"వీరికి మన మీద జాలి, దయ ఎంత మాత్రం లేవు."
"బాగా చెప్పావు. ఎంత సేవ చేస్తున్నాం...ఎంత ఆనందాన్నిస్తున్నాం."
"పెళ్ళి కాని, పేరంటం కానీ...అసలే శుభకార్యమైనా మనం లేకుండా జరుగుతుందా?"
"అందంగా పువ్వుల్లా కళకళ్ళాడుతూ వుండేవాళ్ళం, ఈ రోజిలా అలసటతో, వడలిపోయి, నిస్సహాయంగా వుండడానికి కారణం ఎవరు?"

"పిట్టల్నీ, పువ్వుల్నీ, గాలినీ, నీటినీ ప్రేమించే సంస్కృతి మనది. అన్నింటిని ప్రేమించగలిగిన వాళ్ళు నిరంతరం అంటి పెట్టుకునే మనల్ని మాత్రం ఎందుకంత నిర్లక్ష్యంగా చూస్తారు?"
"మనల్ని చూసిన క్షణం నుండీ చేజిక్కించుకునేంత వరకూ మన గురించి కలలూ, కలవరింతలూనూ..."
"దరి చేరాక మోజు తీరగానే ఇంత లెక్కలేని తనమా! మనమే కనుక లేకపోతే వీరి మాన మర్యాదలు మంట కలసిపోతాయన్న విషయం అయినా గుర్తుందా?"
"మన౦ వారితో ఉండడం వల్లే సమాజంలో వారికి గౌరవం, గుర్తింపూను."
"చల్లగా వణికిపోతూ, దుర్వాసనతో, మట్టికొట్టుకు పోయి వగచే మనల్ని అసహ్యంగా చూడడం తగునా?"
"దీనంగా, కదలలేని స్థితిలో నిస్సహాయంగా పడి వుంటే మనమీద కొంచెమైనా జాలి కలగదా?"

"పూర్వం ఈ స్థితిలో వున్న మనల్ని ప్రేమగానో, బాధ్యత అనుకునో దగ్గరకు తీసుకుని మన అలసట తీరేలా సపర్యలు చేసేవాళ్ళు."
"తీగ మీద ఊగుతూ స్వచ్ఛమైన గాలి పీలుస్తూ చెట్టూ చేమలతో కబుర్లు చెప్పుకునే భాగ్యం ఏనాడో పోయింది."
"ఇనుప హస్తాలలో నలిగి వేసారి కొన ఊపిరితో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మనల్ని ఒకింత ప్రేమగా హత్తుకుని మంచి మాటలతో ఓదార్చితే ఎంత బావుంటుందో కదా!"

"మనమంటే ఇంత నిర్లక్ష్యమా. ఈ విషయాలన్నీ అర్ధం అయ్యేలా ఓ ఉత్తరం రాద్దా౦."
ప్రియమైనా మీకు,
మాదో విన్నపం. ఏనాడూ మాకు 'ఇది కావాలీ' అని అడుగలేదు. ఎక్కడో బందీలై ఉన్న మమ్మల్ని బంధ విముక్తులను చేసి కొత్త జీవితం ప్రసాదించారు. మీతో ఇలా రావడం, ఎల్లవేళలా మిమ్మల్ని అంటిపెట్టుకుని వుండడం మాకు చాలా సంతోషకరమైన విషయం. మేము అందంగా వెలిగిపోయే సమయంలో మాకోసం ఎంతో ధనం వెచ్చించి మమ్మల్ని మీ సొంతం చేసుకుంటారు, బంధుమిత్రులకు గర్వంగా పరిచయం చేస్తారు, సెంట్లు, అత్తర్ల ఘుమఘుమలతో ముంచెత్తుతారు. మమ్మల్ని ఆనంద పరచడానికి అవన్నీ ఏమీ చెయ్యనవసరం లేదు. మీరు మాతో గడిపే సమయం చాలు. మాసిపోయి, నలిగిపోయి, మురికిగా వున్నమమ్మల్ని చూసి అసహ్యంచుకోకండి. మిషిన్ లో వేయడం వలన నలిగిపోయి జీవం కోల్పోయిన మమ్మల్ని మడత పెట్టడానికి ఓ గంట వెచ్చించండి. తృప్తిగా మేం తెలిజేసే కృతజ్ఞతలను అందుకోండి.

