కూర చెయ్యడానికి పొయ్యి మీదకు ఎక్కించిన గిన్నెలా ఖాళీగా ఉంది ఉదయం పూట సౌత్ స్టేషన్ లో ట్రైన్. తాళింపు గింజలు నూనెలో వేసినట్లు యారోవుడ్ స్టేషన్ నుండీ ఒకరూ ఒకరుగా ట్రైన్ ఎక్కుతున్నారు. గిన్నెలో తరిగిన కూర ముక్కలు వేసినట్లు టైవోలా స్టేషన్ నుండి గుంపులు గుంపులుగా ఎక్కే వారితో సందడి మొదలయ్యింది. కూర కుతకుత ఉడుకుతున్నట్లుగా స్టేషన్ రాబోతోందన్న అనౌన్స్మెంట్స్ వినిపిస్తున్నాయి. కూరలో మసాలాలు, కొత్తిమీర వేసినట్లు వీడ్, పెర్ఫ్యూమ్ వాసనలు కలగలిపి వస్తున్నాయి. ఉడికిన కూర గిన్నెలో నిండుగా ఉన్నట్లు అప్ టౌన్ చేరేసరికి కళకళలాడుతోంది ట్రైన్. వండిన కూర గరిటల కొద్దీ వడ్డించినట్లు బ్రూక్లిన్ విలేజ్ స్టేషన్ దగ్గరనుండీ సెవెంత్ స్ట్రీట్ వరకూ హడావిడిగా దిగి పోతున్నారు. కూర మొత్తం వడ్డించాక ఖాళీ గిన్నె మిగిలినట్లు యూనివర్సిటీ చేరేసరికి ట్రైన్ కూడా ఖాళీ అయిపొయింది.
బాగానే వర్ణించారు కాని ఫోటోలోది మీ ఎందురింట్లో వాళ్ళ కూరగిన్నెలా కనిపిస్తోందే (ఫోటోలో ట్రెయిన్ మీ ఎదుటి ప్లాట్‌ఫార్మ్ మీదది. మీరెక్కింది కాదనుకుంటా) :-)
ReplyDelete