ఓ కల...ఎదలో మెదిలి నేటికి నాలుగేళ్ళు. ఎనిమిదిమంది పిల్లలతో మొదలైన మా పాఠశాలలో ఇప్పుడు మొత్తం నలభై ఆరు మంది విద్యార్ధులు, ఎనిమిది మంది ఉపాద్యాయులు వున్నారు.
అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉండేది 'అంతా వృధా ప్రయాసేనా...ఏనాటికైనా పిల్లలు తెలుగులో మాట్లాడం సాధ్యమయ్యే పనేనా...పుట్టిన దగ్గరనుండి అమెరికాలో ఉంటూ, ఒక్క తెలుగు మాట రాని పిల్లలతో తెలుగు మాట్లాడించగలమా' అని. అప్పటకీ తల్లిదండ్రులు "మా పిల్లల భాషలో చాలా మార్పు వస్తోంది, ఇప్పుడు పదాలు స్పష్టంగా పలక గలుగుతున్నారు, వాళ్ళ అమ్మమ్మావాళ్ళతో కొంచెం కొంచెం తెలుగులో మాట్లాడుతున్నారు" అని చెప్పినా అనుమానంగానే వుండేది.
ఈ శనివారం తల్లిదండ్రుల సహకారంతో పాఠశాల వార్షికోత్సవం జరిగింది. పిల్లలు వేసిన నాటికలు చూసాక, వారు పాడిన పద్యాలు, పాటలు విన్నాక తెలుగు స్పష్టంగా మాట్లాడగలరనే నమ్మకం కలిగింది.
ఈ కార్యక్రమాలలో పిల్లలు సమయస్ఫూర్తితో సమస్య ఎలా గట్టెక్కాలి అని సందేశాత్మకమైన "చేపల తెలివి", అర్ధం చేసుకోకుండా బట్టీ పెట్టడం వలన కలిగే అనర్ధాలను తెలిపే "ఎస్ నో ఆల్రైట్", చెడు సావాసాలతో ఎలా కష్టాల పాలౌతమో తెలిపే 'చెడు స్నేహం', ఐకమత్యం గురించి ప్రభోదించే 'శరీర ఆవయవాలు ఏమంటున్నాయో విందామా!', ఒక మనిషి వ్యక్తిత్వం ఆ మనషి ప్రవర్తన ద్వారా ఎలా బయటపడుతుందో తెలిపే "అప్పు", మాతృదేశానికి ఎంత దూరంలో ఉన్నా మన మూలాలు మర్చిపోకూడనే అంశంతో రూపొందించిన 'రూట్స్' అనే తెలుగు నాటికలు వేశారు. పిల్లలకు ఇంత చక్కని తర్ఫీదు నిచ్చిన ఉపద్యాయులకు ప్రత్యేక అభినందనలు.
పిల్లలు పెద్ద పెద్ద వాక్యాలు అవలీలగా చెప్తుంటే, "ఇదంతా ఎలా సాధ్యమైంది?" అని ఆశ్చర్యం వేసింది. చాలా సంతోషంగా కూడా అనిపించింది. దీని వెనుక ఉపాద్యాయుల కృషితో పాటు తల్లిదండ్రుల శ్రమ ఎంతుందో అర్ధమైంది. పిల్లలు పాటలు, పద్యాలు కూడా చాలా చక్కగా చెప్పారు.
ఈ పిల్లలను "మీకు తెలుగు చదవడం వచ్చింది కదా..ఇక ఇంటి దగ్గర చదువుకోండి" అని చెప్తే, "లేదు మేము పాఠశాలకే వస్తామంటూ" ఈ ఏడాది కూడా వచ్చి స్పష్టంగా చదవడం నేర్చుకుంటున్నారు. వీళ్ళకోసం నాలుగవ తరగతి మొదలు పెట్టాము. ఒక్కరోజు వాళ్ళ ఉపాద్యాయుడు రాకపోతే ఈ పిల్లలు మొహాలు చిన్నబోవడం చూస్తుంటే వారి అనుబంధానికి చాలా ముచ్చటేస్తుంది. వీరు పడిన లింగాష్టకం ఇక్కడ చూడొచ్చు.
ఈ ఉపాద్యాయులందరూ స్వలాభాపేక్షలేకుండా ఏడాది పొడవునా అంకితభావంతో పాఠాలు చెప్తున్నారు.
