అయితే ఈ మధ్య సుఖంగా బ్రతకడం తెలివికి నిదర్శనం అని ఒక తత్వవేత్త చెపితే విన్నాను. తెలివితేటలతో తెచ్చుకున్న పెద్ద ఉద్యోగమూ, దాని ద్వారా వచ్చే జీతమూ ఉదాహరించి అలా చెప్పలేదు అతను. తెలివితో జీవితాన్ని మనకు కావలసిన విధంగా బ్రతకడం గురించి చెప్పాడు. ఇంకా చాలా చెప్పారు, అందులోనివి కొన్ని.
సాధారణంగా అమ్మా నాన్నలు పిల్లల కోసం ఏదైనా చేసే త్యాగ మూర్తులై ఉండాలి, భార్య భర్తలు ఒకరినొకరుఅర్థం చేసుకుని, ఒక్క తాటిపై నడవాలి. పిల్లలు తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలతో ఉండాలిఇలాంటివన్నీ వింటుంటాం కదా! ఈ తల్లిదండ్రులు, భార్యాభర్తలు, పిల్లల ప్రవర్తన వారి వారి మానసిక పరిపక్వత, అవగాహనా సామర్ధ్యం, వారికిఎదురైన అనుభవాలు, వారు సంపాదించిన జ్ఞానం వీటన్నింటిని బట్టి ఉంటుంది. అంతేకానీపైన ఉదహరించినట్లుగా వారు ప్రవర్తించరు, ఆ చట్రాలలో వారు ఇమడరు. అక్కడే సమస్యలుమొదలవుతాయి, అశాంతిని కలిగిస్తాయి.
దానికి నాకు తోచినవి కొన్ని జత చేస్తాను. మనకూ కుటుంబ సభ్యులు ఉంటారు. వారు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారో గమనిద్దాం.
మన అనుకున్న వారు, ఒకటి మన సుఖ సంతోషాలను కోరుకోవాలని, రెండు మన శ్రమను పంచుకోవాలనీ, మూడు మనల్ని అర్ధం చేసుకుని తగిన సలహా ఇవ్వాలని ఆశిస్తాం.
పై మూడు లక్షణాలు ఒక్క వ్యక్తిలో ఉండడం దాదాపుగా అసాధ్యం.
మొదటి, మూడవ లక్షణాలు అంటే శ్రేయోభిలాషి, అర్ధం చేసుకునే మనిషీ కనుక మన జీవితంలో ఉన్నట్లయితే అది అదృష్టమనే అనుకోవాలి.
శ్రేయోభిలాషి, పని పాటల్లో సహకరించే వ్యక్తి కనుక ఉంటే కూడా అదృష్టవంతుల కోవలోనే ఉన్నట్లు.
చివరి రెండూ వదలి వేసి, కేవలం శ్రేయోభిలాషి మాత్రమే అయితే అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది కానీ ఆబంధం చాలా బలహీనంగా ఉంటుంది.
అస్సలు మన శ్రేయస్సే కోరని వ్యక్తి అయి, మన సరదా సంతోషాలకు అసూయ పడే వ్యక్తి అయితే మిగిలిన రెండు లక్షణాలు ఉన్నా కూడా ఉపయోగం లేనట్లే, ఆ బంధం ఏక్షణాన అయినా విచ్ఛిన్నం అవొచ్చు.
మూడింటిలో ఏ ఒక్క లక్షణమూ కూడా లేనట్లయితే అక్కడ ఏ బంధమూ లేనట్లు. వారిని కుటుంబ సభ్యులు అనుకోవడం పేరుకు మాత్రమే.

తెలివితేటలు అంటూ మొదలుపెట్టి ఈ అదృష్టం, దురదృష్టం గురించే మాట్లాడుతున్నాను ఏమిటా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.
మన కుటుంబ సభ్యులను మనం ఎంచుకోలేదు, మనం వద్దు అనుకుంటే వారు మన నుండి మాయం అయిపోరు. పైగా ఏ వ్యక్తి ప్రవర్తనా అందరితో సమానంగా ఒకేలా ఉండదు. మనం చేయవలసిది మన భావావేశాలను కాసేపు పక్కన పెట్టి, ఎదుటి వారి ప్రవర్తన మన పట్ల ఎలా ఉందో గమనించడం. మనతో ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం అయ్యాక వారితో మనం ఎలా ఉండాలో వారి దగ్గర నుండి మనం ఏమి ఆశించాలో తేలిగ్గా అర్థం అవుతుంది.

