Wednesday, December 21, 2011

జెన్ వై (jenaration y)

మా పిన్ని కూతురు ప్రసూనకు ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే మంచి సంబంధ౦ వచ్చిందని పెళ్లి చేశారు. ఆ అబ్బాయి ఉండేది కూడా మేం ఉన్న ఊరికి దగ్గర్లోనే అని తెలిసి అందరం చాలా సంతోషించాం. పెళ్ళయిన రెండు నెలలకు ప్రసూన  కాపురానికి వచ్చింది.

"అక్కా ఇండియన్ షాప కి వెళ్లి గ్రాసరీస్ తెచ్చుకుందామా?  వచ్చిన రెండు రోజుల తరవాత ఫోన్ చేసింది.
“అలాగే మధ్యాన్నం లంచ్ అయ్యాక వెళదాం” అన్నాను.
ఆ మధ్యాహ్నం ఇద్దరం చెరొక కార్ట్ తీసుకుని షాప్ లోకి వెళ్ళాము. “లిస్టు రాసుకుని వచ్చావా?”  అడిగాను.
“అమ్మనడిగి అన్నీ రాసుకుని వచ్చాను.” అంది పెద్ద లిస్టు పర్సులోనుంచి తీస్తూ.

      బియ్యం దగ్గరనుండి మొదలుపెట్టాము. అక్కడ పదిహేను రకాల బియ్యం ఉన్నాయి. ఏవి కొనాలో చెప్పి బాగ్ తీసి కార్ట్ లో పెట్టాను. లిస్టులో తరువాతది కందిపప్పు. పప్పులు ఉన్న సెక్షన్ లోకి వెళ్ళాము. అక్కడ నా ఫ్రెండ్ రాధిక కనిపించింది. పరిచయాలయ్యాయి. తనేదో రైస్ నూడిల్స్ కోసం వచ్చిందట ఏ బ్రాండ్ కొనాలో తెలియలేదంటే, మా ప్రసూనను పప్పులు తీసుకోమని తనతో వెళ్లి ఆ సేమ్యా ఏదో చూసి వచ్చాను. అప్పటికి పది నిముషాలైంది. ప్రసూన పప్పులను పరీక్షగా గమనిస్తూ నిలబడి ఉంది. కార్ట్ లో బియ్యం తప్ప మరేమీ లేవు.

“ఏం తీసుకోలేదేం ప్రసూనా?” అని అడిగాను.
“అక్కా పేర్లన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి.” అంటూ అయోమయంగా చూసింది.
అప్పటికి నాకర్ధం అయింది. మా అమ్మాయికి ఏ పప్పులు ఏవో తెలియవని. సరే, ఏ పప్పేదో వివరించి చెప్పాను.
“ఇంకేమన్నా ఉన్నాయా తీసుకోవలసినవి?” అడిగాను.
“రవికి రైస్ కంటే చెపాతీలే ఇష్టం అట. మనం మైదాపిండి తీసుకోవాలి? అంది.
“మైదాతో చపాతీలా?” అన్నాను వచ్చేనవ్వాపుకుంటూ.
“ఓ కాదా అయితే శనగ పిండి తీసుకుందా౦” అంది. ఇక నవ్వకుండా ఉండడం నా వల్ల కాలేదు.

                *          *         *         *

       ఆ తరువాత ఇంట్లో పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడింది. ఒక్కోసారి వెళ్ళేసరికి ఏడుపు మొహంతో ఉండేది. అప్పటికీ రవి ఓపిగ్గా అన్నీ దగ్గరుండి చూపించేవాడు, పనులన్నీ ఇద్దరూ కలిసే చేసేవాళ్ళు. 

      మా పిన్ని ప్రసూనను వంటగదిలోకి అడుగు పెట్టనిచ్చేది కాదు. తనకు అన్నీ అవలవాటు అవడానికి దాదాపుగా సంవత్సరం పట్టింది. తన వైవాహిక జీవితపు తొలినాళ్ళన్నీ ఇలా పనులు నేర్చుకోవడానికే సరిపోయినట్లనిపించింది. పెళ్లై ఎవరి సంసారం వాళ్ళు  చూసుకోవాలని తెలిసినా పిల్లలకు ఏమీ అలవాటు చెయ్యకపోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో మా ప్రసూన లాంటి వాళ్ళను చూసాక తెలిసింది. భార్యా భర్తలకు ఒకరిమీద ఒకరికి ఎంత ప్రేమున్నా నిద్ర లేచేసరికి ఆకలిదేగా రాజ్యం.

