బీటలు వారిన నేలపై
స్వాతి చినుకుల సంబరం!
మోడువారిన మానుపై
చివురాకుల కలకలం!
వసివాడిన పసిమొగ్గ
వికసిస్తున్న పరిమళం!
ఒ౦టరియైన నింగికి
నెలవంక స్నేహితం!
ముసురేసిన మబ్బును దాటి
దూసుకు వస్తున్న రవికిరణం!
భారమైన బ్రతుకునకు
ఆలంబన ఆశావాదం!!
చాలా బాగుంది అనే పదం చాలా చిన్నదవుతుందండీ! అంత చక్కగా ఉంది!
ReplyDelete@జ్యోతిర్మయి గారు "వసివాడిన పసి మొగ్గ వికసిస్తున్న పరిమళం!" ఇది అస్సలైన ఆశా వాదం ఆహా చాలా చాలా చక్కగా వివరించారు ..
ReplyDeleteగడిచిన క్షణాలను కాక ముందున్న కాలాన్ని లేక్కించడమే ఆశావాదం అని నా అభిప్రాయం. ఒక్కో వాక్యాన్ని చదువుతూ ఆస్వాదిస్తుంటే అసలు అ దృశ్యాన్ని చూస్తునట్టే నాకు అనిపించింది . దీనికి దృశ్య రూపం ఇస్తే ఇంకా అద్బుతంగా ఉంటుంది..
ఆశావాదమే ఆశయసాధనకు ఆయుధం!
ReplyDeleteకవిత బాగుందండి.
బావుంది మీ ఆశావాదం! :)
ReplyDeleteచాలా ఆలశ్యంగా చూసానండీ.. ఇప్పుడు మీ నందనవనంలో ఆశావాదం చిగురించిందే.. నేలమ్మ తడిచి, మాను పూచి, మొగ్గ విరిసి బాగుంది చక్కని పరిమళాలు వెదజల్లుతూ..
ReplyDeleteసుభ గారన్నట్లు ఆశావాదం చిగుర్చి వ్యాఖ్యల పూలు పూశాయి. బ్లాగు పరిమళాలు వెదజల్లుతోంది.
ReplyDeleteకళ్యాణ్ గారూ, దృశ్యరూపమంటే ఏదైనా చిత్రం పెట్టమంటారా?
రసజ్ఞ గారు, కళ్యాణ్ గారు, పద్మార్పిత గారు, మధుర వాణి గారూ, సుభగారూ ధాన్యవాదాలు.
@జ్యోతిర్మయి గారు అవునండి కాని దానికి తగ్గటుగా ఉంటేనే బాగుంటుంది . మంచిగా దొరికే వరకు ప్రయత్నించండి లేదా మీరే గేసేయండి . నేను ప్రయత్నిస్తాను.
ReplyDeleteAwesome :)
ReplyDeleteధన్యవాదాలు హర్షా.
Deleteచాలా బాగుంది.
ReplyDeleteధన్యవాదాలు రాధిక గారు.
Delete