Sunday, November 20, 2011

మనసాడెనే మయూరమై

సంబరంగా జాజితీగ
నవ్వుపువ్వులు రువ్వుతోంది!

గాలిపాటకు కొబ్బరాకు
పరవశంగా ఊగుతోంది!

అరవిరిసిన చెంగలువ
పరిమళాలు చల్లుతోంది!

ఆకసాన తుంటరిమేఘం
వలపుగీతం పాడుతోంది!

వెన్నెలవేళ నీలాకాశం
వింత అంద౦ ఒలికిస్తోంది!

సత్యునిగాంచిన సంతసం
పార్ధివిమోమున పొడవడుతోంది!!

4 comments:

  1. పరవశం కొబ్బరాకుకో నాకో తెలియట్లేదు చదివిన తర్వాత.చాలా బాగుందండీ..

    ReplyDelete
  2. మల్లెమొగ్గ (bold) కలము నుండి జాలు వారిన పదాల పులకరింతలో మనసు నిజంగానే పురి విప్పుతోంది!

    ReplyDelete
  3. @ వనజగారూ ధన్యవాదాలు..

    @ సుభా ఇప్పటికైనా తెలిసిందా? ధన్యవాదాలు.

    @ రసజ్ఞా రాముని చూచిన ఆనందం జానకి మోములో కనిపిస్తో౦దని నేనంటే...మధ్యలో ఈ మల్లెమొగ్గలేమిటి?
    మనసు పూరి విప్పితే నాట్యం చేసేయడమే.
    ధన్యవాదాలు.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.