     తనింకా ఓ సంవత్సరం ఖాళీగా ఉంది. వచ్చిన వెంటనే ఉద్యోగంలో చేరే వాళ్ళు, లేకపోతే వెంటనే ప్రగ్నేన్సీ వచ్చినవాళ్ళ కష్టాలు చెప్పనే అఖ్ఖర్లేదు. ఇక మొగపిల్లలైతే చదువులకోసమో, ఉద్యోగారీత్యానో ఇక్కడకు వస్తారు. ఏమీ చేసుకోవడం రాక ఫాస్ట్ ఫుడ్స్ కి అలవాటు పడతారు. ఫలితం ఊబకాయం, ఆరోగ్యం పాడవడం. ఉతికిన బట్టలు, విడిచిన బట్టలు వేరువేరుగా పెట్టుకోవాలని కూడా తెలియని పిల్లల్ని చూశాక, పిల్లలకు చదువుతో పాటు, చిన్న చిన్న పనులు  చిన్నప్పట్నుంచే ఓ ఆటలా నేర్పితే బావుంటుందనిపించింది.




27 comments:

  1. మా పెళ్ళయిన కొత్తలో 50 ఏళ్ళకితం మేము పడిన కష్టాలే! బలే! భూమి గుండ్రంగా వుందికదూ

    ReplyDelete
  2. "చిన్న చిన్న పనులు చిన్నప్పట్నుంచే ఓ ఆటలా నేర్పితే బావుంటుందనిపించింది."
    చాలా బాగా చెప్పారండీ..
    పిల్లలకి అన్ని పనులు తప్పకుండా నేర్పించాలి అప్పుడే దేనికి ఇబ్బంది పడకుండా వుంటారు
    ఎ పనినైనా నేర్చుకుని మర్చిపోయినా పర్లేదు కానీ అసలు నేర్చుకోకుండా వుండకూడదు..

    ReplyDelete
  3. నిజమేనండీ చాలా మంచి విషయం చెప్పారు..
    నాకు,మా చెల్లికి మా అమ్మ చిన్నప్పటి నుండి
    నేర్పిన చిన్న చిన్న పనులు మాకు ఇప్పుడు చాలా వుపయోగపడుతున్నాయి ఇబ్బంది లేకుండా..

    ReplyDelete
  4. పిల్లలకు చదువుతో పాటు, చిన్న చిన్న పనులు చిన్నప్పట్నుంచే ఓ ఆటలా నేర్పితే బావుంటుందనిపించింది.
    idi correct. pillalu kooda vinaali.

    ReplyDelete
  5. nijame idi andaru oppukovalsinde..

    ReplyDelete
  6. @ బాబాయి గారూ అవునండీ భూమి గుండ్రంగానే ఉంది. :)

    ధన్యవాదాలు.

    @ నాని గారూ తొలిసారి నా బ్లాగుకు వచ్చినట్లున్నారు స్వాగతం.
    "ఏ పనైనా నేర్చుకుని మర్చిపోయినా పర్లేదు కానీ అసలు నేర్చుకోకుండా వుండకూడదు." బాగా చెప్పారు. ధన్యవాదాలు

    @

    ReplyDelete
  7. @ రాజి గారూ ఈ విషయంలో మిమ్మల్ని కూడా మెచ్చుకోవాలండీ..మీ అమ్మగారు చెప్పిన పనులు చేసినందుకు..చివరకు ఉపయోగపడేది మనకే కదా..ధన్యవాదాలు.

    @ గీత యశస్వి గారూ "పిల్లలు కూడా వినాలని" బాగా చెప్పారు. ఈ కాలంలో ఇది కొంచెం కష్టమైన విషయమే. కొంచెం వయసొచ్చిన పిల్లలు ఈ సెల్ ఫోన్లు, పేస్ బుక్ లలో బిజీ అయిపోయి తీరిక లేనట్లుగా ఉంటున్నారు. పని చెయ్యడం కంటే చేయించడమే కష్టమై పోతుంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  8. సందీప్ గారూ స్వాగతం..
    ఇంటర్ వరకు పిల్లల చదువుల్లో తీరిక లేకుండా ఉండడం..తరువాత చదువు కోసం హాస్టల్స్ ..బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా అయిపోతున్నారు. ఇంట్లో ఉన్న నాలుగు రోజులు ఈ పనులెందుకులే అని పెద్దవాళ్ళూ అనుకుంటున్నారు. జీవితలో ఏవైనా సమతుల్యంలో ఉండడం అవసరం అనిపిస్తుంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  9. హాయ్ నేను నయ్యమనమాట! ఇక్కడ చాలా మంది జనాలకి నేనే చూపించాను! వాళ్లకి ఏ కూర లేదా పప్పు లేదా పిండితో ఏ ఏ వంటకాలు చేసుకోవాలో కూడా సరిగ్గా తెలియని పెళ్ళయిన వాళ్ళు ఉన్నారు!

