అబ్బ! ఈ పెద్దవాళ్ళున్నారు చూశారూ...వాళ్ళకేం చెప్పినా అర్థం కాదు. అప్పటికీ మనం ఎంతో ఓపిగ్గా explain చేస్తామా, అయినా కూడా అర్థం చేసుకోరు. మా నాన్నగారైతే మరీనూ. సంతకం చేయమని report card చేతికివ్వగానే దాన్ని పైనుంచి కిందకు చూస్తారు. ఆయనకు ముందుగా అందులో B, C, D, లే కనిపిస్తాయి. మనం Alphabets నేర్చుకునేప్పుడు ముందు ఏం నేర్చుకుంటాం? A నే కదా. అంటే report card లో కూడా ముందు A నే చూడాలి కదా! ఆహా.. A తప్ప మిగిలినవవ్నీ చూసేసి grades ఎందుకిలా వచ్చాయ్ పండూ అనేస్తారు.
అప్పటికీ చెప్తాను, B కూడా మంచిదే నాన్నా discriminate చెయ్యకూడదు అని. పైగా మా teacher కూడా B మంచిదనే చెప్పారు అని చెప్తాను. వినరుగా! మీ teachers అలాగే చెప్తారు. A ఒక్కటే మంచిది అని గాఠిగా వాదించేస్తారు. టీచర్ చెప్పిన పాఠాలేమో జాగ్రత్తగా వినాలి, మిగిలినవి వినకూడదంటే ఎలాగో మీరే చెప్పండి.
ఇంకా ఏమో చిన్నప్పుడు వాళ్ళు ఎంత బాగా చదివేవారో అప్పటికప్పుడు ఒక గంట సేపు lecture ఇచ్చేస్తారు. అప్పుడంటే వాళ్ళకు video games, movies, play dates, soccer ఇవన్నీ లేకపోబట్టి bohr కొట్టి చదివారు గాని లేకపోతే అంతలా చదివేవారా ఏమిటి?