"రేపెకొంజావునే లేవాల తొందరగా పడుకోండి" రాత్రి పదైనా కూడా నిద్రపోకుండా కబుర్లు చెప్పుకుంటున్న మమ్మల్ని హెచ్చరించి౦దమ్మమ్మ. ఇంకా కబుర్లు చెప్పుకోవాలని వున్నా ఉదయన్నే లేస్తే కొన్ని టపాసులు కాల్చుకోవచ్చని పడుకున్నాం. నరకచతుర్దశి నాడు పూర్తిగా తెల్లవారిపోతే కాల్చనీయరుగా, అప్పుడు కాకపోతే టపాకాయలు కాల్చడానికి మళ్ళీ దీపావళి రోజు సాయంత్రం వరకూ ఆగాలి.
ఉదయం లేచేప్పటికి ఇంకా చీకటిగానే వుంది. కొబ్బరాకుల మధ్యన ఆకాశం గులాబి రంగులో కనబడుతోంది. మేడపైన రాత్రి నా పక్కన పడుకున్న వాళ్ళెవరూ కనిపించలేదు, కిందకు దిగి వచ్చేసరికే ఇల్లంతా లైట్లు వెలుగుతున్నాయి. అసలయితే ఇల్లంతా లైట్లు వేయడం అమ్మమ్మకు ఇష్టం ఉండదు. "ఎందుకమ్మా కరెంటు కర్చా, కిటికీ తలుపుల్దెరిస్తే పోలా" అంటుంది కాని ఇవాళ తెల్లవారకుండానే లేచామేమో కిటికీ అవతల కూడా చీకటిగానే వుంది.
సందులో పొయ్యి మీద పే...ద్ద జర్మన్ సిల్వర్లో దబరలో నీళ్ళు కాగుతున్నాయి. నారింజ రంగులో పైకి లేచిన మంట భగాభగా మండుతూ దబర చుట్టూ మూత దాకా పాకుతోంది. ఉదయం చలికి ఆ మంట దగ్గర వెచ్చగా కూర్చుని అరచేతులకు సెగ చూపిస్తుంటే "నీళ్ళు కాగినాయి నాయనా, మావయ్యనా బావిలోంచి నీళ్ళు తోడి గంగాళంలో పొయ్యమన్జెప్పు" చెప్పిందమ్మమ్మ. "మావయ్యా" అని పిలుస్తూ బావి దగ్గరకు వెళ్ళేసరికే గంగాళం నిండుగా నీళ్ళు తోడున్నాయి. పక్కనే వున్న బిందెల్లో, బక్కెట్లల్లో కూడా నిండుగా నీళ్ళున్నాయి.
"అమ్మమ్మా మామయ్య నీళ్ళు తోడేశాడు" అక్కడ్నుంచే అరిచాను.
"దబర కాలిపోతావుంది, వేడ్నీళ్ళు తెస్తన్నానడ్డ౦ రాబాకండి" అంటూ సందులోంచి వేడి నీళ్ళు తెచ్చిందమమ్మ. "అన్నిట్లో నిండా తోడ్నారు ఎక్కడ్నే వేడి నీళ్ళు పోసేదా...వాకిట్లో నీళ్ళు జల్లను పిన్ని బక్కెనెత్తుకపోయింది, ఖాళీ అయిందేమో జూసి తీసకరా నాయనా" అని మళ్ళీ నన్నే పంపింది. ఒక బక్కెనలో సగం నీళ్ళు కింద పొయ్యొచ్చుగా! ఊహు..పొయ్యదు. పైగా నేను కనుక చెప్పాననుకోండి "ఎందుకమ్మా ఉర్దాగా పారబొయ్యడమా" అంటుంది. వాకిలి దగ్గరకు వెళ్ళేసరికి పిన్ని నీళ్ళు చల్లేసి ముగ్గేస్తూ వుంది. అప్పటికే పిన్ని స్నానం చేసి తలకు తెల్ల టవల్ చుట్టుకుని వుంది. ఖాళీ బక్కెన తీసుకుని బావిదగ్గరకు వెళ్ళగానే అమ్మమ్మ సగం వేడ్నీళ్ళు సగం చన్నీళ్ళు ఆ బక్కెట్లో పోసి వేళ్ళు తగిలించి చూసింది. "అబ్బ...ఖాలి పోతన్నాయే" అంటూ ఇంకో రెండు చెంబులు పోసి మళ్ళీ పరీక్ష చేసి "ఇజ్యమ్మా పాపకు తలకు బోద్దువురా" అని అమ్మను పిలిచింది.
