'ఈ పూట కాస్త ఇల్లు సర్దుదా౦' అని పైఅరలో వున్నడబ్బా కిందకు దించి మూత తెరిచాను. కళకళ్ళాడుతూ దేవతల బొమ్మలు, తళతళలాడే తులసి కోటలు, ముచ్చటైన కుంకుమ భరిణలు, మిలమిలలతో వెండిపూలు, ఇంకా అలాంటివే ఏమిటేమిటో దర్శనమిచ్చాయి. "ఇవన్నీ ఏమిటి?" అనుకుంటున్నారా....మీకంతా వివరంగా చెప్తాగా. సత్యన్నారాయణ స్వామి వ్రతాల తాలూకు వెండి కుంకుమ భరిణలు, గృహప్రవేశానికి తులసి చెట్లు, బారసాల కృష్ణులు, ఓణీల పండుగల లక్ష్మీదేవి బొమ్మలు... లాంటివన్నమాట. పాప౦ ఇచ్చిన వాళ్ళు గుర్తుగా ఉంటుందనుకుంటారు. ఓ పది భరిణలు, ఎనిమిది తులసి చెట్లు, తొమ్మిది దేవతలు, ఓ ఇరవై ముచ్చటైన పూలలో ఎవరేది ఇచ్చారో ఎలా గుర్తుపెట్టుకోవడం? ఈ రోజుల్లో బారసాల పిల్లాడి పేరే గుర్తుండడం లేదు ఇక ఈ వస్తువులనేం గుర్తుపెట్టుకుంటాం. వీటన్నింటినీ ఇప్పుడేం చేయాలి? సరే వాటిని పక్కన పెట్టి బెడ్రూం క్లోజెట్ దగ్గరకు వెళ్లాను.
ఇంద్రధనస్సుకొన్ని వందల ముక్కలై అరల్లో సర్దుకున్నట్లుగా గుట్టలు గుట్టలుగా బట్టలు. కొన్నింటికి మెరుపులు అద్దినట్లు తళుకులు కూడానూ...అన్ని బట్టలు ఎలా వచ్చాయా అని ఆశ్చర్యపోయి గుండ్రాలు చుడితే...డాలరు ఖర్చు పెట్టడానికి యాభైఐదు సార్లు ఆలోచించే నేను రెండేళ్ళ వరకూ రాముకదా అని కట్టలు కట్టలు వెచ్చించిన సందర్భాలు గుర్తొచ్చాయి. స్వయ౦కృతాపరాధం అంటారా...అబ్బే అదేం కాదు పూర్తిగా వినండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంటికి వెళితే జాకెట్ ముక్క పెట్టడాలు మొదలెట్టారు. ఏదో మన సాంప్రదాయం ప్రకారం బొట్టుపెడితే బావుంటుంది. పైగా ఇప్పుడు మాచింగ్ జాకెట్లూ, డిజైనర్ జాకెట్లూ వేసుకు౦టున్నా౦గా, ఆ జాకెట్ ముక్కలనేం చేసుకోవాలో తెలీదు. అది చాలనట్లు గృహప్రవేశాలకు చీరలు కూడానూ.. వద్ద౦టే మరి పద్ధతిగా ఉండదు...ఏదో ఇష్టం లేని మొగుడుతో అయితే సర్దుకుపోగలం కానీ నచ్చని చీర కట్టలేంగా...

ఇండియా నుంచి వచ్చే ముందు రోజు "అమ్మాయ్ నీకోసం ఈ ఉప్పాడచీర తీసిపెట్టాను." అని ఓ పాకెట్ చేతిలో పెడతారు. ఇలా పెట్టిన చీరలే పెట్టె నిండిపోయాక, కొన్న చీరలు మరోపెట్టెలో సర్దుకుని ఇక్కడకు తీసుకొస్తే ఆ బట్టలన్నీ ఇలా అసూర్యంపశ్యలుగా మిగిలిపోయాయన్నమాట. ఈ మధ్య నాలాంటి వాళ్ళకోసమే ఎయిర్ లైన్స్ వాళ్ళు లగేజ్ బరువు తగ్గించారేమో..ఆ వంకనన్నా ఈసారి నుండి తక్కువ సామానుతో రావచ్చు.