మనకు మాట సాయం కావలసినప్పుడు ఎవరి దగ్గరకు వెళ్ళాలో, పనిలో సహాయం కావాల్సి వచ్చినప్పుడు ఎవరిని ఆడగాలో, మన సుఖ సంతోషాలను ఎవరితో పంచుకోవాలో తెలుస్తుంది.
నీళ్ళు లేని బావి లో నిచ్చెన వేయక, నీళ్ళు దొరికే దగ్గరకే వెళ్ళి తెచ్చుకోవడమే తెలివితేటలు. ఒక్కోసారి నీరేదొరక్క పోవచ్చు కానీ ప్రత్యామ్నాయం ఆలోచించడం కూడా తెలివి తేటల కోవలోకే వస్తాయి.
చిన్నదో పెద్దదో జీవితం అందులో ప్రతి క్షణమూ విలువైనదే.
మీరు ఇప్పటివరకు వ్రాయని జోనర్ కదా ఇది :-)
ReplyDeleteఆగి చూడడం వరకు బానే ఉంది. కానీ ఈ మధ్య జాజిమల్లి గారు చెప్పినట్లు బుర్రలో తీర్పరులు కిటకిటలాడుతున్న తర్కం ఒకటుంది. ఇప్పటి పిల్లలు గాడుగ్గాయిలు, ఎంత మనం ఆశిస్తున్నా వాళ్ల లోకం వాళ్ళు సృష్టించుకుని సుఖం గా ఉండడం వాళ్లకు తెలుసు కదా అండి.
మౌళి గారా ? ఏమైపోయారు ఇన్నాళ్లు ? అంతా కుశలమేకదా ? అప్పట్లో మీరు బ్లాగులు ని చీల్చి చెండాడేవారు , మళ్ళి ఇన్నాళ్ళకి ... బ్లాగులకి పాత రోజులు వస్తున్నాయా ? వస్తే సంతోషమే .
Deleteఅవునండీ, బ్లాగులకి పాత రోజులు ఎందుకండీ,ఎంచక్కా ప్రతి రోజూ కొత్త రోజు అవుతుంటే .
Deleteమౌళి గారు, మన ప్రపంచం మనం నిర్మించుకోవడం లోనే ఉంది మన తెలివి అంతానూ. పిల్లలు మనకంటే చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళనే ఆదర్శంగా తీసుకుందాం :)
Deleteఇలాంటి పోస్ట్ లు ఇంతకు ముందు కూడా వ్రాసానండి . https://themmera.blogspot.com/search/label/%E0%B0%85%E0%B0%B5%E0%B1%80..%E0%B0%87%E0%B0%B5%E0%B1%80పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళను చూసే
ReplyDeleteఅర్థమయినట్టూ వుంది. కానట్టూ వుంది.
మీరు తత్వవేత్త అయిపోయినట్టున్నారు.
అంతేనంటారా :)
Deleteఅప్పుడప్పుడూ ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి, కొన్ని అక్షర రూపం ఇచ్చే వరకూ వదలవు. అలాంటిదే ఈ పోస్ట్ కూడా. థాంక్యు.
This comment has been removed by the author.
ReplyDeleteనీహారిక గారూ, అదే ఆండీ మార్కుల తెలివి ఉంది కానీ జీవించే తెలివి ఉండాలని. ఇది కొత్త దంపతుల గురించి కాదు ఆ మాట కొస్తే దంపతుల గురించే కాదు. దాహం వేస్తే నీళ్ళు తాగడానికి సముద్రానికి వెళ్ళడం గురించి అంతే. థాంక్యు,
Deleteనీహారిక గారూ ఒక రంగంలో "తెలివి" గ ఉన్న వాళ్ళు ఇంకొక రంగంలో (సంసారం) లో ఉండాలని లేదుగదా! సంసారం ఎల్లా చేయాలనేది పుస్తకాల్లో చదువుకుని పరీక్షలు వ్రాయలేదు కదా.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteIndividual Choice. Niharika garu you are right.
ReplyDelete