నేను వెళ్లేసరికి సుమన చింటూకు ఫోన్ ఇచ్చి అన్నం పెడుతూ వుంది. వాడు ఫోన్లో 'కెవ్వు కేక' పాట చూస్తూ పది నిముషాలకోసారి నోరు తెరుస్తున్నాడు. ఆ తరువాత పెరుగన్నం తినేప్పుడు 'రింగ రింగా' పాట చూస్తూ తిన్నాడు. రోజూ ఉండే తతంగమే ఇది. వాడికి అన్నం పెట్టడానికి సుమనకు ఓ అరగంట పడుతుంది. ఏదో విధంగా తన కొడుకు అన్నం తింటే చాలన్న ఆలోచనను రోజులా నాకెందుకులే అని చూస్తూ ఊరుకోలేక పోయాను.
"అబ్బ ఈ పిల్లాడికి అన్నం పెట్టేసరికి తల ప్రాణం తోక్కొస్తుందనుకో " అంటూ వచ్చి కూర్చుంది.
"పిల్లల పోషణ అంటే శారీరక అవసరాలు చూడడమేనా మన బాధ్యత?" అడిగాను.
"అంతేగా మరి రెండేళ్ళ పిల్లలకు అంతకంటే ఏం చేస్తాం?" ఆశ్చర్యపోయింది సుమన.
"చింటూ 'కెవ్వు కేక', 'రింగ రింగా' పాటలు రోజూ చూస్తున్నాడు. ఆడవారిని ఆటబొమ్మగా చూపే అలాంటి పాటలు వాడి మనసుమీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఆలోచిస్తున్నామా....మరో రెండేళ్ళు పొయ్యాక వాడు ఆడే వీడియో గేమ్స్ లో గన్స్ తో కాల్చుకోవడమే వుంటుంది. వాడి ఆలోచనా ధోరణి పెద్దయ్యాక ఏవిధంగా ఉంటుందో ఆలోచించు" తను నొచ్చుకోకుండా సాధ్యమైనంత సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించాను.
"చిన్నతనంలో ఆడే వీడియో గేమ్స్, టివి పిల్లల మీద అంత ప్రభావం చూపిస్తాయంటే నేనొప్పుకోను." నా ఆలోచనను గట్టిగానే ఖండిచింది.
"మొన్న సెలవల్లో మా అక్కావాళ్ళు వచ్చారు గుర్తుందిగా వాళ్ళ అమ్మాయి ప్రవల్లిక టెన్త్ చదువుతోంది. తనోసారి పిల్లలతో కూర్చుని టివి చూస్తూ, "ఆ ఏరోప్లేన్ ను గన్ తో కాల్చేయాలనిపిస్తుంది" అంది. నాకర్ధం కాలేదు, "ఎందుకలా అనిపించిందిరా" అనడిగాను. " ఐ డోంట్ నో, వీడియో గేమ్స్ లో అలా చేసి చేసి అలవాటయిపోయింది" అంది."
కొంచెం సేపు నిశ్సబ్దంగా ఉండిపోయింది సుమన. "మొన్న స్కూల్లో తల్లిని, పసిపిల్లలను నిలువునా కాల్చేసిన వాడ్నికరుడు గట్టిన రాక్షసుడనుకోవాలా? నిండా పాతికేళ్ళు కూడా వున్నట్టులేవే" నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అన్నాను.
"అతను పెరిగిన పరిస్థితిలు ఎలాంటివో మన వాళ్ళు అలా ఎందుకవుతారు?" మెల్లగా అంది. అంతకు ముందున్నంత విశ్వాసం లేదు స్వరంలో, తన ఆలోచన మీద తనకే పూర్తి నమ్మకం వున్నట్లనిపించలేదు.
"వ్యసనాలకు బానిసై సులభంగా వచ్చే డబ్బుకు ఆశపడి పసిపాపను బలితీసుకున్న వాడు పెరిగింది మన దేశంలోనే. పాపం వాళ్ళమ్మను చూస్తే ఎంత బాధనిపించిందో! "నా కొడుకు మంచి వాడు ఎవరినీ ఇబ్బంది పెట్టే మనస్థత్వం కాదు వాడిది. ఇలా ఎందుకు చేశాడో" అని ఆవిడ బాధపడుతుంటే నాకు ఎదురుగా మన పిల్లలే కనిపించారు. ఎక్కడుంది లోపం?" ఎన్నాళ్ళుగానో మనసులో ఆలోచన ప్రశ్న రూపంలో బయటకు వచ్చింది. సమాధానం లేనట్లుగా మౌనంగా చూస్తూండిపోయింది సుమన.
