తెలుగులో టైప్ చేయడానికి చాలా ఉపకరణాలు ఉన్నాయి. నాకిది తేలికగా అనిపించింది.
ఈ లింక్ మీద నొక్కినప్పుడు అది వేరే పేజీకి తీసుకెళుతుంది. అక్కడ తెలుగును ఎంచుకుని I agree మీద చెక్ చేసి డౌన్ లోడ్ మీద నొక్కాలి.
డౌన్ లోడ్ అయిన ఫైల్ మీ ఫైల్స్ లో వుంటుంది.
ఆ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఈ రన్ డయలాగ్ వస్తుంది. Run మీద నొక్కి అప్లికేషన్ ఇన్స్టాల్ చెయ్యాలి.
ఇన్స్టాల్ చేసాక కీ బోర్డ్ మీద shift, alt రెండూ ఒక్కసారి నొక్కితే కుడి వైపు మూల ఇలా కనిపిస్తుంది
ఇప్పుడు ఎక్కడ ఇంగ్లీషులో టైప్ చేసినా అది తెలుగులోకి మారుతుంది.
ముఖ్యంగా బ్లాగులో, ఫేస్ బుక్ లో వ్రాసుకోవడానికి, వ్యాఖ్య పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఎక్కడో రాసి దాన్ని కాపీ చేసి వేరే దగ్గర పెట్టకుండా ఒకే దగ్గర టైప్ చేసుకోవచ్చు. మైక్రో సాఫ్ట్ వార్డ్ కాని, నోట్ పాడ్ కాని ఎక్కడైనా తెలుగులో సులువుగా టైప్ చెయ్యొచ్చు.
లేఖిని కూడా వాడొచ్చు కాని తెలుగు టైప్ చేయడానికి ప్రతిసారి ఆ పేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. మనం వ్రాసిన విషయాన్ని కాపి చేసి వేరొకదగ్గర పేస్ట్ చెయ్యాలి. తెలుగు ఇప్పటివరకూ టైపు చెయ్యని వారు లేఖినిలో ఇచ్చిన ఇంగ్లీషు అక్షరాల ఆధారంగా తెలుగులో ఎలా టైపు చెయ్యాలో నేర్చుకోవచ్చు.

మనం రాస్తున్నప్పుడు పదం సరిచూసుకోవడానికి వీలుగా డ్రాప్ డౌన్ విండోలో నాలుగు పదాలు వస్తూ ఉంటాయి. నాకు ఇందులో బాగా నచ్చిన మరో అంశం కొన్ని అక్షరాల కోసం ప్రతిసారి షిఫ్ట్ నొక్కే అవసరం లేకపోవడం.
ముఖ్యంగా బ్లాగులో, ఫేస్ బుక్ లో వ్రాసుకోవడానికి, వ్యాఖ్య పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఎక్కడో రాసి దాన్ని కాపీ చేసి వేరే దగ్గర పెట్టకుండా ఒకే దగ్గర టైప్ చేసుకోవచ్చు. మైక్రో సాఫ్ట్ వార్డ్ కాని, నోట్ పాడ్ కాని ఎక్కడైనా తెలుగులో సులువుగా టైప్ చెయ్యొచ్చు.
లేఖిని కూడా వాడొచ్చు కాని తెలుగు టైప్ చేయడానికి ప్రతిసారి ఆ పేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. మనం వ్రాసిన విషయాన్ని కాపి చేసి వేరొకదగ్గర పేస్ట్ చెయ్యాలి. తెలుగు ఇప్పటివరకూ టైపు చెయ్యని వారు లేఖినిలో ఇచ్చిన ఇంగ్లీషు అక్షరాల ఆధారంగా తెలుగులో ఎలా టైపు చెయ్యాలో నేర్చుకోవచ్చు.
http://lekhini.org/