కూర చెయ్యడానికి పొయ్యి మీదకు ఎక్కించిన గిన్నెలా ఖాళీగా ఉంది ఉదయం పూట సౌత్ స్టేషన్ లో ట్రైన్. తాళింపు గింజలు నూనెలో వేసినట్లు యారోవుడ్ స్టేషన్ నుండీ ఒకరూ ఒకరుగా ట్రైన్ ఎక్కుతున్నారు. గిన్నెలో తరిగిన కూర ముక్కలు వేసినట్లు టైవోలా స్టేషన్ నుండి గుంపులు గుంపులుగా ఎక్కే వారితో సందడి మొదలయ్యింది. కూర కుతకుత ఉడుకుతున్నట్లుగా స్టేషన్ రాబోతోందన్న అనౌన్స్మెంట్స్ వినిపిస్తున్నాయి. కూరలో మసాలాలు, కొత్తిమీర వేసినట్లు వీడ్, పెర్ఫ్యూమ్ వాసనలు కలగలిపి వస్తున్నాయి. ఉడికిన కూర గిన్నెలో నిండుగా ఉన్నట్లు అప్ టౌన్ చేరేసరికి కళకళలాడుతోంది ట్రైన్. వండిన కూర గరిటల కొద్దీ వడ్డించినట్లు బ్రూక్లిన్ విలేజ్ స్టేషన్ దగ్గరనుండీ సెవెంత్ స్ట్రీట్ వరకూ హడావిడిగా దిగి పోతున్నారు. కూర మొత్తం వడ్డించాక ఖాళీ గిన్నె మిగిలినట్లు యూనివర్సిటీ చేరేసరికి ట్రైన్ కూడా ఖాళీ అయిపొయింది.
Showing posts with label నా జ్ఞాపకాలు. Show all posts
Showing posts with label నా జ్ఞాపకాలు. Show all posts
Friday, September 15, 2023
Wednesday, March 22, 2023
వసంతంలో ఓ రోజు
పోయిన శనివారం ఉదయాన్నే రెండు జతల బట్టలు బాగ్ లో పెట్టుకుని బయలుదేరాం. పనిమీదేమీ కాదు, వసంతం లో చెట్లనూ, పిట్టలనూ కలుద్దామని. ఊహించినట్లుగానే మోడు వారిన కొమ్మలు చివురాకులతో పచ్చబడి కళకళలాడుతున్నాయి. అక్కడక్కడా ఎర్రటి పూలతో ఈస్ట్రన్ రెడబడ్ చెట్లు, కొమ్మలపైకి పాకి ఊయలలు ఊగుతున్న ఊదారంగు విస్టీరియా తీగలు, బావుంది ప్రయాణం. మధ్యాహ్నానికి చార్ల్ స్టన్ డౌన్ టౌన్ కు చేరుకున్నాం. పార్కింగ్ అంటూ పెద్ద హడావిడి ఏమీ లేదు. నీడగా ఉన్న దగ్గర రోడ్ పక్కన కార్ పార్క్ చేసి కాస్త ముందుకు నడిస్తే ఒక గార్డెన్ కనిపించింది. దాన్ని వైట్ పాయింగ్ గార్డెన్ అంటారట. పెద్ద ఏంజెల్ ఓక్ చెట్లు నేల మీద ముగ్గులు వేస్తున్నాయి. అక్కడేవో విగ్రహాలు అవీ ఉన్నాయి కానీ ఫోటోలు తియ్యలేదు.
ఆ పార్క్ చివర రోడ్ దాటి వెళితే నడవడానికి వీలుగా పొడవాటి బ్రిడ్జి ఉంది. దానికి ఒకవైపు సముద్రం మరొక వైపు పొందిగ్గా ఉన్న వీధులు పెద్ద పెద్ద ఇళ్ళూనూ. అవన్నీ 17 శతాబ్దం లో కట్టినవి, పాడవ కుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబట్టేమో ఈ మధ్యనే కట్టినంత కొత్తగా ఉన్నాయి.
