ఇప్పుడంటే నెలకొకసారి పున్నమి కోసం ఎదురుచూడాల్సి వస్తుంది కానీ, అప్పుడంతా చిట్టితల్లి నవ్వులతో పగలూ, రాత్రీ వెన్నెలే కదూ! ఉంగరాల జుట్టు, గుండ్రటి మొహం, చారడేసి కళ్ళు, లేతనీలం రంగు గౌను వేసుకుని, బుజ్జి కాళ్ళకు మువ్వల పట్టీలు పెట్టుకుని ఘల్లుఘల్లుమంటూ ఇంట్లో నడుస్తూ ఉంటే ఆ సిరిమహాలక్ష్మి నట్టింట్లో తా౦డవమాడినట్లే ఉండేది.
పెళ్ళయి, కాగానే శ్రీవారు ఒక మూడంతస్తుల అపార్ట్మెంట్ లో మూడో ఫ్లోర్ లో ఇల్లు చూశారు. అక్కడున్నప్పుడే చిట్టితల్లి పుట్టింది. ఆ ఏడాదే ఎదురింటి స్వాతి బడికి వెళ్లడం మొదలుపెట్టింది. వాళ్ళింట్లో ఆఖరిదవడంతో తనకన్నా చిన్నదైన చిట్టితల్లిని క్షణం ఒదిలేది కాదు స్వాతి. ఇంటిదగ్గర ఉన్న సమయమంతా చిట్టితల్లితోనే ఆటలు. స్వాతి వాళ్ళ అమ్మగారు టీచరుగా పనిచేసేవారు. ఆవిడ కూడా సాయంకాలాలు చిట్టితల్లిని ఇంటికి తీసుకెళ్ళి ఆడించుకునేవారు. చిట్టితల్లి రెండేళ్ళకే స్పష్టంగా మాట్లాడి౦దంటే అది స్వాతి చలువే మరి. తనకొచ్చిన పద్యాలూ, పాటలూ అన్నీ చిట్టితల్లికి చెప్తూ ఉండేది.
ఇంటికి రాగానే స్వాతి కాళ్ళు చేతులు కడుక్కుని, మెట్లమీద కూర్చుని పాలు తాగేది. చిట్టితల్లికేమో పాలు తాగడం అస్సలు ఇష్టం లేదు. అయితే స్వాతి మెట్ల దగ్గరకు వచ్చే సమయానికే అమ్మ కూడా బోర్నవిటాతో ఉన్న పెద్ద గ్లాసు, తాగడానికి వీలుగా మరో చిన్నగ్లాసు తీసుకుని మెట్ల దగ్గరకు వచ్చేది. పెద్దగ్లాసులోంచి చిన్నగ్లాసులోకి కొంచెం వంపి చిట్టితల్లి చేతికి ఇచ్చేది. చిట్టితల్లి ఒక్క చుక్క నోట్లోకి రాకుండా తాగినట్లు నటించేది. స్వాతి తాగడం అవగానే 'నువ్వు పాలు తాగితేనే నేను నీతో ఆడుకుంటా' అనేది. అంతే పాలన్నీ తాగేసి ఖాళీ గ్లాసు అమ్మ చేతిలో పెట్టేసేది చిట్టితల్లి. కొన్ని రోజులయ్యాక చిట్టితల్లి, స్వాతి అలా చెప్పకపోతే అడిగి చెప్పించుకుని మరీ పాలు తాగేది.
అలా ఆడుతూ, పాడుతూ, ముద్దులు మూట కడుతూ నలుగురి మధ్య రెండేళ్ళు పూర్తి చేసింది చిట్టితల్లి. ఒకరోజు చిట్టితల్లి చూస్తుండగా స్వాతి కాగితంతో చేసిన విమానం పైనుంచి కిందకు వేసింది. అది గాలిలో ఎగురుతూ, తిరుగుతూ, వయ్యారంగా వెళ్లడం విపరీతంగా నచ్చేసింది చిట్టితల్లికి. అప్పటినుండి చేతిలో ఏదుంటే అది పైనుంచి 'జుయ్' అని కింద వెయ్యడం మొదలు పెట్టింది. కిందకు చూస్తే మధ్యలో ఏదో అడ్డం ఉంది కాని ఒకవైపు కింద ఇంటి వాళ్ళు గిన్నెలు తోముకునే స్థలం, మరో వైపు కింద పోర్షన్ వారి వీధి వాకిలి కనిపిస్తాయి. చిట్టితల్లి చేతిలో ఏదైనా గట్టి వస్తువు చూస్తే అమ్మకు పై ప్రాణాలు పైనే పోయేవి.

ఒక్కోసారి చిట్టితల్లి కాలికి ఒక చెప్పు వేసుకుని కనిపించేది, వెతికితే రెండో చెప్పు కింద కనిపించేది. మరోసారి అప్పడాల కర్ర పడేసింది. లేచినవేళ మంచిది కాబట్టి ఆపూట అక్కడెవ్వరూ లేరు. చిట్టితల్లికా చెప్తే అర్ధం చేసుకునే వయసు కాదు. అమ్మ చెలం పుస్తకాలూ అవీ చదివి ఉందేమో 'చిట్టితల్లిని కోప్పడదా౦' అన్న ఊహే వచ్చేది కాదు.
చిట్టితల్లి చేతిలో ఏదైనా బలమైన వస్తువు చూసి౦దంటే స్వాతి 'అంటీ అంటీ' అని గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుని పాప దగ్గరకు వచ్చేది. చిట్టితల్లి నవ్వుతూ స్వాతికి దొరక్కుండా పరిగెత్తి ఇంకా బలంగా విసరడం మొదలు పెట్టింది. కొంత పరిశోధన చేసిన తరువాత చిట్టితల్లికి విసిరే ఉద్దేశం లేకపోయినా స్వాతి మోహంలో కంగారు చూడడం కోసం విసురుతోందని అర్ధం అయిందమ్మకు. సమస్య అర్ధమైయ్యాక పరిష్కారం దానంతట అదే దొరికింది. ఆ విధంగా చిట్టితల్లికి ఆ ఆటమీద ఆసక్తి పోయింది. అమ్మ 'అమ్మయ్య' అని ఊపిరి పీల్చుకుంది.
* * *
ఆ రోజులే వేరు కదూ..ఎవరికి ఎవరం ఏమవుతామో...తన, మన అన్న బేధం ఉండేది కాదు. పసిపాపతో ఇంటిపని, వంటపని ఒక్కర్తినీ చేసుకున్నా ఒక్కసారి కూడా శ్రమ అనిపించలేదు. ఆ బిల్డింగ్ లో అందరూ పాపను తీసికెళ్ళి ఆడుకోవడమే. రెండేళ్ళు నిండాక స్నానం చేయించి బయటకు పంపిస్తే మళ్ళీ భోజనాల వేళకు ఎవరింట్లో ఉందో వెతికి తీసుకొచ్చి అన్నం పెట్టి నిద్రపుచ్చేదాన్ని. భయం వుండేది కాదు, అందరి తలుపులూ తెరిచే ఉండేవి. అపార్ట్మెంట్ గేటు పక్కన ఇస్త్రీ బండి పెట్టుకుని చాకలి వాళ్ళ కుటుంబం ఉండేది. ఈ రోజుల్లో ఏ అపార్ట్మెంట్ చూసినా మూసిన తలుపులూ తాళాలూనూ..