అమ్మ ఆనంద కలరు కొత్త పావడా, జాకెట్టు తీసుకుని వచ్చింది. నాకైతే పట్టులంగా వేసుకోవాలని వుంది కాని, అది దీపావళికని చెప్పిందిగా అమ్మ, అందుకని స్నానం అవగానే ఆ కొత్తబట్టలు వేసుకున్నాను. అమ్మ తమ్ముడికి బావి గట్టుమీదే నీళ్ళు పోసినట్టుంది, మధ్యగదిలో పలుచని టవల్ చుట్టుకుని ఎగురుతున్నాడు. దేవుడి గదిలోకి వెళ్లి దండం పెట్టుకుని వరండాలోకి వెళ్ళేసరికి వీధిలో కొద్దిగా వెలుతురు కనిపిస్తోంది. వాకిట్లో గేటు పక్కనున్న రెండు స్థంభాల మీద రెండు దీపాలు వెలుగుతున్నాయి. వరండాలో కాకరప్పూవ్వొత్తులు, సీమ టపాకాయలు, లక్ష్మీ బాంబులు పెట్టి వున్నాయి.
నేను తమ్ముడూ కాకరప్పూవ్వొత్తులు వరండా గట్టుమీద నిలుచుని దూర౦గా పట్టుకుని కాలుస్తుంటే మామయ్యలిద్దరూ లక్ష్మీ బాంబులు ఇంటిముందు వీధిలో పెట్టి కాకరపువ్వొత్తితో పేలుస్తున్నారు. ఎంత ధైర్యమో! పిన్ని కూడా భయ౦ లేకుండా సీమటపాకాయల్ని కొవ్వొత్తితో అంటించి వీధిలోకి విసిరేస్తే టపాటపా, ఢమాఢమా అని ఒకటే శబ్దం. మామయ్య తమ్ముడ్ని ఎత్తుకుని వీధిలోకి తీసుకెళ్ళి లక్ష్మీ బాంబు పేలిస్తే, వాడు భయ౦తో కెవ్వున ఏడవడం మొదలెట్టాడు. "పసిపిలకాయల్ని ఎందుకురా ఏడిపిస్తారా, మీ పాటికి మీరు కాల్చుకోకుండా" అని తాతయ్య అంటే, "వాడికి భయం పోగొట్టాలన్లే బాబా" అని నవ్వేశాడు శేష్మావయ్య.
సాయ౦త్రం నేను, తమ్ముడు, శ్యామ్మావయ్య, శేష్మావయ్య రచ్చబండ దగ్గరకు వెళ్ళాం. అక్కడ గడ్డి నరకాసురుణ్ణి కాలుస్తారుగా! నరకాసురుడు తగలబడిపోతుంటే అందరం చప్పట్లు కొడ్తాం. అసలైతే అలాంటి పని చేస్తే పెద్దవాళ్ళు కోప్పడతారు. కాని నరకాసురుడు రాక్షసుడు, పైగా అందర్నీ బోలెడు బాధలు పెడుతున్నాడని సత్యభామా దేవి అప్పుడెప్పుడో చంపేసిందిట. ప్రజలకు రాక్షసుని బాధ తొలగినందుకు సంతోషించి అందుకు గుర్తుగా ఇప్పుడు ఇలా నరకాసురుడు తగలబడిపోతున్నందుకు చప్పట్లు కొడతామన్నమాట. గడ్డి నరకాసురుడిలో పెట్టిన టపాసులన్నీ ఢా౦ఢా౦ అని పేలిపోయి అక్కడా ఇక్కడా పడి గడ్డి పూర్తిగా కాలిపోయేదాకా చూసి ఇంటికొచ్చేశా౦. రేపే అసలు పండుగ దీపావళి.

meedi prakasam leda guntur ayi undaali.....bhasha chala bagundi...baga raasaaru...evo gurthukosthunnay
ReplyDeleteలక్ష్మీ నరేష్ గారు...బాల్యం ఆ భాషలో ఇమిడిపోయింది, జ్ఞాపకాలన్నీ ఆ దారే పడుతున్నాయి. థాంక్యు.
Deleteపండగ హడావిడి బహు అందంగా చెప్పారు.. అభినందనలు...
ReplyDeleteమీకూ మీ కుటుంబసభ్యులకూ దీపావళి శుభాకాంక్షలు..