    ReplyDelete
  10. కష్టేఫలే శర్మ గారు చెప్పినట్టు, యాభయ్యేళ్ళ కిందట పెళ్ళైన మా అమ్మా నాన్నదీ అదే పరిస్థితి. బహుశా ఆ అనుభంతోనేనేమో, మా అమ్మ ఆడపిల్లల్నీ మొగపిల్లల్నీ తేడా లేకుండా అన్ని పనులూ నేర్పిస్తూ పెంచింది. ఇంటి పనులూ అందరూ నేర్చుకోవాలి.

    ReplyDelete
  11. nice post. Pani vibhajana,nerchukovadam annee chinnappati nundi..cheyinchaali.. chaalaa baagaa viluvaina vishayam cheppaaru. baagundandee!

    ReplyDelete
  12. రసజ్ఞా..నువ్వు కాస్త నయమేంటి..అసలు నిన్ను చూసి నేర్చుకోవాలి ఎవరైనా.. ధన్యవాదాలు.

    ReplyDelete
  13. @ కొత్తపాళీ గారూ, వనజ గారూ ధన్యవాదాల౦డీ...

    ReplyDelete
  14. ఆట పేరు కనబెట్టేసానండీ!

    మోనోపలీ లాగా కొత్త ఆట కనబెట్టి దాని పేరు భో 'జెన్' !


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  15. నిన్న అమ్మ కూడా ఇది చదివిందండీ.. బాగా చెప్పారు అంటోంది. మా పెద్దమ్మ గారి అమ్మాయి ఇది చదివితే బాగుండు అని కూడా అన్నది. తను అంతే జాబ్ కి వెళ్ళడం, రావడం తప్ప ఇంకో పని చేయదు. ఇప్పుడు సంబంధాలు చూస్తున్నారు. మా పెద్దమ్మ కూడా అస్సలు చెప్పదు. ఇప్పుడు ఎవరన్నా వస్తే మంచి నీళ్ళు ఇవ్వడం వచ్చో రాదో కూడా తెలియదు.. నేను జాబ్ చేయకముందు నా పరిస్థితి కూడా ఇదే అనుకోండి.అంటే మరీ ఇంత దారుణం కాదులెండి. మొత్తానికి మంచి విషయం చర్చించారు. చూడ్డానికి ఏదో సిల్లీ గా అనిపించినా సీరియస్ విషయం ఇది.

    ReplyDelete
  16. @ జిలేబి గారు కొత్త ఆట చూడడానికి బావుంది కాని..ఆడదానికి బావుండదు. ధన్యవాదాలు.

    @ సుభా చాలా రోజులకు కనిపించావు. అమ్మ కూడా చదివినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. విషయం చిన్నదే కానీ ఇల్లు సర్దుకోవడం, వంట చేసుకోవడం రాక ఆ చిరాకులో గొడవలు పడుతున్న వాళ్ళను చూస్తుంటే జాలి వేస్తుంది. అమ్మ చేత కూడా చదివించినందుకు నీకు బోలెడు ధన్యవాదాలు..

    ReplyDelete
  17. ఓ..ఈ పోస్టు మాకు కాదుకదా !!
    >>ఉతికిన బట్టలు, విడిచిన బట్టలు వేరువేరుగా పెట్టుకోవాలని కూడా తెలియని పిల్లల్ని చూశాక

    అసలు మీకేమైనా తెలుసా, ఇది ఎంత కష్టమైన పనో అని? :)

    ReplyDelete
  18. భాస్కర్ గారూ..ఈ ఉతికిన బట్టలు, విడిచిన బట్టలు... ప్చ్, చాలా కష్టమండీ..ధన్యవాదాలు.

    ReplyDelete
  19. చాలా సున్నితమైన విషయాన్ని చాలా చక్కగా వివరించారు.
    మీరు చెప్పింది అక్షరాలా నిజం. మా బామ్మ ఏది చేస్తున్నా పిలిచి ఏదో ఒక పని చెప్తూ నేర్పించేవారు.
    కొంచెం పెద్దయ్యాక పిండి వంటలు చేసేప్పుడు చక్రాలు వత్తడం , ఆవకాయ కలిపేప్పుడు అన్ని కొలిచి ఇవ్వడం లాంటివి చేసేదాన్ని మొదట్లో...

    ఉద్యోగంలో చేరడానికి 3 ఏళ్ళ ముందు నుంచి ఆవకాయ నేనే స్వయంగా పెట్టే పోస్టు కొట్టేసాను (బామ్మ అధ్వర్యంలోనే లెండి).... అప్పుడు తెలీలేదు కానీ ఇప్పుడాలోచిస్తే నిజమే అనిపిస్తుంది.....