పిల్లలే ముందుకు వచ్చి తెలుగు ఎందుకు నేర్చుకోవాలో, వాళ్ళకు తెలుగు నేర్చుకోవడం ఎంత ఇష్టంగా వుందో చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. బోధనలో భాగంగా ప్రతి వారం తరగతిలో చెప్పే 'మంచి విషయం', పిల్లల ప్రవర్తనలో ఎలా మార్పు తీసుకొని వస్తుందో చెప్తూ నేటి విద్యా విధానంలో లోపించిన ఎన్నో అంశాలు వారు ఈ తరగతులలో నేర్చుకుంటున్నారని...ఆ తల్లిదండ్రుల మాటల్లో వింటుంటే మా బాధ్యత మరింత స్పష్టంగా అర్ధం అయింది.
తల్లిదండ్రులు, ఉపద్యాయులకోసం ప్రత్యేకంగా రూపొందించిన 'తెలుగు భాష గొప్పదనం' పాట, ఆ తరువాత తెలుగులో వారు కవిత వ్రాసి ఇచ్చిన మేమెంటో మాకు ఎంతో విలువైనవి.
'ఒక్క నిముషం తెలుగు', 'మన తెలుగు తెలుసుకుందాం', 'మీకు తెలుసా...' వంటి కార్యక్రమాల పాల్గొన్న పెద్దవాళ్ళ ఉత్సాహం చూసాక మన భాష పట్ల వున్న మమకారం అర్ధం అయింది.
ఇన్నాళ్ళూ పిల్లలు ఏమి నేర్చుకున్నా, అందరి ముందు ప్రదర్శించడం ఇదే మొదటిసారి. పిల్లలు చేసిన అక్షర నీరాజనానికి పెద్దల కళ్ళలో ఆనందభాష్పాలు నిలిచాయి. పెద్దలందరూ వారిని మెచ్చుకున్నందుకు పిల్లలకు చాలా గర్వంగా కూడా అనిపించే ఉంటుంది. ఆ స్ఫూర్తితో వారు మరింత శ్రద్దగా తెలుగు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను.
మా పాఠశాల గుర్తింపు చిహ్నంలో వున్న మూడు అంశాలు
భాష: మాతృభాషను నేర్పించడం
భావం: మంచి భావాలను పెంపొందించేలా పాఠ్యప్రణాళిక రూపొందించడం.
భవిత: భవితను సన్మార్గం వైపు నడిపించడం.
తెలుగు నేర్పించాలనుకుంటున్న పెద్దల కోసం ఓ నాలుగు మాటలు
భవితను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిది.
అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉండేది 'అంతా వృధా ప్రయాసేనా...ఏనాటికైనా పిల్లలు తెలుగులో మాట్లాడం సాధ్యమయ్యే పనేనా...పుట్టిన దగ్గరనుండి అమెరికాలో ఉంటూ, ఒక్క తెలుగు మాట రాని పిల్లలతో తెలుగు మాట్లాడించగలమా' అని. అప్పటకీ తల్లిదండ్రులు "మా పిల్లల భాషలో చాలా మార్పు వస్తోంది, ఇప్పుడు పదాలు స్పష్టంగా పలక గలుగుతున్నారు, వాళ్ళ అమ్మమ్మావాళ్ళతో కొంచెం కొంచెం తెలుగులో మాట్లాడుతున్నారు" అని చెప్పినా అనుమానంగానే వుండేది.
ఈ శనివారం తల్లిదండ్రుల సహకారంతో పాఠశాల వార్షికోత్సవం జరిగింది. పిల్లలు వేసిన నాటికలు చూసాక, వారు పాడిన పద్యాలు, పాటలు విన్నాక తెలుగు స్పష్టంగా మాట్లాడగలరనే నమ్మకం కలిగింది.
మూడు చేపల కథ |
శరీర ఆవయవాలు ఏమంటున్నాయో విందామా |
'లింగాష్టకం' పాడుతున్న నాలుగవ తరగతి పిల్లలు |
ఒకటవ తరగతి ఉపాద్యాయని మంజుల |
ఒకటవ తరగతి ఉపాద్యాయులు సుమతి, స్నేహ |
రెండవ తరగతి ఉపద్యాయని లావణ్య |
రెండవ తరగతి ఉపాద్యాయులు రాధ, లక్ష్మి |
మూడవ తరగతి ఉపాద్యాయని రాధ |
నాలుగవ తరగతి ఉపాద్యాయులు రఘునాథ్ |
పాఠశాల ఉపాధ్యాయుల బృందం |
పిల్లలే ముందుకు వచ్చి తెలుగు ఎందుకు నేర్చుకోవాలో, వాళ్ళకు తెలుగు నేర్చుకోవడం ఎంత ఇష్టంగా వుందో చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. బోధనలో భాగంగా ప్రతి వారం తరగతిలో చెప్పే 'మంచి విషయం', పిల్లల ప్రవర్తనలో ఎలా మార్పు తీసుకొని వస్తుందో చెప్తూ నేటి విద్యా విధానంలో లోపించిన ఎన్నో అంశాలు వారు ఈ తరగతులలో నేర్చుకుంటున్నారని...ఆ తల్లిదండ్రుల మాటల్లో వింటుంటే మా బాధ్యత మరింత స్పష్టంగా అర్ధం అయింది.
తల్లిదండ్రులు, ఉపద్యాయులకోసం ప్రత్యేకంగా రూపొందించిన 'తెలుగు భాష గొప్పదనం' పాట, ఆ తరువాత తెలుగులో వారు కవిత వ్రాసి ఇచ్చిన మేమెంటో మాకు ఎంతో విలువైనవి.
'ఒక్క నిముషం తెలుగు', 'మన తెలుగు తెలుసుకుందాం', 'మీకు తెలుసా...' వంటి కార్యక్రమాల పాల్గొన్న పెద్దవాళ్ళ ఉత్సాహం చూసాక మన భాష పట్ల వున్న మమకారం అర్ధం అయింది.
ఇన్నాళ్ళూ పిల్లలు ఏమి నేర్చుకున్నా, అందరి ముందు ప్రదర్శించడం ఇదే మొదటిసారి. పిల్లలు చేసిన అక్షర నీరాజనానికి పెద్దల కళ్ళలో ఆనందభాష్పాలు నిలిచాయి. పెద్దలందరూ వారిని మెచ్చుకున్నందుకు పిల్లలకు చాలా గర్వంగా కూడా అనిపించే ఉంటుంది. ఆ స్ఫూర్తితో వారు మరింత శ్రద్దగా తెలుగు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను.
మా పాఠశాల గుర్తింపు చిహ్నంలో వున్న మూడు అంశాలు
భాష: మాతృభాషను నేర్పించడం
భావం: మంచి భావాలను పెంపొందించేలా పాఠ్యప్రణాళిక రూపొందించడం.
భవిత: భవితను సన్మార్గం వైపు నడిపించడం.
తెలుగు నేర్పించాలనుకుంటున్న పెద్దల కోసం ఓ నాలుగు మాటలు
- తెలుగు నేర్పించాలన్న మీ సంకల్పం అభినందనీయం.
- మన భాష నేర్చుకుంటున్నామన్న ఉత్సాహ౦ పిల్లలకు కలుగజేయాలి.
- పద్యాలు, శ్లోకాలు చెప్పించడం వలన వారికి తెలుగు మాట్లాడం తేలిక అవుతుంది.
- సామెతలు, జాతీయాల వంటివి వాడడం ద్వారా వారిలో, ఆసక్తిని కలిగించి వారికి భాషనే కాక లోకజ్ఞానాన్ని కలిగించిన వాళ్ళమౌతాము.
- చక్కని భావం వున్న పాటలను వినిపించడం, స్పష్టమైన ఉచ్చారణ ఉన్న టివి కార్యక్రమాలను చూపించడం వలన వారికెన్నో కొత్త పదాలు పరిచయమౌతాయి.
- ఇంట్లో తెలుగులోనే మాట్లాడేలా ప్రోత్సహించండి.
- తెలుగులో మాట్లాడినప్పుడు వారికి చిన్న, చిన్న బహుమతులు ఇస్తే ప్రోత్సాహకరంగా ఉంటుంది.
- రాత్రి పడుకునేప్పుడు తెలుగు కథ చదవడం, లేదా తెలుగులో కథ చెప్పడం వల్ల వాళ్ళకు భాషతో అనుబంధం ఏర్పడుతుంది.
- పండుగ రోజు ఆ పండుగ యొక్క ప్రాశస్త్యం, కథ చెప్పడం వలన వారికి మన సంస్కృతి గురించి చక్కని అవగాహన వస్తుంది.
- మీరు తెలుగులో మాట్లాడేప్పుడు ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా వాడకండి.
- అన్నింటికంటే ముఖ్యమైనది మీరు మీ పిల్లలతో తెలుగులోనే మాట్లాడండి.
- ఎవరైనా వారితో ఇంగ్లీషులో మాట్లాడుతున్నా పిల్లలకు తెలుగు అర్ధమౌతుందనే విషయాన్ని గుర్తుచేయడానికి మొహమటపడకండి.
భవితను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిది.