Tuesday, July 17, 2012

సరిగ్గా ఎనిమిది గంటలకు....

"అందరూ గుర్తు పెట్టుకోండి.... మిగిలిన విషయాలు అక్కడే మాట్లాడుకుందాం."

        *               *                  * 

       అనుకున్న సమయం అయింది. దాదాపుగా అ౦దరూ వచ్చారు. కొందరు కారు డిక్కీలోని వస్తువులు జాగ్రత్తగా తీసి కింద పెడుతున్నారు. చుట్టుపక్కల అంతా నిశ్శబ్దంగా వుంది. గాలి కూడా స్థంబించి౦దేమో ఎక్కడా ఒక్క ఆకు కూడా కదలడంలేదు. పేరు తెలియని పక్షి ఒకటి కీచుగా అరుస్తూ ఎగిరిపోయింది.


"మన వాళ్ళ౦దరూ వచ్చినట్లేనా?" అడిగాడు సూర్యం.
"ఆ అంతా వచ్చేశారు..ఏం చెయ్యాలో చెప్పు" తొందర పెట్టాడు రవి.
"సరే...ప్లాన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం మొత్తం ఇరవై రెండుమందిమి, పదకొండు మందిమి ఇటువైపు, ఇంకో పదకొండు మందిమి అటువైపు వెళ్తే హోల్ ఏరియా కవర్ చెయ్యొచ్చు. ఏమంటారు?" సమాధానం కోసం ఆగాడు వెంకటేష్. 


"ఏం రిస్క్ లేదుగా?" అడిగింది ఝాన్సీ.
"రిస్కా...రిస్క్ లేకుండా యే పనీ ఉండదు. రిస్క్ గురించి అలోచిస్తే అసలేమీ చెయ్యలేం.... ఇదుగో రాఘవ రెడ్డీ నువ్విది పట్టుకుని ముందు నడువ్, ఎవరూ రాకుండా చూస్తుండు, కాస్త జాగ్రత్తగా వుండాలి, కొంచెం కూడా తేడా రాకూడదు." చెప్పాడు శేషాచలం.
"భాస్కర్, చూసేవాళ్ళ కనుమానం రాకుండా, దీన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ముందు నడువు. జాగ్రత్త, హఠాత్తుగా ఎవరైనా ఎదుట్నుండి రావచ్చు. తేడా వస్తే ఎముక మిగలదు. "గ్లవ్స్ తెచ్చాను, తాలా రెండు తీస్కోండి." అంటూ అందరికీ ఇచ్చాడు సత్యన్నారాయణ.


"ఇప్పుడీ గ్లవ్స్ అవసరమా?" అడిగాడు శంకర్.
"ఇటుబోయి ఎటొస్తుందో మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది." అంటూ వెంకటేష్ డిక్కీలో వున్న సంచిలోవి తీసి, "ఇవి కూడా తలా ఒకటి తీస్కోండి. వీటిని వాడడం తెలుసుగా?" అందర్నీ ఉద్దేశించి అడిగాడు.
సంచిలోంచి ఒకటి తీసి అటూ ఇటూ తిప్పి పరీక్షగా చూస్తూ "అబ్బో చాలా పొడవుగా వున్నాయే, వీటిని వాడే పని పడ్తుంద౦టావా?" అడిగాడు మల్లేష్.
" అవసరమవుతుందా? అంటే ఇప్పుడే ఎలా తెలుస్తుంది మల్లేష్, అవసరమైతే మాత్రం తప్పకుండా వాడాల్సిందే." చెప్పాడు సూర్యం.
"ఈ సంచులు తీస్కుని దొరికినివాటిని దొరికినట్లుగా వీటిలో వేసి మూటకట్టండి. పనయ్యాక అందరం ఇక్కడే కలుస్తాంగా వీటిని ఎలా పంచుకోవాలో అప్పుడు చూద్దాం. ఆ..సరిగ్గా పన్నెండు గంటలకల్లా అందరం ఇక్కడే కలుద్దాం."

"బ్రదర్, ఒక్కసారి ఆ సీసా ఇవ్వు వెళ్ళడానికి కాస్త ..." అంటూ నవ్వాడు మహేష్.
"ఆ....ఇప్పుడే ఖాళీ జేస్తే వెళ్ళడానికి కష్టం, తిరిగొచ్చేదాకా ఆగాల్సిందే" సీసాలున్న డబ్బా మూత వేస్తూ చెప్పాడు వెంకట్.

              *               *                  *

    వాళ్ళ౦దరూ అలా రెండు గ్రూపులుగా విడిపోయారు. అందరూ ఒకే దగ్గర నడిస్తే ప్రమాదమని ఒకళ్ళకొకళ్ళు కూతవేటు దూరంలో వెళ్ళేలా సంజ్ఞలు చేసుకుని 
ఇద్దరు ముగ్గురూ కలసి ఒక గుంపుగా నడవడం మొదలుపెట్టారు.  

"మనం శ్రమ పడ్డమే కాని ఇక్కడేవీ దొరికేలా లేవే?" వెంకట్.
"అదిగో అక్కడ చూడు ఏదో మెరుస్తూ...." బాగా కిందకు వంగి చెట్టు మొదలు వైపు చూస్తూ చెప్పాడు మాధవ్.
"మనక్కావల్సిందదే." వేణు మొహం వెలిగిపోయింది.
"ఆ పక్కన ఇంకో రెండు కూడా వున్నాయి" కొమ్మలు తప్పి౦చాడు వెంకట్.
"ఇంకొంచెం ముందుకు...జాగ్రత్త, అమ్మయ్య దొరికిందా...ఇదిగో ఈ మూటలో వెయ్యి" సంచి తెరచి పట్టుకున్నాడు వేణు.

  
         *               *                  *
"ఇక్కడెవరో వున్నట్లున్నారు" కాల్చిపారేసిన సిగెరెట్ పీకను అనుమానంగా చూస్తూ చెప్పాడు సూర్యం."
"అటువైపు వెళ్ళకండి, ఏదో కారు వస్తున్నట్లుంది. లైట్లు కనిపిస్తున్నాయి." చిన్న గొంతుతో హెచ్చరించాడు ముందు నడుస్తున్న భాస్కర్.
"ఎందుకైనా మంచిది నేను ఇటు నడుస్తాను. మీరు ఆ చెట్లచాటుగా రండి." అన్నాడు రాఘవ రెడ్డి
"ఇక్కడేం దొరకవనుకున్నాం గాని, చాలానే ఉన్నాయే, అప్పుడే సగం సంచి నిండిది." సంచిలోవి జారిపోకుండా మూతి బిగించి పట్టుకుని నడుస్తున్నాడు మోహన్.
"ఒక్కోటి కనిపిస్తూ వుంటే ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేక పోతున్నాను." మోహన్ తో చెప్పింది ధరణి.
"ఫైవ్ స్టార్ చాక్లెట్ తిన్నట్లుగానా?" ఉడికించాడు మోహన్.
"ఎప్పుడూ తిండేనా ..." అంటూ నవ్వింది.

         *               *                  *

"మన వెనుకున్న కుర్రాళ్ళు కనిపించడంలా" కీచుగా అరిచింది వాణి.
అందరూ ఒక్కసారిగా ఆగిపోయ్యారు. వెనుక చెట్లు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. మూట నిండగానే ఎవరికీ చెప్పకుండా ఎటైనా వెళ్ళిపోయుంటారా? లేక వారికేమైనా ప్రమాదం జరిగిందా? ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. "ఆ చెట్టుదాటే వరకు మా వెనుకే ఉన్నారు?" నిశ్శబ్దాన్ని భగ్నం చేశాడు రవి. "నేనెళ్ళి చూసొస్తాను, మీరు ఇక్కడే ఉండండి." అంటూ వచ్చిన దారిలో వెనక్కి వెళ్లాడు వేణు. ఓ ఐదు నిముషాల తరువాత ముగ్గురూ దూరంగా వస్తూ కనిపించారు. ఈలోగా రెండొవ గ్రూప్ లో వున్న ఓ ఇద్దరు పెద్దమూటతో ఎదురొచ్చారు.

"ఇంతన్యాయం పనికి రాదు, ఎవరి ఏరియా వాళ్ళదే మీరిటు రాకూడదు" అవేశపడింది ధరణి.
"మనలో మనం గొడవలు పెట్టుకోకూడదు, ఇలాంటివి కొంచెం చూసీ చూడనట్టు పోవాలి" సర్ది చెప్పాడు నరసింహం."
"అదేం కుదరదు" అంటూ అభ్యంతరం వ్యక్తం చేశాడు మోహన్.
"పోనీ సంచిలోవి ఇచ్చైమా?" అడిగాడు రవి.
"మనమిలా మాట్లాడుకుంటుంటే టైమైపోతోంది. త్వరగా వెనక్కి పోదాం పదండి" అంటూ హడావిడి పెట్టాడు మల్లేశ్. 

         *               *                  *
"వెళ్ళేప్పుడు ఆ పక్కదారిలో వెళదాం, ఇంకాసిన్ని దొరకొచ్చు" ఆశగా చెప్పాడు సూర్యం. అ౦దరూ వేరేదారి పట్టారు. ఆ దారంతా గడ్డి మొలిచి వుంది. మధ్యలో అక్కడక్కడా చెట్లు. ముందురోజు కురిసిన వర్షం వల్లనేమో నేల కొంచెం తడిగా వుంది.

"ఇక్కడంతా బురద, అడుగుల గుర్తులు పడకుండా నడవండి." హెచ్చరించాడు నరహరి.
"ఆ గ్యాస్ స్టేషన్ లోనుంచి వస్తున్న కార్లో అతను మనల్ని చూసినట్లున్నాడు. ఫోన్లో ఏదో చెప్తున్నాడు చూడండి." కంగారుగా చెప్పింది ఝాన్సీ.
"ఇందాక ఆ పక్కగా వెళ్ళినతను మనల్ని ఫోటోలు తీశాడేమోనని నాకు అనుమానంగా ఉంది." అనుమానంగా చెప్పాడు మోహన్.

    మెల్లగా అందరూ పన్నెండు గంటలకు చెట్టుకిందకు చేరారు. కారు డిక్కీ తెరిచి తలా ఒక సీసా తీసి తాగుతూ, జీడిపప్పులు నములుతున్నారు. ఐదు సంచులకు పైగా సరుకు తెచ్చారు. అందరి మొహాలు సంతోషంతో వెలిగి పోతున్నాయి.
"ఇక్కడేమీ దొరకవనుకున్నాము, బాగానే దొరికాయి." తృప్తిగా నిట్టూర్చాడు మోహన్.
"మళ్ళీ ఎప్పుడు కలవడం?"
"మూడు నెలల తర్వాత కలుద్దాం."
"ఆ ట్రాష్ బాగ్ లన్నీ ట్రంక్ లో పెట్టేయండి, హారిస్ టీటర్ వెనుక ట్రాష్ లో పడేస్తాము" చెప్పాడు వెంకటేష్.

        *               *                  * 

      అదండీ విషయం. మా ఊరు శుభ్రంగా ఉండడం కోసం మా బాధ్యతగా ఏమైనా చెయ్యాలని మా తెలుగు అసోసియేషన్ ఓ రెండు మైళ్ళ రోడ్డును దత్తత తీసుకు౦ది. సంఘ సభ్యులు, స్వచ్చంద కార్యకర్తలు కలసి, రెండేళ్ళ పాటు, మూడునెల్లకోసారి ఈ రోడ్డును శుభ్రం చేస్తామన్నమాట. అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, నీలాకాశాన్ని, వెండి మబ్బుల్ని చూస్తూ, చెత్త కనపడితే నిధి కనపడినంతగా సంతోషిస్తూ, ఉత్సాహంగా ఉల్లాసంగా కనపడినవన్నీగ్లవ్స్, ట్రాష్ గ్రాబర్ నుపయోగించి  ఏరి మూట కట్టేసి, చెత్తకుండీలో వేశాం. వేసవి కాలం ఎండ ఇబ్బంది పెట్టిన మాట నిజమే కాని, నలుగురం కలసి పనిచేశాం కదా ఏదో కొంచెం తృప్తిగా అనిపించింది.


