Wednesday, January 2, 2013

బడికెళ్ళిన బుజ్జిపండు

       బుజ్జిపండు అమ్మ కొంగు వదిలి ఈ నెల నుండి బడికి వెళ్ళడం మొదలు పెట్టాడు. ఉన్నత విలువలున్న 'కౌముది' లాంటి బళ్ళో చదువుకునే అవకాశం దొరికినందుకు చాలా ఆనందంగా వుంది. బళ్ళో చేర్చుకున్నందుకు కౌముది సంపాదకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 

మరి మన 'అమెరికా బుజ్జిపండు' అక్కడ ఏం చేస్తున్నాడో చూద్దామా!



30 comments:

  1. "రోడ్డు దేవుడు లేడు కాబట్టే ప్రమాదాలు జరుగుతున్నాయ్"
    “కారంగా వుండే ఆవకాయ ముక్కని కడుకోక్కుండా తినేస్తున్న దేవుడి కంటే నేనే పెద్ద”

    హ్హహ్హహ్హ బావున్నాయ్ పండుగాడి కబుర్లు జ్యోతిర్మయి గారూ

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.

      Delete
  2. మీ పోస్టుల్లో ఏది మిస్ అయినా బుజ్జిపండు కబుర్లు మాత్రం అస్సలు మిస్ అవనండి, అంత ఇష్టం నాకు తన కబుర్లు :) అలాంటి కబుర్లు ఇపుడు కౌముదిలో రావడం చాలా బాగుంది. అభినందనలు :-))

    ReplyDelete
    Replies
    1. వేణు గారు మీ వ్యాఖ్యలో నకేప్పుడూ నిండు మనసు కనిపిస్తుందండి. వ్యాఖ్య పెట్టేప్పుడు మీలా పెట్టాలని ఎప్పుడూ అనుకుంటాను. ధన్యవాదాలు.

      Delete
  3. Replies
    1. ధన్యవాదాలు శివప్రసాద్ గారు.

      Delete
  4. హ హా...అమెరికా బుజ్జి పండు సందేహాలూ, మాటలూ భలే తమాషాగా ఉన్నాయి.
    దేవుడికి దండం పెట్టుకుంటే కుమాన్ వర్క్ చెయ్యక్ఖర్లేదా...మరంతే కదా, దేవుడడిగినవన్నీ ఇచ్చేస్తాడని మనం చెప్తుంటే పిల్లలు కోరే మొదటి కోరికిదే కదా ;)
    Very nice!

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశ గారు మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

      Delete
  5. meeru mari inta pedda post lu vraste chadavatam kocham kastam andi.. ardham chesukuntaru anukuntanu vishyanni simple chinnagaa ceppite memu happykada maa santoshoshame mee shantoshamu kadaa!!!!

    ReplyDelete
    Replies
    1. ప్రయత్నిస్తానండి ప్రిన్స్ గారు. ధన్యవాదాలు.

      Delete
  6. జ్యోతి గారూ,
    బుజ్జిపండు.. వాడు కుముది లాంటి బడికి వెళ్ళటం.. ఇంక కొత్త సంవత్సరం గుడికి వెళ్ళటం చాలా ముద్దుగా వుంది. బుజ్జిపండు తో పాటూ నేను కూడా గుడికి వెళ్ళాను, దేవుడి దర్శనం అయ్యింది, పులిహోర ప్రసాదం దొరికింది. ఎంత బావుందో.. మీ రచనలు పాలలా స్వచ్చంగా తేనెల తియ్యగా వున్నాయి. మన అందరి సతసంకల్పాలకు ఆ జగదంబ అసిస్సులను కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో..

    సుజాత

    ReplyDelete
    Replies
    1. సుజాత గారు మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండీ. నా రచనల గురించి మీ వ్యాఖ్యానం నన్నో క్షణం మైమరిపించింది. ధన్యవాదాలు.

      Delete
  7. జ్యోతి గారు, చాలా బాగున్నాయండి బుజ్జిగాడి కబుర్లు. ఇవి చదువుతుంటే మా బుజ్జిగాడు అమ్మమ్మ వాళ్ళ ఇంటినుంచి వచ్చాక ఎన్ని వివరాలు అడుగుతాడో అని కొద్దిగా భయం వేసింది

    ReplyDelete
    Replies
    1. పారుపల్లి గారు స్వాగతమండి. మీ బుజ్జాయి అమ్మమ్మా వాళ్ళింట్లో ఉన్నాడా...అదృష్టవంతుడు. వచ్చి మీకు మంచి మంచి కబుర్లు వినిపిస్తాడు లెండి. ధన్యవాదాలు.

      Delete
  8. మిస్సయ్యాను.. బావున్నాయండి బుజ్జిపండి కబుర్లు :)

    ReplyDelete
    Replies
    1. తృష్ణ గారు మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

      Delete
  9. జ్యొతి గారు, మీ బుజ్జిపండు కబుర్లు, చదవాలి అనిపిస్తుంది. ఈ సందర్బంగా నాదొ కొరిక మీరు బాలల కథలు చక్కగా రాయొచ్హు కదా. మంచి సైలి.

    ReplyDelete
    Replies
    1. మెరాజ్ మీకు నచ్చినందుకు చాలా సంతోషం. నిజమేనండి, మా పాఠశాల పిల్లల కోసం కథలు వెతుకుతూ ఉంటాను. 'కొత్తపల్లి' పత్రికలో కొన్ని దొరుకుతున్నాయి. మిగిలిన కథలన్నీ రాజులు, గ్రామాలు, న్యాయాధికారి....ఇలాగే ఉంటున్నాయి. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్న పిల్లలకు అవి చదవడం చాలా కష్టంగా ఉంది. తేలిక భాషలో ఇప్పటి విషయాలను తీసుకుని కథలు రాయగలిగితే పిల్లలు ఆసక్తిగా చదువుతారు. తెలుగులో ఇలాంటి కథలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధన్యవాదాలు.

      Delete
  10. జ్యోతిర్మయీ,
    కౌముదిలో బుజ్జిపండు శీర్షిక మొదలవ్వడం బావుంది. పెద్దల కోసం పిల్లల కథలాగా మొదలైనా ముందు ముందు పిల్లల కోసం పిల్లల కథల శీర్షిక మొదలైతే బావుంటుందని నా కోరిక. కొత్తపల్లి పిల్లల పత్రికకి మీరూ కుడా కథలు అందించవచ్చు. అంతర్జాల పత్రికల వారు మీ లాంటి రచయిత్రుల సహాయంతో చిన్నగా పిల్లల కోసం ప్రత్యేకంగా తెలుగు కథలు, కబుర్లు (ఓ నాలుగు పేజీలు చాలు) తీసుకు రావచ్చు. మీ బడిలో weekly reader అని చదవడం ప్రోత్సహించడం కోసం ఇక్కడ బళ్ళలో ఇస్తారు, అలాంటి నాలుగు పేజీల (రెండు కాగితాలు, నాలుగు పేజీలు) బుక్లెట్ లాంటిది తయారు చేసి పిల్లలందరికీ పంచవచ్చు.ఆలోచించి, ప్రయత్నించి చూడగలరు.

    ReplyDelete
    Replies
    1. లలిత గారు పిల్లల కోసం కథలు.... చాలా మంచి ఆలోచనండి. పిల్లల కోసం రాసే కథలలో చిన్న చిన్న పదాలు వాడితే వారు చదవడానికి తేలికగా వుండి, ఆసక్తిగా చదువుతారు. మీ సూచన బావుంది, వ్రాయడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.

      Delete
  11. బుడుగును పోలిన అమెరిక బుజ్జిపండు ముచ్చటగా ముద్దోచేలా ఉన్నాడు .మంచి టపా

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానికి ధన్యవాదాలు నవజీవన్ గారు.

      Delete
  12. బావున్నాయండీ బుజ్జిపండు కబుర్లు! :)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు కొత్తావకాయ గారు.

      Delete
  13. చాలా రోజుల తర్వాత బుజ్జిపండు విశేషాలు చదువుతున్నాను....

    మొత్తానికి పెద్దవాడయిపోతున్నాడు...... చాలా బాగుంది.....

    ReplyDelete
    Replies
    1. అవునండి పెద్దవాడయిపోతున్నాడు. ధన్యవాదాలు మాధవి గారు.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.