ఇక వంటగది విషయానికి వస్తే పూజలు, వ్రతాల బాపతు ప్లాస్టిక్ గిన్నెలు, డబ్బాలు...చిన్నప్పుడే నయం, అమ్మా వాళ్ళు పసుపు కుంకానికి వెళ్తే చక్కగా బొట్టుపెట్టి కాళ్ళకు పసుపు రాసి స్వీటు, హాటు, పండు, ఆకులు, వక్కపొడి పొట్లం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఇంటికి రాగానే తినేవన్నీ పిల్లలం తీసేసుకునేవాళ్ళం. పెద్దవాళ్ళు తాంబూలం వేసుకునేవారు. అంతటితో అవి పూర్తయ్యేవి. ఈ సమస్య ఇక్కడే అనుకున్నాను. పోయినసారి ఇండియా వెళ్ళినప్పుడు మా అత్తగారింట్లో ఒక పెద్ద అద్దాల బీరువా నిండా స్టీలు డబ్బాలు కనిపించాయి. మా అత్తయ్యకు స్టీలు అంటే ఇష్టమని తెలుసు మరీ ఇన్ని స్టీలు డబ్బాలు కోనేంత అనుకోలేదు. అయితే మాటల్లో తెలిసిన విషయం ఏమిటంటే అవి ఆవిడ కొనలేదట, జ్ఞాపకార్ధాలవట. అవి అడ్డం రావడం వల్ల ఆవిడ అవసరమైన గిన్నెలు ఎక్కడో పెట్టుకుని ఇబ్బంది పడుతున్నారు.
వంట గదిలో పాంట్రీలోకి వెళ్లాను. అక్కడ మొదటిసారి భోజనానికి వచ్చిన వారు తెచ్చిన గృహోపకరణాలు, గృహాలంకరణాలు....రకరకాల రంగుల్లో, ఆకారాల్లో కనిపించాయి. వాటిని ఎక్కడా పెట్టలేను అలాగని గుడ్ విల్ లో ఇచ్చెయ్యనూలేను. వాటిని తీసెయ్యాలంటే మనం 'గుర్తుగా ఉంచుకుంటాం అని కదా ఇచ్చారు' అనిపిస్తుంది. అవన్నీ ఓ పక్కన పెట్టాను, వాటినేం చెయ్యాలో తెలీదు.
బయట వాళ్ళ సంగతి సరే...ఇంట్లో వున్న వాళ్ళు "సర్ప్రైజ్" అంటూ బర్త్ డేకి, వాలెంటైన్ డేకి, మారేజ్ డే కి, ఇంకా మదర్స్ డేకి పెర్ఫ్యూమ్స్, చిన్న చిన్న డెకొరేటివ్ పీసెస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి లెండి. దేవుడి అర తీశాను. ఓ యాభై మంది వినాయకుళ్ళు, ఇరవై మంది సాయిబాబాలు, కొలువై వున్నారు. ఇండియా నుండి వస్తూ పుణ్య క్షేత్రాలు దర్శించిన వాళ్ళు తెచ్చి ఇచ్చినవి. ఇంకా చిన్న చిన్న పాకెట్ లలో పసుపు, కుంకుమలు. బాబాలు ఇచ్చిన పూసల దండలు...ఈ లెక్కన పోగు చేస్తుంటే కొన్నాళ్ళ తరువాత ఈ ఇల్లు ఓ మ్యూజియంలా తయారవుతు౦దేమో... సాయినాథా నన్ను నువ్వే కాపాడాలి తండ్రీ...
ఇవాళ ఇల్లు సర్దుదామని మొదలుపెట్టి, ఇలా అనేకరకాల వస్తువుల మధ్య చిక్కుకుని, నిండా ఐదున్నర అడుగుల ఎత్తులేని నాకు ఇన్ని బట్టలా అని విరక్తి చెంది, నా బాధను ఈ బ్లాగులో పెడుతున్నాను. ఇలా ఆలోచిస్తుంటే ఓ కథ గుర్తొచ్చింది. ఒక ఫ్యాక్టరీలో పని చేసే ఆవిడ సాయంత్రం వస్తూ వస్తూ కొంచెం బియ్యం, కూరగాయలు, బట్టల సోడా, నూనె, కిరసనాయలు, కాసిని మల్లెపూలు కొనుక్కుని ఇంటికొచ్చి తెచ్చిన వాటితో ఆ రోజు కానిచ్చి ఆ పూట ప్రశాంతంగా నిద్రపోయిందట. ఇలా హృదయం లేని వస్తువుల మధ్య చిక్కుకునే కష్టాలు లేవు కదా ఆవిడకు...అకటా...నీలాకాశం, వెండిమబ్బులు, పచ్చని చెట్లను చూడకుండా, చక్కని పాటలు వినకుండా ఈ రోజు ఇలా బలయ్యానేమిటి?
