సాయంత్రం నాలుగయింది. వేపచెట్టు నీడ ఇంటిమీద పడుతోంది. వీధి వాకిలి పక్కనున్న చంద్రకాంతలు అందంగా విచ్చుకు౦టున్నాయి. దక్షిణపు గాలికి జాజితీగ వయ్యారంగా ఊగుతోంది.
"బాబాయ్ పొలానికెళ్దామా?" అడిగాను.
"అప్పుడేనా? ఇంకా ఎండ పూర్తిగా తగ్గలేదు. ఓ అరగంటాగి వెళ్ళండి." చెప్పిందమ్మ.
"మాపటెండేలే, సల్లగుంటదొదినా, మరీ ఆల్సెమైతే పొద్దుగూకుద్ది" అ౦టూ బండి కట్టడానికి బయటకు వెళ్ళాడు బాబాయి.
మొహం కడుక్కుని పౌడర్ రాసుకుని తయరయ్యేప్పటికి పోలీస్టేషన్ వీధిలో వుండే పెద్దత్త, సీనుమామయ్య, వాళ్ళ పిల్లలు విజయ, రాజు వచ్చారు. ఉదయాన్నే అత్తావాళ్ళి౦టికెళ్తే ఇటుకరంగు పోలీస్టేషన్ ముందు నిక్కరు చొక్కా వేసుకున్న పోలీసులు౦టారా, వాళ్ళను గోడ చాటునుండి నక్కి నక్కి చూడాల్సిందే, వాళ్ళక్కాని కనపడ్డామా జైల్లో పెట్టేస్తారు. అసలే అన్నం దగ్గర గొడవ చేసిన విషయం అమ్మ చెప్పేసుంటది కదా. నాన్నకు మాత్రం వాళ్ళను చూస్తే అస్సలు భయం వెయ్యదు. ఎదురుగా పొయ్యి "ఏం వెంకటేశులూ కేసులేమైనా ఉన్నాయా?" అని అడుగుతారు. పోలీసు కూడా నాన్నతో నవ్వుతూ మాట్లాడతాడు. సరే సరే ఆలశ్యం అయిపోతుంది, ముందు పొలానికెళ్ళి అక్కడ కబుర్లు చెప్పుకుందాం.
బాబాయ్ ఎద్దులబండిని ఇంటిముందుకు తీసుకొచ్చి"హే..హే డుర్" అంటూ ఎద్దులు బెదరకుండా వాటిని నిమురుతూ నిల్చున్నాడు. పిల్లలం బండి జల్లలో కూర్చున్నాం. బాబాయి ఎద్దుల్ని అదిలిస్తూ నగ మీద కూర్చున్నాడు. బండి గతుకుల్లో పడి ఊగుతూ ముందుకు కదిలింది. నాన్న, మామయ్య వెనుగ్గా నడుస్తూ వస్తున్నారు.
"రావకిష్ణా ఎప్పుడొచ్చినార?" నీరుకావి పంచె కట్టుకుని కర్ర మేడమీద అడ్డంగా పెట్టి రెండు చేతులూ దానిమీద వేసి ఎదురుగా నడుస్తూ వస్తున్నాయన నాన్నని అడిగాడు.
"పొద్దునొచ్చాం చిన్నాయనా, చిన్నమ్మ బావుందా?" అడిగాడు నాన్న.
"మీ సిన్నమ్మకేమా..బెమ్మాండంగుండాది. పిలకాయల్ని తీసుకుని పొలానికి బోతండారా?" బండిలో వున్న మావైపు చూస్తూ అన్నాడు.
"తాటికాయలు కొట్టిద్దామని తీసకపోతండా౦" నవ్వుతూ చెప్పాడు బాబాయి. అసలు బాబాయి ఏం మాట్లాడినా నవ్వుతూనే మాట్లాడుతాడు.
"మీ నాయన నెల్లాళ్ళనుండీ ఆ తూరుపు గట్టుమీద తాటికాయల్ని ఎవుర్నీ గొట్టనీలా. మీకోసరం దాసిపెట్టుండాడు." అని నాన్నతో చెప్పి, "పెందలాడే ఎనిక్కి రాండి. పొద్దుబోతే పురుగూ, పుట్రా తిరగత౦టయ్" అని బాబాయికి జాగ్రత్త చెప్పాడు.
"అట్నేలే చిన్నాయనా" అంటూ బాబాయి ఎద్దుల్ని అదిలించాడు.
