"సినిమాకి వెళదాం వస్తావా?"
"ఎందుకో?"
"ఎందుకేమిటి సరదాగా ఎ౦టర్టైన్ మెంటూ..."
"సరే పద...".
"థూ..యాక్..అది సినిమానా. ఆ బూతులూ..సగం సగం వేసే ఆ అమ్మాయిల బట్టలూ..."
"వాళ్ళ బట్టలూ వాళ్ళిష్టం."
"ఆ నరకడాలు ..కొట్టడాలు.."
"అదే మరి హీరోఇజం.."
"రెండర్ధాల మాటలూ, పాటలూ.."
"రాసేవాళ్ళకూ, చేసే వాళ్ళకూ లేని ఇబ్బంది మనకెందుకు!"
"కాని అది లక్షల మంది చూసే సినిమా కదా..విజ్ఞులూ ప్రాజ్ఞులూ ఉంటారుగా..."
"చూడ్డం ఇష్టంలేని వాళ్ళు సినిమాల కెళ్లడం మానేస్తారు.."
"చౌకబారు సినిమాలకూ, సాహిత్యానికీ పెద్దపీట వేసి..మనం అభివృద్ధి ఏవైపు సాగిస్తున్నాం?"
"చూసిచూడనట్టు పోవాలి...అన్నీ పట్టించుకోకూడదు."
"ఎలక్షన్లలో అతనెలా గెలిచాడు?"
"మనిషెవరైతేనేం కులం ప్రధానం."
"కులానికి అంతటి ప్రాధాన్యతనివ్వాలా..."
"కులానికి అంతటి ప్రాధాన్యతనివ్వాలా..."
"కులానికి నాయకులేంటి సామాన్యులేంటి పసిపిల్లల దగ్గరనుండీ పెద్దవాళ్ళ దాకా అందరూ దాసులే"
"అయితే మాత్రం..దేశాన్ని పాలించవలసిన నాయకులు..కులాల కుమ్ములాటలో..."
"అయితే మాత్రం..దేశాన్ని పాలించవలసిన నాయకులు..కులాల కుమ్ములాటలో..."
"చూసిచూడనట్టు పోవాలి..అన్నీ పట్టించుకోకూడదు."
"పెళ్లి బాగా జరిగింది కదూ.."
"విందులో మిగిలిన వంటలతో మన ఊరికి ఓ వారం భోజనం పెట్టొచ్చు.."
"ఉన్నవాళ్ళ పెళ్ళిళ్ళు మరీ...పెళ్లి చీర పది లక్షలూ, పెళ్లి కూతురి నగలు మూడు కోట్లూనట. పెళ్ళికి పెద్దపెద్దవాళ్ళు వచ్చారు చూశావా.."
"అతనేదో కాంట్రాక్టరు అనుకుంటానే.."
"ఆ..పోయినేడాది 'మాదారం' బ్రిడ్జి కట్టించాడు."
"ఆర్నెల్ల క్రితం బ్రిడ్జి కూలి ఎనభై మంది చచ్చిపోయారనుకుంటాను.."
"చూసిచూడనట్టు పోవాలి..అన్నీ పట్టించుకోకూడదు."
"గిరిజ మంచి పిల్ల. పాపం సీత ఎలా తట్టుకుంటుందో..ఎంతైనా తల్లి మనస్సు.."
"ఏమైంది?"
"వాడెవడో ప్రేమించమన్నాట్ట. ఈ పిల్లేమో నాకు చదువే ముఖ్యమన్నదట."
"దానికి బాధె౦దుకూ?"
"పూర్తిగా వినూ..వాడికి ఒళ్ళు మండి మొహం మీద ఆసిడ్ పోశాడట."
"అయ్యో అయ్యో...వాడికి అమ్మా నాన్నా ఉన్నారా?"
"అలా ఆవేశపడిపోకు. వాళ్ళ గురించి మనకెందుకు? మన ప్రదీపు అలా లేడుగా.."