అంతా వినేసి "మరీ చోద్యం కాకపోతే ఈ మాత్రం దానికి ఓ టపా" అనుకోకండి. ఈ సమస్య చాలా తీవ్రమైనది ముఖ్యంగా నాలాంటి ఇల్లాళ్ళకు. ఈ రోజుల్లో ఏ ఇల్లు చూసినా గడియారంలో అంకెల్లా పొందిగ్గా కాకుండా, చిక్కుపడిన ఊలు దారంలా గజిబిజిగా వుంటోంది. ఇంట్లో అవసరమైన వస్తువులు ఏవీ కనిపించడం లేదు. పైగా అనవసరమైన వస్తువుల కోసం ధనం, సమయం ఎంత వృధా చేస్తున్నామో చూడండి. ఇలా అయితే మరి ఇక జ్ఞాపకం మాటేమిటంటారా? ఒక మనిషినో లేక వేడుకనో గుర్తుపెట్టుకోవాలంటే వస్తువుల మీద ఆధారపడాలా...వారితో గడిపిన సమయ౦ చాలదా...

ఎవరికైనా ఏమైనా ఇవ్వాలనుకుంటే నాలుగు పండ్లు ఇచ్చి సంతోషంగా వారితో గడిపివద్దాం. మనం ఇచ్చే వస్తువులు వారికి అఖ్ఖర్లేదు. వారికి కావలసినవి/నచ్చినవి వారినే కొనుక్కోనిద్దాం.
కరెక్టు గా చెప్పారు !
ReplyDeleteశ్రావ్య గారూ ధన్యవాదాలు..
Deleteచాలా బాగా చెప్పారు. ఈ అనవసరమైన వస్తు సముదాయంలో చిక్కుకుని విపరీతమైన బాధ..
ReplyDeleteపారేయ లేక ఉంచలేక,వద్దని అనలేక ,మింగలేక లేక -కక్క లేక అన్నట్లు.
బాగా చెప్పారు వనజగారూ..ధన్యవాదాలు.
Deleteఈ బహుమతుల తాలుకు వస్తువులతో పడలేక ఉపయోగపడవు అయినా ఎన్ని వాడగలము అందుకే అన్నింటిని అటకమీద దాచి. 3సంవత్సరముల క్రీతము మా అమ్మాయి పుష్పవతి అయినప్పుడు మొత్తము ఖాళి చేసాము. బజారు నుంచి కొత్తవి కోనకుండా వున్నవాటికి పాలీష్ వాడిచే పాలీష్ చేయించి తాంబులం పాకేట్స్ లో వుంచినాము.
ReplyDeleteరమేష్ బాబు గారూ నా బ్లాగుకు స్వాగతమండీ...ఎలాగోలా ఉపయోగించి, మంచిపని చేశారు. ధన్యవాదాలు.
Deleteఏదో ఇష్టంలేని మొగుడుతో అయితే సద్దుకుపోగలం కాని నచ్చని చీర కట్టలేంగా.....హన్నా! ఎంతమాట అన్నావమ్మా! అల్లుడు చూసేడా?...హహహ :)
ReplyDeleteఇప్పటివరకు చూడలేదు బాబాయిగారూ...కొంచెం చిన్నగా నవ్వండి. లేకపోతే ఇప్పుడు చూసేయగలరు. :)) ధన్యవాదాలు.
Deleteఇవన్నీ సరే , నేను నాకోసం చీర కొనుక్కోవటానికి షాప్ కెళ్ళి ఎన్నేళ్ళైందో !ఇంటి కి పెద్దవాళ్ళమని ప్రతివాళ్ళూ చీరలు పెట్టటమే . పైగా ఫామిలీ మెంబర్సైతే మంచి చీరలు నువ్వు కట్టుకునంటవవి అంటూ పెడతారు . ఇంట్లో మంచి చీరలుంచుకొని మళ్ళీ కొనలేము కదా . ఎప్పుడూ కనీసం 20 చీరలైనా కొత్తవి వుంటాయి . అలమార తీసినప్పుడల్లా ఈ చీరలన్నీ నా జీవితకాలం సరిపోతాయి . ఇహ నాకు ఇష్టమైన చీర కొనుక్కునే యోగమెప్పుడో అని నిట్టూర్స్తూ వుంటాను . ఈ విషయమై ఓ పోస్ట్ రాయాలని నేనూ ఎప్పటి నుంచో అనుకుంటూ బద్దకిస్తున్నాను :)
ReplyDeleteమీ బాధంతా వ్యాఖ్యలో తెలుస్తుంది మాలా గారూ...ఏం చేయాలో, ఏమిటో కానీ త్వరలో దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. ధన్యవాదాలు.
Delete100% correct andi
ReplyDeleteధన్యవాదాలు లక్ష్మీ శిరీష గారూ..
Deleteఇక్కడ ఇంకో విషయం ప్రస్తావించాలి జ్యోతిర్మయిగారూ ,
ReplyDeleteముఖ్యంగా వివాహాలప్పుడు -
చదివింపులూ(ధనరూప) , బహుమతులూ -
వీటిని పెండ్లిమంటపంలోనే గుర్తుకోసం(ఇచ్చినవాళ్ళ పిల్లల పెళ్ళిల్లప్పుడు తిరిగి చెల్లించడానికి )రాసి పెట్టుకోవాలి -
ఆయా సందర్భాలకు తప్పని సరిగా వెళ్ళి బదులు చెల్లించి రావలసి ఉంటుంది -
పూర్వం వీటి ఉద్దేశ్యం మంచిదేమో కాని ,
ఇప్పుడైతే అంత అవసరం లేకపోగా , కొంత ఇబ్బంది కూడా -
అందుకే మాఇద్దరి పిల్లల పెళ్ళిళ్ళకీ శుభలేఖలలో "చదివింపులూ , బహుమతులూ స్వీకరింపబడవు "అంటూ విన్నపము రాయవలసివచ్చిది -
నిజంగా మీ పోస్ట్ ఆలోచింప జేసేదిగా ఉంది .
----- సుజన-సృజన
రాజారావు గారూ మంచిపని చేశారు. ఎప్పటికప్పుడు ఇలా అనవసరమైనవి వచ్చి చేరుతుంటే సర్దుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటోంది..ఈ పోస్ట్ చదివినవారైనా ఇలాంటి పద్ధతి మార్చుకుంటారని వ్రాశాను. ధన్యవాదాలు.
DeleteUseful post..
ReplyDeleteపద్మార్పిత గారూ ధన్యవాదాలు.
Deletemanchi vishayam chepparandi.
ReplyDeleteభాస్కర్ గారూ ధన్యవాదాలు.
Deleteమీరన్నట్టు అసూర్యంపశ్య...సూర్య వెలుగు చూడని వస్తువులే ఇప్పుడు ఇళ్ళల్లో ఎక్కువ సూర్యంపశ్య వాటికన్నా...
ReplyDeleteపోనీలెండి అప్పుడప్పుడూ అన్నీ సర్ది కొన్ని గుడ్ విల్ కి డొనేట్ చేసినా కాస్త మనశ్శాంతి అనిపిస్తుంది...అరల్లో అలా దాగి ఉండేకంటే ఎవరికైనా ఉపయోగపడితే మంచిదే కదా? అందుకే తప్పదు మరి అప్పుడప్పుడూ ఒకరోజిలా పూనుకొని అన్నీ బయటికి లాగి పడేస్తే కానీ తెలీదు, అసలేం ఉన్నాయో...కొంతలో కొంత ఎయిర్ లైన్ వాళ్ళూ సహాయం చేస్తున్నారీమధ్య బరువులు తగ్గించేసి...
అవునండీ..ఎయిర్ లైన్స్ బరువు తగ్గించారనగానే చాలా రిలీఫ్ గా ఫీల్ అయ్యాను. ఇన్ని సూట్ కేసులతో వెళ్ళి మనం ఇబ్బందిపడి అక్కడివాళ్ళను ఇబ్బందిపెట్టి అంత అవసరమా అనిపించింది. ధన్యవాదాలు.
DeleteGood post. I would include gifts from/to kids birthday parties. I completely stopped bought gifts, I nowadays give/take gift cards only.
