Monday, October 15, 2012

విన్నపం

"వీరికి మన మీద జాలి, దయ ఎంత మాత్రం లేవు."
"బాగా చెప్పావు. ఎంత సేవ చేస్తున్నాం...ఎంత ఆనందాన్నిస్తున్నాం."
"పెళ్ళి కాని, పేరంటం కానీ...అసలే శుభకార్యమైనా మనం లేకుండా జరుగుతుందా?"
"అందంగా పువ్వుల్లా కళకళ్ళాడుతూ వుండేవాళ్ళం, ఈ రోజిలా అలసటతో, వడలిపోయి, నిస్సహాయంగా వుండడానికి కారణం ఎవరు?"
"పిట్టల్నీ, పువ్వుల్నీ, గాలినీ, నీటినీ  ప్రేమించే సంస్కృతి మనది. అన్నింటిని ప్రేమించగలిగిన వాళ్ళు నిరంతరం అంటి పెట్టుకునే మనల్ని మాత్రం ఎందుకంత నిర్లక్ష్యంగా చూస్తారు?"
"మనల్ని చూసిన క్షణం నుండీ చేజిక్కించుకునేంత వరకూ మన గురించి కలలూ, కలవరింతలూనూ..."
"దరి చేరాక మోజు తీరగానే ఇంత లెక్కలేని తనమా! 
మనమే కనుక లేకపోతే వీరి మాన మర్యాదలు మంట కలసిపోతాయన్న విషయం అయినా గుర్తుందా?"
"మన౦ వారితో ఉండడం వల్లే సమాజంలో వారికి గౌరవం, గుర్తింపూను."
"చల్లగా వణికిపోతూ, దుర్వాసనతో, మట్టికొట్టుకు పోయి వగచే మనల్ని అసహ్యంగా చూడడం తగునా?"
"దీనంగా, కదలలేని స్థితిలో నిస్సహాయంగా పడి వుంటే మనమీద కొంచెమైనా జాలి కలగదా?"
"పూర్వం ఈ స్థితిలో వున్న మనల్ని ప్రేమగానో, బాధ్యత అనుకునో దగ్గరకు తీసుకుని మన అలసట తీరేలా సపర్యలు చేసేవాళ్ళు."
"తీగ మీద ఊగుతూ స్వచ్ఛమైన గాలి పీలుస్తూ చెట్టూ చేమలతో కబుర్లు చెప్పుకునే భాగ్యం ఏనాడో పోయింది."
"ఇనుప హస్తాలలో నలిగి వేసారి కొన ఊపిరితో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మనల్ని ఒకింత ప్రేమగా హత్తుకుని మంచి మాటలతో ఓదార్చితే ఎంత బావుంటుందో కదా!"
"మనమంటే ఇంత నిర్లక్ష్యమా. ఈ విషయాలన్నీ అర్ధం అయ్యేలా ఓ ఉత్తరం రాద్దా౦."

ప్రియమైనా మీకు, 

       మాదో విన్నపం. ఏనాడూ మాకు 'ఇది కావాలీ' అని అడుగలేదు. ఎక్కడో బందీలై ఉన్న మమ్మల్ని బంధ విముక్తులను చేసి కొత్త జీవితం ప్రసాదించారు. మీతో ఇలా రావడం, ఎల్లవేళలా మిమ్మల్ని అంటిపెట్టుకుని వుండడం మాకు చాలా సంతోషకరమైన విషయం. మేము అందంగా వెలిగిపోయే సమయంలో మాకోసం ఎంతో ధనం వెచ్చించి మమ్మల్ని మీ సొంతం చేసుకుంటారు, బంధుమిత్రులకు గర్వంగా పరిచయం చేస్తారు, సెంట్లు, అత్తర్ల ఘుమఘుమలతో ముంచెత్తుతారు. మమ్మల్ని ఆనంద పరచడానికి అవన్నీ ఏమీ చెయ్యనవసరం లేదు. మీరు మాతో గడిపే సమయం చాలు. మాసిపోయి, నలిగిపోయి, మురికిగా వున్నమమ్మల్ని చూసి అసహ్యంచుకోకండి. మిషిన్ లో వేయడం వలన నలిగిపోయి జీవం కోల్పోయిన మమ్మల్ని మడత పెట్టడానికి ఓ గంట వెచ్చించండి. తృప్తిగా మేం తెలిజేసే కృతజ్ఞతలను అందుకోండి. 

సదా మీ సేవలో తరించాలనుకునే 
మీ 
వస్త్రములు 


49 comments:

  1. :-)...:-)...
    జ్యోతి గారూ!...
    కొత్తబట్టలు కొనుక్కున్న తర్వాత అవి వేసుకునే లోపు ఎన్ని సార్లు చూసుకునే వాళ్ళమో చిన్నప్పుడు...
    ఇంకా ఆ అలవాటు పూర్తిగా పోలేదనుకోండి అది వేరే విషయం...:-)...
    ఓ సస్పెన్స్ కథల మొదలెట్టి వస్త్రాల వేదనగా ముగించారు...:-)
    కథనం చాలా బాగుంది...అభినందనలు...
    మీకు మీ కుటుంబానికీ శరన్నవరాత్రుల శుభాభినందనలు...@శ్రీ

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శ్రీ గారు. మీక్కూడా దసరా శుభాకాంక్షలు.

      Delete
  2. మీ ఈ శైలే నాకిష్టం. ఏదైనా భలే చెప్తారు. లేఖ అందింది. ఆవేదన మా మనసులని తాకింది. :)

    ReplyDelete
    Replies
    1. శిశిర గారు మీ ఇంట్లో బట్టలు సంతోషంతో పండుగ చేసుకుంటాయిక. :-) థాంక్స్

      Delete
  3. బలే ఆలోచనండి...:)) బాగుంది.

    ReplyDelete
    Replies
    1. :-) ధన్యవాదాలు రాధిక గారు.

      Delete
  4. వస్త్రం ల విన్నపం ఆలోచించాల్సిన విషయమే .

    ReplyDelete
    Replies
    1. మాలా గారూ అవునండీ ఆ విన్నపం గురించి ఆలోచిస్తే మన ఇల్లే శుభ్రంగా అందంగా ఉంటుందట. ఆ విషయం కూడా చెప్పాయవి. :-) థాంక్యు.

      Delete
  5. హహ్హహ్హా.. భలే రాసారే బట్టల తరపున వకాల్తా పుచ్చుకుని.. :)
    నేను మాత్రం బోల్డు ప్రేమగా చూసుకుంటానండీ బట్టల్ని.. మా అమ్మ అప్పుడప్పుడూ తిడుతూ ఉంటుంది.. అంత ఇదిగా డబ్బులు పోసి ఏరి కోరి కొని తెచ్చుకుని.. వాటిని సర్దేది, చూసుకునేదే ఎక్కువ, వాడేది తక్కువ అని.. :D

    ReplyDelete
    Replies
    1. మధుర గారు మీ ఇంట్లో బట్టలు సుఖంగా సంతోషంగా వున్నాయన్నమాట. :-) థాంక్స్

      Delete
  6. మొత్తానికి భలే విషయమే చెప్పారు. నేను పాపం వస్త్రాలని హింసించను గాని మంచి దశలోనే అవసరమైన వారికి ఇచ్చేస్తు ఉంటాను:)

    ReplyDelete
    Replies
    1. జయ గారు మంచి పని చేస్తున్నారు. థాంక్స్.

      Delete
  7. Replies
    1. రమేష్ గారు స్వాగతమండీ. పోస్ట్ నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

      Delete
  8. వస్త్రాల విన్నపం.. మంచి ఆలోచన
    చాలాబాగుంది..

    ReplyDelete
  9. అందుకేగా నేను వేసుకుంటానన్నవారికి బాగున్నప్పుడే ఇచ్చేస్తాను. ఉపయుక్తకరమైన పోస్ట్.

    ReplyDelete
    Replies
    1. పద్మార్పిత గారు మంచి పని చేస్తున్నారు. థాంక్స్.

      Delete
  10. వస్త్రాలతో మంచి జ్ఞానభోధన:)

    ReplyDelete
  11. అమ్మాయ్!
    వస్త్రాలు కూడా పెద్ద వాళ్ళలా గుర్తింపు కోరుతున్నాయంటావా?

    ReplyDelete
    Replies
    1. లేదు బాబాయి గారు. వాటి బాధ చెప్పుకుంటున్నాయంతే. కొంచెం దయగా చూడమంటున్నాయి. ధన్యవాదాలు.