సదా మీ సేవలో తరించాలనుకునే
మీ
వస్త్రములు
:-)...:-)...
ReplyDeleteజ్యోతి గారూ!...
కొత్తబట్టలు కొనుక్కున్న తర్వాత అవి వేసుకునే లోపు ఎన్ని సార్లు చూసుకునే వాళ్ళమో చిన్నప్పుడు...
ఇంకా ఆ అలవాటు పూర్తిగా పోలేదనుకోండి అది వేరే విషయం...:-)...
ఓ సస్పెన్స్ కథల మొదలెట్టి వస్త్రాల వేదనగా ముగించారు...:-)
కథనం చాలా బాగుంది...అభినందనలు...
మీకు మీ కుటుంబానికీ శరన్నవరాత్రుల శుభాభినందనలు...@శ్రీ
ధన్యవాదాలు శ్రీ గారు. మీక్కూడా దసరా శుభాకాంక్షలు.
Deleteమీ ఈ శైలే నాకిష్టం. ఏదైనా భలే చెప్తారు. లేఖ అందింది. ఆవేదన మా మనసులని తాకింది. :)
ReplyDeleteశిశిర గారు మీ ఇంట్లో బట్టలు సంతోషంతో పండుగ చేసుకుంటాయిక. :-) థాంక్స్
Delete:) chaalaa baavundi.
ReplyDeleteథాంక్యు వనజ గారు.
Deleteబలే ఆలోచనండి...:)) బాగుంది.
ReplyDelete:-) ధన్యవాదాలు రాధిక గారు.
Deleteవస్త్రం ల విన్నపం ఆలోచించాల్సిన విషయమే .
ReplyDeleteమాలా గారూ అవునండీ ఆ విన్నపం గురించి ఆలోచిస్తే మన ఇల్లే శుభ్రంగా అందంగా ఉంటుందట. ఆ విషయం కూడా చెప్పాయవి. :-) థాంక్యు.
Deletenijame kadaa vinnapaanni baagaa chepparu baavundi
ReplyDeleteథాంక్యు మంజు గారు.
Deleteహహ్హహ్హా.. భలే రాసారే బట్టల తరపున వకాల్తా పుచ్చుకుని.. :)
ReplyDeleteనేను మాత్రం బోల్డు ప్రేమగా చూసుకుంటానండీ బట్టల్ని.. మా అమ్మ అప్పుడప్పుడూ తిడుతూ ఉంటుంది.. అంత ఇదిగా డబ్బులు పోసి ఏరి కోరి కొని తెచ్చుకుని.. వాటిని సర్దేది, చూసుకునేదే ఎక్కువ, వాడేది తక్కువ అని.. :D
మధుర గారు మీ ఇంట్లో బట్టలు సుఖంగా సంతోషంగా వున్నాయన్నమాట. :-) థాంక్స్
Deleteమొత్తానికి భలే విషయమే చెప్పారు. నేను పాపం వస్త్రాలని హింసించను గాని మంచి దశలోనే అవసరమైన వారికి ఇచ్చేస్తు ఉంటాను:)
ReplyDeleteజయ గారు మంచి పని చేస్తున్నారు. థాంక్స్.
Deletechala bagundandi me post
ReplyDeleteరమేష్ గారు స్వాగతమండీ. పోస్ట్ నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.
Deleteవస్త్రాల విన్నపం.. మంచి ఆలోచన
ReplyDeleteచాలాబాగుంది..
థాంక్స్ రాజి గారు.
Deleteఅందుకేగా నేను వేసుకుంటానన్నవారికి బాగున్నప్పుడే ఇచ్చేస్తాను. ఉపయుక్తకరమైన పోస్ట్.
ReplyDeleteపద్మార్పిత గారు మంచి పని చేస్తున్నారు. థాంక్స్.
Deleteవస్త్రాలతో మంచి జ్ఞానభోధన:)
ReplyDeleteధన్యవాదాలు సృజన గారు.
Deleteఅమ్మాయ్!
ReplyDeleteవస్త్రాలు కూడా పెద్ద వాళ్ళలా గుర్తింపు కోరుతున్నాయంటావా?
లేదు బాబాయి గారు. వాటి బాధ చెప్పుకుంటున్నాయంతే. కొంచెం దయగా చూడమంటున్నాయి. ధన్యవాదాలు.