ధన్యవాదాలు శ్రీ లలిత గారు. మీక్కూడా దీపావళి శుభాకాంక్షలు.
Deleteచాలా బాగున్నాయి జ్యోతి గారూ!
ReplyDeleteమీ బాల్యపు మధుర స్మృతులు...
మీకు మీ కుటుంబానికీ దీపావళి శుభాకాంక్షలు...@శ్రీ
థాంక్యు శ్రీ గారు.
Deleteఅచ్చమైన దీపావళి శుభాకాంక్షలు:-)
ReplyDeleteబహు మచ్చాటగా చెప్పారు. మీక్కూడా దీపావళి శుభాకాంక్షలు సృజన గారు.
Deleteనిజం దీపావళి రేపే. కాని మా అమ్మాయి ఈ వేళే తెచ్చేసింది మా ముంగిట్లోకి...బాగా చెప్పేవమ్మా అమ్మమ్మ మాటలు, ఎంత గుర్తున్నాయో!
ReplyDeleteబాబాయి గారు పండక్కోరోజు ముందే వస్తే కందండీ సందడి. అమ్మమ్మ జ్ఞాపకాలు బాల్యంలో పెనవేసుకున్నాయి. విడదీయలేని అనుబంధం. ధన్యవాదాలు.
Deleteమీ చిన్ననాటి దీపావళి కబుర్లు బాగున్నాయండీ..
ReplyDeleteమీకు,మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు..
థాంక్యు రాజి గారు.
Deleteమీకు కూడా దీపావళి శుభాకాంక్షలు .
ReplyDeleteథాంక్యు మాలా గారు.
Deleteబంగారు బాల్యాన్ని తలుచుకున్న తీరు బాగుందండీ.. బాగా రాశారు ఏవో జ్ఞాపకాలు చుట్టుముట్టాయ్..
ReplyDeleteతలచిన కొద్దీ ఆ రోజులన్నీ కళ్ళ ముందే తిరుగుతున్నాయి. అదీ అదృష్టమై కదూ...
Deleteఈ విషయంలో "అందమైన జ్ఞాపకాలు మాత్రమే రాయి. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంద"
ని సలహా ఇచ్చిన నెచ్చెలికి కృతజ్ఞతలు చెప్పాలి.
ధన్యవాదాలు వేణు గారు.
mee smruthulu chala baavunnayandi
ReplyDeleteరమేష్ గారు ధన్యవాదాలు.
Delete
ReplyDeleteమీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభకామనలు.
మీక్కోడా బాబాయి గారు. ధన్యవాదాలు.
Deleteబాగుండాయి చిన్నప్పటి ముచ్చట్లు నెల్లూరు యాసలో....;)
ReplyDeleteటపాసులు, దబర, పావడా, ఉర్దాగా, తలకి పోద్దువు, పిలకాయలు...ఇలా చాలా నెల్లూరు మార్కు పదాలు చదువుతుంటే సరదాగా అనిపించింది...
మీకూ మీ కుటుంబానికీ దీపావళి శుభాకాంక్షలు!
చిన్ని ఆశ అమ్మమ్మ గురించి తలచుకుంటే అవే పదాలు వచ్చేస్తాయండి. అలాగే బావుంటుంది కదూ. థాంక్యు.
Deleteమీకు, మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!
ReplyDeleteనాగేంద్ర గారు మీక్కూడానండి. ధన్యవాదాలు.
Deleteఆరోగ్య దీపమ్ము హాయిగా వెలుగొంది
ReplyDeleteభువికి మహాభాగ్య మొలయు గాత !
ఐశ్వర్య సందీప్తు లంత కంతకు హెచ్చి
సిరులతో లోగిళ్ళు పొరలు గాత !
కోర్కెల దివ్వెలు క్రొత్త వెల్గులు దెచ్చి
జీవన సౌఖ్యాలు చెలగు గాత !
విజయాల దీపాల వెల్గు వెల్లువ వచ్చి
బ్రతుకులో బంగారు పండు గాత !
అన్నిటికి మించి బుథులలో నలరు ‘ జ్ఞాన
లక్ష్మి ‘ లోకైక దీపాంకుర మయి వెలిగి ,
భువిని చైతన్య పరచి యీ భువనములకు
‘ తెలుగు బ్లాగర్లు ’ దివ్వెలై వెలుగు గాత !