      Delete
  12. నేను మాత్రం బట్టలు తమంతకు తాము అడిగేవరకు వాషింగ్ మెషిన్ లో వేసి వాటిని నలుపను, :))
    బాగుంది మీ పోస్ట్ :)

    ReplyDelete
  13. మొత్తానికి వకాల్తా తీసుకున్నారు చూసారూ.. :)
    బాగుందండీ.

    ReplyDelete
    Replies
    1. కొత్తావకాయ గారు...శుభ్రంగా ఇస్త్రీ చేసి మడత పెట్టిన ప్రతిసారి కృతజ్ఞతతో చూస్తాయండి మరి. వకాల్తా తీసుకోక తప్పలేదు. ధన్యవాదాలు.

      Delete
  14. వస్త్ర వ్యాపారి అయిన మా మిత్రుడు ఇదే విషయం చెప్పాడు.వాషింగ్ మెషిన్ వచ్చిన తరువాత మా వ్యాపారం బాగా జరుగుతుందిఅని,దానిలో వేస్తె త్వరగా బట్టలు పాడవుతాయని చెప్పాడు.సరదాగా మంచి విషయం వ్రాసారు.

    ReplyDelete
    Replies
    1. రవిశేఖర్ గారు..మీ మిత్రుడు మీతో వ్యాపార రహస్యం చెప్పేసారన్నమాట. థాంక్యు.

      Delete
  15. Bagundandi ...vastramalu kuda ela badha padtayi ani telisi vachindi...😃eesari nunchi meeru chepina salha patinchdanki prayatnistanu...😃

    ReplyDelete
    Replies
    1. అనురాధా...పాటిస్తే మనపనే సులువౌతుంది. మొత్తానికి బ్లాగు తరచుగా ఫాలో అవుతున్నారన్నమాట. థాంక్యు.

      Delete
  16. బట్టలు జీర్ణమయ్యే వరకూ వాడితే భర్త జేబుకు చిల్లు ఎందుకు పడుతుందీ..
    అమ్మో ఈ నవయుగంలో రోజుకో ఫ్యాషన్ అనుకరించకపోతే చిన్నతనంగా ఉండదూ :-)
    జ్యోతి గారూ హాస్య కథ రాయండి మీరు రాయగలరు. ఆలస్యంగా వస్తున్నాను మన్నిన్చేస్తూ ఉండండి.

    ReplyDelete
    Replies
    1. మెరాజ్ గారు నాకూ రాయాలనే వుందండి. మీ వ్యాఖ్య చూశాక ఆ కోరిక పదింతలైంది. మీ అభిమానానికి బోలెడు ధన్యవాదాలు.

      Delete
  17. jyothi gaaru, o chinni kaatha raayandi meeru raayagalaru. try ceyandi

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా మెరాజ్ గారు. థాంక్యు.

      Delete
  18. వస్తువులు మాట్లాడతాయి ..వస్త్రాలు మాటలాడుతాయి
    స్పందించే హృదయం ఉండాలే గానీ ..అడుగడుగునా
    ఇలా ఎన్ని ఘోషలో నిరంతర జీవయాత్రలో ..
    ఇంకా ఎన్నో రాయాలని ఎన్నో గుండెలను తట్టి లేపే
    ఈ కార్యక్రమం ఇలా సాగి పోవాలని నా ఆశ ..ఆశయం
    ఉపయుక్తమైన ఈ మంచి రచనకు అభినందనలు

    ReplyDelete
  19. కొత్తగా ఉంది, చాల బాగుంది.

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగుకు స్వాగతం సాయరం గారు. ధన్యవాదాలు. మీ పేరు సరిగ్గా పలికానా?

      Delete
  20. ఇలా సరదాని కలిపి ఆలోచింపజేసేలా భలే రాస్తారు మీరు.
    బాగుంది వస్ర్తాలకి మాటలొస్తే ఇలాగే మాటలాడతాయేమో బహుశా!

    ReplyDelete
    Replies
    1. బట్టలు చక్కగా మడతలు పెడ్తే అవి కృతజ్ఞతతో చూస్తున్నట్లనిపిస్తాయెందుకో. అప్పుడే ఈ ఆలోచన వచ్చిందండీ. థాంక్యు చిన్ని ఆశ గారు.

      Delete
  21. బాగుంది.. 'వస్త్ర విలాపం'

    ReplyDelete
    Replies
    1. కృష్ణప్రియ గారు :) ధన్యవాదాలు.

      Delete
  22. Replies
    1. ధన్యవాదాలు సుబ్రమణ్యం గారు.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.