Monday, November 3, 2025

కెన్యన్ లాండ్స్ నేషనల్ పార్క్ (Canyonlands National Park)

ఈ పోస్ట్ నేషనల్ పార్క్స్ ప్రయాణం లోని భాగం. ఈ ప్రయాణం మొదటినుండీ చదవాలనుకుంటే ఇక్కడకు, ఇంతకు ముందు భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.

యూటా(Utah)లోని మైటీ ఫైవ్ నేషనల్ పార్క్స్(Mighty Five National Parks)లో కెన్యన్ లాండ్స్ నేషనల్ పార్క్ (Canyonlands National Park) కూడా ఒకటి. కెన్యన్ లాండ్స్ పార్క్ రెండు భాగాలుగా ఉంటుంది, ఐలెండ్ ఇన్ ది స్కై(Island in the sky), ది నీడిల్స్(The Needles).

మేము ఐలెండ్ ఇన్ ది స్కై దగ్గరకు వెళ్ళేసరికి నాలుగవుతోంది. ఆ పార్క్ లో చూడవలసిన వాటిలో మేసా ఆర్చ్(Mesa Arch) ఒకటి. పార్కింగ్ నుండి కొంత దూరం వెళ్ళాక అన్నీ నున్నని రాళ్ళు, ఆ రాళ్ళు ఎక్కుతూ దిగుతూ వెళ్ళడం సరదాగా అనిపించింది.

  

అప్పటికి వరకు మేము చూసిన అన్ని నేషనల్ పార్క్స్ లో కెన్యన్ లాండ్స్ నేషనల్ పార్క్ చాలా పెద్దది. అక్కడ గ్రాండ్ వ్యూ పాయింట్(Grand Viewpoint)దగ్గరకు వెళ్ళడానికి కొండ చెరియ అంచునే దారి. ఎండ వేడి తగ్గి ఆహ్లాదంగా ఉన్న ఆ సాయంత్రం కొండ చెరియ అంచునే నడుస్తూ నడుస్తూ ఉంటే ఆ పార్క్ మొత్తం కనిపిస్తోంది. గ్రాండ్ వ్యూ పాయింట్ పాయింట్ దగ్గర మేము, కొండలు లోయలు తప్ప మరో ప్రాణి లేదు. వేరే గ్రహానికి వెళ్ళిన అనుభూతి కలిగింది.

సాయంత్రం ఏడవుతుండగా అక్కడ నుండి మోఆబ్(Moab) అనే ఊరికి బయలుదేరాము. షార్లెట్ నుండి బయలుదేరాక వెళ్ళిన మొట్ట మొదటి పెద్ద ఊరు అది. ఆ దారిలో సూర్యాస్తమయం, చంద్రోదయం రెండూ చూసాము. 

 
అక్కడ థాయ్ రెస్టరెంట్ బెల్లా మోఆబ్ (Thai Bella Moab) కు వెళ్ళాము. రెస్టరెంట్ సీటింగ్ అంతా ఆరుబయటే ఉంది. టేబుల్స్ మధ్యలో చిన్నచిన్న మొక్కలు అక్కడక్కడా చెట్లకు వేలాడదీసిన లైట్స్ తో చాలా అందంగా ఉంది. సీటింగ్ కోసం ఒక అరగంట వెయిట్ చేయాల్సి వచ్చినా ఫుడ్ కూడా బావుండడంతో తృప్తిగా భోజనం చేసి హోటల్ కు వెళ్ళాము.
ఇంతకు ముందు భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.