    ReplyDelete
  20. నిజంగా చాలా సున్నితమైన విషయమే ఇది. చిన్నప్పుడు అమ్మ చిన్న చిన్న పనులు నేర్పటం వల్లనే ఇవ్వాళ అన్ని పనులూ చేసుకోగలుగుతున్నాం.

    మా పక్కింట్లో కొత్తగా పెళ్లైన జంట దిగింది. ఓ నెల రోజులపాటు ఆ అమ్మాయికి వంట చేసే అవసరం రాలేదు. ఆ తరువాత వాళ్లాయన తనకు చపాతీలంటే చాలా ఇష్టం చేయమని అడిగారట.

    తను ఎలాగో చేసింది. ఆ తరువాతి రోజు వాళ్లాయన ఆఫీసుకు వెళ్లాక నన్ను పిల్చి.. అక్కా చపాతీలు చాలా గట్టిగా విరిగిపోయేంతలా వచ్చాయి. వాటిని చూడగానే మా ఆయన నవ్వి, ఇంకెప్పుడూ చపాతీ చేయవద్దని అన్నాడని చెప్పింది. వినగానే నాకూ నవ్వు వచ్చింది.

    ఆ తరువాత చపాతీ ఎలా చేయాలో ఆ అమ్మాయికి నేర్పించాను. ఇప్పుడిప్పుడే ఒక్కో పనీ చేయటం అలవాటు చేసుకుంటోంది.

    ReplyDelete
  21. ఆహారం తినటం అనేది నిత్యం చేసే పని. కనీసం చిన్నప్పుడు చెయ్యక పోయినా ఎల్లా చేస్తారో చూడటం మంచిది. ఎప్పుడో ఒకప్పుడు అవసరం వస్తుంది.
    దేశం వదిలి వచ్చిన వాళ్ళని ఎంతమందినో చూశాను, ఇష్టం ఉన్నా లేకపోయినా నేర్చుకున్నారు. చేసుకు తింటున్నారు.
    జీవితంలో ఒక ముఖ్య విషయాన్ని చక్కగా చెప్పారు.

    ReplyDelete
  22. @ మాధవి గారూ..మీ బామ్మగారు మీకు చాలా నేర్పించారన్నమాట. ఆవకాయ కూడా పెట్టేస్తున్నారంటే వంటల్లో మీకు చాలా ప్రావీణ్యముందన్నమాటే....
    మీ స్పందనకు ధన్యవాదాలు..

    @ శోభ గారూ మీ పక్కి౦టమ్మాయి ఇప్పుడు నేర్చుకు౦టు౦దన్నమాట..బావుందండీ..ధన్యవాదాలు.

    @ లక్కరాజు గారూ..ఎప్పుడైనా నేర్చుకోక తప్పదుకదండీ..చిన్నప్పటినుంచీ అయితే త్వరగా అలవాటయి పని సులువవుతుంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  23. చాల బాగా చెప్పినారండి పిల్లలకు పనులు , బాధ్యతలు నేరిపించాలని .
    పెద్దలుగా అది కూడా మన పనే . మనం చేసిన తప్పులు చెప్పి వాళ్ళు కూడా ఆడే పని చెయ్యకుండా చూడాలి. కాని పిల్లలు కూడా వినాలి కదండి .

    ReplyDelete
  24. మంజుల గారూ..'పిల్లలు కూడా వినాలిగా' మీరన్నదీ నిజమే. వాళ్ళు వినడం లేదని మన ప్రయత్నం మానకూడని నా అభిప్రాయం. బ్లాగు చదివి వ్యాఖ్య పెడుతున్నందుకు మీకు బోలెడు ధన్యవాదాలు.

    ReplyDelete
  25. inkaa nayam. Indialone maa pillalu vanta cheyyadam (vaalle ishtapadi nerchukunnaru morro annaa vinakunda)choosi, bale training ichinavu ani vyangalanu edurkovalasi vachindi.

    ReplyDelete
  26. challa baga chepparu.asalu valle ishtapadi nerchukunna, indialo ammalaku maa ammayilu vanta cheyyadam choosi kontha madiki vyangyam , kontha mandiki haasyam, kontha mandiki vaari meeda saanubhoothi.
    Latha

    ReplyDelete
  27. లత గారూ స్వాగతం. ఎవరేమనుకుంటేనేం, పిల్లలు చక్కగా పనులు నేర్చుకున్నారు అందులోనూ ఇష్టంగా. ఇక వాళ్లకు ఇబ్బంది ఉండదు. ధన్యవాదాలు.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.