మొన్నాదివారం ఉదయాన్నే తెల్లవారకముందే వచ్చి కూర్చుంది. కేవలం నాలుగ్గంటల నిద్రతో బద్దకంగా వాలిన కళ్ళను బలవంతంగా తెరిచి విషయమేమిటని అడిగాను. 'ఏవో పండగలూ వేడుకలూ ఉన్నాయిగా' అంటూ దీర్ఘం తీసింది. 'ఉంటే' అన్నాను దుప్పటి ముసుగు తలపైకి లాక్కుంటూ. ఉంటే గింటే ఏం లేదు, 'నిన్న ఏవో డాన్సులూ అవీ అనే మాటలు వినపడితేనూ...' అని ఆపేసింది. ఆ మాటతో మత్తు దిగిపోయింది. హడావిడిగా లేచి మొహం కడుక్కుని ఓ కప్పు కాఫీ కలుపుకున్నాను. నిన్న అనుకున్న పనులన్నీ చకచక పూర్తి చేసి ఏడుగంటలకల్లా పదిమంది మిత్రబృంద౦ ఒక బేస్మేంట్ లో కలిశాం. చెణుకులు, చెమక్కుల మధ్య ఓ రెండు గంటల సాధన సరదాగా నడిచింది.
"చాలా కష్టపడ్డావ్ ఇంటికి వెళ్ళగానే కాస్త విశ్రాంతి తీసుకో" అంది. ఏమైనా నేనంటే చాలా అభిమానంలెండి. ఇ౦టి లోపలకు అడుగుపెట్టగనే ఇంట్లో వాళ్ళంతా ఒక్కొక్కళ్ళూ లేచి కిందకు దిగి వచ్చారు. దోసెలు వేస్తుండగా చిట్టితల్లి 'మంచి భారతీయ వంట తెస్తానని స్నేహితురాలికి మాటిచ్చినట్లుగా' చెప్పింది. ఆ వంట సంగతేదో చూసి, ఇంట్లో పనులు అవగొట్టేసి ఇక మంచమెక్కేద్దా౦ అనుకున్నాను. వంట అవగానే మా వారు స్క్రిప్ట్ తో వచ్చి కూర్చున్నారు. నన్ను జాలిగా చూసి దీర్ఘంగా నిట్టూర్చింది. 'ష్' అని కోప్పడి నాటిక గురించి చర్చలు మొదలెట్టాం. ఈ నాటిక నాది కాదులెండి శ్రీవారిది. ఈ లోగా ఫోన్ "మిమ్మల్ని చూసి చాలా రోజులయింది ఐదు నిముషాల్లో వస్తున్నామన్న" కబురు వినిపించింది. వచ్చిన వాళ్ళతో పిచ్చాపాటీ కబుర్లు చెప్తుంటే మాకంటే ఎక్కువగా సరదా పడింది.
ఈలోగా నాటిక రిహార్సిల్స్ మొదలెడదామని పిలిచిన మిత్రులు రానే వచ్చారు. వారికి స్క్రిప్ట్ వినిపించి మార్పులూ చేర్పులూ గురించి చర్చిస్తుండగా మరో ముగ్గురు మిత్రులు ఓ తీయని కబురు మోసుకు వచ్చారు. నాటిక చర్చలు ముగించి వచ్చిన వారు నిష్క్రమించారు. కొత్తగా వచ్చిన మిత్రులతో ఆడిన కారంస్ ఆట 'టోర్టియా చిప్స్', 'గ్వాకమోలీ' నేపధ్యంలో పసందుగా సాగింది. ఆట జరుగుతుండగానే బుజ్జిపండు కోసం పిలుపు వచ్చింది. ఝామ్మని పండు వాళ్ళ నేస్తాల దగ్గరకు వెళ్ళాడు. సందట్లో సడేమియా..చిట్టితల్లి ప్రాజెక్ట్ పేరుతో తుర్రుమంది. తనేమో జరిగేవన్నీ చిరునవ్వుతో చూస్తూ విశ్రాంతిగా కూర్చు౦ది.
వచ్చిన మిత్రులను పంపించి తెలుగు తరగతికోస౦ పాఠ్యా౦శాలు చూసుకుని తరగతికి కావాల్సిన కుర్చీలు, బోర్డ్లు సర్డుతుండుగానే విద్యార్ధులు ఉపాధ్యాయులు హాజరు. 'తేనెల తేటల మాటలతో' పాట ప్రతి గదిలోనూ ప్రతిధ్వనించింది. ఈ పాట వింటున్నఆ కళ్ళలో పరవశం చూడాలి. సరే వాళ్ళను పంపించి భోజనాలు అయ్యాయనిపించాగానే పత్రిక పనికోసం మరో ఇద్దరి వచ్చారు. వారి పని చూసి ఫోనులో మాట్లాడాల్సిన విషయాలు పూర్తిచేసి రాత్రి పది గంటలకు విశ్రాంతిగా కూర్చుని ఉదయం నుంచీ జరిగిన విషయాల గురించి కబుర్లు చెప్పుకున్నాము. అన్ని అనుభావాలను ఆనందంగా దాచుకుని తృప్తిగా వీడ్కోలు తీసుకుంది.
ప్రతి రోజూ ఇలా గడిస్తే ఎంత బావుంటుందో! అత్యాశ కదూ. కనీసం ప్రతి వారం అన్నా ఇలా గడిస్తే సంతోషమే. ఆ రోజు మొత్తం పెద్దలూ పిల్లలూ కలసి సుమారుగా యాభైమందిని కలిసాము. ఉదయం తిన్న ఒక్క దోశతో సాయంత్రం వరకూ ఆకలే గుర్తు రాలేదు. మూసిన తలుపుల వెనుక నెలలు నెలలు గడిచిపోయే ఈ రోజుల్లో ఒక్క రోజును అంత తృప్తిగా పంపించడం అదృష్టమే కదూ.
పని చేయడం శ్రమ అనుకుంటా౦ కాని, ఇష్టమైన పని చేయడంలోని తృప్తిని అనుభవించిన వాళ్ళెవ్వరూ ఆ ఆనందాన్ని ఒదులుకోరు. పని చెయ్యడానికి భయపడతాం. సమయం మీదో సామర్ధ్యం మీదో నెపం వేస్తాం. పనిలో ఉండే కష్టాల్ని ఏకరువు పెడతాం. లేదు ఏతావాతా ఆ పని చేశామనుకోండి గుర్తింపు కోసం ప్రాకులాడతాం. నిజంగా పని చేసిననాడు మనకు లభించే తృప్తి ముందు ఇతరుల పొగడ్తలు తేలిపోతాయి. ఆ పని సమాజానికి సంబంధించినదైతే ఆ తృప్తే వేరు.
ఉదయాన్నే నన్ను నిద్రలేపిన రోజు, వెళ్ళే ముందు తనకు బాగా నచ్చిన వాటి గురించి చెప్పింది.

- మర్యాదలు, మట్టిగడ్డల గురించి ఆలోచించక నేరుగా వచ్చి తలుపు తట్టడం.
- నలుగురు కలిసి అడేవేళ బుజ్జిపండును తలచుకుని పిలుచుకెళ్ళడం.
- పిల్లల౦దరూ కలసి పాడిన 'తేనెల తేటల మాటలతో' పాట.
- అవకాడోతో తొలిసారిగా చేసిన 'గ్వాకమోలి'.