వీధి మలుపు తిరిగి ఎత్తరుగుల ఆది శేషారెడ్డిల్లు దాటగానే బుజం మీద బట్టల మూట పెట్టుకుని చాకలి సుబ్బమ్మ కనిపించింది.
"ఎవురీ పిలకాయల సీతారామా? అంటూ బాబాయిని అడిగింది.
"సూపు కాన్రావడం లేదా యేంది? మా పిలకాయాలే గదా" చెప్పాడు బాబాయి.
"ఒరె ఒరె...కనుక్కోలేక పోతినే, అమ్మాయి బాగా పొడుగైపోయిళ్ళా. ఏం జోతమ్మా బాగుండారా?" అంటూ అడిగింది.
"ఆ" అంటూ తల ఊపాను.
"రావకిష్టయ్యా బావుండా, కోడల్రాలా?" పరామర్శించింది సుబ్బమ్మ.
"వచ్చింది సుబ్బమ్మా, ఇంటిదగ్గరుంది." చెప్పాడు నాన్న.
"పొలానికి బోతండారెట్టా, రవణయ్య మావ పొలంలో సీమసింత కాయలు ఇరగ్గాసుండయ్, పిలకాయలకి నాలుగ్గాయలు గోసీ౦డి" అంటూ బోయింది.
దాదాపుగా ఊరి చివరికు వచ్చేశాం, చిన్న చిన్న తాటాకు గుడిసెల ముందు పిల్లలు మాత్రమే వెళ్ళగలిగే బుల్లి గుడిసెలు వున్నాయ్.
"అవేంటక్కా?" అడిగాడు తమ్ముడు.

"పిల్లలాడుకోవడం కోస౦ చిన్న ఇళ్ళు కట్టారు." ఆ ఇళ్ళు చూసి ముచ్చటపడిపోతూ చెప్పాను. విజయ కిసుక్కున నవ్వింది.
"అయ్యాడుకునే బొమ్మరిళ్లు కాదు సురేషా, పందుల కోసం యేస్తారా గుడిసెలు." తమ్ముడి సందేహం తీర్చాడు బాబాయ్.
"నవీన్ వాళ్ళు కుక్కపిల్లను పెంచుకున్నట్లు వీళ్ళు పంది పిల్లల్ని పెంచుకుంటారా బాబాయ్?" అడిగాను. ఈ మాటకు అందరూ నవ్వారు. ఏదో చెప్పారు కాని నవ్వినందుకు అసలే వుక్రోషంగా వున్నానేమో ఏమీ వినపడ్లేదు.
మాటల్లోనే ఊరు దాటేశా౦. దారి పక్కనంతా చిల్లచెట్లు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. ఓ నాలుగు బర్రెలు మెల్లగా నడుస్తూ వస్తున్నాయ్. అందులో ఒక దానిమీద చొక్కాలేకుండా నిక్కరు మాత్రమే వేసుకుని చేతిలో కర్ర పట్టుకుని "డుర్ డుర్" అని బర్రెల్ని అదిలిస్తూ ఒక చిన్నబ్బాయ్ కూర్చునున్నాడు.

"ఏం కిట్టిగా మేతేడన్నాదొరికినాదిరా?" మామయ్య అడిగాడు.
"దక్షిణప్పొలంలో కాస్త గడ్డి పెరిగుండాదయ్యా. ఆడికే తోలుకుపోయ్యా పసుల్ని." చెప్పాడా అబ్బాయి.
"ఏం కిష్టయ్యా స్కూలికి బోవటంలా?" అడిగాడు నాన్న.
"ఈడా... పలకా బలపం గొనిచ్చి బళ్ళో యేస్తే, ఈడు బడికి బోకుండా రోజంతా పోలాలెంబడి దిరిగి చెర్లో దూకి రౌడిగాళ్ళ సావాసం తగులుకున్నాడని ఈడి నాయన వెంకట్రెడ్డి కాడ పాలేరు పనికి బెట్టినాడు." చెప్పాడు బాబాయ్.
"ఈ పని బడికంటే సుకంగుళ్ళా" అంటూ నవ్వాడు మామయ్య.
కిష్టయ్య పళ్ళన్నీ కనిపించేలా నవ్వి రోడ్డు దిగుతున్న పశువుల్ని పక్కకు మళ్లిస్తూ వెళ్ళిపోయాడు. బండి మట్టిరోడ్డు వదిలి ఇసకదారి పట్టింది. కనుచూపు మేరలో సన్నపాయలాగ యేరు కనిపిస్తోంది.