"మన వార్తా పత్రికల్లో గ్యాంగ్ రేప్స్ గురించి చదువుతూనే వున్నాం కదా. వాళ్ళు పెరిగింది మన సంస్కృతిలోనే. పిల్లలు ఇక్కడ పెరిగారా, ఇండియాలోనా అన్నది కాదు ముఖ్యం వాళ్ళు పెరుగుతున్న పరిస్థితులు ఎలాంటివి? వాళ్ళను సరిదిద్దవలసిన బాధ్యత మనమీద ఎంతుంది?" నిన్నటినుండి మనసులో సుడి తిరుగుతున్న ప్రశ్నలను ఎవరిని అడగాలో తెలియక సుమన వైపు సంధించాను.
"అందరూ అలానే తయారవుతున్నారా? ఎంతమంది చక్కగా చదువుకుని జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు లేరు."
"నిజమే జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళే వున్నారు. పక్కన అన్యాయం జరుగుతున్నా స్పందించే సున్నితత్వాన్ని కోల్పోతున్నారు. వారి జీవితమే వారికి ముఖ్యం. తమదాకా వస్తే కాని అది పట్టించుకోవాల్సిన సమస్య కానే కాదు వారి దృష్టిలో."
"అలా అని ప్రతి సమస్యనూ మనసుదాకా తీసుకుని ఎప్పుడూ బాధ పడుతూ ఉండాలా?"
"అక్కర్లేదు సుమనా కనీసం మన వలన అలాంటి తప్పులు జరగకుండా చూడాలి. ఇండియా గురించి నాకు తెలియదు కాని ఇక్కడ మాత్రం పిల్లలకు మంచి చెడూ బోధించాల్సిన తల్లిదండ్రులు అమెరికా వ్యామోహంలో పూర్తిగా మునిగి పోయారు. నిద్రలేస్తే జీవనోపాధి కోసం పరుగులు, రెండు దేశాల సంస్కృతలను వంట బట్టించుకునే ప్రక్రియలో క్షణం తీరికలేని వారాంతాలు.
ఇక మన, తన అని తేడా ఏముంది" కొంత బాధగా చెప్పాను.
"సెలవలలో పెద్దవాళ్ళు రావడమో పిల్లలు ఇండియా వెళ్లడమో జరుగుతూనే ఉంటుందిగా" నేను మాట్లాడుతున్నది అర్ధమౌతున్నా ఒప్పుకోవడానికి సిద్దంగా లేదు.
"మనవల కోసం పెద్దవాళ్ళు వస్తున్నారు. వచ్చిన వాళ్ళతో వీళ్ళెంతవరకూ మాట్లాడ గలుగుతున్నారు? ఇద్దరి మధ్య సంబంధాలు ఎలా వుంటున్నయ్. మనం చిన్నప్పుడు మన అమ్మమ్మా వాళ్ళిల్లు అని మధుర స్మృతులు గుర్తుచేసికున్నట్లుగా వీరికి వారితో ఆ అనుబంధం వుందా?"
"నువ్వన్నది నిజమే. దీనికి పరిష్కారం ఏమిటి మరి" సాలోచనగా అంది.
పరిష్కారం అంత సులువుగా దొరికేది కాదు. ఈ సమస్య మనందరిదీ. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు రేపు ఎలాంటి భయంకర పరిస్థితులు ఎదుర్కుంటారో, ఎలాంటి పరిస్థితులలో దోషులుగా మారుతారో తెలియదు. పరిస్థితి చెయ్యిదాటి పోకముందే మేల్కొoదాం. పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడుపుదాం. వాళ్ళ స్నేహితులు ఎలాంటి వారో తెలుసుకుందాం.
మన చుట్టూ వుండే టివి, సినిమా రంగం మానవతా విలువలు లేకుండా, అసభ్యతతో కలుషితమై పోయి వుంది. వాటిని నిర్మూలించ వలసిన ప్రభుత్వం కొంత మంది వ్యక్తుల లాభాలకోసం, కొన్ని సంస్థల అభివుద్ది కోసమో అమ్ముడు పోయింది. వాటిని మనం మార్చలేనప్పుడు కనీసం పిల్లలను వాటికి దూరంగా ఉంచడానికి ప్రయత్నిద్దాం. మొక్కై వంగనిది మానై వంగదు ... పసిపిల్లలుగా ఉన్నప్పుడే వారికి నీతి కథలు, కబుర్లతో మంచీ చెడూ చెప్దాం.
పరిస్థితి చేయి దాటి పోతోందని రోజూ వార్తా పత్రికలలో వచ్చే వార్తల ద్వారా తెలుస్తూనే వుంది. పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిండ్రుల మీదే వుంది. పసి మనసుల మీద చేస్తున్న వ్యాపారాన్ని అరికట్టవలసిన బాధ్యత మనందరిదీ.
అన్యాయంగా దురాగతాలకు బలౌతున్న అమాయకులకు అశ్రునయనాలతో...