Deleteనేను మాత్రం బట్టలు తమంతకు తాము అడిగేవరకు వాషింగ్ మెషిన్ లో వేసి వాటిని నలుపను, :))
ReplyDeleteబాగుంది మీ పోస్ట్ :)
హర్షా :)) థాంక్యు.
Deleteమొత్తానికి వకాల్తా తీసుకున్నారు చూసారూ.. :)
ReplyDeleteబాగుందండీ.
కొత్తావకాయ గారు...శుభ్రంగా ఇస్త్రీ చేసి మడత పెట్టిన ప్రతిసారి కృతజ్ఞతతో చూస్తాయండి మరి. వకాల్తా తీసుకోక తప్పలేదు. ధన్యవాదాలు.
Deleteవస్త్ర వ్యాపారి అయిన మా మిత్రుడు ఇదే విషయం చెప్పాడు.వాషింగ్ మెషిన్ వచ్చిన తరువాత మా వ్యాపారం బాగా జరుగుతుందిఅని,దానిలో వేస్తె త్వరగా బట్టలు పాడవుతాయని చెప్పాడు.సరదాగా మంచి విషయం వ్రాసారు.
ReplyDeleteరవిశేఖర్ గారు..మీ మిత్రుడు మీతో వ్యాపార రహస్యం చెప్పేసారన్నమాట. థాంక్యు.
DeleteBagundandi ...vastramalu kuda ela badha padtayi ani telisi vachindi...😃eesari nunchi meeru chepina salha patinchdanki prayatnistanu...😃
ReplyDeleteఅనురాధా...పాటిస్తే మనపనే సులువౌతుంది. మొత్తానికి బ్లాగు తరచుగా ఫాలో అవుతున్నారన్నమాట. థాంక్యు.
Deleteబట్టలు జీర్ణమయ్యే వరకూ వాడితే భర్త జేబుకు చిల్లు ఎందుకు పడుతుందీ..
ReplyDeleteఅమ్మో ఈ నవయుగంలో రోజుకో ఫ్యాషన్ అనుకరించకపోతే చిన్నతనంగా ఉండదూ :-)
జ్యోతి గారూ హాస్య కథ రాయండి మీరు రాయగలరు. ఆలస్యంగా వస్తున్నాను మన్నిన్చేస్తూ ఉండండి.
మెరాజ్ గారు నాకూ రాయాలనే వుందండి. మీ వ్యాఖ్య చూశాక ఆ కోరిక పదింతలైంది. మీ అభిమానానికి బోలెడు ధన్యవాదాలు.
Deletejyothi gaaru, o chinni kaatha raayandi meeru raayagalaru. try ceyandi
ReplyDeleteతప్పకుండా మెరాజ్ గారు. థాంక్యు.
Deleteవస్తువులు మాట్లాడతాయి ..వస్త్రాలు మాటలాడుతాయి
ReplyDeleteస్పందించే హృదయం ఉండాలే గానీ ..అడుగడుగునా
ఇలా ఎన్ని ఘోషలో నిరంతర జీవయాత్రలో ..
ఇంకా ఎన్నో రాయాలని ఎన్నో గుండెలను తట్టి లేపే
ఈ కార్యక్రమం ఇలా సాగి పోవాలని నా ఆశ ..ఆశయం
ఉపయుక్తమైన ఈ మంచి రచనకు అభినందనలు
థాంక్యు నాన్నా..
Deleteకొత్తగా ఉంది, చాల బాగుంది.
ReplyDeleteనా బ్లాగుకు స్వాగతం సాయరం గారు. ధన్యవాదాలు. మీ పేరు సరిగ్గా పలికానా?
Deleteఇలా సరదాని కలిపి ఆలోచింపజేసేలా భలే రాస్తారు మీరు.
ReplyDeleteబాగుంది వస్ర్తాలకి మాటలొస్తే ఇలాగే మాటలాడతాయేమో బహుశా!
బట్టలు చక్కగా మడతలు పెడ్తే అవి కృతజ్ఞతతో చూస్తున్నట్లనిపిస్తాయెందుకో. అప్పుడే ఈ ఆలోచన వచ్చిందండీ. థాంక్యు చిన్ని ఆశ గారు.
Deleteబాగుంది.. 'వస్త్ర విలాపం'
ReplyDeleteకృష్ణప్రియ గారు :) ధన్యవాదాలు.
Deletebagundandi
ReplyDeleteధన్యవాదాలు సుబ్రమణ్యం గారు.
Deletebagundandi
ReplyDelete