ఈ బుట్టలు వట్టి గడ్డితో తయారుచేసినవి కావు, వీటికి ఏడు తరాల ఘన చరిత్ర ఉందిట. ఇదే వృత్తిగా జీవనం సాగిస్తున్న ఆఫ్రికన్ అమెరికన్ లు అక్కడ ఉన్నారు.
ఈ ఊరికి చాలా చరిత్ర ఉంది, వింటుంటే "ఏ దేశచరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం" అన్న శ్రీ శ్రీ మహాప్రస్థానం గుర్తుకు వచ్చింది. మనసు వికలమైయ్యే ఆ ప్రదేశాల ఫోటోలు నేను తియ్యలేక పోయాను.
ఓపీకున్నంతసేపు తిరిగి సాయంత్రానికి హోటల్ కు వెళ్ళి రాత్రికి మళ్ళీ డౌన్ టౌన్ వెళ్ళాము. ఏ ఊరి డౌన్ టౌన్ అందాలు చూడాలన్నా రాత్రిళ్ళే వెళ్ళాలి మరి. పెద్ద హడావిడి లైట్స్ కాకుండా ఒక అక్కడక్కడా బుల్లి దీపాలతో చిన్న పల్లెటూరులా ఉంది. ఒకరిద్దరుగా నడుస్తున్నవాళ్ళు, గుంపుగా నిలబడి కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడప్పుడూ వాహనాలు తిరుగుతున్నాయి కానీ తక్కువ. సాయంత్రం ఆరు గంటలకే అన్ని షాప్ లు మూసేసారు. ఆ నిశ్శబ్దం కూడా బావుంది. భోజనం చేసి రాత్రి హోటల్ కు వెళ్ళాం.
బావున్నాయి కాదూ ఫోటోలు. నింపాదిగా వెళ్ళి రావడానికి బావుందా ఊరు. మళ్ళీ ఒకసారి వెళ్ళి, ఆర్ట్ గలరీలు, బీచ్, రైన్ బో ఇళ్ళు, మరోసారి మేగ్నోలియా ప్లాంటేషన్ చూసి రావాలి.
ఆ పార్క్ చివర రోడ్ దాటి వెళితే నడవడానికి వీలుగా పొడవాటి బ్రిడ్జి ఉంది. దానికి ఒకవైపు సముద్రం మరొక వైపు పొందిగ్గా ఉన్న వీధులు పెద్ద పెద్ద ఇళ్ళూనూ. అవన్నీ 17 శతాబ్దం లో కట్టినవి, పాడవ కుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబట్టేమో ఈ మధ్యనే కట్టినంత కొత్తగా ఉన్నాయి.
ఈ ఊరేదో కళల కాణాచిలా ఉంది. ఎక్కడ చూసినా ఆర్ట్స్ గాలరీలు ఉన్నాయి. ప్రతిదీ చూడాలని ఉంది కానీ అప్పటికే దాదాపు మూడు గంటల నుండీ నడుస్తూనే ఉన్నాం.
ఈ బుట్టలు వట్టి గడ్డితో తయారుచేసినవి కావు, వీటికి ఏడు తరాల ఘన చరిత్ర ఉందిట. ఇదే వృత్తిగా జీవనం సాగిస్తున్న ఆఫ్రికన్ అమెరికన్ లు అక్కడ ఉన్నారు.
ఈ ఊరికి చాలా చరిత్ర ఉంది, వింటుంటే "ఏ దేశచరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం" అన్న శ్రీ శ్రీ మహాప్రస్థానం గుర్తుకు వచ్చింది. మనసు వికలమైయ్యే ఆ ప్రదేశాల ఫోటోలు నేను తియ్యలేక పోయాను.