"బాబాయ్ ఆపవా ఇ౦క దిగి నడుస్తాం" అంటూ బండి ఆగకుండానే కిందకు దూకేశా౦. పరిగెడుతుంటే ఇసుకలో కాళ్ళు కూరుకుపోతున్నాయ్. "ఎంత వేగంగా వెళ్ళగలరో చూస్తాను" అన్నట్లు ఇసుక మాతో సవాల్ చేస్తోంది. చివరకు మేమే గెలిచాం. చల్లటి నీళ్ళలో నిలబడితే ఇసుక కాలికింద చక్కలిగింతలు పెడుతోంది. ఏటి పక్కన పొలం గట్టుమీద తాటి చెట్లు నిండుగా గెలలతో పొడవుగా నిలబడి వున్నాయి. ఎండాకాలం అవడం వలన ఏటిలో నీళ్ళు తక్కువగా వున్నాయ్. పశువులని విప్పి మేతకోసం వదిలేసి మేమందరం ఏటికడ్డంగా నడిచి తాటిచెట్లదగ్గరకు వెళ్ళాం.
బాబాయి తాటినారతో చేసిన బంధం కాళ్ళకు కట్టుకుని, కొడవలి బొడ్లో దోపుకొని , రెండు చేతులతో చెట్టును పట్టుకుని, రెండుకాళ్ళతో మానుమీద ఎగురుతూ చూస్తుండగానే తాటిమోవిపైకి వెళ్ళిపోయాడు. కొడవలి తీసి గెలమీద కొట్టగానే గెలతో సహా కాయలు కింద పడ్డాయి.
"అమ్మాయ్ ఎనిక్కి రాండి. దూరం జరగాల" అంటూ మామయ్య హెచ్చరిస్తూ కిందపడిన తాటికాయను ఎడం చేత్తోపట్టుకుని కుడిచేత్తో కొడవలితో చెక్కేసి ఇచ్చాడు. ఆకాశంలో చందమామ మూడు ముక్కలై౦దా అన్నట్లు మూడు కళ్ళతో తాటికాయ ఎంత౦దంగా వుందో, తాటిముంజ కింద కదులుతూ నీళ్ళు. "గుడ్డల మీద పోసుకోకుండా తినండి. నీళ్ళు మీదపడితే గుడ్డలు పాడైపోతాయ్" చెప్పాడు బాబాయ్. మామయ్య కాయలు కొట్టిస్తూ వుంటే ఎన్ని కాయలు తిన్నామో లెక్కేలేదు. తమ్ముడికోసం బాబాయి కొడవలితో ము౦జెను పైకి తీసి ఇచ్చాడు. మామయ్య తాటాకు తిరగతిప్పిన గొడుగులా చేస్తే, అందులో కొన్ని ముంజెలను వేసి చివర ముడేసాడు బాబాయ్.
కాసేపు ఇసకలో ఆడుకున్నాక, "నాన్నా నీళ్ళు కావాలి" అడిగాడు తమ్ముడు. నాన్న ఇసుక తవ్వి చెలం తీశాడు. చూస్తూ వుండగానే అందులో నీళ్ళూరాయి. ఆ నీళ్ళు దోసిలిలో పట్టుకుని తాగితే అచ్చం కొబ్బరి నీళ్ళలా ఎంత తియ్యగా వున్నాయని.
చూస్తుండగానే ఎండ పూర్తిగా తగ్గిపోయింది. ఆకాశంలో పక్షులు గుంపులు గుంపులుగా ఎగిరిపోతున్నాయి. అమ్మావాళ్ళ కోసం తాటిగెలలు కొన్ని౦టిని బండిలోకి ఎక్కించారు. పంతులుగారికి ఇవ్వడానికి తాటిముంజెల్ను ముంగంలో కట్టి దొరికిన పుల్లతో మట్టిలో గీతలు గీస్తూ ఇంటిదారి పట్టాము.
అసలు ఎండాకాల౦ అంటేనే తాటిముంజెలు, తాటిముంజల౦టేనే ఎండాకాలం, రెంటినీ విడదీయలేం. తరవాత్తరవాత్త ఎన్ని కొత్త కొత్త కాయలు, పండ్లు తిన్నా ఆ ఏటొడ్డున నీరెండలో తిన్న తాటికాయాల రుచి మాత్రం ఎన్నాళ్ళయినా అలా గుర్తుండిపోయింది.