ReplyDeleteచాతంకం గారూ నా బ్లాగుకు స్వాగతమండీ...పిల్లలకు గిఫ్ట్ కార్డ్ లిచ్చి మంచిపని చేస్తున్నారు. వాళ్లకు నచ్చినవి కొనుక్కుంటారు. ధన్యవాదాలు.
Delete''కష్టేఫలి '' గారి కొచ్చిన సందేహమే నాకు కలిగింది జ్యోతీ
ReplyDeleteఅయినా ఇంత హాస్య భరితంగా అలనాటి మునిమాణిక్యం గారిలా ఎన్ని విషయాలు నగ్న సత్యాలు చెప్పావు
ఆ పదజాలం భాష ప్రయోగం అద్భుతం... ఆకట్టుకొనే రీతిలో సాగిన నీ రచన అభినందనీయం
ఇంటినిండా ఇన్ని అనవసరమైన వస్తువుల్లాగే మనసునిండా ఎన్నో బాధలు భయాలు ఉంచుకొని మసలే
వాళ్ళున్నారు వాళ్ళని గురించి ఒక టపా వ్రాయి జీవితాలు బాగుపడతాయి
నాకు ఒక రచయిత మాటలు గుర్తొచ్చాయి జంధ్యాల అనుకుంటాను ''ఇల్లు మారేటప్పుడు ఇవన్ని అంటే చెత్త చెదారం ధర్మ దర్శనం ఇస్తాయని ''ఇంత మంచి ఉపయోగమైన రచనలు ఈ నాడు ఎంతో అవసరం
నాన్నా..మునిమాణిక్యం గారితో పోల్చావా..గాల్లో తేలుతున్నాను. నిజమే మనసులో పనికిరాని ఆలోచనలను ఇలా తీసివేయగాలిగితే ఎంత బావుంటుందో..ఎవరెన్ని చెప్పినా ఆ పరిణితి రానిదే ఏవీ వినపడవు. రాయడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.
Deleteదహా.
ReplyDelete(కామెంటు పెడితే ఇదెక్కడ పాడేయాలా అని మళ్ళి ఆలోచిస్తారేమో నని అలా కానిచ్చేసానన్నమాట)
ReplyDeleteసుబ్రహ్మణ్యం గారూ మీ కామెంటును నవ్వుల అరలో సర్దేశానండీ...ఎంచక్కా అమిరింది. ధన్యవాదాలు.
Deleteఅబ్బ నా మనసులోని బాధ ను టపా వేసారండి.
ReplyDeleteమీరు చెప్పినట్లు ట్రాన్స్ఫర్ అయ్యేతప్పుడల్లా ఇదో సమస్య.
శుబ్రంగా క్యాష్ ప్రైజ్ ఇస్తే ఏది కావాలో అది కొనుక్కుంటారు.
కాని పెల్లిల్లల్లో ఎవరు చదివింపులు వ్రాయక పోతుం టిరి.
శశి కళ గారూ పెళ్ళి అయి వారింటికి వెళ్ళినప్పుడు నచ్చినవి కొనుక్కోమని వారిచేతిలోనే కొంత డబ్బు పెడితే సరి. ధన్యవాదాలు.
Deleteబహుశః ప్రతీ ఇంట్లోనూ ఉండే సమస్యే అనుకుంట ఇది. ఇంట్లోనే కాదు హాస్టల్లో కూడా కొన్ని పేపర్స్ ఉంచాలో, పాడెయ్యాలో కూడా తెలియని పరిస్థితి. మా ఇంట్లో మీరు చెప్పినలాంటివి తక్కువే కానీ మా ఇల్లు ఒక పెద్ద గ్రంధాలయంలా తయారయ్యింది అని మా తాతగారు చాలా పుస్తకాలను శాఖా గ్రంధాలయానికి ఇచ్చేశారు. ఇన్ని రకాల పుస్తకాలు మన ఇంట్లో ఉండటం కంటే అక్కడ ఉంటే బోలెడు మంది చదువుతారనే ఉద్దేశ్యం వారిది. ఏ పోటీలకి వెళ్ళినా పుస్తకాలే అలా తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సంస్కృతం భాషలలో మా ఇంట్లో ఎన్ని ఉన్నాయో లెక్కే లేదు. ఇప్పటికీ చాలానే ఉన్నాయి. నాకు పోటీలలో వచ్చిన పుస్తకాలను భద్రంగానే దాచుకున్నా, కొన్ని పోటీలకి వాళ్ళిచ్చే చెక్క ముక్కలు (షీల్డులు) ఉంచుకోనూ లేను, పారేయ్యనూ లేను. చక్కని టపా! ఇది చోద్యం ఏమిటండీ??? నిత్యం ఉండేదేగా!