----- సుజన-సృజన
రాజారావు గారు సాక్షాత్తూ ఆ సరస్వతి దేవి వచ్చి దీవి౦చినట్లుగా వుండండి. మీకు పాదాభివందనం చేస్తున్నాను. ఈ పండుక రోజున మీ లాంటి పెద్దలు ఆశీర్వదించడం నా అదృష్టం.
Deleteచిన్నప్పటి కబుర్లు గుర్తుకు వచ్చాయి.చాలా బాగా వ్రాసారు
ReplyDeleteధన్యవాదాలు శశి కళ గారు.
Deleteజ్యోతిర్మయి గారూ,
ReplyDeleteమీరు ఏ కబుర్లు చెప్పినా ...అవి కాసేపు అలా కూచోబెట్టి ఏవో పాత జ్ఞాపకాల్లోకి లాక్కు పోతాయి. ఇలా రాయడం అందరికీ సాధ్యం కాదు.
భలే అందంగా ఉన్నాయి మీ దీపావళి జ్ఞాపకాలు!
మరో సారి చదువుతున్నా...
ఆ గులాబి రంగు ఆకాశం, ఆ నీళ్ళ దబరా, వాకిట్లో ముగ్గు..నరకాసురుడు..ఆనంద్ కలర్ పావడా ల కోసం....
సుజాత గారు మీ వ్యాఖ్య నన్ను ఏవో లోకాల్లోకి తీసుకెళ్ళింది. ఆ పదాలన్నీ జ్ఞాపకాల్లో ఇమిడిపోయాయి, విడదీయలేనంత అనుబంధం మరి. మీకూ నచ్చినందుకు చాలా సంతోషం. థాంక్యు.
Deleteచాలా తియ్యటి జ్ఞాపకాలు. మీ అందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు.
ReplyDeleteజయ గారు ఆలశ్యంగా స్పందిస్తున్నాను. ఏమనుకోకండి. మధురమైన జ్ఞాపకాలనే గుర్తుంచుకోవాలట ఓ స్నేహితురాలి సలహా. థాంక్యు.
Deleteనాకు చాలా నచ్చిందండీ ఈ టపా. ఎప్పటిలాగే బాగా రాశారు.
ReplyDeleteధన్యవాదాలు శిశిర గారు.
Deleteహలో అండీ !!
ReplyDelete''తెలుగు వారి బ్లాగులు'' తరుఫున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!
వెలుగు జిలుగుల దీపావళి నాడు ఆ లక్ష్మీ మాత కటాక్షం
ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తూ ...
ఒక చిన్న విన్నపము ....!!
రాబోయే నెల డిసెంబర్ 2 వ ఆది వారము (తెలుగు బ్లాగుల దినోత్సవం) లోపల ఒక వెయ్యి తెలుగు బ్లాగులను ఒకదరికి చేర్చాలని సంకల్పించటమైనది
మీరు అనుమతించి నట్లైతే మీ బ్లాగును కూడా తెలుగు వారి బ్లాగుల సముదాయం లో జతపరిచేదము.
మీ అంగీకారము తెలుపగలరు
http://teluguvariblogs.blogspot.in/
తప్పకుండాను. మీ ప్రయత్నా౦ దిగ్విజమవ్వాలని కోరుకుంటున్నాను.
Deleteబాగున్నాయండీ ముచ్చటైన కబుర్లు..మీకూ దీపావళి శుభాకాంక్షలండీ :)
ReplyDeleteహాయ్ సుభా...చాన్నాళ్ళకు దర్శన౦ మీకూ కొంచెం ఆలశ్యంగా దీపావళి శుభాకాంక్షలు. కబుర్లు నచ్చినందుకు చాలా సంతోషం. థాంక్యు.
DeleteBagundandi jyothigaru ee postu..meeku mee ammamaval intlo gadapina chinna nati vishayalu baga gurthuku vunnayi...ee rakamina postlu chadavetapudu maa chinna naati vishayalu gurthuku vastuntayi...
ReplyDeleteప్రవీణ్ గారు నా బ్లాగ్ కి స్వాగతమండీ. అమ్మమ్మవాళ్ళ ఊరు కదండీ మరి. ఆ జ్ఞాపకాలన్నీ అలా పదిలంగా ఉన్నాయి. బాల్యం ఎవరిదైనా బంగారమే ఏమంటారు? థాంక్యు.
Deleteఎంతో బాగుంది..మీ బాల్యపు తీపి గురుతు..:)
ReplyDeleteధాత్రి గారు స్వాగతమండీ. మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.
Deletevery nice...
ReplyDeleteధన్యవాదాలు మాధవి గారు.
Delete