Monday, February 6, 2012

తల కళ్ళు

       అక్క బుల్లి డ్రాయింగ్ టేబుల్ దగ్గర కూర్చుని దీక్షగా బొమ్మ వేసుకుంటుంది. బుజ్జిపండు అక్క దగ్గరకెళ్ళి నిలబడ్డాడు. "కక్కా(మన బుజ్జాయికి అప్పటికి అక్క అనడం రాదు) నువ్వేం చేత్తున్నావ్?" అడిగాడు పండు. "బొమ్మ వేస్తున్నా" తల పైకెత్తకుండానే చెప్పింది అక్క. "ఏం బొమ్మ?" కొంచెం ఒంగి మోకాళ్ళ మీద చేతులు పెట్టుకుని బొమ్మ వైపు చూస్తూ అడిగాడు పండు.  "మన ఫామిలీ బొమ్మ వేస్తున్నా" పేపర్ పైకి పెట్టి ఆనందంగా చూసుకుంటూ చెప్పింది అక్క.

"ఇది ఓలు?" ఒక బొమ్మ మీద వేలు పెట్టి చూపిస్తూ అడిగాడు.

"అది అమ్మ" చెప్పింది అక్క.
"మలి ఇది?"
"నాన్న"
"ఇది కక్క" కాళ్ళ వరకు పొడవు జుట్టున్న బొమ్మను చూపించి ఆనందంగా చెప్పాడు పండు. అక్కను తలచుకుంటేనే పండు మోహంలో సంతోషం తోసుకుని వస్తుంది.
"గుడ్ జాబ్. భలే కనుక్కున్నావే". అక్క మొహం వెలిగిపోయింది. అక్క వేసిన లావుపాటి బెరడు పైన చిన్న బాల్ ఆకారంలో వున్న చెట్టును చూపిస్తూ "ఇది బిల్దింగ్" అన్నాడు పండు.

      అక్కకు అది నచ్చలా. 'నేను ఇంత బాగా చెట్టు వేస్తే బిల్డింగ్ అంటాడా' అనుకుని, "బుజ్జిపండూ నువ్వు బ్లాక్స్ పెట్టుకో" అంది. పండుకి బ్లాక్స్ పెట్టడం అంటే ఎక్కడలేని సరదా. రయ్యిమని పరిగెత్తుతూ మూలనున్న పెద్ద డబ్బాని గది మధ్యకు లాక్కుని వచ్చి మూత తీసి అన్నీ కిందపోశాడు. ఆ శబ్దానికి అక్క రెండు చెవులూ గట్టిగా మూసుకుంది. పెరట్లో మొక్కలకు నీళ్ళు పోస్తున్న అమ్మ ఏం జరిగిందోనని పరిగెత్తుకునొచ్చి౦ది. అమ్మయ్య బ్లాక్స్ శబ్దమే అనుకుని "పండూ ఆడడం అయిపోయాక అన్నీ సర్దేయాలి. ఏం" అని చెప్పింది. "ఓకే అమ్మా" అంటూ బుజ్జిపండు బ్లాక్స్ ఒకదాని మీద ఒకటి పెట్టడం మొదలుపెట్టాడు. 

     "కక్కా కక్కా, లుక్ లుక్" సంతోషంగా చప్పట్లు కొడుతూ పిలిచాడు బుజ్జిపండు. ఓ సారి తలెత్తి చూసి, తమ్ముడి కళా సృష్టికి ఒకి౦త ఆశ్చర్యపడి "వావ్ భలే పెట్టావే, ఇంతకూ ఏంటి పండూ అది?" అని అడిగింది. "ఇది ఏలోపెన్." దాని చుట్టూ ఎగురుతూ బదులిచ్చాడు. కాసేపటికి మళ్ళీ బ్లాక్స్ అటూ ఇటూ మార్చి "కక్కా కక్కా" అని పిలిచాడు. "మెల్లగా తలెత్తి చూసి, "ఇప్పుడే౦ పెట్టావు పండూ" అడిగింది. "కాల్" చెప్పాడు బుజ్జి. "కార్ చాలా బావుంది." అని బొమ్మకి క్రేయాన్ తో రంగులు వేయడం మొదలు పెట్టింది.

     "కక్కా లుక్" మళ్ళీ పిలిచాడు పండు. అక్క చూడలేదు దీక్షగా రంగుల్లో మునిగి పోయింది. దగ్గర కెళ్ళి మొహంలో మొహం పెట్టి "కక్కా కక్కా, చూలు ఏం పెత్తానో" అని బ్లాక్స్ వైపు చూపించాడు. అక్క అయిష్టంగా బొమ్మ మీదనుంచి చూపు మరచి కొంచెం నీరసంగా "గుడ్ జాబ్ పండు" అంది. అక్క మెచ్చుకోగానే పండు ఎగురుకుంటూ బ్లాక్స్ దగ్గరకెళ్ళాడు. ఓ ఐదు నిముషాలాగి "కక్కా లుక్" అన్నాడు. అక్క తలెత్తకుండానే "చూస్తున్నా పండూ" అంది. పండు నమ్మలా "లుక్ ఎత్ మై ఎల్లో తక్" అన్నాడు మళ్ళీ.

    "పండూ నాకు ఫోర్ ఐస్ ఉన్నాయ్. రెండు ఫ్రంట్ రెండు బాక్. నా బాక్ ఐస్ తో చూస్తున్నా" అని వివరించింది అక్క. దానికి సాక్ష్యంగా "నీ ఎల్లో ట్రక్ బావుంది" అని మెచ్చుకుంది కూడా. నిజమే కాబోలనుకున్నాడు పండు. అప్పటినుండి ఎప్పుడైనా అక్కని పిలిచి అక్క తల తిప్పకపోతే "ఓ బాక్ ఐస్ తో చూస్తున్నావా" అనేవాడు పండు. ఓ రెండేళ్ళు అక్క 'తల కళ్ళు' దివ్యంగా పనిచేశాయి. నిజం తెలిసే వరకూ బుజ్జి పండు హాపీస్, అక్క హాపీస్. ఇద్దరూ గొడవ చెయ్యకుండా ఆడుకు౦టున్న౦దుకు అమ్మ కూడా హాపీ.

32 comments:

  1. చార్ ఆంఖే,
    చార్మీ నారీ!!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  2. చాలా బాగున్నాయి బుజ్జిపండు కబుర్లు. :))))))

    ReplyDelete
  3. జ్యోతిర్మయి ...
    మీ బుజ్జి పండు గుర్తొస్తున్నాడు పదే పదే
    బాల్యమే అంత గొప్పది .అందుకే ఒక కవి అంటాడు ..
    ''ఉందో లేదో పుణ్యం నాస్వర్గం నాకిచ్చెయ్
    నా సర్వస్వం నీకిస్తా నా బాల్యం నాకిచ్చెయ్ ''
    చిన్ననాటి చిన్ని చిన్ని ముచ్చట్లు గుర్తు చేసారు
    అభినందనలు
    ..................................బాలకృష్ణ ఒంగోలు

    ReplyDelete
  4. మీరు బలే రాస్తారు అండి..

    ReplyDelete
  5. సర్ఫ్ ఎక్సెల్ "మరక మంచిదే" యాడ్ లాగా అప్పుడప్పుడు అబద్ధం కూడా మంచిదే అన్నమాట :)

    ReplyDelete
  6. బుజ్జిపండు క్షేమంగా వచ్చేసాడు కదా. ఇంక మీకు కావాల్సినంత సందడే సందడి. తెలుగు పూర్తిగా వచ్చేసినట్టేనా:)

    ReplyDelete
  7. కొద్దిగా అర్థమయ్యేట్టు డైరక్ట్ గా రాయొచ్చు కదండీ. టపాలను అర్థంచేసుకోవడానికి కూడా ఇంత శ్రమ పెట్టాలా?

    ReplyDelete
  8. ఒక రెండేళ్ళు అన్నారంటే మరి తరువాత ఏమైనట్టు
    తరువాయి పోస్టులో వస్తుందేమో వేచి చూస్తాము....

    బాగున్నాయి అక్క లుక్కులు తమ్ముడి ట్రిక్కులు.... అసలైతే ట్రిక్కులు కూడా అక్కవే....
    పాపం బుజ్జిపండుకి బ్లాకులు తప్ప ఏమీ లేవని అక్క ఇచ్చేసిందంట....

    ReplyDelete
  9. చిన్న పిల్లాడ్ని చేసి ఇలా కూడా మోసం చేస్తారా ఇదేం బాగోలేదండి ... మొత్తం ఎనిమిది కళ్ళు ఉండంగా నాలుగే అంటే ఎలా .. నేనైతే ఆ నిజం చెప్పేటోడ్ని :-P

    ReplyDelete
  10. మీ పోస్టు చదివాక మేము కూడా హ్యాపీసేనండీ జ్యోతిర్మయిగారు...

    ReplyDelete
  11. @ జిలేబిగారూ కష్టపడి టపా వ్రాస్తానా..చిదివిన వాళ్ళ పెదవుల మీద నవ్వు మొహమాటంగా ఆగిపోతుంది. కింద మీ వ్యాఖ్య చూడగానే అది ఆగకుండా పరిగెట్టుకునొచ్చేస్తుంది. ఒకప్పుడు టపా వ్రాయడం వ్యసనమయ్యింది.ఇప్పుడు పోస్ట్ చేశాక మీ వ్యాఖ్య కోసం చూడడం వ్యసనంగా మారింది. నా మనసులోని భావం చెప్పాలంటే ధన్యవాదాలు అనే మాట సరిపోదు. అంతకంటే పెద్ద పదం నాకు తెలియదు. అందుకే మీకు బోలెడు ధన్యవాదాలు.

    ReplyDelete
  12. @ బాబాయిగారూ ప్రతి టపా చదివి మీరిస్తున్న ప్రోత్సహ౦ మరువలేనిది. ధన్యవాదాలు.

    @ వనజ గారూ బుజ్జిపండు మీద అభిమానంతో చిట్టితల్లిని మరచిపోయారు. ధన్యవాదాలు.

    @ శ్రావ్య గారూ ధన్యవాదాలు.

    @ బాలకృష్ణ గారూ చక్కని విషయం చెప్పారు. ధన్యవాదాలు.

    ReplyDelete
  13. @ మధురవాణి గారూ ధన్యవాదాలు.

    @ తెలుగు పాటలు గారూ మీ అభిమానానికి ధన్యవాదాలు.

    @ రాజి గారూ అప్పుడప్పుడూ మాత్రమేనండోయ్. ధన్యవాదాలు.

    ReplyDelete
  14. @ క్రిష్ణప్రియ గారూ :) ధన్యవాదాలు.


    @ జయ గారూ ఎక్కడండీ బుజ్జిపండు ఇంకా రాలేదుగా..కష్టేఫలె శర్మగారితో కలసి ప్రయాణం చేస్తున్నాడు. బుజ్జిపండుకు తెలుగు వచ్చండీ. వాళ్ళ బాబాయికి ఉత్తరం కూడా వ్రాశాడు. ధన్యవాదాలు.

    @ వేణుగారూ :) ధన్యవాదాలు.

    ReplyDelete
  15. @ భాస్కర్ గారూ అర్ధమయ్యేట్లు వ్రాయడానికి ప్రయత్నిస్తానండీ. ధన్యవాదాలు.

    @ మాధవిగారూ తరువాత ఏమై౦దంటారా...బుజ్జిపండు 'లుక్ లుక్' అనడం మానేశాడు. అక్కకు తలకళ్ళతో అవసరం రాలేదు. ఇప్పుడా విషయం తలచుకుని ఇద్దరూ నవ్వేసుకుంటారు అంతేనండీ..మీ వ్యాఖ్యలో ప్రాస బావుంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  16. @ కళ్యాణ్ గారూ మీరు అక్కకు కొత్త ఐడియాలు ఇచ్చేస్తున్నారు. అసలే గడుగ్గాయ్ ఆ తర్వాత మనకి కష్టం. ధన్యవాదాలు.

    @ శోభ గారూ మీ వ్యాఖ్య చూశాక నేను కూడా హాపీస్ అండీ..ధన్యవాదాలు.

    ReplyDelete
  17. భలే భలే...పండు వాళ్ళ అక్క ఎంత తెలివైనదో! :)

    ReplyDelete
  18. సౌమ్య గారూ పండు వాళ్ళ అక్క 'నొప్పించక తానొవ్వక' టైప్ అండీ...ధన్యవాదాలు.

    ReplyDelete
  19. ఎట్టా గుర్తుంటాయండి?

    ReplyDelete
  20. తెలుగు భావాలు గారూ స్వాగతం. మా అమ్మ మా చిన్నప్పటి కబుర్లన్నీ చెప్తుండేవారు. నాకర్ధాంతరంగా ఏమన్నా అయితే ఈ విషయాలన్నీ మరుగున పడిపోవూ..వాళ్ళ బాల్యాన్ని జాగ్రత్తగా అప్పచెప్పే ప్రయత్నమే ఇది. ధన్యవాదాలు.

    ReplyDelete
  21. హహ్హహ్హా.. ఎంత ముద్దుగా ఉన్నాయో పండు, అక్క ముచ్చట్లు. టపా చదివి చాలా రిఫ్రెష్ అయిపోయాను. పంచుకున్నందుకు ధన్యవాదాలు జ్యోతిర్మయి గారూ:)

    ReplyDelete
  22. అపర్ణ గారూ మీరు రిఫ్రెష్ అయ్యారు కదా చాలా సంతోషం.
    మీ అనుభూతిని వ్యాఖ్య ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  23. జ్యోతిర్మయి గారూ,
    ఈ కథని (జరిగిన విషయాన్నిఒ కథలా మీరు చెప్పిన తీరు చాలా బావుంది) తెలుగు4కిడ్స్ కోసం మీ సహకారంతో తయారు చెయ్యలని ఉంది. మీకు ఇష్టమేనా?

    ReplyDelete
  24. @ లలితగారూ మీకు నచ్చినందుకు చాలా సంతోషం. తెలుగు4కిడ్స్ కోసం నా సహకారం కావాలన్నారు. సంతోషంగా చేస్తాను. ధన్యవాదాలు.

    ReplyDelete
  25. జ్యోతిర్మయీ,
    Thanks. త్వరలోనే e-mail ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తాను. మాలతి గారి "బుష్ కోటు" కథ వీడియో తెలుగు4కిడ్స్ కోసం చెయ్యడంలో బిజీగా ఉండాలి ఇంతవరకూ.చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగు4కిడ్స్ ప్రాజెక్టులు మొదలు పెట్టాను. అందుకని నెమ్మదిగా అవుతున్నాయి పనులు. మాలతి గారి కథను ఎలా present చేశానో చూస్తే మీకు మీ కథను ఎలా present చెయ్యాలనుకుంటున్నానో కొంచెం అర్థం కావచ్చు. సందేహాలుంటే సంప్రదించండి. మీ సూచనలకూ, అభిప్రాయలకూ కూడా స్వాగతం.

    ReplyDelete
  26. mee *talakallu*nu 16.6.2013 aadivaram sanchikalo prachuristhunnam
    -editor, andhrahyothi

    ReplyDelete
    Replies
    1. చాలా సంతోషం. సంపాదకులకు ధన్యవాదాలు.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.