అప్పుడే ఏడాది పూర్తయ్యింది చిత్రంగా లేదూ! ప్రతి ఏడాది అనుకునే మాటే అయినా ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. మా చిన్న కుటుంబం పెరిగి పెద్దదవుతోంది. ఇప్పుడు సరిపడా ఇల్లు కావాలంటే ఆ ఇంట్లో కనీసం ఓ నూట యాభై గదులన్నా ఉండాలి. ఏమిటీ ఆశ్చర్యపోతున్నారా పాఠశాల గురించి చెప్తున్నానండీ.
తొంభై ఏడు మంది విద్యర్దులున్న పాఠశాలలో పోయినేడాది హఠాత్తుగా మరో నూట ఇరవై మంది విద్యార్ధులు రిజిస్టర్ చేసుకున్నారు. ఏం చెయ్యాలా అని ఆలోచించే లోపలే ఓ ఇరవై రెండు మంది ఉపాధ్యాయులు మేం పాఠాలు చెప్తాం అంటూ ముందుకు రావడం తలచుకుంటే మాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. పాఠశాలలో గత ఆరేళ్లుగా పాఠాలు చెప్తున్నవారున్నారు. మార్గ మధ్యలో కలసిన వారున్నారు, పోయినేడాది ఓపెన్ హౌస్ కి వచ్చి అప్పటికప్పుడు మేము కూడా పాఠాలు చెప్తాం అంటూ ముందుకు వచ్చిన వారున్నారు. అందరు టీచర్లు కూడా విజయవంతంగా ఈ ఏడాది పాఠాలు చెప్పడం పూర్తిచేశారు.
నిన్న ఒక టీచర్ మాట్లాడుతూ విద్యార్ధులకు నేర్పించిన దానికన్నాతాను నేర్చుకున్నదే ఎక్కువన్నారు. అది నూటికి నూరు పాళ్ళు నిజం. పిల్లలకు సుభాషితాలు, శతకాలు నేర్పిస్తున్నప్పుడు జీవితాన్ని తరచి చూసుకున్నది నాకూ అనుభవమే.
"ఇంతకు ముందు ఊర్లో ఉన్నామో లేదో, అసలు నేననేదాన్ని ఒకదాన్ని ఉన్నాననే ఎవరికీ తెలిసేది కాదు. ఇప్పుడు అలా కాదు. ఓ రెండు వారాలు ఇండియా వెళ్ళిరాగానే ఎలా ఉన్నారు? జెట్ లాగ్ ఉందా? ఏమైనా వంట చేశారా? లేదా మ క్లాస్ పేరెంట్స్ అంటూ పలకరిస్తుంటే కళ్ళు చెమర్చాయంటే నమ్మండి". అంటూ మరో టీచర్.
"పిల్లలూ వారి పేరెంట్స్ తో పిక్నిక్ భలే సరదాగా గడిచింది. ఆ రోజంతా చాలా బాగా ఎంజాయ్ చేశాం. మన టీచర్స్ అందరం కూడా వచ్చే ఏడాది తప్పక పిక్నిక్ వెళ్దాం" అంటూ మరో టీచర్.
"ఈ చిన్న పిల్లలకు ఇన్ని యాక్టివిటీస్ ఏమిటండీ. ఎప్పుడు క్లాస్ రీస్కెడ్యూల్ చెయ్యలన్నా కుదరదు. మాకు పిల్లల యాక్టివిటీస్ మీద పూర్తి అవగాహన వచ్చింది. మా అమ్మాయి పెద్దయ్యాక ఏ క్లాస్ ముఖ్యమో ఏది కాదో ఇప్పుడే తెలిసి పోయింది" అంటూ ఓ రెండేళ్ళ పాప ఉన్న టీచర్ ఆనందంగా చెప్పారు.
"మా పిల్లలు అ అంటే అట్టు, ఆ అంటే ఆవడ, ఇ అంటే ఇడ్లీ అంటూ చెప్తున్నరండీ" అని ఓ టీచర్ మురిపెం.

ఈ ఏడాది మురిపించిన అనుభవాలు కొన్ని....
"మేము మీ పిల్లలకు తెలుగు చెప్పడం మొదలు పెడుతున్నాం, ఈ ఏడాదే కాదు మన ఈ సంబంధం మరో నాలుగేళ్ళు పాటు కొనసాగుతుంది అంటూ ఒక టీచర్ పేరెంట్స్ కి పంపిన మెయిల్ తొలి మెయిల్ చూసినప్పుడు ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది.

మొన్న ఒక ఈవెంట్ కి వెళితే ఓ నాలుగురు పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి హాగ్ లు ఇచ్చేశారు. ఎవరా అని చూస్తే పోయిన సంవత్సరం నా క్లాస్ విద్యార్ధులు అని తృప్తిగా మరో టీచర్...
మేము మా క్లాస్ పిల్లలతో క్రిస్ మస్ సెలవలలో జింజర్ బ్రెడ్ హౌస్ చేశామని ఒకరు, మా క్లాస్ వారందరం కలసి సంక్రాంతి జరుపుకున్నామని మరొకరు ఇలా ప్రతి తరగతిలో టీచర్ కు విద్యార్ధుల కుటుంబాలకు పెరుగుతున్న అనుబంధం చూస్తుంటే ఆనందంగానూ ఆశ్చర్యంగా ఉంది.
ఇంతమందిని అలరించిన పాఠశాల వేసవి విశ్రాంతి తీసుకోబోతోంది. మా పిల్లలకు ఇక మీరే ఉపాధ్యాయులంటూ విద్యార్ధులను తల్లిదండ్రులకు అప్పగించిన టీచర్లు, పిల్లలకు అక్షరాలు చక్కగా వచ్చేశాయి. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న వాక్యాలు స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు. మేము ఎలా పంపిస్తున్నామో వేసవి అనంతరం మాకు ఈ పిల్లలను అలాగే తిరిగి ఇవ్వాలని పేరెంట్స్ కు జాగ్రత్తలు చెప్తున్న టీచర్లతో ఈ వారం హడావిడిగా ఉంది.
తెలుగు నేర్పించడమే ప్రధానంగా మొదలుపెట్టిన పాఠశాల అనుబంధాల అల్లికతో కొత్త పుంతలు తొక్కడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది.