“మోవ్ ఈసారి అక్కోళ్ళు, పిలకాయలందరూ పండక్కొస్తళ్ళా. పెద్ద భోగిమంటెయ్యాల" అన్నాడు మామయ్య అమ్మమ్మతో.
"అట్నేలేరా. గెనెం మీద తాటాకులు కొట్టకరారాదా." సలహా ఇచ్చింది అమ్మమ్మ.
మామ్మయ్య భోగికి పదిరోజుల ముందే బోల్డన్ని తాటాకులు తెచ్చి సందులో ఎండబెట్టాడు.
* * * * * * *
"మాయ్ కోడి కూసింది. భోగిమంటేస్కోబళ్ళా. ల్యాండి ల్యాండి." అన్న అమ్మమ్మ పిలుపుతో మెలుకువ వచ్చింది.
"అప్పుడేనా?" దుప్పటి మొహం మీదనుండి తియ్యకుండానే అడిగాను.
"ఆ మీ మావయ్య లేచా తాటాకులు లాక్కొచ్చి రోడ్డుమింద యాస్తా వున్యాడు." చెప్పింది అమ్మమ్మ.
"దిబ్బకాడ ముట్టిబోయిన చీపుర్లు, ఇరిగి పోయిన తలుపురెక్క బెట్నాం. అయ్యిగూడా రోడ్డుమింద యాస్తన్నాడా? అడిగింది పిన్ని.
"యేవోనమ్మా నే జూళ్ళేదా."చెప్పింది అమ్మమ్మ.
"నేంబొయ్యి చూసొస్తానుండు పిన్నీ" అంటూ లేచి దుప్పటి చుట్టూ చుట్టుకుని పరిగెత్తి వీధిలోకి వెళ్ళాను. అప్పటికే తాతయ్య దిబ్బపక్కనున్న విరిగిపోయిన సామాన్లని వీధి పక్కన పేరుస్తున్నాడు.
"ఏం జోతా లేచినావా? రా ఇటు గూచో యెచ్చంగుంటది." పోగేసిన తాటాకులకు నిప్పంటిస్తూ చెప్పాడు మామయ్య. దుప్పటి కింద పడకుండా జాగ్రత్తగా మడుచుకుంటూ కూర్చున్నాను. ఈలోగా ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చి మంట చుట్టూ కూర్చున్నారు. ఎర్రగా మొదలైన చిన్న మంట చూస్తుండగానే రాజుకుని నిప్పు రవ్వలు పైకి లేవడం మొదలుపెట్టాయి. మంటకు అరచేతులు అడ్డం పెట్టి వెచ్చగా చలి కాచుకుంటున్నాం. ప్రతి ఇంటి ముందు ఎర్రెర్రని మాటలు. ఇంటెల్లపాది మంట చుట్టూ చేరడంతో వీధి వీధంతా సందడిగా ఉంది.
"మాయ్ ఇంకా మంటకాడ్నించి లేచా తలకుబోసుకోండి. అట్నే పిలకాయలగ్గూడా తొందరగా తలకులు బొయ్యండి." చెప్పింది అమ్మమ్మ. ఎప్పుడు స్నానం చేసిందో గచ్చకాయ రంగు చీరకి మామిడి పిందెల అంచున్న పాటూరి చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని ఉప్పు మిరియాలు కలగలిసినట్లుండే బారెడు జుట్టుకి కాశీ టవల్ చుట్టుకొనుంది.
"నీర్జా కాస్త కుంకుడ్రరసం దీసి అక్కకీ." అంటూ చిన్నపిన్నికి పురమాయించింది.
స్నానం చేసి వంటింట్లో కొచ్చేసరికి మసాలా ఉడుకుతున్న ఘుమఘుమలు, పెనం మీద నుండి సుయ్ మన్న శబ్దం వినిపిస్తోంది. సన్నికల్లు మీద వేరుశనక్కాయల పచ్చడి నూరుతోంది అక్క.
"అప్పుడే దోశలు పోస్తున్నావా?" అడిగాను అమ్మమ్మని.
"అప్పుడే యేవా ఏడవతళ్ళా. నీళ్ళు బోసుకున్నా, దేవుడికి దణ్ణం పెట్టుకురాపో" చెప్పింది అమ్మమ్మ.
"దండం పెట్టుకునే వచ్చా." సమాధానం చెప్పాను.
"అదిగో ఆ తలుపెనకాల పీటలుండాయ్. ఇటు వాల్చు నాయనా. అట్నే ఆ పళ్ళాలు ఇట్దీసకరా." అంది పెనానికి నూనె రాస్తూ. పొయ్యిలో కట్టెల మీద నిప్పులు కణకణ మండుతున్నాయ్. మంట పెనం కిందంతా పరుచుకుంటోంది.
అమ్మమ్మ చెప్పినట్లుగానే చేశాను. అక్క నూరడం పూర్తిచేసి గిన్నెలోకి పచ్చడి తీస్తోంది. స్నానం చేసిన వాళ్ళు ఒక్కొక్కరే వంటింట్లోకి వస్తున్నారు. పళ్ళెంలో దోశ వేసి పక్కనే కోడి కూర కూడా వేసి నా ముందు పెట్టింది అమ్మమ్మ. ఇంతలో "వొరెవొరెవొరె అందరూ ఈడ్నే ఉండారే. ఎప్పుడొచ్చినారా? యేం ఆదిలచ్చమ్మా దోశలు బోస్తండా?" అంటూ నేరుగా వంటింట్లోకి వచ్చాడు పక్కింట్లో ఉండే పెద్ద తాతయ్య.
"రామావా. పండగ్గదా, పిలకాయలంతా వొచ్చినారు." సమాధానం చెప్పింది అమ్మమ్మ.
"మేవొచ్చి నాల్రోజులవతా ఉంది పెదనాయినా, సూళ్ళూరుపేట బోయినావంట్నే, యెప్పుడొచ్చినావా?" అంటూ తాతయ్య కూర్చోడానికి పీట వాల్చింది అమ్మ.
"ఇప్పుడే యేడు గంటల బస్సుకొచ్చినా రాజమ్మా. రాంగానే విజ్యమ్మ జెప్పింది మీరంతా వచ్చుండారని, పలకరిచ్చి పోదావని వచ్చినా." పీట మీద కూర్చుంటూ చెప్పాడు తాతయ్య.
"మావకి రొంత కూరేసీ రాజమ్మా." అంటూ దోశలున్న పళ్ళెం అమ్మ చేతికిచ్చింది అమ్మమ్మ.
"నా కోడలు గూడా దోశలు బోస్తా వుండాది." మొహమాట పడ్డాడు తాతయ్య. పోస్తే పోసిందిలే మావా ఈడ గూడ దినొచ్చు. అయినా పిలకాయలంతా ఈడ్నే ఉంటే వాళ్ళు మాత్తరం ఎందుకాడ?" అంది అమ్మమ్మ.
ఇంతలో "తాతయ్యా అమ్మా పిలస్తా వుంది." అంటూ తాతయ్య పెద్దమనవరాలు విజయొచ్చింది.
"యేమ్మే, మీ యమ్మగూడా దోశలు బోస్తా వుందా?" అడిగింది అమ్మమ్మ.
"ఇంకాలా నాయనమ్మా బుజ్జమ్మకు నీళ్ళు బోస్తా వుంది." చెప్పింది విజయ.
"మాయ్, ఇజ్యగ్గూడా పళ్ళెమీయండి. అని పిన్నితో చెప్పి, పాపా నువ్బొయ్యి అత్తని, మావని పిల్చకరా" పురమాయించింది అమ్మమ్మ.
"యేంనా సూళ్ళూరుపేట యేం పని మీద బోయినావా?" అడిగాడు తాతయ్య.
"మన పెద యెంకట్రామిరెడ్డి లేడా గూడూర్లో, కూతురుకి సమ్బందాలు జూస్తా నన్నుగూడ పిల్చకపోయినాడు." చెప్పాడు పెద్ద తాతయ్య.
"సంబందం కుదిరినట్టేనా మావా?" అడిగింది అమ్మమ్మ.
"వాళ్ళు కట్నం లచ్చడుగుతుండారు. మన ఎంకట్రాముడు అంత ఇచ్చుకోలేడు."
"పిల్లోడు బాగుండాడా? ఆస్తేమాత్రం వుంటాదా?" అడిగాడు తాతయ్య.
"బాగుండేదేందిలేరా, మంచాస్తి. పదిహేనెకరాల మాగాణి ఏకచక్క. సమచ్చారానికి మూడు పంటలు పండే బూవి. మన నీర్జమ్మకు జూద్దామా?" అడిగాడు పెద్ద తాతయ్య.
"ఈ రోజుల్లో పంటలేంటికిలే మావా? మనం జాస్తళ్ళా యవసాయమా. వొక సంవచ్చరం వానలెక్కువ బడి పంట కుళ్ళిపోయ, ఇంకో సంవచ్చరం నీళ్ళే లేక కంకులెండిపోయ. పిలకాయలకెందుకులే ఆ బాదలు. ఆడపిలకాయలైనా సుబ్బరంగా చదూకుంటుంటిరే గవుర్నమెంటు ఉజ్జోగస్తునికిస్తే ఇద్దరూ ఉజ్జోగాలు జేసుకుంటా వాళ్ళ తంటాలేవో వాళ్ళు బడతారు." చెప్పింది అమ్మమ్మ.
"అదీ నిజమేలే." ఒప్పుకున్నాడు పెద్ద తాతయ్య.
ఈలోగా పెద్ద తాతయ్య కోడలు పిండి గిన్నె ఎత్తుకుని వచ్చింది. అందరం ఆ పూట అక్కడే కడుపు నిండా దోశలు, కోడికూర దిన్నాం.