Thursday, January 31, 2013

బాయ్స్ ఆల్

       డ్రాయింగ్ పుస్తకం, రంగు పెన్సిళ్ళు, క్రేయాన్లు తీసుకొచ్చి కాఫీ టేబుల్ దగ్గర కూర్చున్నాడు బుజ్జిపండు. ఒక కాగితం మీద ముందుగా ఒక నిలువు గీత, దానికి పది అడ్డం గీతలు, ఒక్కో గీతకు అటో ఐదు, ఇటో ఐదు మొత్తం పది సున్నాలు చుట్టాడు. “అమ్మా, లుక్ లుక్...” పిలిచాడు పండు. కాఫీ తాగుతూ లాప్ టాప్ లో నెట్ బ్రౌజ్ చేస్తున్న వైష్ణవి, పండు వైపు చూసింది. “ట్రీ డ్రా చేశాను బావుందా?” అడిగాడు. బొమ్మ వైపు చూస్తూ “చాలా బావుంది నాన్నా” చెప్పింది వైష్ణవి. పండు తృప్తిగా బొమ్మను చూసి ఒక్కో సున్నాకి ఒక్కో రంగు వేయడం మొదలెట్టాడు. “అన్నట్టు, ఈ శనివారం రిత్విక్ పుట్టినరోజు నాన్నా....నువ్వు బొమ్మ వేయడం పూర్తవగానే మనం ‘టాయ్స్ రస్’ కి వెళ్ళి తన కోసం మంచి బొమ్మ కొందాం” చెప్పింది వైష్ణవి. ‘టాయ్స్ రస్’ పేరు వినగానే బుజ్జి పండు మొహం విప్పారింది. 

మిగిలిన విశేషాలు కౌముదిలో పత్రికలో చదువుదాం. 







Wednesday, January 2, 2013

బడికెళ్ళిన బుజ్జిపండు

       బుజ్జిపండు అమ్మ కొంగు వదిలి ఈ నెల నుండి బడికి వెళ్ళడం మొదలు పెట్టాడు. ఉన్నత విలువలున్న 'కౌముది' లాంటి బళ్ళో చదువుకునే అవకాశం దొరికినందుకు చాలా ఆనందంగా వుంది. బళ్ళో చేర్చుకున్నందుకు కౌముది సంపాదకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 

మరి మన 'అమెరికా బుజ్జిపండు' అక్కడ ఏం చేస్తున్నాడో చూద్దామా!