతీ...?

    ReplyDelete
  3. నాకు ఇంట్లో ఎప్పుడూ అన్నం తినిపించే బాధ్యత అమ్మమ్మదే. నా డిగ్రీ అయ్యి హాస్టల్లో చేరే దాకా మా అమ్మమ్మ నాకు రోజుకొక కథ చెప్పాల్సిందే అదీ పురాణాలకి సంబంధించినది లేదా ఏదయినా ఋషుల గురించి. ఎప్పుడయినా విన్నది చెప్తే అస్సలు తినేదానిని కాదు. అలా ఎన్ని నేర్పిందో! ఇలా ఎవరయినా కథలు చెప్తూ తినిపిస్తే ఎంత బాగుంటుందో! ఇక్కడ ఉండి కూడా ఇలా కథలు వింటూ తింటున్నాడంటే అదృష్టవంతుడే!

    ReplyDelete
  4. శర్కరి గారు బాగుంది అండి.. మాకు తినిపిస్తున్నారు అనిపించింది.. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేశారు మీరు చాల నయ్యం అండి.. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మా ఇంట్లో ఉండి చడువుకోనేవాడిని. నా ఉహ తెలిసిన దెగ్గర నుంచి అక్కడనే ఉన్నాను..ఉదయం మధ్యానం తినేవాడిని బడినుచి రాగానే సాయంత్రం నేను తినక పోయేవాడిని..అమ్మమ్మా తినిపించేది కాని నేను అసలు తినక పోయేవాడిని.. ఒక రేంజ్ లో కొట్టి నోట్లో పెట్టేది అలానే ఏడ్చుకుంటూ తినేవాడిని.. అంత అయిన తరువాత బెల్లం ముక్కనో లేక కొబ్బరి గోలి నో ఇచ్చేది.. అవి ఇవాగానే ఏడుపు మనేషేవాడిని అల కొట్టి తినిపించటం వాళ్ళ చిన్నప్పుడు చాల బొద్దుగా ఉండేవాడిని.. అప్పుడు తెలియలేదు కాని ఇప్పుడు మనతో లేరు కాని జ్ఞాపకాలు అలానే గుండెల్లో ఉన్నాయి..

    ReplyDelete
  5. నిజంగా పసిడి పలుకులే మీ బాబువి. పిల్లలు మాటలు నేర్చుకునేటప్పుడు, మాటలు స్పష్టంగా పలకటం వచ్చేదాకా వారు మాట్లాడే తీరు... నిజంగా ఆ సంతోషం మాటల్లో చెప్పలేము.

    మా చెల్లెలు కూతురు హనీ.. అది మాట్లాడుతుంటే నాకు ఎంత ముచ్చటేస్తుందో. నన్ను పెద్దమ్మ అనడం తనకు తిరగదు. ద్దమ్మా అని పిలుస్తుంది. మాట తిరగకపోతే సలే.. సలే అంటుంది. నిజ్జంగా నాకు మీ పోస్టు చదువుతుంటే తనే గుర్తుకొస్తోంది.

    ReplyDelete
  6. పిల్లలకి కష్టపడకుండా అన్నం పెట్టటం,
    తెలుగు నేర్పించటం లో మీ టెక్నిక్ చాలా బాగుందండీ..

    ReplyDelete
  7. బాగా రాస్తున్నారు. బాగుంటున్నాయి మీ రచనలు.

    ReplyDelete
  8. మీ బుజ్జోడి భోజనం బాగుందండి :)

    ReplyDelete
  9. నాక్కూడా ఒకసారి మీతో కథలు చెప్పించుకుంటూ మాం తినాలని పిస్తోంది:)

    ReplyDelete
  10. @ బాబాయి గారూ..తల్లులందరూ అలానే ఉంటారండీ..పిల్లల్ని పెంచడంలో ఒక్కళ్ళది ఒక్కో పద్ధతి.మీ వ్యాఖ్యానం చూడగానే ఎంత సంతోషంగా అనిపించిందో చెప్పలేను. ధన్యవాదాలు.