49 comments:

  1. వేయి ఆలోచనల కన్నా ఒక్క ఆచరణ మిన్న.
    గ్రేట్.. అక్కడ ఉన్న తెలుగు అసోషియన్ వారందరి అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. వనజ గారూ ధన్యావాదాలండీ. వారందరికీ మీ అభినందనలు అందజేస్తాను.

      Delete
  2. ఏదో నిధి కోసం, లేక ఏదో పేద్ద ప్లాన్ వేసి దారిలో పోయే ఎవరినో దారి దోపిడీ చేయడానికి సరైన వ్యక్తిని వెతుకుతున్నారేమోనని అనుకున్నా...:)
    చాలా మంచి పని, మంచి ఐడియా కదా... మీకు, మీ టీం కి అభినందనలు అండీ.. :))
    మీ ఐడియా ని నేను కూడా గుర్తుంచుకొని ఏదో ఒక దశలో వుపయోగిస్తా :))
    చాలా బాగా రాసారు జ్యోతిర్మయి గారు!

    ReplyDelete
    Replies
    1. హర్ష గారూ :) నలుగురూ పాటిస్తే బావుంటుందనే ఈ పోస్ట్ వ్రాసానండీ..మీలాంటి వారు ముందుకు రావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గున్న వారందరికీ మీ అభినందనలు అందజేస్తానండీ..ధన్యవాదాలు.

      Delete
  3. సస్పెన్స్, హర్రర్, థ్రిల్లర్ అన్ని కలపి చివరికి కామిడీ చేశారే, మొత్తం మీద మంచి పని చేశారు, అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. భాస్కర్ గారూ ఏదో సరదాగా వ్రాశానండీ.. ధన్యవాదాలు.

      Delete
  4. చేసేది మంచిపని అయినా కూడా చేస్తున్నపుడు అంత భయపడుతూ చేసే పరిస్థితిలో వున్నామండీ ఈ రోజుల్లో మనం ...నిజం నిష్ఠూరంగానే వుంటుంది మరి..

    ReplyDelete
    Replies
    1. శ్రీ లలిత గారూ..చాలా రోజులకు కనిపించారు. బావున్నారా?
      కొన్నిసార్లు మంచిపని చేయడానికి కూడా చాలా అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. స్థిర చిత్తంతో ముందుకు వెళ్ళడమే..ధన్యవాదాలు.

      Delete
  5. ఇలాంటి మంచి పనులు మా స్టేట్ లో చెయ్యరండి.. ఈ సారి నేను మీ assciation గురించి చెపుతాను ఉండండి.

    ReplyDelete
    Replies
    1. వెన్నెల గారూ ఆలశ్యం ఎందుకు మీరు మొదలెట్టేయండి మరి. ధన్యవాదాలు.

      Delete
  6. ఎప్పట్లాగే బాగా వ్రాశారు.వీలైతే ఇలాంటి పనులు ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియజేయండి. ఎవరికైనా ఆసక్తి ఉంటే ఉపయోగపడుతుంది.

    ReplyDelete
    Replies
    1. లలిత గారూ మీకు నచ్చినందుకు చాలా సంతోషం. నేను టపా వ్రాసిన వుద్దేశ్యం కూడా అదేనండీ..ఆ వివరాలన్నీ తప్పకుండా తెలియజేస్తానండీ..ధన్యవాదాలు.

      Delete
  7. ఎవరో చేస్తారని ఎదురుచూడకుండా మంచి పని చేసారు. మీకూ...మీ టీం సభ్యులకు అభినందనలు!

    ReplyDelete
    Replies
    1. నాగేంద్ర గారూ ఇక్కడ ఎప్పుడూ ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారండీ..మా వంతుగా కొంచెం సహాయం చేసామంతే...ఇండియాలో కూడా ఎవరో వచ్చి చేస్తారని ఎదురుచూడకుండా ఇలాంటివి చేస్తే మన ఊరు, దేశమే బాగుపడుతుంది. పైగా పని చేస్తే కాని దాని కష్టం తెలియదు. పాశ్చ్యాత్య నాగరితలో భాగంగా వాలెంటైన్స్ డేలాంటివే కాకుండా ఇలాంటివి కూడా వంటబట్టించుకుంటే బావుంటుంది.
      అందులో పాలుపంచుకున్న సభ్యులందరకీ మీ అభినందనలు తెలియజేస్తానండీ..ధన్యవాదాలు.

      Delete
  8. నేడే చదవండి - "క్లీన్ అండ్ గ్రీన్ - ఓ సస్పెన్స్ థిల్లర్" :)

    http://100telugublogs.blogspot.in


    .

    ReplyDelete
    Replies
    1. జీడిపప్పు గారూ టైటిల్ భలేగా వుంది. సినిమా విడుదల సందర్భంలో బండిమీద పేపర్లు పంచేవాళ్ళు చూడండి, అది గుర్తొచ్చింది. ధన్యవాదాలు.

      Delete
  9. జ్యోతిర్మయిగారూ,
    మంచి సస్పెన్సుతో JyOthirmayian style లో సాగింది కథనం. దానితో బాటు మంచి సిటిజన్స్ ఇనీషియేటివ్ కూడ పరిచయం చేశారు. ఇది తప్పకుండ అనుకరించదగినదీ, ఇక్కడ అటువంటి అవేర్ నెస్ క్రియేట్ చెయ్యదగ్గదీ.
    అభినందనలతో

    ReplyDelete
    Replies
    1. మూర్తిగారూ...మీరు పెద్దవారు నన్ను గారు అనకండి. మీకు కథనం నచ్చినందుకు చాలా సంతోషమం...మన దేశంలోనే ఇలాంటి చేస్తున్నవారు, ఇంకా ఎంతో సమాజసేవ చేస్తున్నరున్నారు. వార్తలలో ఇలాంటివి చోటు చేసుకున్నప్పుడు మిగిలిన వారికి చేయాలనే అభిలాష పెరుగుతుంది. అన్యాయాలను ఖండించాలి, కాని వాటినే ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్న మీడియాను చూస్తే బాధ కలుగుతుంది. ధన్యవాదాలు.

      Delete
  10. Great suspense thriller cinema screen play well written and executed.Congrats.

    ReplyDelete
    Replies
    1. బాబాయి గారూ...మీనుండి ఇవాళ పెద్ద కితాబే అందుకున్నాను. ధన్యవాదాలు.

      Delete
  11. జ్యోతి గారు సూపర్ రాసారు :)

    మొదట ఎ రాయలసీమో అనుకున్నా
    తరువాత చిన్నపిల్లలు ఏదో ఆట అనుకున్నా
    చివరికి ఒక మంచి పని గురించి చెప్పారు..మంచిది...:)

    ReplyDelete
  12. వైవిధ్యభరితమైన మరో రచనా కోణం ఆవిష్కృతమైంది .

    ReplyDelete
    Replies
    1. రాజారావు గారూ మీ వ్యాఖ్య ఎంతో స్ఫూర్తినిస్తోంది...ధన్యావాదాలండీ.

      Delete
  13. చాలా బాగా రాసారండీ.. :)

    ReplyDelete
  14. ఎక్కడికి ఎలా ఎందుకు ఎన్ని సందేహాలో చదివినంత సేపు
    ముగింపు ఏదో ఇలాటిదే అయ్యుంటుంది అని ఓదార్పు
    ఎంత నేర్పుగా అల్లావో కదా కధనం ..
    ఎందరికో ఇది మార్గదర్శనం చేస్తుందనడంలో
    సందేహం లేదు . ఏది ఏమైనా రచనాశైలి అద్భుతం

    ReplyDelete
    Replies
    1. నాన్నా ఎందరో చూపిన దారే ఇది. వెనుక తరం వారికి మార్గదర్శకం కావాలని ఆకాంక్ష. రచనా శైలి నచ్చినందుకు చాలా సంతోషం. థాంక్యు.

