"సరోజా, నాకేం చెయ్యాలో తోచట్లేదే"
"బాధపడకే కష్టాలు మనుషులకు కాకపోతే మానులకొస్తాయా"
"నీకేం నువ్వు ఎన్నైనా చెప్తావ్, నీదాకా వస్తే కదా తెలిసేది"
"మా అక్క కూడా ఇలాగే బాధ పడేది, ఏం చేస్తాం 'మన ప్రాప్తం ఇంతే' అని సరిపెట్టేసుకోవాలి"
"ఏం సరిపెట్టుకోవడమో నా పరిస్థితికి నా మీద నాకే జాలిగా ఉంది"
"అయ్యో అలా బాధ పడకే...కాలేజీలో 'వీరనారి' అనిపించుకున్న నువ్వేనా ఇలా కృ౦గిపోతుంది?"
"ఈ సంసారంలో పడ్డాక ధైర్యం గీర్యం కొండెక్కి కూర్చున్నయ్"
"అసలా విషయం ఎప్పుడు తెలిసిందే నీకు?"
"ఓ నెల్లాళైంది, అప్పట్నుంచీ నాలో నేనే కుమిలి పోతున్నానంటే నమ్ము"
"ఓ విషయం అడుగుతాను ఏం అనుకోవుగా..."

"అనుకోవడానికేం ఉంది, అయినా నీ దగ్గర నాకు దాపరికమేమిటే. అడుగూ"
"అది తెల్లగా అందంగా ఉంటుందటగా"
"ఆ కళా కాంతి లేకుండా తెల్లగా ఉంటుంది...మా అయన దాన్ని చూసి మెరుపుతీగ అని మురిసిపోతుంటే ఒళ్ళు మండిపోతుందనుకో"
"ఆ కళా కాంతి లేకుండా తెల్లగా ఉంటుంది...మా అయన దాన్ని చూసి మెరుపుతీగ అని మురిసిపోతుంటే ఒళ్ళు మండిపోతుందనుకో"
"ఏంటీ....నీ ముందే అలా అన్నారా!"
"ఆ...నా ముందే అన్నారు."
"దాన్ని ఎలాగోలా ఒదిలించుకోలేకపోయావా?"
"ఆ ప్రయత్నమూ అయింది. నానా గడ్డీ పెట్టాక మొహం నల్లబరచుకుని ఓ రెండువారాలు౦టుంది, తరువాత మళ్ళీ మామూలే. జీవితాంతం నేను దీన్ని భరించాల్సిందేనే.. ఇలాంటి కష్టం పగవాళ్ళక్కూడా రాకూడదు బాబూ."
"ఊరుకోవే ఇంక చేసేదేముంది సర్దుకుపోవడమే.."
"ఎలానే సర్దుకునేది, ఎక్కడికెళ్ళినా నాతోనే, దాన్ని చూసి నన్ను వరసలు మార్చి పిలుస్తుంటే ఎలా తట్టుకోమంటావ్.."
"ప్చ్..కష్టమే పాప౦"
"కష్టమని చిన్నగా అంటావా..రాత్రి పగలూ అదే ఆలోచనైపోయింది, ఆ పెద్దమ్మ నా నెత్తికెక్కాక మనశ్శాంతి లేకుండా పోయింది. ఏదైతే నా ఎదటికి రాకూడదనుకున్నానో, దేన్నైతో ఎదుర్కోవడానికి ఇంత కాలం భయపడ్డానో అది దాపురించాక 'నలుగురితోపాటు నారాయణా' అని అనుకోలేకపోతున్నాను."
"పోనీ ఎవరినైనా సలహా అడుగుదామా..."
"అదీ అయింది....ఎవరికి తోచినవి వాళ్ళు చెప్పారు, అన్నీ ప్రయోగించా మహా మొండిది కదూ అంత త్వరగా వదుల్తుందా.."
"మరెలా..పోనీ మీ అత్తగారితో ఓ మాట అనక పోయావా.."
"చెప్పకుండానే ఉంటానా...దానికావిడ "మాకూ వచ్చిందమ్మా ఈ కష్టం, ఏదో గుట్టుగా నోరు మూసుకుని ఊరుకున్నాం కానీ నీలా ఇల్లెక్కి గోల పెట్టలేదు" అన్నారు.
"ఇక ఊరుకునేది లేదు"
"ఇ౦కా వినూ....తరవత్తవాత దాని బంధుగణాన్నంతా తీసుకొస్తుందని కూడా అన్నారావిడ"
"మనమేం చేతులు ముడుచుక్కూర్చున్నామా, అందాకా వస్తే...."
"ఆ వస్తే ఏం చెయ్యనే..."
"ఒక్క తెల్ల వెంట్రుకని ఊరుకున్నాం కానీ తలంతా వస్తే....ఎంచక్కా పార్లర్ కి వెళ్లి రంగేయించుకో, లేకపోతే హెన్నా అయినా పెట్టించుకో"
"ఆ వస్తే ఏం చెయ్యనే..."
"ఒక్క తెల్ల వెంట్రుకని ఊరుకున్నాం కానీ తలంతా వస్తే....ఎంచక్కా పార్లర్ కి వెళ్లి రంగేయించుకో, లేకపోతే హెన్నా అయినా పెట్టించుకో"
"అంతేనంటావా"
"ఆ..అంతే మరి"