    @ ఆత్రేయ గారూ స్వాగతం..మీరు వ్యాఖ్యతో పలకరించక పోతే మీ 'లిపి లేని భాష...' మిస్ అయ్యేదాన్ని. ధన్యవాదాలు.

    @ రసజ్ఞా ఇప్పటికీ కొన్ని సార్లు అలాగే పెట్టాలి. ఎక్కడ ఉన్నా పిల్లలు పిల్లలే కదా..వాడికలా కథలు చెప్పడం నాకు చాలా ఇష్టం. ధన్యవాదాలు.

    ReplyDelete
  11. @ తెలుగు పాటలు గారూ...మీకు పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయన్నమాట. మావారిదీ మీ అనుభవమేనట. ధన్యవాదాలండీ..

    @ శోభ గారూ.. స్వాగతం. పిల్లల వచ్చీరాని మాటలు ఎంత విన్నా తనివి తీరదు. మీ హానీ కబుర్లు బ్లాగులో పెట్టండి, వినాలని వుంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  12. @ రాజి గారూ...పిల్లలతో కబుర్లు చెప్తూ పెట్టడంలో ఒక ఆనందం ఉంటుంది. వారికి మనకి మధ్య సంభాషణ ఒక వారదిలా ఉండి మన బంధం గట్టిపడడానికి తోడ్పడుతుంది. భారతదేశానికి దూరంగా, ఇతర దేశాలలో పెరుగుతున్న పిల్లలకు మన భాష నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్నతనంలో అయితే వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు, పెద్దయ్యేకొద్దీ వారికి బయట ప్రపంచంలో ఎక్కువ సమయం గడపడం వలన నేర్పించాలన్నా నూరుశాతం సఫల౦కాలేము. సాధ్యమైనంతగా వారితో మాట్లాడుతూ, వారిని మాట్లాడిస్తూ ఉంటే వారికి మన భాష నేర్చుకునే అవకాశం కలుగుతుంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  13. @ శిశిర గారూ ధన్యవాదాలు.

    @ మాలా కుమార్ గారూ ఇప్పటికీ ఒక్కోసారి అంతేనండీ మరీ తినకపోతే వాడికిష్టమైన ఇడ్లీలు పెట్టేస్తాను. ధన్యవాదాలు.

    @ జయ గారూ మా ఇంటి కొచ్చేయండి మీకు బాబుతో పాటే కథ చెప్తూ పెట్టేస్తాను. బాల్యం బంగారం కదూ..ధన్యవాదాలు.

    @ వేణు శ్రీకాంత్ గారూ..స్వాగతం. మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  14. చాలా బాగా చెప్పారు. తెలుగు వెలుగులు ఇంటింటా ఇలాగే వర్ధిల్లాలని కోరుకుంటూ.

    ReplyDelete
  15. వనజ గారూ ధన్యవాదాలు.

    ReplyDelete
  16. ఇండియాలో వుంటున్న తల్లులు ఇంత మధురంగా తెలుగులో పిల్లలకు కథ చెప్పడానికి ఇష్టపడరేమో.. చాలా బాగుంది.

    ReplyDelete
  17. చందమామ ను పిలవాల్సిన పనే లేదు ఎంత cute గా ఉందొ చదువుతున్నట్లు లేదు నేనే చిన్న పిల్లాడి నైనట్లు :) :) :)
    చాలా నచ్చింది థాంక్స్ ఫర్ touching my heart "తల్లి మమత లా " అని ఏదో ad లో అంటారే అది ఇదేనేమో !!

    superb narration

    small doubt


    అవును zilebi గారి comment ఏమి లేదు
    వారి
    "బుజ్జి పండు తెలుగు చదువు !" ki
    emanna relation vunda...

    ?!

    ReplyDelete
  18. @ బాలు గారూ..పిల్లలకు కథ చెప్పడానికి ప్రదేశానికి ఏమీ సంబంధం ఉండదేమో నండీ..మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.