ReplyDeleteమీ తాతగారు మంచిపని చేశారు రసజ్ఞా...పేపర్లు గురించి బాగా గుర్తుచేసావు..అన్నీ పనికి వచ్చేవిలాగానే కనిపిస్తాయి. అప్పటికీ డిసెంబర్ లో కూర్చుని అన్నీ సర్దేస్తూ ఉంటాం. అయినా నిండిపోతూనే వుంటాయి. ధన్యవాదాలు.
Deleteనాకు మంచి విషయాలు వున్న పేపర్స్ అన్నా,పుస్తకాలన్నా చాలా ఇష్టం.ఏవీ పడెయ్య బుద్ది కాదు .అందరికీ ఉండే సమస్యే !
ReplyDeleteపుస్తకాలు అన్నీ దాచుకోవాలి లెండి. మిగిలిన వస్తువులే వృధాగా అనిపిస్తాయి. ధన్యవాదాలు రవిశేఖర్ గారూ..
Deleteఏం చెప్తాం.. అవునని తలూపుతాం. :)
ReplyDelete:) ధన్యవాదాలు కొత్తావకాయ గారూ...
Deletechala bagarasayvu akka
ReplyDeleteఈ అజ్ఞాత తమ్ముడా..చెల్లెలా...పేరు చెపితే బావుండేది. చదివి మీ అభిప్రాయం చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
Deleteనేనిచ్చిన బహుమతులను మాత్రం ఖచ్చితంగా వాళ్ళింట్లో షోకేస్‌లో ప్రదర్శనలో పెట్టుకోవాల్సిందే!:)
ReplyDeleteవిజయమోహన్ గారూ మీరిచ్చే అపురూపమైన బహుమతులు షోకేస్ లోనే పెట్టుకుంటార౦డీ...ధన్యవాదాలు.
Deleteసరిగ్గా ఇలాంటి పరిస్థితే నండీ నాది కూడా..సంవత్సరానికి ఓ సారి ఇల్లు మారితే గుడ్విల్ల్ కి ఇవ్వాల్సినవి బయటపడతాయి అని అనిపించింది.
ReplyDeleteకంప్యూటర్ లో కూడా పనికి రాని ఫైల్స్,మైల్స్ పెట్టుకొని కావాల్సినవి వెతుక్కో డానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. వారానికి ఒక సారి వాడని ఫైల్స్ తీసివేయడం మొదలు పెట్టాక ఎంతో ప్రశాంతంగా వుంది
వినీల గారూ చాలా రోజుల తరువాత కనిపించారే, బావున్నారా...
Deleteనిజమేనండోయ్ కంప్యూటర్ లో కూడా పనికిరాని ఫైల్స్ తీసేయ్యాలి. బాగా గుర్తుచేశారు. ధన్యవాదాలు.
నేను చిన్నతనంలో, వేలువిడచిన ఓ ఒంటరిగా బ్రతికిన ఓ విద్యాధికుడైన(డిగ్రీలు కాదు) తాత చనిపోగా, ఆయనవుండిన పాత ఇల్లు ఖాళీ చేస్తూ దొరికిన కొన్ని తాటాకుల పుస్తకాలను, ఓ రోజు చారు కాయడానికి వాడిన మా పిన్ని గుర్తుకొచ్చారండి. కొన్ని వెండి నాణాలూ పిన్నికి దొరికాయి లేండి.
ReplyDeleteనేనూ సైతం... నేను సైతం కొన్ని తాళపత్రాలు ఆకులు సమిధగా నిచ్చాననుకోండి :(
అందులో ఏముండేదో, ఎందుకా ముసలాయన అంత అపురూపంగా దాచుకున్నాడో అని అప్పుడప్పుడు అనిపిస్తూ వుంటుంది. :((
అయ్యో పాప౦ అందులో ఏమి వున్నాయో...తెలిసిన వారికి అప్పజేపితే బావుండేది. మీకు నా టపా చూసి ఆ తాళపత్రాలు గుర్తొచ్చాయన్నమాట బావుందండీ...ధన్యవాదాలు.