      Delete
  15. మీ concept excellent.అనుకున్నది ఆచరించి చూపారు.రచనను చాలా సరదాగా వ్రాసి మంచి సందేశం ఇచ్చారు.

    ReplyDelete
    Replies
    1. రవిశేఖర్ గారూ మీ వ్యాఖ్య ఎందుకో ప్రచురితవ్వలేదండీ. ఇప్పుడే చూసి ప్రచురి౦చాను. చేయాలనుకున్నదానికి పరిస్థితులు కూడా తోడ్పడ్డాయండీ..ఎందరో చేస్తున్నదే ఏదో ఉడతా భక్తి అంతే... ధన్యవాదాలు.

      Delete
  16. ఊహించని మలుపులతో చక్కగా రాసారండి.
    ఇలాంటి మంచి విషయాలను వ్రాయటం వల్ల మరి కొందరికి స్పూర్తి కలుగుతుంది.

    ReplyDelete
    Replies
    1. ఆనందం గారూ ఈ టపా వ్రాసిన ఉద్దేశ్యం అదేనండీ...మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

      Delete
  17. మొత్తానికి మే బాణీలో భయపెట్టేసి...
    కంగారు పెట్టేసి...
    అసలు విషయం చెప్పారు...
    అభినందనలు కథనానికీ...
    మంచి పనికీ...:-)
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారూ మీకు కథనం నచ్చినందుకు మమ్మల్ని మెచ్చినందుకు బోలెడు ధన్యవాదాలండీ.

      Delete
  18. బాగుందండీ మీ దత్తత కార్యక్రమం.
    ఆసక్తి గా, ఉత్కంఠ రేపుతూ రాశారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు చిన్ని ఆశ గారూ..

      Delete
  19. inka naalanti paapathmulunna ee prapanchamlo varshaalu paduthunnayante mee lante manchi manusunna valla valle hahahahahahahahhahhaahah

    ReplyDelete
    Replies
    1. తనూజ్ గారూ స్వాగతం. అందమైన వ్యాఖ్య వ్రాసిన మీరు పుణ్యాత్ములేనండీ...ఇక మంచిపని అంటారా...బాధ్యత అనిపించింది అంతే. ధన్యవాదాలు.

      Delete
  20. కొంచెం maa ఇండియా లో కూడా అదేదో అలవాటు చెయ్యండి. ఆల్రెడీ క్లీన్ గాని వున్నా అమెరికాని ఎక్కువ చేస్తే, అరిగిపోతుందేమో కదండీ? Well written though.

    ReplyDelete
    Replies
    1. అజ్ఞాత గారు ఇలా శుభ్రం చేయడం వలన, చెత్త రోడ్డు మీద వేస్తే వెయ్యి డాలర్లు ఫైన్ కట్టాలన్న నియమం వలన అమెరికా శుభ్రంగా వుండండి. ఇండియాలో కూడా ఇలాంటివి పెడితే అక్కడ కూడా శుభ్రంగా ఉంటుంది. థాంక్యు.

      Delete
  21. చాలా బాగుంది నిజంగా...చదువుతున్నంత సేపు ఫుల్ సస్పెన్స్ అండి :-)like it very much !!!!!!!

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు సంతోష్ గారు.

      Delete
  22. Howdy! I'm at work surfing around your blog from my new iphone 3gs!
    Just wanted to say I love reading through your blog and look forward to all your posts!
    Keep up the great work!

    ReplyDelete
    Replies
    1. Thank you. Working on new series. I will post those shortly.

      Delete
    2. శార్కరీయం ప్రశంశనీయం.
      సృజనాత్మకతజోడించటం తో ఆచరణీయం అనుసరణీయమైన మీ కార్యక్రమం ఆకర్షణీయంగా
      ఆవిష్కృతమైనది.
      Beautiful presentation

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.