"అయితే?'
"చూసిచూడనట్టు పోవాలి అన్నీ పట్టించుకోకూడదు."
"సాగర్ ని రాత్రి పోలీసులు పట్టుకున్నారట."
"ఎందుకు?"
"స్నేహితులతో కలసి క్లబ్బుకెళ్ళి వస్తుంటే.."
"అదేం తప్పు కాదుగా"
"చెప్పనీ..దారిలో ఒక బిచ్చగాణ్ణి గుద్దేశార్ట."
"రోడ్డుకడ్డంగా వచ్చుంటాడు..చీకట్లో కనిపించలేదేమో.."
"అదేం కాదట..బాగా తాగేసున్నార్ట..పేవ్మెంట్ మీదకు బండి ఎక్కించేసార్ట."
"అయ్యో ఈ తాగుడలవాటు ఎక్కడిది వీళ్ళకు?"
"చిన్నప్పట్నుంచీ నాన్ననూ, మామయ్యలనూ చూడట్లా.."
"అయ్యో మంచి పిల్లలు ఎలా పాడయిపోయారు.."
"ఆ సావిత్రి ఇప్పుడు పిల్లల కోసం కూడా ఏడవాలి."
"అసలా మద్యం అమ్మడమెందుకూ?"
"సర్కారుకి డబ్బులెలా వస్తాయి మరి.."
"జీవితాలు నాశనమయ్యాక డబ్బెవరికోసం.."

"ఆ గీతింట్లో విజయ్ మకాం పెట్టాడట..."
"అదేం పనీ..ఇంట్లో దేవతలాంటి పెళ్ళాన్ని పెట్టుకుని.."
"తెల్లారి ఇంటికి వస్తున్నాట్టలే.."
"ఛీ..ఛీ సుగుణెలా రానిస్తోంది"
"ఏం చేస్తుంది పాప౦?"
"తన్ని తరిమెయ్యొద్దూ."
"అవన్నీ పట్టించుకోకూడదు నెలకు ఇంట్లోక్కావలసిన డబ్బిస్తున్నాడుగా"
"ఇస్తే?"
"పెళ్ళానికి తెలియకుండా వెధవ తిరుగుళ్ళు తిరిగే వాళ్లె౦తమంది లేరు?"
"ఉంటే?"
"చూసిచూడనట్టు పోవాలి అన్నీ పట్టించుకోకూడదు."
"ఏవీ పట్టించుకోకుండా..ఎలా ఉండను?
పిల్లలు ఆ సినిమాలే చూస్తున్నారు..
ఆ దేశంలోనే మనమందరమూ ఉంటున్నా౦.
ఆ బ్రిడ్జిల మీద రోజూ వందల కొద్దీ వాహనాలు తిరుగుతున్నాయి.
పిల్లలంతా అలాంటి కాలేజీల్లోనే చదువుతున్నారు.
గొప్ప గొప్ప నిర్ణయాలన్నీ సీసాల మత్తులో జరిగిపోతున్నాయి.
గొప్ప గొప్ప నిర్ణయాలన్నీ సీసాల మత్తులో జరిగిపోతున్నాయి.
మంచేదో తెలియని పెద్దల మధ్య పసిపిల్లలు పెరుగుతున్నారు."
"చూసి చూడనట్టు పోవాలి అన్నీ పట్టించుకోకూడదు.."
"ఎలా?"
"లేచామా..తిన్నామా..పడుకున్నామా.."
"అంతేనా..."
"కావాలంటే చందామామ, వెన్నెల అంటూ కవితలు వ్రాసుకో.."
"నన్నవమానిస్తున్నావ్.."
"తెలుగు భాష, నీతులు అంటూ పిల్లలకు నూరిపొయ్యి."
"దిస్ ఈజ్ టూ మచ్.."
"చూసిచూడనట్టు పోవాలి అది మనకలవాటేగా!"