DeleteWell. If you live in a rented house, it would be prudent to relocate to a near by place every 2 yrs just to get rid of unnecessary stuff from home. In US, many friends switch to opposite apartments from current ones for every 1 year term just to get new carpets & look & feel that give a feeling of freshness & energy to the envy of those live in same boring owned homes for years ;). -- very good comments here.
ReplyDeleteచాటకం గారూ మాకా అదృష్టం లేదులెండి. అందుకే అప్పుడప్పుడు ఇటు అటూ వస్తువులు జరిపేస్తూ ఉంటాం. ధన్యవాదాలు.
DeleteI can seriously relate to what you are saying........ :-)
ReplyDeleteమాధవిగారూ మీరు రాకుండా నా పోస్ట్ కు నిండుతనం రాదండీ. ధన్యవాదాలు.
Deleteనాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది... మీరన్న మాట వింటే.... I am honored
Deletemaaku Canada lo yee problem ledu.. yeppatikappudu koththa families vastuntaayi. kaavalasinavi mohamaatam lekundaa theesukuntaaru.(manam mohamaatam lekundaa iyyachchu koodaa). yevaro okaru vaadukunte haappy. shoppinch cheyyakundaa sarees vaste boldu santhoshapadaraa meeru! naaku 5 pinnaththa gaarlu, 6 siblings, 4ru sibling-in-law(boldu mandi cousins). intlonchi yevvaru india vellina 5+6+4 cheeralu, kuttinchina blouses and falls tho sahaa vachchestaayi. prathi varalakshmi vratham kee courier lo oka cheera puttinti ninchi vachchestundi..nenu adige avasaram koodaa ledu...I feel I am very lucky for that matter. gruhopakaranam gifts maatram intiki vachchina vaallaki yevarikaina avasaram anipiste, icchi pampistaam. maree yekkuvaithe goodwill daakaa kooda vellakkarle, inti mundu petteste, padi nimushaallo hushkaakee...baagundi kadaa...!!!
ReplyDeleteఎన్నెల గారూ బావుందండీ కెనడా సాంప్రదాయం..మీరు మరీ నల్లపూసా అయిపోయారు. మీ విశేషాల కోసం ఎదురుచూస్తున్నాం. ధన్యవాదాలు.
Delete"ఇష్టం లేని మొగుడితో..." గుర్ర్... :)
ReplyDeleteధైర్యంగా నిమజ్జనం చేసేయండి. సరిపోతుంది.
ఫణీంద్ర గారూ మీరు మరీనూ.. ఏదో మాటవరసకన్నానండీ... :))
Deleteధన్యవాదాలు.
బహుమతులతో ఇన్ని సమస్యలా?
ReplyDeleteమేము ఒకరు ఇచ్చిన బహుమతిని ఇంకొకరికి ఇచ్చి చేతులు దులిపేసుకుంటాము.
(బాగా నచ్చితే కొన్ని ఉంచుకుంటామనుకోండి.)
బోనగిరి గారూ స్వాగత౦....బహుమతులోక్కటే కాదులెండి. ఇంకా స్వీట్లు, గట్రాలు కూడా చాలా ఉన్నాయి. మీ బాటే మాదీనూ.. ధన్యవాదాలు.
Deleteచాలా బాగున్నది మీ సలహ.
ReplyDeleteఇన్కొ ఉపాయము/ఆలోచన:
కొహ్ల్'స్ గిఫ్ట్ రెజెస్టరి లగ, హొస్ట్ ఒక ఒన్ లైన్ క్యాశ్ రెజెస్టర్ ఒపెన్ చెయగల్గితె బాగున్టున్ది. ఇచ్చెవాల్లు పుచ్చుకొనేవాల్లు మొహమాట పడకున్డా ఇచ్చి పుచ్చ్కొవచ్చు. హొస్ట్ ఇశ్టమైనవి కొనుక్కొవచ్చు. ఇన్కా, గెస్ట్‌లకు పెద్ద పెద్ద గిఫ్ట్స్ పట్టుకొని ఖారీదైన డ్రెస్స్‌లు తొ ఇబ్బమ్ది పడటము ఉన్డదు.
బావుందండీ మీ ఆలోచన. ధన్యవాదాలు శ్యాం గారూ..
Delete