ఓపీకున్నంతసేపు తిరిగి సాయంత్రానికి హోటల్ కు వెళ్ళి రాత్రికి మళ్ళీ డౌన్ టౌన్ వెళ్ళాము. ఏ ఊరి డౌన్ టౌన్ అందాలు చూడాలన్నా రాత్రిళ్ళే వెళ్ళాలి మరి. పెద్ద హడావిడి లైట్స్ కాకుండా ఒక అక్కడక్కడా బుల్లి దీపాలతో చిన్న పల్లెటూరులా ఉంది. ఒకరిద్దరుగా నడుస్తున్నవాళ్ళు, గుంపుగా నిలబడి కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడప్పుడూ వాహనాలు తిరుగుతున్నాయి కానీ తక్కువ. సాయంత్రం ఆరు గంటలకే అన్ని షాప్ లు మూసేసారు. ఆ నిశ్శబ్దం కూడా బావుంది. భోజనం చేసి రాత్రి హోటల్ కు వెళ్ళాం.
ఉదాయాన్నే ఏవో చూసేసి మధ్యాహ్నానికి తిరిగి ఊరికి వెళ్ళే ఆలోచన. ఏం చూడచ్చు అని గూగుల్ చేస్తే ఏదో మేగ్నోలియా ప్లాంటేషన్ అని కనిపించింది. సరే అక్కడి వరకూ వెళ్ళి ఒక గంట ఉండి వెళదాం అనుకున్న వాళ్ళం మధ్యాహ్నం రెండు గంటల వరకూ అక్కడే ఉన్నాం. కాలం అక్కడే ఆగిపోతే బావుండును అనిపించింది. అప్పుడు కూడా వర్షం పడడం వలన వెనక్కు రావాల్సి వచ్చింది.
బావున్నాయి కాదూ ఫోటోలు. నింపాదిగా వెళ్ళి రావడానికి బావుందా ఊరు. మళ్ళీ ఒకసారి వెళ్ళి, ఆర్ట్ గలరీలు, బీచ్, రైన్ బో ఇళ్ళు, మరోసారి మేగ్నోలియా ప్లాంటేషన్ చూసి రావాలి.
Sunday, January 29, 2023
కొట్టకల్ - ఆర్యవైద్యాశాల - 8
కొట్టకల్ లో ఉన్న మూడు వారాలలో ఒక్క సినిమా చూడలేదు, పగలంతా ఎవరినీ కలిసిందీ లేదు. ఉదయాన్నే పార్కులో నడక, కాంటీన్ లో టిఫిన్, పుస్తకాలు చదవడం, సాయంత్రం గుడి దగ్గర అక్కడకు వచ్చిన వాళ్ళతో కబుర్లు, రాత్రి భోజనం, ఇలా ఉండేది దినచర్య. ఎప్పుడూ చుట్టూ మనషులు, ఉద్యోగాలు, వారాంతంలో పాఠశాల, పార్టీలు ఇలా హడావిడిగా ఉండే మా ఇద్దరికీ చాలాకాలం తరువాత తీరుబడి చిక్కింది. జీవితపు ఈ మజిలీలో కలకాలం గుర్తుంచుకోవలసిన పరిచయాలు, గుర్తుండిపోయే క్షణాలు కొన్ని.
వివేక్ విజయన్, పి.కె.వారియర్ గారి మనుమడు, అక్కడే కైలాసమందిరంలో ఉంటున్నారు. వివేక్ బహుముఖ ప్రజ్ఞాశాలి, వేదం చదువుకున్నారు, ఆస్ట్రాలజీ తెలుసు, రచయిత. జీవితం విసిరిన సవాల్ ను ఆత్మస్థైర్యంతో ఎదుర్కుంటున్న అతనిని చూసి ఎంతో నేర్చుకోవచ్చు అనిపించింది.
డాక్టర్ సరోజ్ బజాజ్, అక్కడకు పేషెంట్ గా వచ్చారు. హిందీ సాహిత్యంలో పి.హెచ్.డి పట్టా పుచ్చుకుని, ప్రొఫెసర్ గా పనిచేసి వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారు. హైదరాబాద్ లో మహిళల కోసం సుమన్ జూనియర్ కాలేజ్, మహిళా దక్షత సమితి కాలేజ్ ఫర్ విమెన్, సుమన్ వొకేషనల్ కాలేజ్ ఫర్ గాళ్స్, నర్సింగ్ కాలేజ్ లు నడుపుతున్నారు. పేద విద్యార్థినిలకు అక్కడ పూర్తిగా ఉచితం. నేషనల్ సిటిజన్స్ అవార్డ్, మహిళా శిరోమణి, మహిళా రత్న పురస్కార్, బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డ్ లాంటి ఎన్నో అవార్డ్స్, బంగారు పతకాలు రాష్టపతి గ్యాని జైల్ సింగ్ యాదవ్, మదర్ థెరిస్సా, శంకర్ దయాళ్ శర్మ గారి సతీమణి విమలా శర్మ లాంటి నుండి అందుకున్నారు.బహదూర్, అజయ్ నేపాల్ నుండి వచ్చి అక్కడ కాంటీన్ లో పనిచేస్తున్నారు. ఏడాదికి ఒక్కసారే వారి దేశానికి వెళ్ళి కుటుంబాన్ని కలిసేది. లేచిన దగ్గర నుండి పడుకునే ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కానీ సంతోషాన్ని స్వంతం చేసుకునే విద్యేదో వాళ్ళకు తెలిసినట్లుంది మొహం మీద నవ్వులేకుండా ఎప్పుడూ కనిపించలేదు.
గుడి మెట్ల మీద కబుర్లు, మసాలా టీ, చైనీస్ ప్లాటర్ కలిసి పంచుకున్న కొట్టకల్ స్నేహాలు, బుల్లి డాక్టర్ల ముచ్చట్లు బావున్నాయి అన్నీ. రెండు నెలలు పాటు పథ్యం ఉంటూ మందులు వాడమన్నారు. ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రయాణం బావుంది.
మీరెవరైనా ఆయుర్వేద చికిత్స తీసుకుని ఉంటే మీ అనుభవాలు కామెంట్ లో వ్రాయండి, మరి కొంతమందికి ఉపయోగపడొచ్చు. ఇంతవరకూ ఈ కబుర్లున్నీ ఓపిగ్గా విన్న మీకందరకూ ధన్యవాదాలతో
స్వస్తి
Wednesday, January 25, 2023
కొట్టకల్ - ఆర్యవైద్యశాల - 7
కోజికోడే (కాలికట్), కొట్టకల్ కు నలభై ఐదు కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఈ పట్టణం ఒకప్పుడు మలబార్ జిల్లా రాజధాని. "సిటీ ఆఫ్ స్పైసెస్" అని పిలువబడే ఈ పట్టణంలో సుగంధ ద్రవ్యాల ఎగుమతి ఏడవ శతాబ్దం నుండి మొదలైయ్యింది. అంతే కాదు వాస్కోడిగామా మొదటిసారి భారత దేశానికి అడుగు పెట్టిన ప్రాంతం అది. "కోజికోడే బీచ్ లో సూర్యాస్తమయం చాలా బావుటుంది. అక్కడ ఎస్.ఎమ్ స్ట్రీట్ అనే వీధిలో దొరికే స్వీట్స్ రుచి అమోఘం" అని హాస్పిటల్ స్టాఫ్ చెప్పారు. కొట్టకల్ కు దగ్గరలోనే ప్రఖ్యాతి గాంచిన గురువాయూర్ గుడి ఉంది. ఇవి రెండూ చూడాలని సరదా పడ్డాం.