    @ ఎందుకో ఏమో గారూ..మీ వ్యాఖ్య కూడా అ౦త టచింగ్ గానూ ఉందండీ..ధన్యవాదాలు.

    ఈ టపా చూసాక జిలేబిగారు వ్రాసి ఉంటారు. నేనది ఈ రోజు ఉదయం చూసాను. నాకు మిగతా వివరాలు తెలియవు.

    ReplyDelete
  19. :)
    ప్రవాసంలో పిల్లలకి తెలుగు నేర్పడం ఇంత సులభమా :))
    బావుంది. నాకీ కిటుకు ముందే తెలిసుంటే బావుండును :)తెలుగే కాదు గొడవ పెట్టకుండా తినడమూ అలవాటయ్యుండేది :)నా పోలికే మా పిల్లలకీ వచ్చింది. కథలంటే ఇష్టమే. కానీ ఆ పేరు చెప్పి పనులు చేయించుకోలేను వాళ్ళ చేత. మా అమ్మమ్మ ఎన్ని పాట్లు పడేదో నా చేత అన్నం తినిపించడానికి. ఎన్ని కథలు చెప్పినా సరిపోయేవి కాదు. మరి నాకు తెలిసి రావాలి కదా ఆమె కష్టం. ఐతే ఆమెకున్న ఓపికకీ నా ఓపికకీ పోలికే లేదు.

    ReplyDelete
  20. లలితగారూ..ఆ కథల రోజులన్నీ భలే సరదాగా ఉండేవి. మీ పిల్లల తెలుగు విన్నానండీ..మీకు ఓపిక లేకపోవటమేమిటి.. పిల్లల చేత ఎంత బాగా చెప్పించారు!
    ధన్యవాదాలు.

    ReplyDelete
  21. మా అబ్బాయికి కొత్త వస్తువు చూపించి వాడు ఆడుకున్తున్నప్పుడు అన్నం పెట్టేస్తాం
    ఇప్పుడు వాడికి 20 నెలలే
    కధలు చెప్పి అన్నం పెట్టాలంటే ఇంకో ఏడాది అగాలేమో :)

    ReplyDelete
  22. జ్యోతిర్మయి గారూ..
    తియ్యనైన తెలుగు టపా చదివిన అనుభూతి:) కథలు చెబుతూ, మాటల్లో పడేసి, మీ కమ్మని తెలుగు భోజనం మాకు కూడా పెట్టేసినట్లున్నారు. కడుపు నిండిపోయింది.

    ReplyDelete
  23. @ అప్పారావుగారూ మీరు చూపించే వస్తువులతోనే చిన్న చిన్న కథలల్లి చెప్పండి..ఆసక్తిగా వింటూ తింటాడు. ధన్యవాదాలు.

    @ అపర్ణ గారూ..తీయని మాట చెప్పారు నాకూ కడుపు నిండిపోయింది ..ధన్యవాదాలు.

    ReplyDelete
  24. Sooooo cute! నాకు కళ్ళ ముందు కనిపించేసారండీ.. మీరూ, మీ బాబూ ఇద్దరూ.. :)))

    ReplyDelete
  25. మధుర గారు..కళ్ళ ముందు కనిపించడం ఏమిటండీ మా అబ్బాయి ఇప్పుడు మీ దగ్గరేగా ఉన్నాడు..త్వరగా చెప్పండి బాబూ..కంగారుగా ఉంది..

    ధన్యవాదాలు.

    ReplyDelete
  26. హహ్హహ్హా... ఉహూ.. మీ బాబుని మా ఇంట్లోనే ఉంచేసుకుంటాం.. వెనక్కి పంపించం.. :))))

    ReplyDelete
  27. "ఎంచక్కా ఉంచేసుకోండి మధురా..
    :)))

    ReplyDelete
  28. Ohhh... really sweet! మీ బాబు ఫోటో కూడా పోస్ట్ చేసుండాల్సింది జ్యోతిర్మయి గారు :)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ప్రియగారు. మా బుజ్జోడ్ని చూడాలని ఉందా తప్పకుండా చూపిస్తాను,

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.