ఆర్యవైద్యశాల నుండి బయటకు వెళ్ళడానికి డాక్టర్ అనుమతి తీసుకోవాలి. అలా వెళ్ళొస్తామని డాక్టర్ తో చెప్పగానే "ట్రీట్‌మెంట్ తీసుకునే సమయంలో శరీరానికి విశ్రాంతి అవసరం, ఎక్కడికీ ప్రయాణం చేయకూడదు" అనేసారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు శరీరం చాలా సున్నితంగా అవుతుందట. అలాంటి సమయంలో చిన్న పాటి కుదుపులకు కూడా ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సమయంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువట. అంతే కాదు ట్రీట్మెంట్ పూర్తి అయిన తరువాత కూడా రెండు వారాలు పూర్తి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం అని చెప్పారు.
ఈ విషయం ముందుగా తెలిస్తే కొంత ముందే వచ్చి అవన్నీ చూసే వాళ్ళం కదా అనుకున్నాము.ట్రీట్‌మెంట్ రేపు పూర్తవుతుందనగా కొట్టకల్ లోనే ఉన్న మ్యూజియమ్, హెర్బల్ గార్డెన్, కాలేజ్ చూసి వచ్చాము.
మ్యూజియమ్ చూడవలసిన ప్రదేశం. అక్కడ ఆర్యవైద్యశాల చరిత్ర, పి.ఎస్.వారియర్, పి.కె.వారియర్ లకు వచ్చిన అవార్డ్స్, వైద్యశాల మొదలెట్టినప్పటి ఫోటోలు, పి.వి.యస్ నాట్య సంఘంలో ప్రదర్శనలిచ్చిన ప్రముఖుల ఫోటోలు, ఇంకా ఎన్నో విశేషాలు వివరంగా వ్రాసి ఉన్నాయి.
ఛారిటబుల్ హాస్పిటల్, మ్యూజియమ్ ఉన్న ప్రాంగణంలోనే ఉంది. మేము వెళ్ళిన సమయంలో కన్సల్టేషన్ కోసం వచ్చిన పేషంట్స్ తో హాస్పిటల్ ముందు చాలా పెద్ద లైన్ ఉంది. అక్కడ ఇన్ పేషంట్స్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఆయుర్వేదంతో పాటు అక్కడ అల్లోపతి డాక్టర్స్ కూడా ఉంటారట. అక్కడ వైద్యం, భోజనం, రూమ్ అన్నీ ఉచితం.
హెర్బల్ గార్డెన్ లో ఆయుర్వేద మందుల తయారీకి కావలసిన మొక్కలు పెంచుతున్నారు. పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.
అక్కడకు కొంచెం దూరంలోనే ఆయుర్వేద కళాశాల ఉంది. చాలా పెద్ద కాలేజ్, హాస్టల్ కూడా ఉంది.
డాక్టర్స్ రౌండ్స్ కు వచ్చేటప్పుడు వారితో పాటు జూనియర్ డాక్టర్స్ ఇద్దరు వచ్చేవారు. వాళ్ళు ఒకరు కొట్టకల్ లో మరొకరు ఉత్తరాఖండ్ లో అంతకు ముందు సంవత్సరమే BAMS పూర్తి చేసారట. ఆయుర్వేదంలో కోర్సు పూర్తి చేసాక ఒక గురువు దగ్గర కానీ హాస్పిటల్ లో కానీ పని చేయాలి. హౌస్ సర్జన్సీ లాగా అన్నమాట. వాళ్ళిద్దరితో ఒకరోజు కాంటీన్ కు వెళ్ళాను, ఆయుర్వేద వైద్యం గురించి, కొట్టకల్ హాస్పిటల్ గురించి చాలా వివరాలు చెప్పారు.
మాన్యుఫాక్చరింగ్ యూనిట్ హాస్పిటల్ కు దగ్గరలోనే ఉంది కానీ చూడడానికి అనుమతి లేదు. అక్కడ తయారయిన మందులు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. మందుల తయారీకి అవసరమైన ఆకులు, మూలికల కోసం ఫామ్స్ లో చాలా మొక్కలు పెచ్చుతున్నారు. ఇవే కాక అడవులలో దొరికేవీ గిరిజనులు సేకరించి ఇస్తారు.
Subscribe to:
Posts (Atom)